బాలుడిపై అత్యాచారం చేసి నిప్పంటించాడు | 7-year-old boy allegedly sexually assaulted, set on fire in Bhiwandi | Sakshi
Sakshi News home page

బాలుడిపై అత్యాచారం చేసి నిప్పంటించాడు

Published Mon, Apr 6 2015 9:17 AM | Last Updated on Wed, Sep 5 2018 9:45 PM

ఇదో అమానవీయ సంఘటన. సిగ్గుతో తలదించుకునే విషయం. మానవత్వం రోజుకింత దిగుజారుతుందా అని అనుమానం కలిగించే అవకాశం.

భీవాండి: ఇదో అమానవీయ సంఘటన. సిగ్గుతో తలదించుకునే విషయం. మానవత్వం రోజుకింత దిగుజారుతుందా అని అనుమానం కలిగించే అవకాశం. ఇప్పటి వరకు పసిపాప నుంచి పండుముసలమ్మ వరకు మృగాళ్లు లైంగికదాడులకు పాల్పడుతుండగా ఇప్పుడు ఓ మృగాడు మాత్రం మరింత రెచ్చిపోయి.. ఏడేళ్ల బాలుడుపై లైంగికదాడికి పాల్పడటంతోపాటు అతడికి నిప్పంటించాడు. మహారాష్ట్రలో భీవాండిలో చోటుచేసుకున్నఈ దుర్ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

ఆ బాలుడికి 30శాతం కాలినగాయాలయ్యాయి. ఈ దారుణానికి పాల్పడింది తెలిసినవారేనని పోలీసుల ప్రాథమిక సమాచారం. ఇంటివద్ద బాలుడిని నిర్మానుష్యంగా ఉన్న ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘటనకు పాల్పడినట్లు పోలీసులు తెలిపారు. ఆ బాలుడు ఆ కర్కశుడి నుంచి తప్పించుకునే ప్రయత్నం కూడా చేసినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడిపై 307, 377 సెక్షన్ల ప్రకారం కేసు నమోదు చేశారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement