సభలో ప్రసంగిస్తున్న డీఎంకే అధ్యక్షుడు ఎం.కె. స్టాలిన్
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై కొయంబత్తూర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన పరువుకు భంగం కలిగిస్తూ స్టాలిన్ అనవసర అభియోగాలు చేశారని తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్టాలిన్‌పై ఐపీసీ 153 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు.
లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూర్ జిల్లాలోని తొండముతుర్‌లో నిర్వహించిన ర్యాలీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మంత్రి వేలుమణి పలు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను తన కుటుంబానికే దక్కేలా చూశారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయనను జైలుకు పంపుతాం. వేలుమణి అవినీతికి సంబంధించిన ఆధారాలు మా దగ్గరున్నాయి. వాటిని ఇప్పుడే అవినీతి నిరోధక శాఖకు ఇచ్చే ఉద్దేశం మాకు లేదు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే, వివరాలను డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్)కు అందిస్తామ’ని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment