కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట!
థానే: పరువు నష్టం దావా కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మహారాష్ట్రలోని బీవాండీ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఈకేసులో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. గత లోకసభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు.
మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనంటూ దాఖలు చేసిన పిటిషన్ కు న్యాయమూర్తి ఎస్ వీ స్వామి సానుకూలంగా స్పందించారు. జాతిపిత మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే చంపారని చేసిన వ్యాఖ్యలపై రాహుల్ పై బీవాండీ యూనిట్ ఆర్ఎస్ఎస్ రాజేశ్ కుంటే కేసు నమోదు చేశారు.