Defamatory Case
-
నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. తేలిగ్గా విడిచిపెట్టనంటూ లైవ్‌లో వార్నింగ్
Sexual Assault Case On Vijay Babu And He Says He Is The Victim: మలయాళ నటుడు, నిర్మాత విజయ్ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణల కింద కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళలోని ఎర్నాకులం దక్షిణ పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో తనపై విజయ్ బాబు లైంగిక దాడికి పాల్పడ్డాడని కోజికోడ్ జిల్లాకు చెందిన ఓ మహిళ పేర్కొంది. తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక్కసారి కాదు, అనేకసార్లు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆరోపించింది. ఏప్రిల్ 22న ఈ ఫిర్యాదు అందినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకు పోలీసులు విజయ్ బాబును అరెస్టు చేయలేదు, ప్రశ్నించలేదని సమాచారం. ఇదిలా ఉంటే మరోవైపు విజయ్ బాబు వెర్షన్ మరోలా ఉంది. తనపై వచ్చిన ఈ లైంగిక ఆరోపణలు ఫేస్బుక్ లైవ్ వేదికగా ఖండించాడు విజయ్ బాబు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చాడు. తానే అసలైన బాధితుడునని, ఆ అమ్మాయిని అంత తేలిగ్గా విడిచి పెట్టటనని వార్నింగ్ ఇచ్చాడు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటిని చూపించగలనని, కానీ ఆమె కుటుంబానికి నష్టం కలిగించే ఉద్దేశం తనకు లేదన్నాడు. తాను కేవలం, తన తల్లి, భార్య, సోదరి, స్నేహితులకు మాత్రమే జవాబుదారీనని వెల్లడించాడు విజయ్ బాబు. ఆ అమ్మాయి ఆడిషన్‌కు వస్తే ఓ పాత్రకు తానే ఎంపిక చేశానని, ఇప్పుడేమో ఈ ఆరోపణలతో తానే బాధితుడిగా మారానని విజయ్ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెనే కుంగుబాటుకు లోనయ్యానని చెబుతూ మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టిందన్నాడు. డిసెంబర్ నుంచి మార్చి 2021 వరకు వారి మధ్య జరిగిన మెసేజ్‌లు అన్ని కలిపి మొత్తం 400 స్క్రీన్‌షాట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తన ఆరోపణలకు ఈ స్క్రీన్షాట్లే బదులిస్తాయని వివరించాడు. సినిమా నిర్మాణ సంస్థ 'ఫ్రైడే ఫిల్మ్ హౌజ్' వ్యవస్థాపకుడు ఈ 45 ఏళ్ల విజయ్ బాబు. ఫిలిప్స్ అండ్ ది మంకీ పెన్ సినిమాకు గానూ ఉత్తమ పిల్లల చిత్రం కింద (నిర్మాతగా) కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డును అందుకున్నాడు. చదవండి: హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు గర్ల్‌ఫ్రెండ్ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్.. ఎందుకంటే ? Malayalam actor-producer Vijay Babu denies sexual assault allegations against him "I am not afraid as I did not do anything wrong. I am the victim here. I have known the woman since 2018 who has put allegations against me" he said (Screenshot of Actor's Facebook live) pic.twitter.com/QSyZw56Zkq — ANI (@ANI) April 27, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4231450453.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
ఏపీ మంత్రి కన్నబాబు, ఎమ్మెల్యే అంబటి కేసు కొట్టివేత
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ సంస్థకు నాంపల్లి కోర్టు మంగళవారం గట్టిషాక్ ఇచ్చింది. గతంలో కన్నబాబు,అంబటి రాంబాబులపై హెరిటేజ్ సంస్థ పరువునష్టం కింద నాంపల్లి కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో నాంపల్లి కోర్టు కేసును కొట్టివేసింది.హెరిటేజ్ కేసులో సంస్థ అధికారులు సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. ఈ మేరకు కన్నబాబు, అంబటి రాంబాబులపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి కోర్టు పేర్కొంది. -
అఖిలేశ్ యాదవ్‌పై పోస్టు.. మార్క్ జుకర్‌బర్గ్‌పై కేసు!
మెటా కంపెనీ (ఫేస్బుక్) సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌పై ఉత్తర ప్రదేశ్‌లో కేసు నమోదు అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ ఛీఫ్, యూపీ మాజీ సీఎం అఖిలేష్ యాదవ్‌కు వ్యతిరేకంగా చేసిన ఓ పోస్ట్ వివాదాస్పదం కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. కన్నౌజ్ జిల్లాలోని ఓ న్యాయస్థానంలో పరువుకు భంగం కలిగించే ప్రయత్నం కింద కేసు నమోదు అయ్యింది. జుకర్‌బర్గ్‌తో పాటు 49 మంది పేర్లను ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. జుకర్‌బర్గ్‌కు ఆ పోస్ట్‌కి ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన సీఈవోగా ఉన్న ఫ్లాట్‌ఫామ్‌లో ఆ పోస్ట్ పడడం, అందులో అఖిలేష్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా కామెంట్లు పడడంతోనే ఎఫ్ఐఆర్లో జుకర్‌బర్గ్ పేరు చేర్చినట్లు తెలుస్తోంది. పీటీఐ రిపోర్ట్ ప్రకారం.. కన్నౌజ్ జిల్లా సారాహతి గ్రామానికి చెందిన అమిత్ కుమార్ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశాడు. అఖిలేష్ ఇమేజ్ను దెబ్బ తీసేందుకే అలాంటి పోస్ట్‌ను చేశారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ అమిత్ కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్లో పేర్కొన్నాడు. అంతకు ముందు పోలీసులకు ఈ వ్యవహారంపై పిటిషన్ అందజేసినా స్పందన లేదని కుమార్ కోర్టుకు వెల్లడించాడు. ‘బువా బాబువా’ పేరుతో రన్ అవుతున్న ఓ పేస్బుక్ పేజీలో అఖిలేష్ యాదవ్‌తో పాటు బీఎస్పీ ఛీఫ్ మాయావతిని ఉద్దేశిస్తూ సెటైరిక్ పోస్టులు పడుతుంటాయి. అయితే ఈ పిటిషన్ ఇన్వెస్టిగేషన్ మొదలుపెట్టిన పోలీసులు ఈ కేసు నుంచి జుకర్‌బర్గ్ పేరును తప్పించారు. పేజీ అడ్మిన్‌ని ప్రశ్నించి దర్యాప్తను వేగవంతం చేస్తామని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ పిటిషన్ ఆధారంగా కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు. చదవండి: పర్మిషన్ లేకుండా ఆ ఫొటోలు పెడితే ఎలా? -
కంగనాకు గట్టి వార్నింగ్ ఇచ్చిన కోర్టు
సాక్షి, ముంబై: బాలీవుడ్ హీరోయిన్ కంగనా రనౌత్‌కు కోర్టు మరోసారి షాక్ ఇచ్చింది. ప్రముఖ సినీ పాటల రచయిత, కవి జావేద్ అఖ్తర్ వేసిన డిఫమేషన్ కేసులో గైర్హాజరు కావడంపై ముంబయి మెట్రోపాలిటన్ కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. వ్యక్తిగతంగా హాజరు కాకుండా పదే పదే మినహాయింపు కోరుతుండడంపై అసహనం వ్యక్తంచేసిన కోర్టు తాజాగా గట్టి వార్నింగ్ ఇచ్చింది. తదుపరి విచారణకు వ్యక్తిగతంగా విచారణకు హాజరుకాకపోతే అరెస్ట్ వారెస్ట్ జారీ చేస్తానని న్యాయమూర్తి హెచ్చరించారు. అనంతరం కేసు విచారణను సెప్టెంబర్ 20 కి వాయిదా వేసారు. చదవండి : Terrific Road Accidents: తీరని విషాదాలు జావేద్ అఖ్తర్ దాఖలు చేసిన పరువు నష్టం కేసులో అంధేరి మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ కోర్టులో మంగళవారం విచారణ జరిగింది. పిటిషనర్ జావేద్ అఖ్తర్ హాజరుకాగా నటి కంగన రనౌత్ మాత్రం హాజరుకాలేదు. తన లాయర్ ద్వారా వ్యక్తిగత హాజరు నుంచి మినహాయింపు ఇవ్వాలని కోర్టును అభ్యర్థించింది. ఇదంతా చూస్తుంటే కావాలనే కాలయాపన చేస్తున్నట్టు కనిపిస్తోందని కోర్టు మండిపడింది. ఇకపై ఇదే తరహాలో వ్యవహరిస్తే ఊరుకునేది లేదని వ్యాఖ్యానించింది. వచ్చే విచారణకు తప్పకుండా వ్యక్తిగతంగా హాజరు కావాలని ఆదేశించింది. లేదంటే అరెస్ట్ వారెంట్ జారీ చేస్తామని స్పష్టం చేసింది. దీనిపై అఖ్తర్ తరఫు న్యాయవాది జే భరద్వాజ్ కోర్టులో అభ్యంతరం తెలుపడంతో తాజా హెచ్చరిక చేసింది. కంగనా రనౌత్ తరఫు న్యాయవాది రిజ్వాన్ సిద్ధిఖీ మాట్లాడుతూ, కంగనా సినిమా యాక్టింగ్, ప్రమోషన్ పనుల్లో బిజీగా ఉండటంతో పా టు, కొన్ని లక్షణాల కారణంగా కోవిడ్ పరీక్ష చేయించుకోనున్నారని, ఒకవేళ పాజిటివ్ వస్తే మరింత మినహాయింపు అవసరం ఉంటుందని కోర్టుకు తెలపడం గమనార్హం కాగా నటుడు సుశాంత్ సింగ్ రాజ్‌పుత్ మరణానంతరం ఒక ఛానెల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో నటి కంగన తన పరువుకు నష్టం కల్గించే రీతిలో మాట్లాడారని జావేద్ పరువు నష్టం కేసు దాఖలు చేశారు. అయితే ఈ కేసును కొట్టివేయాలంటూ బాంబే హైకోర్టును ఆశ్రయించారు కంగనా. అయితే కంగనా పిటిషన్‌ను బాంబే హైకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. -
మంత్రి వేలుమణి ఫిర్యాదు.. స్టాలిన్‌పై కేసు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై కొయంబత్తూర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన పరువుకు భంగం కలిగిస్తూ స్టాలిన్ అనవసర అభియోగాలు చేశారని తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్టాలిన్‌పై ఐపీసీ 153 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూర్ జిల్లాలోని తొండముతుర్లో నిర్వహించిన ర్యాలీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మంత్రి వేలుమణి పలు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను తన కుటుంబానికే దక్కేలా చూశారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయనను జైలుకు పంపుతాం. వేలుమణి అవినీతికి సంబంధించిన ఆధారాలు మా దగ్గరున్నాయి. వాటిని ఇప్పుడే అవినీతి నిరోధక శాఖకు ఇచ్చే ఉద్దేశం మాకు లేదు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే, వివరాలను డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్)కు అందిస్తామ’ని అన్నారు. -
పరువునష్టం కేసులో తేజస్వికి ఊరట
సాక్షి, బెంగళూరు: తన మీద మీడియా ఎలాంటి కథనాలు, ప్రచారాలు చేయకుండా ఉండటానికి దక్షిణ బెంగళూరు బీజేపీ ఎంపీ అభ్యర్థి తేజస్వి సూర్య, న్యాయస్థానం నుంచి తాత్కాలిక ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కోర్టు ఉత్తర్వుతో 49 ఆంగ్ల, కన్నడ చానెళ్లు, పత్రికలు, సామాజిక మాధ్యమాలు గూగుల్, ఫేస్బుక్లో తేజస్వికి వ్యతిరేకంగా ఎటువంటి వార్తలు, కథనాల ప్రచురణకు అవకాశం లేదు. మరుసటి వాదనల కోసం కేసును మే 27కు వాయిదా వేసింది కోర్టు. ఈ నిర్ణయంతో లోక్‌సభ ఎన్నికలు పూర్తయ్యే వరకు తేజస్వీకు ఊరట లభించినట్టైంది. తేజస్వి సూర్య స్వతహాగా న్యాయవాది. ఆయనలో ఎవరికీ తెలియని చీకటి కోణం ఉందంటూ మీటూ హ్యాష్‌ట్యాగ్‌తో ఒక మహిళ ట్విటర్లో చేసిన పోస్ట్‌తో దుమారం రేగింది. దీన్ని పలు మీడియా సంస్థలు హైలైట్ కూడా చేశాయి. దీన్ని సవాల్ చేస్తూ తేజస్వి కోర్టును ఆశ్రయించారు. ఈ విషయమై కర్ణాటక కాంగ్రెస్ నేతలు స్పందిస్తూ.. తేజస్వీని మరో ఎంజే అక్బర్‌గా పోలుస్తూ విమర్శలకు దిగారు. కర్ణాటక కాంగ్రెస్ మహిళా కార్యకర్తలు తేజస్వి ఉదంతంపై రాష్ట్ర మహిళా కమిషన్‌తో దర్యాప్తు చేపట్టాలని పట్టుపట్టారు. తేజస్వి నామినేషన్ వేసిన తర్వాత ఇలాంటి వివాదం రేగడంతో ఆయన కోర్టును ఆశ్రయించారు. దీంతో ఈ విషయంలో తేజస్వికి వ్యతిరేకంగా పరువునష్టం కలిగించే ప్రచారాలు చేయవద్దంటూ బెంగళూరు సిటీ సివిల్ కోర్టు న్యాయాధిపతి దినేష్ హెగ్డే తాత్కాలిక ఉత్తర్వులు జారీ చేశారు. -
కోర్టులో రాహుల్ గాంధీకి ఊరట!
థానే: పరువు నష్టం దావా కేసులో వ్యక్తిగతంగా హాజరు కావాల్సిన అవసరం లేదంటూ మహారాష్ట్రలోని బీవాండీ మెజిస్ట్రేట్ కోర్టు తీర్పునిచ్చింది. దాంతో ఈకేసులో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి ఊరట లభించింది. గత లోకసభ ఎన్నికల ప్రచారంలో ఆర్ఎస్ఎస్ పై అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారంటూ కేసు నమోదు చేశారు. మహారాష్ట్ర, హర్యానా ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్న కారణంగా తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరుకాలేనంటూ దాఖలు చేసిన పిటిషన్ కు న్యాయమూర్తి ఎస్ వీ స్వామి సానుకూలంగా స్పందించారు. జాతిపిత మహాత్మాగాంధీని ఆర్ఎస్ఎస్ కార్యకర్తలే చంపారని చేసిన వ్యాఖ్యలపై రాహుల్ పై బీవాండీ యూనిట్ ఆర్ఎస్ఎస్ రాజేశ్ కుంటే కేసు నమోదు చేశారు.