
రుచికరమైన భోజనం చేస్తున్న సమయంలో పక్కన ఏం జరిగినా పట్టించుకోరు కొంతమంది. అయితే అటువంటి ఓ ఘటన మహారాష్ట్రలోని భీవండిలో చోటు చేసుకుంది. భీవండిలోని అన్సారీ ఫంక్షన్‌హాల్‌లో ఆదివారం ఓ వివాహం జరిగింది. పెళ్లి జరిగిన తర్వాత వివాహనికి వచ్చిన అతిథులు, బంధువులు భోజనాలు చేస్తున్నారు. అదే సమయంలో ఫంక్షన్ హాల్‌లో ఓ చోట భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకొని పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడ్డాయి.
చదవండి ఒకే వేదికపై ఇద్దరు ఎంపీలు.. హుషారైన స్టెప్పులతో రచ్చ..
అయితే వాటిని గమనించని కొంతమంది అతిథులు మాత్రం.. భోజనం టెబుల్ మీద కూర్చొని తింటూ కనిపిస్తారు. దీనికి సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫన్నీగా కామెంట్లు చేస్తున్నారు. ‘వెనుక అగ్ని ప్రమాదం బాబాయ్‌లు.. భోజనం ఆపి పరుగెత్తండి!’.. ‘భోజనం ముందుంటే.. అగ్ని ప్రమాదం కనిపించదా?’ ‘అగ్నిప్రమాదమా? అయితే మాకేంటి ముందు పొట్టనిండాలి!’ అని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment