FIR filed against Zuckerberg over defamatory post against Akhilesh - Sakshi
Sakshi News home page

ఫేస్‌బుక్‌లో అభ్యంతరకర పోస్ట్‌! జుకర్‌బర్గ్‌ ప్రమేయం లేదు, కానీ..

Published Wed, Dec 1 2021 3:29 PM | Last Updated on Wed, Dec 1 2021 3:38 PM

FIR filed against Zuckerberg over defamatory post against Akhilesh - Sakshi

యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌పై అభ్యంతరకర పోస్ట్‌కి సంబంధించి మార్క్‌ జుకర్‌బర్గ్‌పై కేసు

మెటా కంపెనీ (ఫేస్‌బుక్‌) సీఈవో మార్క్‌ జుకర్‌బర్గ్‌పై ఉత్తర ప్రదేశ్‌లో కేసు నమోదు అయ్యింది. సమాజ్‌వాదీ పార్టీ ఛీఫ్‌, యూపీ మాజీ సీఎం అఖిలేష్‌ యాదవ్‌కు వ్యతిరేకంగా చేసిన ఓ పోస్ట్‌ వివాదాస్పదం కావడంతో ఈ పరిణామం చోటు చేసుకుంది. 


కన్నౌజ్‌ జిల్లాలోని ఓ న్యాయస్థానంలో పరువుకు భంగం కలిగించే ప్రయత్నం కింద కేసు నమోదు అయ్యింది. జుకర్‌బర్గ్‌తో పాటు 49 మంది పేర్లను ఇందులో చేర్చినట్లు తెలుస్తోంది. జుకర్‌బర్గ్‌కు ఆ పోస్ట్‌కి ఎలాంటి సంబంధం లేకున్నా.. ఆయన సీఈవోగా ఉన్న ఫ్లాట్‌ఫామ్‌లో ఆ పోస్ట్‌ పడడం, అందులో అఖిలేష్‌కు వ్యతిరేకంగా అభ్యంతరకరంగా కామెంట్లు పడడంతోనే ఎఫ్‌ఐఆర్‌లో జుకర్‌బర్గ్‌ పేరు చేర్చినట్లు తెలుస్తోంది.

పీటీఐ రిపోర్ట్‌ ప్రకారం.. కన్నౌజ్‌ జిల్లా సారాహతి గ్రామానికి చెందిన అమిత్‌ కుమార్‌ అనే వ్యక్తి ఈ కేసును దాఖలు చేశాడు. అఖిలేష్‌ ఇమేజ్‌ను దెబ్బ తీసేందుకే అలాంటి పోస్ట్‌ను చేశారని, ఈ మేరకు చర్యలు తీసుకోవాలంటూ అమిత్‌ కోర్టులో దాఖలు చేసిన అభ్యర్థన పిటిషన్‌లో పేర్కొన్నాడు. అంతకు ముందు పోలీసులకు ఈ వ్యవహారంపై పిటిషన్‌ అందజేసినా స్పందన లేదని కుమార్‌ కోర్టుకు వెల్లడించాడు.  ‘బువా బాబువా’ పేరుతో రన్ అవుతున్న ఓ పేస్‌బుక్‌ పేజీలో అఖిలేష్‌ యాదవ్‌తో పాటు బీఎస్పీ ఛీఫ్‌ మాయావతిని ఉద్దేశిస్తూ సెటైరిక్‌ పోస్టులు పడుతుంటాయి. 

అయితే ఈ పిటిషన్‌ ఇన్వెస్టిగేషన్‌ మొదలుపెట్టిన పోలీసులు ఈ కేసు నుంచి జుకర్‌బర్గ్‌ పేరును తప్పించారు. పేజీ అడ్మిన్‌ని ప్రశ్నించి దర్యాప్తను వేగవంతం చేస్తామని సీనియర్‌ అధికారి ఒకరు తెలిపారు. ఇక ఈ పిటిషన్‌ ఆధారంగా కేసు నమోదు చేయాలని న్యాయమూర్తి పోలీసులను ఆదేశించారు.

చదవండి: పర్మిషన్‌ లేకుండా ఆ ఫొటోలు పెడితే ఎలా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement