
ప్రతీకాత్మక చిత్రం
సాక్షి, ముంబై: ఎన్ని చట్టాలు చేసినా.. అనేక రక్షణ చర్యలు చేపట్టినా మహిళలపై అత్యాచారాలు మాత్రం ఆగటం లేదు. ఆడపిల్లలకు బయటనే కాదు ఇంట్లో కూడా రక్షణ కరువైంది. 14 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసి అతి దారుణంగా చంపిన ఘటన మహారాష్ట్రలోని భీవండిలో చోటు చేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. భీవండిలోని పవర్‌లూమ్ టౌన్‌లో గుర్తుతెలియని దుండగులు ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారం చేసి, అతి దారుణంగా కొట్టి, వాటర్ టబ్‌లో పడేసి చంపారు. సాయంత్రం ఇంటికి వచ్చిన బాలిక అక్క.. విగతజీవిగా ఉన్న చెల్లిని చూసి తల్లిదండ్రులకు, పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. నేరస్తులపై ఐపీసీ 376, 306 సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్లు తెలిపారు. అయితే ఎంత మంది ఈ హత్యలో పాల్గొన్నారో వివరాలు తెలియాల్సివుంది.
Comments
Please login to add a commentAdd a comment