ఢిల్లీలో స్వల్ప భూకంపం | Earthquake tremors felt in Delhi | Sakshi
Sakshi News home page

ఢిల్లీలో స్వల్ప భూకంపం

Published Mon, Apr 13 2020 6:12 AM | Last Updated on Mon, Apr 13 2020 6:12 AM

Earthquake tremors felt in Delhi - Sakshi

న్యూఢిల్లీ: దేశ రాజధాని ఢిల్లీలో ఆదివారం సాయంత్రం తక్కువ తీవ్రత కలిగిన భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై ఇది 3.5గా నమోదైంది. భూప్రకంపనలతో జనం  ఇళ్ల నుంచి ఒక్కసారిగా బయటకు పరుగెత్తారు. ఈ భూకంప కేంద్రం ఢిల్లీలోని వజీరీబాద్‌లో 8 కిలోమీటర్ల లోతున కేంద్రీకృతమైనట్లు నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ సిస్మాలజీ(ఎన్‌సీఎస్‌) వెల్లడించింది.  నోయిడా, ఘజియాబాద్, ఫరీదాబాద్‌లోనూ భూప్రకంపనలు సంభవించాయి. ప్రాణ, ఆస్తి నష్టం జరిగినట్లు ఎలాంటి వార్తలు వెలువడలేదు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement