అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది.
న్యూఢిల్లీ: అండమాన్ నికోబార్ దీవుల్లో గురువారం తెల్లవారుజామున భూకంపం సంభవించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్పై 5.0గా నమోదు అయింది. అయితే ఎటువంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం కానీ సంభవించినట్లు సమాచారం లేదని జాతీయ భూకంప పరిశోధన సంస్థ వెల్లడించింది. అలాగే సునామీ వచ్చే సూచనలు కూడా లేవని తెలిపింది. ఈ రోజు తెల్లవారుజామున 2.30 గంటలకు ఈ భూకంపం సంభవించిందని పేర్కొంది. భూకంప కేంద్రాన్ని గుర్తించినట్లు తెలిపింది.