మహిళకు ఆపరేషన్‌ చేస్తూ వీడియో తీసిన డాక‍్టర్‌ | Thane: Doctor makes video of patient while being operated, sends it to friend; booked | Sakshi
Sakshi News home page

మహిళకు ఆపరేషన్‌ చేస్తూ వీడియో తీసిన డాక‍్టర్‌

Published Wed, May 17 2017 6:32 PM | Last Updated on Mon, Oct 8 2018 5:45 PM

మహిళకు ఆపరేషన్‌ చేస్తూ వీడియో తీసిన డాక‍్టర్‌ - Sakshi

మహిళకు ఆపరేషన్‌ చేస్తూ వీడియో తీసిన డాక‍్టర్‌

థానే(మహారాష్ట్ర): ఆపరేషన్‌ కోసం వచ్చిన మహిళను మాటలతో వేధిస్తూ.. అభ్యంతరకరంగా వీడియో తీయటమే కాకుండా మిగతా వారికి వాటిని పంపించి, అసభ్యకర కామెంట్లు పెట్టాడో వైద్యుడు. గౌరవప్రదమైన వైద్య వృత్తికి కళంకం తెచ్చేలా వ్యవహరించిన సదరు వైద్యులపై పోలీసులు పలు సెక‌్షన్ల కింద కేసులు పెట్టారు.

మహారాష్ట్రలోని థానేలో ఈ ఘటన చోటుచేసుకుంది. భివండి పట్టణంలోని ఓ ప్రైవేట్‌ ఆస్పత్రిలో ఈ నెల 12వ తేదీన ఒక మహిళకు శస్త్రచికిత్స జరిగింది. ఈ ఆపరేషన్‌ సందర్భంగా వైద్యుడు అభ్యంతరకరంగా కామెంట్లు చేస్తూ తీవ్రంగా మనోవేదనకు గురిచేశాడు. ఆమెకు సంబంధించిన వీడియోను దొంగతనంగా తీయటంతోపాటు దానిని తన స్నేహితుడైన మరో డాక్టర్‌కు ఫోన్‌లో పంపించాడు. వీటన్నిటినీ సదరు స్నేహితుడు మరో వ్యక్తికి పంపించాడు.

విషయం తెలిసిన బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు.. ఇద్దరు వైద్యులతోపాటు మూడో వ్యక్తిపైనా 354ఏ, 500, 509 సెక‌్షన్లతోపాటు ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఇప్పటి వరకు ఎవరినీ అరెస్ట్‌ చేయలేదని పోలీసులు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement