పాఠశాల స్లాబ్ కూలి తెలుగు విద్యార్థులకు గాయాలు | 20 students injured as slab collapses in school | Sakshi
Sakshi News home page

పాఠశాల స్లాబ్ కూలి తెలుగు విద్యార్థులకు గాయాలు

Published Tue, Jul 22 2014 1:01 PM | Last Updated on Fri, Nov 9 2018 4:44 PM

20 students injured as slab collapses in school

థానే: మహారాష్ట్ర థానే జిల్లా భీవండి పట్టణం పద్మా నగర్లో తెలుగు పాఠశాల తరగతి గది పై కప్పు కుప్ప కూలింది. ఆ ఘటనలో 20 మంది విద్యార్థులు గాయపడ్డారు. మంగళవారం ఉదయం ఎప్పటిలాగే పాఠశాల ప్రారంభమైంది. ఎనిమిదో తరగతి విద్యార్థులు తరగతి గదిలో కుర్చుని ఉండగా గదిపై కప్పు ఒక్కసారిగా కుప్పకూలింది. దాంతో వారిని హుటాహుటిన పట్టణంలోని ఎంజీఎం ఆసుపత్రికి తరలించారు. అయితే విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం లేదని వైద్యులు వెల్లడించారని పోలీసులు తెలిపారు. ఆ ప్రమాదంపై సమాచారం అందుకున్న అగ్నిమాపక శాఖ, పోలీసులు, మున్సిపల్ ఉన్నతాధికారులు హుటాహుటిన సంఘటన స్థలానికి చేరుకుని స్కూల్ నుంచి విద్యార్థులను ఖాళీ చేయించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement