నటుడిపై లైంగిక వేధింపుల కేసు.. తేలిగ్గా విడిచిపెట్టనంటూ లైవ్‌లో వార్నింగ్ | Sexual Assault Case On Vijay Babu And He Says He Is The Victim | Sakshi
Sakshi News home page

Vijay Babu: లైంగిక వేధింపుల కేసు.. స్క్రీన్‌షాట్లున్నాయి, అంత ఈజీగా వదిలిపెట్టనంటూ నటుడి వార్నింగ్‌

Published Wed, Apr 27 2022 12:37 PM | Last Updated on Wed, Apr 27 2022 1:00 PM

Sexual Assault Case On Vijay Babu And He Says He Is The Victim - Sakshi

Sexual Assault Case On Vijay Babu And He Says He Is The Victim: మలయాళ నటుడు, నిర్మాత విజయ్‌ బాబుపై లైంగిక వేధింపుల ఆరోపణల కింద కేసు నమోదైంది. ఓ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేరళలోని ఎర్నాకులం దక్షిణ పోలీసులు కేసు నమోదు చేశారు. కొచ్చిలోని ఓ ఫ్లాట్‌లో తనపై విజయ్ బాబు లైంగిక దాడికి పాల్పడ్డాడని కోజికోడ్‌ జిల్లాకు చెందిన ఓ మహిళ పేర్కొంది. తనకు సినిమాల్లో అవకాశాలు ఇస్తానని చెప్పి ఒక్కసారి కాదు, అనేకసార్లు ఈ అఘాయిత్యానికి ఒడిగట్టాడని ఆరోపించింది. ఏప్రిల్‌ 22న ఈ ఫిర్యాదు అందినట్లుగా పోలీసులు తెలిపారు. అయితే ఇప్పటివరకు పోలీసులు విజయ్‌ బాబును అరెస్టు చేయలేదు, ప్రశ్నించలేదని సమాచారం. 

ఇదిలా ఉంటే మరోవైపు విజయ్‌ బాబు వెర్షన్‌ మరోలా ఉంది. తనపై వచ్చిన ఈ లైంగిక ఆరోపణలు ఫేస్‌బుక్‌ లైవ్‌ వేదికగా ఖండించాడు విజయ్ బాబు. తాను ఎలాంటి తప్పు చేయలేదని, తనపై తప్పుడు ఆరోపణలు చేసిన మహిళపై పరువు నష్టం దావా వేస్తానని చెప్పుకొచ్చాడు. తానే అసలైన బాధితుడునని, ఆ అమ్మాయిని అంత తేలిగ్గా విడిచి పెట్టటనని వార్నింగ్‌ ఇచ్చాడు. తన దగ్గర ఉన్న ఆధారాలన్నింటిని చూపించగలనని, కానీ ఆమె కుటుంబానికి నష్టం కలిగించే ఉద్దేశం తనకు లేదన్నాడు. తాను కేవలం, తన తల్లి, భార్య, సోదరి, స్నేహితులకు మాత్రమే జవాబుదారీనని వెల్లడించాడు విజయ్‌ బాబు. 

ఆ అమ్మాయి ఆడిషన్‌కు వస్తే ఓ పాత్రకు తానే ఎంపిక చేశానని, ఇప్పుడేమో ఈ ఆరోపణలతో తానే బాధితుడిగా మారానని విజయ్‌ ఆవేదన వ్యక్తం చేశాడు. ఆమెనే కుంగుబాటుకు లోనయ్యానని చెబుతూ మెసేజ్‌లు పంపడం మొదలు పెట్టిందన్నాడు. డిసెంబర్‌ నుంచి మార్చి 2021 వరకు వారి మధ్య జరిగిన మెసేజ్‌లు అన్ని కలిపి మొత్తం 400 స్క్రీన్‌షాట్స్ ఉన్నాయని చెప్పుకొచ్చాడు. తన ఆరోపణలకు ఈ స్క్రీన్‌షాట్లే బదులిస్తాయని వివరించాడు. సినిమా నిర్మాణ సంస్థ 'ఫ్రైడే ఫిల్మ్‌ హౌజ్‌' వ్యవస్థాపకుడు ఈ 45 ఏళ్ల విజయ్‌ బాబు. ఫిలిప్స్‌ అండ్‌ ది మంకీ పెన్‌ సినిమాకు గానూ ఉత్తమ పిల్లల చిత్రం కింద (నిర్మాతగా) కేరళ రాష్ట్ర చలన చిత్ర అవార్డును అందుకున్నాడు. 

చదవండి: హీరోపై వరుసగా నిర్మాతల ఫిర్యాదులు.. కోట్లు మోసం చేశాడని కేసు

గర్ల్‌ఫ్రెండ్‌ ఫిర్యాదుతో సీరియల్ నటుడి అరెస్ట్‌.. ఎందుకంటే ?



No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement