M. K. Stalin
-
మా ముఖ్యమంత్రిని ఎవరేం అన్న సహించేది లేదు: దర్శకుడు
తమిళ సినిమా: మహిళ నిర్మాత శ్యామల రమేష్ నిర్మించిన చిత్రం కటాక్షం. పట్టుకోట్టై శివ దర్శకుడుగా పరిచయం అవుతున్న ఈ చిత్రంలో కార్తీక్ చరణ్, మహాన అనే నవ జంట హీరో హీరోయిన్గా నటిస్తున్నారు. దర్శకుడు కె. భాగ్యరాజ్ కీలకపాత్రలో పోషించిన ఈ చిత్రానికి సంగీత దర్శకుడు చార్లీ సంగీతాన్ని అందించారు. కాగా నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం త్వరలో విడుదలకు ముస్తాబవుతుంది. ఈ సందర్భంగా చిత్ర ఆడియో ట్రైలర్ ఆవిష్కరణ కార్యక్రమాన్ని శుక్రవారం సాయంత్రం చెన్నైలోని ప్రసాద్ ల్యాబ్‌లో నిర్వహించారు. ఇందులో కె. భాగ్యరాజ్, ఆర్వీ ఉదయకుమార్, పేరరసు, జాగ్వర్ తంగం తదితరులు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు. కె. భాగ్యరాజ్ ఆడియోను ఆవిష్కరించగా పేరరసు, ఆర్వీ ఉదయ్ కుమార్ తదితరులు తొలి ప్రతిని అందుకున్నారు. ఈ సందర్భంగా ఆర్వీ ఉదయ్ కుమార్ మాట్లాడుతూ ఈ చిత్ర కథానాయకి తమిళ భాషలో చాలా చక్కగా మాట్లాడారని ప్రశంసించారు. నిర్మాత శ్యామల రమేష్ షూటింగ్ స్పాట్లో ఉదయం ఐదు గంటలకే అందరినీ నిద్రలేపి రెడీ చేయించడం అన్నది అభినందనీయం అన్నారు. దర్శకుడు పేరరసు మాట్లాడుతూ ప్రస్తుతం కర్ణాటకలో కొన్ని సంఘాలు చేస్తున్న ఆందోళన వివాదంగా మారుతుందని వాళ్లు మన ముఖ్యమంత్రి స్టాలిన్‌ను దూషించడం సరికాదన్నారు. తమిళనాడులో అనేక పార్టీలు ఉండవచ్చునని భేదాభిప్రాయాలు ఉండవచ్చునని, అయితే మనం తమిళనాడు దాటితే మనం ముఖ్యమంత్రి స్టాలిన్‌ను ఎవరేమన్నా సహించేది లేదని పేర్కొన్నారు. కె.భాగ్యరాజ్ మాట్లాడుతూ చిన్న చిత్రాలు లేనిదే చిత్రపరిశ్రమ లేదని పేర్కొన్నారు. కాబట్టి ప్రతి థియేటర్లోనూ చిన్నచిత్రాలను ఒక్క షో అయినా ప్రదర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. చిన్న బడ్జెట్లో చిత్రాలు చేయడానికి నిర్మాతలు రావద్దని ఎవరు అన్నారని, అలా అనే హక్కు వారికీ లేదని చిత్త నిర్మాత రమేష్ పేర్కొన్నారు. తమ చిత్ర షూటింగ్ సమయంలో ఎందరో కళాకారులు, సాంకేతిక వర్గం జీవిస్తున్నారని తాను కళ్లారా చూశానని తమలాంటి చిన్న చిత్రాల నిర్మాతలు రాకపోతే అలాంటి వారికి జీవనోపాధి ఎవరు కల్పిస్తారని ప్రశ్నించారు. తను వారి కోసం అయినా మరో చిత్రం చేస్తానని ఆయన అన్నారు. -
సీఎం జగన్‌కు ప్రధాని మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి ప్రధాని నరేంద్ర మోదీ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో వర్థిల్లాలని ప్రధాని ట్వీట్ చేశారు. సీఎం జగన్‌కు తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. పలువురు కేంద్రమంత్రులు సీఎంకు బర్త్‌డే విషెస్ తెలిపారు. ఏపీవ్యాప్తంగా సీఎం జగన్ పుట్టినరోజు వేడుకలు ఘనంగా నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ శ్రేణులు వేడుకలు, సేవా కార్యక్రమాలు చేపట్టాయి. నియోజకవర్గాల్లో రక్తదాన శిబిరాలు, మొక్కలు నాటే కార్యక్రమాలు, అన్నదానం, క్రీడా పోటీలు, కేక్ కటింగ్లతో కోలాహలంగా సంబరాలు జరుపుతున్నారు. చదవండి: AP CM YS Jagan: ప్రజా యోధుడు.. Best wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu on his birthday. May he be blessed with a long and healthy life. — Narendra Modi (@narendramodi) December 21, 2022 -
తమిళనాడు సీఎంగా స్టాలిన్
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఇటీవల జరిగిన తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో డీఎంకేను భారీ విజయం దిశగా నడిపిన ముత్తువేల్ కరుణానిధి(ఎంకే) స్టాలిన్(68) ఆ రాష్ట్ర 14వ ముఖ్యమంత్రిగా శుక్రవారం ప్రమాణస్వీకారం చేశారు. కోవిడ్ వ్యాప్తి నేపథ్యంలో రాజ్‌భవన్‌లో ఈ కార్యక్రమం నిరాడంబరంగా జరిగింది. స్టాలిన్‌తోపాటు 33 మంది మంత్రులతో గవర్నర్ భన్వరీలాల్ పురోహిత్ ప్రమాణస్వీకారం చేయించారు. కోవిడ్ ప్రోటోకాల్‌ను అనుసరించి 500 మందిని మాత్రమే ఈ కార్యక్రమానికి ఆహ్వానించారు. కొత్త కేబినెట్ గ్రూప్ ఫొటో ఉదయం 9.10 గంటలకు ‘ముత్తువేల్ కరుణానిధి స్టాలిన్ అనే నేను..’అంటూ స్టాలిన్ తన ప్రమాణ స్వీకారాన్ని ప్రారంభించారు. అనంతరం, డీఎంకే సీనియర్ నేత, పార్టీ జనరల్ సెక్రటరీ దురై మురుగన్ ప్రమాణం చేశారు. ఆయనకు జల వనరుల శాఖ, నీటిపారుదల ప్రాజెక్టులు, గనులు, ఖనిజాల శాఖలను అప్పగించారు. మంత్రులంతా డీఎంకే అనుసరిస్తున్న సంప్రదాయం ప్రకారం తమిళంలోనే ప్రమాణం చేశారు. స్టాలిన్ క్యాబినెట్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు మైనారిటీలకు చోటు దక్కింది. హోం, సాధారణ ప్రజా వ్యవహారాల నిర్వహణ, ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ తదితర విభాగాలను స్టాలిన్ తన వద్దే ఉంచుకున్నారు. అయితే, మొదటిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైన తన కుమారుడు ఉదయనిధి స్టాలిన్‌కు క్యాబినెట్లో చోటివ్వలేదు. కార్యక్రమం అనంతరం స్టాలిన్ రాజ్‌భవన్ నుంచి గోపాలపురంలో తండ్రి కరుణానిధి నివసించిన ఇంటికి వెళ్లి తండ్రి చిత్రపటానికి నివాళులర్పించారు. అక్కడి నుంచి చెన్నై మెరీనా బీచ్‌లోని అన్నాదురై, కరుణాని«ధి సమాధుల వద్ద పుష్పాంజలి ఘటించారు. మధ్యాహ్నం 12.10 గంటలకు సచివాలయానికి చేరుకుని సీఎంగా బాధ్యతలు స్వీకరించారు. శుక్రవారం సాయంత్రం మంత్రులు, జిల్లా కలెక్టర్లతో సమావేశమై కరోనా పరిస్థితులను సమీక్షించారు. మొదటి విడత కోవిడ్ సాయం విడుదల సీఎంగా బాధ్యతలు చేపట్టిన స్టాలిన్ ప్రధాన ఎన్నికల హామీల అమల్లో భాగంగా పలు చర్యలను ప్రకటించారు. కోవిడ్ సాయం కింద బియ్యం కార్డు దారులకు రూ.4 వేలకు గాను మొదటి విడతగా రూ.2 వేలను ఈ నెలలోనే అందజేసేందుకు ఉద్దేశించిన ఫైలుపై సంతకం చేశారు. దీంతో, రాష్ట్రంలోని 2,07,67,000 రేషన్ కార్డు దారులకు రూ.4,153.69 త్వరలో అందుతాయి. అదేవిధంగా, ప్రత్యేక బీమా పథకం కింద కోవిడ్ బాధితులకు ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స అందించేందుకు వీలు కల్పిస్తూ ఆదేశాలిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం సరఫరా చేసే ఆవిన్ పాల ధరను లీటరుపై రూ.3 తగ్గిస్తూ ఉత్తర్వులిచ్చారు. శనివారం నుంచి రాష్ట్ర రవాణా సంస్థకు చెందిన ఆర్డినరీ సిటీ బస్సుల్లో మహిళలు ఉచితంగా ప్రయాణం చేయవచ్చు. ఇందుకోసం రూ.1,200 కోట్లు విడుదల చేసినట్లు ప్రభుత్వం తెలిపింది. అధికారంలోకి వచ్చిన 100 రోజుల్లోనే ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్న హామీ అమలుకు ‘మీ నియోజకవర్గంలో ముఖ్యమంత్రి’పథకం అమలు కోసం ఐఏఎస్ అధికారి నేతృత్వంలో ఒక విభాగాన్ని ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులిచ్చారు. -
సీఎంగా స్టాలిన్ ప్రమాణ స్వీకారం ఆ రోజే..
సాక్షి, చెన్నై: మే2న విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టబోతుంది. జయలలిత మరణించిన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ సత్తా చాటింది. మొత్తం 234 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో 156 స్థానాలను డీఎంకే కూటమి కైవసం చేసుకుంది. పదేళ్ల నిరీక్షణ అనంతరం మళ్లీ డీఎంకేకు అధికారం వరించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సెకండ్ వేవ్ సంక్షోభం కారణంగా నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టబోనున్నట్లు ఇప్పటికే స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం విజయం తర్వాత తన తండ్రి కరుణానిధి సమాధి దగ్గర నివాళులర్పించిన స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ కొలత్తూరు నుంచి ఆయన తనయుడు ఉధయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే. చదవండి: 156 స్థానాల్లో డీఎంకే కూటమి ఘనవిజయం తమిళనాడు: ఇరవై ఏళ్లకు.. వికసించిన కమలం -
Udhayanidhi Stalin: మరో వారసుడు రెడీ
సాక్షి, చెన్నై: కరుణానిధి వారసుడు స్టాలిన్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో తన వారసుడిని స్టాలిన్ ముందే రంగంలోకి దించారు. స్టాలిన్‌కు భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్, కుమార్తె సెంతామరై ఉన్నారు. సినీ నిర్మాతగా, నటుడిగా తన కంటూ ప్రత్కేక గుర్తింపు కలిగిన ఉదయనిధిని తాను స్థాపించిన డీఎంకే యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ గతంలోనే నియమించారు. అలాగే, చేపాక్కం –ట్రిప్లికేన్ నుంచి విజయకేతనంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఉదయనిధి రెడీ అయ్యారు. ఈ నెల 6న సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసే చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు. -
మంత్రి వేలుమణి ఫిర్యాదు.. స్టాలిన్‌పై కేసు
సాక్షి, చెన్నై: డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్‌పై కొయంబత్తూర్ జిల్లా పోలీసులు కేసు నమోదు చేశారు. తన పరువుకు భంగం కలిగిస్తూ స్టాలిన్ అనవసర అభియోగాలు చేశారని తమిళనాడు మంత్రి ఎస్పీ వేలుమణి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో స్టాలిన్‌పై ఐపీసీ 153 (ఏ) సెక్షన్ కింద కేసు నమోదు చేశారు. లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో భాగంగా కోయంబత్తూర్ జిల్లాలోని తొండముతుర్లో నిర్వహించిన ర్యాలీలో స్టాలిన్ మాట్లాడుతూ.. ‘మంత్రి వేలుమణి పలు ప్రభుత్వ కాంట్రాక్ట్‌లను తన కుటుంబానికే దక్కేలా చూశారు. డీఎంకే ప్రభుత్వం ఏర్పాటయ్యాక ఆయనను జైలుకు పంపుతాం. వేలుమణి అవినీతికి సంబంధించిన ఆధారాలు మా దగ్గరున్నాయి. వాటిని ఇప్పుడే అవినీతి నిరోధక శాఖకు ఇచ్చే ఉద్దేశం మాకు లేదు. డీఎంకే ప్రభుత్వం అధికారంలోకి వచ్చాకే, వివరాలను డీవీఏసీ (డైరెక్టర్ ఆఫ్ విజిలెన్స్ అండ్ కరప్షన్)కు అందిస్తామ’ని అన్నారు. -
రాజకీయ శూన్యత పూరించేదెవరు?
తమిళనాడు మాజీ ముఖ్యమంత్రులు, రెండు ప్రధాన ద్రవిడ పార్టీలు డీఎంకే, ఏఐడీఎంకే నేతలు ఎం.కరుణానిధి, జయలలిత మరణంతో రాష్ట్రంలో రాజకీయాలు ఎటు తిరుగుతాయి? మూడున్నర దశాబ్దాలకు పైగా రాష్ట్రాన్ని పరిపాలించిన ఈ ఇద్దరు అగ్రనేతలు లేని లోటును ఎవరు తీరుస్తారు? ఇద్దరు తమిళ సూపర్ స్టార్లు రజనీకాంత్, కమల్‌హాసన్ నాయకత్వంలోని కొత్త ప్రాంతీయపక్షాలు ఎంత వరకు ఈ ఖాళీని భర్తీ చేస్తాయి? అనే ప్రశ్నలు తమిళ రాజకీయ పండితులకు చర్చనీయాంశాలుగా మారాయి. కరుణానిధి తన రాజకీయ వారసునిగా మూడో కొడుకు ఎంకే స్టాలిన్‌ను కిందటేడాది జనవరిలో ప్రకటించారు. పార్టీ కార్య నిర్వాహక అధ్యక్షునిగా నియమించారు. ఫలితంగా ఆయన కుటుంబ సభ్యుల్లో రాజకీయలతో సంబంధమున్న రెండో కుమారుడు, కేంద్ర మాజీ మంత్రి ఎంకే అళగిరి, చిన్న కూతురు, రాజ్యసభ ఎంపీ కనిమొళి, ఇంకా ఆయన మేనల్లుడి కొడుకు, కేంద్ర మాజీ మంత్రి దయానిధి మారన్లు డీఎంకే నాయకత్వం కోసం పోటీ పడే అవకాశాలు లేవు. 65 ఏళ్ల స్టాలిన్ 1973 నుంచీ డీఎంకే కార్యకలాపాల్లో చురుకుగా పాల్గొంటూ, 1984 నుంచీ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. 45 ఏళ్లుగా పార్టీ కార్యకర్తలు, నాయకులతో ఉన్న సంబంధాలు, పార్టీ విభాగాలు, ఆస్తులపై ఉన్న పట్టు కారణంగా స్టాలిన్‌కు పార్టీని ముందుకు తీసుకెళ్లే అన్ని అవకాశాలూ ఉన్నాయి. ఏఐడీఎంకే నిలదొక్కుకుంటుందా? ఏఐడీఎంకేలో సీఎం పళనిస్వామి, ఉప ముఖ్యమంత్రి ఓ పన్నీర్‌సెల్వం ప్రస్తుతానికి కలిసి పనిచేస్తున్నా వారిద్దరి నాయత్వాన పార్టీలో రెండు గ్రూపులు నడుస్తున్నాయనేది బహిరంగ రహస్యమే. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో పన్నీర్‌సెల్వంకు సన్నిహిత సంబంధాలున్నందున రాబోయే ఎన్నికల్లో ఆయన వర్గం ఎన్డీఏకు దగ్గరైతే పార్టీ బలహీనపడే ప్రమాదం ఉంది. అలాంటి పరిస్థితిలో జయ సన్నిహితురాలు వీకే శశికళ అక్క కొడుకు టీటీవీ దినకరన్ నాయకత్వంలోని అమ్మా మక్కల్ మున్నేట్ర కజగం మాతసంస్థ ఏఐడీఎంకే నేతలు, కార్యకర్తలను పెద్ద సంఖ్యలో చీల్చి కొంత మేరకు బలపడే అవకాశాలు కూడా లేకపోలేదు. ఏఐడీఎంకే పాలనకుగాని, పళనిస్వామికిగాని జనాదరణ అంతంత మాత్రమే. ఈ పరిస్థితుల్లో ఏఐడీఎంకే ఎన్ని పార్టీలుగా చీలిపోతుందో కూడా చెప్పలేమని తమిళ రాజకీయ పండితులు అంచనా వేస్తున్నారు. జయలలిత తర్వాత జనాకర్షణ శక్తి ఉన్న నేతలెవరూ లేకపోవడం, అర్థబలంతో అంగబలం సంపాదించిన శశికళ జైల్లో ఉండడంతో ఏఐడీఎంకే పూర్వ వైభవం సంపాదించడానికి చాన్సే లేదని తేల్చిచెబుతున్నారు. రజనీ, కమల్ పార్టీలకు ఇంకా పునాదులే లేవు ఇద్దరు తమిళ రాజకీయ దిగ్గజాలు జయ, కరుణ లేని పరిస్థితుల్లో తమ అదష్టం పరీక్షించుకోవడానికి మక్కల్ నీతి మెయ్యం అనే పార్టీ పెట్టిన కమల్‌హాసన్‌గాని, ఇంకా పార్టీ పేరు ప్రకటించకుండానే కొత్త పార్టీకి ఇంకా ఏర్పట్ల పనిలో మునిగి ఉన్న రజనీకాంత్‌గాని ఇప్పట్లో ఈ రాజకీయ శూన్యాన్ని భర్తీచేసే సామర్ధ్యం లేదు. బ్రాహ్మణేతర కులాలకు సామాజికన్యాయం, మూఢాచారాల నిర్మూలన, హిందీ వ్యతిరేకత, తమిళ భాషా వికాసం వంటి సైద్ధాంతిక భూమికతో ఎదిగిన డీఎంకే, అన్నాడీఎంకేలు నేడు ఎలాంటి సైద్ధాంతిక బలం లేకుండా ముందుకుసాగుతున్నాయి. ఇలాంటి సిద్ధాంతాలేవీ లేకుండా, సమకాలీన తమిళ ప్రజలను ఆకట్టుకోవడానికి సినీ గ్లామర్ ఒక్కటే ఈ ఇద్దరు నటులకు సరిపోదు. వామపక్షాలకు దగ్గరగా ఉన్నట్టు కనిపించే కమల్ పార్టీ నిర్మాణం కూడా అనుకున్నట్టు జరగడం లేదు. రజనీకాంత్‌కు ఎలాంటి సైద్ధాంతిక బలం లేకున్న తనకున్న ‘ఆధ్యాత్మిక’ నేపథ్యంతో ఎన్నికల్లో బీజేపీకి దగ్గరవ్వచ్చేమోగాని అధికారంలోకి వచ్చే స్థాయిలో సీట్లు గెలుచుకోవడం సాధ్యం కాదనే అభిప్రాయం ఉంది. మళ్లీ పుంజుకునే అవకాశాలే లేని కాంగ్రెస్‌తో పొత్తు పెట్టుకుని వచ్చే ఎన్నికల్లో పోటీచేయాలని కమల్‌హాసన్ ఆలోచిస్తున్నారు. హిందుత్వ సిద్ధాంతంతో తమిళులను ఆకట్టుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు కూడా ఆశించిన ఫలితాలు ఇచ్చే పరిస్థితులు లేవు. స్టాలిన్ సామర్ధ్యంపైనే డీఎంకే భవితవ్యం! అంకితభావంతో పనిచేసే కార్యకర్తలతో నిండిన పార్టీ యంత్రాంగం, అవసరమైన వనరులు, తగినంత అనుభవం ఉన్న స్టాలిన్ చాకచక్యంగా వ్యవహరిస్తూ పార్టీని నడపగలిగితే డీఎంకేను మరోసారి అధికారంలోకి తీసుకురావడానికి వీలవుతుంది. ఎప్పటి నుంచో పొత్తుల అనుబంధం ఉన్న కాంగ్రెస్, ఇతర చిన్నచితకా పార్టీలతో కలిసి బలమైన కూటమి నిర్మిస్తే కరుణానిధి వారసునిగా ముఖ్యమంత్రి పదవి చేపట్టడం కష్టమేమీ కాదనే అభిప్రాయాన్ని ఎక్కువ మంది రాజకీయ పండితులు వ్యక్తం చేస్తున్నారు. ద్రవిడ సిద్ధాంత వారసత్వం కూడా డీఎంకేకు కలిసొచ్చే ప్రధానాంశం. ప్రస్తుతమున్న సంక్లిష్ట రాజకీయ వాతావరణంలో డీఎంకే పార్టీ మాత్రమే ఎన్నికలను సునాయాసంగా ఎదుర్కొనగలదని రాజకీయ విశ్లేషకుల్లో అధిక శాతం అభిప్రాయపడుతున్నారు. - (సాక్షి నాలెడ్జ్ సెంటర్) -
అధికారంలోకి వస్తే మిస్టరీ ఛేదిస్తాం
♦ శశికళ, పన్నీరుపై విచారణ కమిషన్ ♦జయలలిత మరణంపై స్టాలిన్ వ్యాఖ్య ♦జాలర్లతో సమావేశం సాక్షి, చెన్నై : తాము అధికారంలోకి రాగానే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని ఛేదించేందుకు అవసరమైన కీలక నిర్ణయాలు తీసుకుంటామని డీఎంకే కార్య నిర్వాహక అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ తెలిపారు. శశికళ, పన్నీరుసెల్వంపై విచారణ కమిషన్ వేస్తామని ప్రకటించారు. ఆర్కేనగర్లో జాలర్ల సమస్యలపై జరిగిన సమావేశానికి స్టాలిన్ హాజరు అయ్యారు. అసెంబ్లీ ఎన్నికల ముందు మనకు.. మనమే నినాదంతో స్టాలిన్ రాష్ట్ర పర్యటన సాగించిన విషయం తెలిసిందే. అన్ని వర్గాలతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహిస్తూ, వారి వారి సమస్యలను అడిగి తెలుసుకుంటూ ఆ పర్యటనలో ముందుకు సాగారు. ఈ పర్యటనకు అమిత స్పందన రావడంతో ప్రస్తుతం మళ్లీ అన్ని వర్గాల సమస్యల అధ్యయనం మీద స్టాలిన్ దృష్టి పెట్టారు. ఇందులో భాగంగా సోమవారం ఆర్కేనగర్ నియోజకవర్గం పరిధిలోని ఓ కల్యాణ మండపంలో జాలర్లతో ఆయన సమావేశం అయ్యారు. జాలర్ల సంఘాల ప్రతినిధులు, జాలర్ల కుటుంబాలు ఈ సమావేశానికి హాజరు అయ్యారు. తమ సమస్యలను స్టాలిన్‌కు వివరించారు. సాగరంలో సాగుతున్న దాడులను, తమకు కరువు అవుతోన్న భద్రతను ఏకరువు పెడుతూ ఆవేదన వ్యక్తం చేశారు. జాలర్ల సంఘాల ప్రతినిధులు సందించిన ప్రశ్నలకు స్టాలిన్ సమాధానాలు ఇచ్చారు. ఈసందర్భంగా స్టాలిన్ తన ప్రసంగంలో జాలర్ల సంక్షేమం లక్ష్యంగా గతంలో డీఎంకే ప్రభుత్వం తీసుకున్న చర్యలను గుర్తు చేశారు. నిఘా పెంచాలి : ఆర్కేనగర్లో ఎన్నికల యంత్రాంగం మరింత కఠినంగా వ్యవహరించాల్సి ఉందన్నారు. ఫిర్యాదుల్ని తక్షణం పరిశీలించి చర్యలు తీసుకోవడాన్ని ఆహ్వానిస్తున్నామన్నారు. రెండాకుల గుర్తు తన రూపంలో అన్నాడీఎంకేకు దురమైనట్టు టీటీవీ దినకరన్ చేస్తున్న ఆరోపణలపై తాను స్పందించ దలచుకోలేదన్నారు. ఇలాంటి వారిపై విమర్శలు గుప్పించి తన స్థాయిని దిగజార్చుకోదలచుకోలేదని వ్యాఖ్యానించారు. జల్లికట్టు మద్దతు ఉద్యమకారుల్ని అణచి వేయడానికి పోలీసులు సాగించిన తీరు సర్వత్రా ఖండించ దగ్గ విషయమేనని స్పందించారు. ఆ సమయంలో విద్యార్థుల్ని పోలీసుల నుంచి రక్షించేందుకు అండగా నిలిచింది జాలర్ల కుటుంబాలకు చెందిన తల్లులేనని అభినందించారు. అధికారంలో ఉన్నప్పుడు నోరు మెదపని ఓ పన్నీరుసెల్వం, ఇప్పుడు స్పందిస్తున్న తీరు హాస్యాస్పందంగా ఉందని విమర్శించారు. తాను ఒక్కటే చెప్పదలచుకున్నానని, డీఎంకే అధికార పగ్గాలు చేపట్టగానే, జయలలిత మరణం వెనుక ఉన్న మిస్టరీని చేధించేందుకు తగ్గ నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశారు. శశికళ, పన్నీరు సెల్వంSపై విచారణ కమిషన్ వేస్తామని, న్యాయ విచారణలో అన్ని వాస్తవాలు వెలుగులోకి వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. -
ఐఏఎస్‌ల ఆక్రోశం
ఇద్దరు సస్పెన్షన్ 18 మందికి వెయిటింగ్ లిస్టు ఐపీఎస్‌లలో కూడా సచివాలయంలో చర్చ అసెంబ్లీకి తాకిన ఐఏఎస్‌ల ఆక్రోశం సమాధానం కరువుతో వాకౌట్ చెన్నై: జయలలిత ప్రభుత్వ తీరుతో పలువురు ఐఏఎస్‌లలో ఆక్రోశం రగిలింది. ఇద్దరిని సస్పెండ్ చేయడంతోపాటు 18 మందిని వెయిటింగ్ లిస్టులో ఉంచడమే కాకుండా... మరి కొందరు సీనియర్లను ప్రాధాన్యత లేని చోట నియమించినట్లు సమాచారం అందడంతో సచివాలయంలో చర్చకు దారి తీసింది. అలాగే ఐపీఎస్ అధికారులు పలువురు ఐఏఎస్‌ల తరహాలో తమ ఆక్రోశాన్ని వెళ్లగక్కేందుకు సిద్ధం అవుతుండడంతో వ్యవహారం కాస్తా అసెంబ్లీకి చేరింది. దీనిపై ప్రభుత్వం నుంచి స్పందన కరువు కావడంతో డీఎంకే, కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు. అన్నాడీఎంకే సర్కారు రెండోసారిగా అధికార పగ్గాలు చేపట్టిన తర్వాత కొందరు ఐఏఎస్‌లను పక్కన పెట్టే పనిలో పడిందని సమాచారం. ఈ అధికారుల్లో ఎక్కువ శాతం మంది అసెంబ్లీ ఎన్నికల సమయంలో ఎన్నికల యంత్రాంగం ఆదేశాల మేరకు ప్రత్యేక అధికారులుగా నియమించ బడ్డ వారే నని తెలిసింది. అయితే ఇదే సమస్యను పలువురు ఐపీఎస్ అధికారులు కూడా ఎదుర్కొంటున్నట్టు సమాచారం. తాజాగా సచివాలయంలో ప్రభుత్వ కక్ష సాధింపునకు ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లు గురి అవుతున్నట్టుగా చోరుగా ప్రచారం జరుగుతోంది. దీనిపై చర్చ కూడా జరుగుతోంది. ఈ సమయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేసి, ఇటీవల ఆగమేఘాలపై బదిలీ వేటు పడిన జ్ఞానదేశికన్తోపాటు ప్రజా పనుల శాఖ కార్యదర్శి యతీంధ్రనాథన్ పై సస్పెన్షన్ వేటు పడింది. అలాగే 18 మంది అధికారులకు ఎలాంటి పదవులు లేకుండా వెయింటింగ్ లిస్ట్ లో ఉన్నారు. మరి కొందరు సీనియర్లు ప్రాధాన్యత లేని చోట్ల తీసుకెళ్లి పడేసినట్టు సంకేతాలు వెలువడ్డాయి. ఇది కాస్త ఐఏఎస్‌లలో ఆక్రోశాన్ని రగిల్చింది. సుమారు 35 మంది ఐఏఎస్‌లు ఏకమై.... ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామ్మోహన్ రావుతో భేటి అనంతరం ఓ నిర్ణయం తీసుకునేందుకు సమాయత్తం అవుతున్నట్టు సచివాలయంలో చర్చ హోరెత్తుతున్నది. అదే విధంగా తీవ్ర అసంతృప్తితో ఉన్న ఐపీఎస్ అధికారులు సైతం ఏకం అవుతున్నట్టు సమాచారం. ఈ పరిస్థితుల్లో ఐఎఎస్, ఐపీఎస్‌లో రగిలిన అసంతృప్తి జ్వాల ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయో అన్న ఉత్కంఠ బయలుదేరి ఉన్నది. అదే సమయంలో ఈ వ్యవహారం గురువారం అసెంబ్లీని తాకింది. అసెంబ్లీలో ఈ విషయంగా సమాధానం రాబట్టేందుకు ప్రధాన ప్రతి పక్షం డిఎంకే, కాంగ్రెస్ సభ్యులు పట్టుబట్టారు. అయితే, పాలకుల నుంచి స్పందన కరువు కావడంతో సభ నుంచి వాకౌట్ చేశారు. మీడియాతో స్టాలిన్ మాట్లాడుతూ ఐఏఎస్‌ల సస్పెండ్, పక్కన పెట్టే వ్యవహారాల వెనుక కారణాల గురించి ప్రశ్నిస్తే పాలకుల వద్ద సమాధానాలు లేదని మండి పడ్డారు. అందుకే సభ నుంచి వాకౌట్ చేశామని స్టాలిన్ చెప్పారు. -
స్టాలిన్ సర్వే
రాష్ట్రంలో జిల్లాల వారీగా పార్టీ పరిస్థితి, అక్కడి నేతల వ్యవహార శైలి గురించి డీఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ రహస్య సర్వే నిర్వహించి ఉన్నారు. బలహీనంగా ఉన్నచోట్ల బలోపేతం లక్ష్యంగా, గ్రూపు తగాదాలు ఉన్న చోట్ల ప్రత్యామ్నాయం అడుగులకు సిద్ధం అయ్యారు. గ్రూపు రాజకీయాలు సాగిస్తున్న జిల్లాల నేతల్ని పిలిపించి చీవాట్లు పెట్టడంతోపాటుగా తీవ్ర హెచ్చరికలు చేసి పంపుతున్నారు. ఉన్న జిల్లాల సంఖ్యను 65కు చేర్చారు. నాయకుల్లో ఉన్న అసంతృప్తి జ్వాలను చల్లార్చే రీతిలో వ్యవహరించి పదవుల్ని కేటాయించారు. అనేక జిల్లాల్లో కీలక పదవుల్ని కొత్త వాళ్లకు, యువతకు అప్పగించారు. ఇంత వరకు అంత బాగానే ఉన్నా, జిల్లాల్లో సీనియర్లు, జూనియర్లు అన్న బేధాలు లేకుండా అందరూ సమిష్టిగా పనిచేయాలన్న విషయాన్ని సేనలకు ఉపదేశించడంలో మరిచారు. దీంతో కొత్తగా ఎంపికైన వాళ్లకు సీనియర్లను చిక్కులు, సమస్యలు తప్పలేదు. ఇది కాస్త గ్రూపులకు ఆజ్యం పోసి ఉన్నది. స్టాలిన్ సర్వే : అధినేత కరుణానిధి వారసుడిగా, ప్రతినిధిగా నిత్యం పార్టీ వర్గాలకు అందుబాటులో ఉన్నది డిఎంకే కోశాధికారి ఎంకే స్టాలిన్ అన్న విషయం తెలిసిందే. పార్టీ సంస్థాగత సమరం, పదవుల పందేరాలు ముగియడంతో ప్రస్తుతం జిల్లాల్లో పార్టీ పరిస్థితి, నేతల తీరు తెన్నులు , వ్యవహార శైలిపై స్టాలిన్ రహస్య సర్వే చేపట్టి ఉన్నారు. రాష్ర్టంలో ప్రస్తుతం నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యంలో జిల్లాల వారీగా సమాచారాన్ని సేకరించి ఉన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలం పేరిగి ఉన్నట్టు ఆ సర్వేలో తేలి ఉన్నది. అలాగే, గతంలో మరీ బలహీనంగా ఉన్న కొన్ని జిల్లాల్లో పార్టీ బల పడ్డా, కొందరు నాయకుల గ్రూపు రాజకీయాల రూపంలో ఎన్నికల వేళ చిక్కులు తప్పవన్న విషయం ఆ సర్వేలో తేలింది. ఈ సమాచారంతో మేల్కొన్న స్టాలిన్ గ్రూపు రాజకీయాలకు కల్లెం వేసే పనిలో పడ్డారు. రోజుకు ఒక జిల్లా చొప్పున అక్కడున్న నాయకులందరిని పిలిపించి క్లాస్ పీకే పనిలో పడ్డట్టు అన్నా అరివాలయం వర్గాలు పేర్కొంటున్నారు. హెచ్చరికలు : అన్ని జిల్లాల నాయకులతో స్టాలిన్ మంతనాలు జరుపుతూ, సూచనలు సలహాలు, మందలిస్తున్నా, ప్రధానంగా పదిహేను జిల్లా నాయకుల్ని మాత్రం టార్గెట్ చేసి తీవ్రంగా హెచ్చరించే పనిలో పడ్డట్టు ఆ పార్టీ వర్గాలు చెబుతున్నాయి. ఈ సమావేశాల్లో భాగంగా బుధవారం తిరునల్వేలి జిల్లాలోని నాయకులతో సాగిన భేటీ వాడి వేడిగా జరిగినట్టు పేర్కొంటున్నారు. ఈ సమావేశానికి తిరునల్వేలి పరిధిలోని మూడు జిల్లాల కార్యదర్శులు ఆవుడయప్పన్, అబ్దుల్ వాహాబ్, దురై రాజ్‌లతో పాటుగా మాజీ మంత్రు లు పూంగోదై, మొహిద్దీన్ ఖాన్, యూనియన్, నగర విభాగాల నాయకుల్ని, మాజీ ఎమ్మెల్యేలను పిలిపించి ఉన్నారు. మాజీ ఎమ్మెల్యే, సీనియర్ నాయకుడు కరుప్పుస్వామి పాండియన్ మాత్రం డుమ్మా కొట్టారు. ఈ భేటీలో ప్రధానంగా గ్రూపు రాజకీయాలకు కల్లెం వేయడం లక్ష్యంగా స్టాలిన్ తీవ్రంగా స్పందించినట్టు ఆ జిల్లా నాయకులు ఒకరు పేర్కొన్నారు. రెండు గంటల పాటుగా సాగిన ఈ భేటీలో రాష్ట్రంలో పరిస్థితులు డీఎంకేకు అనుకూలంగానేఉన్నాయని, ఐక్యతతో ముందుకు సాగని పక్షంలో ఫలితాలు తారుమారయ్యే ప్రమాదం ఉందని హెచ్చరించి ఉన్నారు. ఎవరికి వారు గ్రూపులతో, విబేధాలతో సాగిన పక్షంలో పార్టీని ఒడ్డుకు చేర్చడం కష్టం అని మందలించి ఉన్నారు. వాళ్లతో కలిసి పనిచేయం, వీళ్లతో కలసి పనిచేయం అని వాళ్లు మర్యాదగా పార్టీ నుంచి బయటకు వెళ్ల వచ్చని, అసవరం అయితే, జిల్లా కమిటీల్ని రద్దు చేస్తానని తీవ్రంగా హెచ్చరించినట్టుగా అన్నా అరివాలయంలో చర్చ సాగుతున్నది. స్టాలిన్ తీవ్రంగానే ఆగ్రహం వ్యక్తం చేస్తుండడంతో గ్రూపుల్ని కట్టిబెట్టి ఐక్యతను చాటుకునే విధంగా స్టాలిన్ ఎదుట ప్రత్యక్షం అయ్యేందుకు ఆయా జిల్లాల నాయకులు సిద్ధం అవుతున్నారటా..! -
స్టాలిన్ తంత్రం
డీఎంకేలో అసంతృప్తికి చోటులేదని చాటడంతో పాటుగా ఎంతటి వారినైనా సరే తన వైపు తిప్పుకుని తీరుతానని ఆ పార్టీ కోశాధికారి ఎంకే స్టాలిన్ మరో మారు రుజువు చేశారు. పార్టీ అనుబంధ విభాగాల జాబితాలో తన రాజకీయ తంత్రాన్ని ప్రయోగించి అసంతృప్తి వాదులకు పదవుల్ని కట్టబెట్టారు. ఇందులో తన అన్నయ్య, పార్టీ బహిష్కృత నేత ఎంకే అళగిరి మద్దతుదారులు ఎక్కువగా ఉండడం గమనార్హం. సాక్షి, చెన్నై : డీఎంకే దక్షిణాది కింగ్ మేయర్ ఎంకే అళగిరిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే. తమ నేతను బహిష్కరించడంతో ఆయన మద్దతుదారులు అధిష్టానంపై గుర్రుగానే ఉన్నారు. మళ్లీ అళగిరిని పార్టీలోకి ఆహ్వానించాలని ఒత్తిడి తెచ్చే పనిలో ఉన్నారు. ఈ పరిస్థితుల్లో ఇటీవల జరిగిన పార్టీ సంస్థాగత ఎన్నికల్లోనూ అళగిరి మద్దతు నేతలకు చోటు దక్కలేదు. గతంలో జిల్లాల కార్యదర్శులుగా పనిచేసిన నాయకులు, తాజాగా ఆ పదువుల్ని సైతం కోల్పోయూరు. డీఎంకేలో స్టాలిన్ హవా సాగుతుం డడం, ఆయన మద్దతుదారులకే సంస్థాగత ఎన్నికల్లో పదవులు దక్కుడాన్ని అళగిరి మద్దతుదారులు జీర్ణించుకోలేక పోయారు. అళగిరి పుట్టినరోజును పురస్కరించుకుని కీలక నిర్ణయాలు తీసుకోవాలన్న యోచనలో పడ్డారు. దీన్ని పసిగట్టిన స్టాలిన్ తన రాజకీయ తంత్రాన్ని ప్రయోగించారు. ఆగమేఘాలపై పార్టీ అనుబంధ విభాగాల కార్యవర్గాల భర్తీ లక్ష్యంగా కరుణానిధి, ప్రధాన కార్యదర్శి అన్భళగన్లపై ఒత్తిడి పెంచినట్టు సమాచారం. పార్టీ అనుబంధ విభాగాల పదవులను అసంతృప్తి వాదులు, అళగిరి మద్దతుదారులకు కట్టబెట్టి తన వైపు వారిని తిప్పుకునే రీతిలో వ్యూహ రచన చేసి సఫలీకృతులయ్యారు. అసంతృప్తి వాదులకు పదవి : ఇన్నాళ్లు తనకు వ్యతిరేకంగా వ్యవహరిస్తూ వచ్చిన వారందరికి ఏక గ్రీవంగా పదవుల్ని కట్టబెట్టడంతో పాటుగా అళగిరి పుట్టినరోజుకు ఆ నాయకులను దూరం చేశారు. శుక్రవారం అళగిరి పుట్టినరోజు వేడుకను మదురైలో ఘనంగా నిర్వహించేందుకు ఆయన మద్దతుదారులు ఏర్పాటు చేశారు. దీన్ని పసిగట్టిన స్టాలిన్ అదే రోజున కార్యవర్గాల చిట్టాను విడుదల చేయిం చారు. అళగిరికి దూరంగా ఆయన మద్దతునేతలను తీసుకొచ్చేశారు. ఉదయాన్నే అనుబంధ విభాగాలు, రాష్ట్ర పార్టీ నిర్వాహక కమిటీ, తీర్మానాల కమిటీ, తదితర కమిటీల్లో అళగిరి మద్ద తు దారులు, అసంతృప్తి నాయకుల పేర్లతో జాబితాలు వెలువడేలా చేశా రు. అసంతృప్తి ఉన్న నాయకులు తమ కు పదవులు దక్కడంతో ఏకంగా అళగిరి బర్త్‌డే వేడుకకు డుమ్మా కొట్టారు. ఎవరైనా నా వెంటే : పదవుల్ని దక్కించుకున్న వారిలో ప్రధానంగా దక్షిణ తమిళనాడులో కీలక నేతలుగా ఉన్న వాళ్లు, మంత్రులుగా పనిచేసిన వాళ్లు ఉన్నారు. పొన్ ముత్తు రామలింగం, పళణి మాణికయ్యం, కరుప్ప స్వామి పాండియన్, కన్నప్పన్, అప్పావు, తిరుచ్చి సెల్వ రాజ్, కేఎస్ రాధాకృష్ణన్, రంగనాథన్ పొంగలూరు పళని స్వామి, వెల్లకొవిల్ స్వామి నాథన్, ఏజీ సంపత్, రఘుపతి, సెల్వేంద్రన్, సెల్వ గణపతి, సత్యమూర్తి, ముత్తయ్య, తంగవేలు, కేపీపీ స్వామి, ఆర్డి శేఖర్, అలగు తిరునావుక్కరసు, సెంగుట్టవన్, లారె న్స్, ఆస్టిన్, పూంగోదై, ఇందిరా కుమారి, కాశిముత్తు మాణిక్య, మైదీన్ ఖాన్, వంటి నేతల్ని సంతృప్తి పరిచే రీతిలో ఏదో ఒక పదవిని అప్పగించారు. అళగిరికి అత్యంత సన్నిహితుడిగా ఉన్న ఎంపీ కేపీ రామలింగానికి మళ్లీ వ్యవసాయ శాఖ కార్యదర్శి పదవిని అప్పగించారు. ఈ విషయమై స్టాలిన్ మద్దతు నేత ఒకరు పేర్కొం టూ, డీఎంకేలో అసంతృప్తికి చోటు ఉండదని, అందరూ అధినేత కరుణానిధి మార్గంలో నడవాల్సిందేనని చాటే రీతిలో స్టాలిన్ తన తంత్రాన్ని ప్రయోగించారని చెప్పారు. అళగిరి బర్త్‌డేకు కేపీ రామలింగం మినహా, తక్కిన ఆయన మద్దతు నేతలెవ్వరూ వెళ్ల లేదని వివరించారు. ఆ బర్త్‌డే వేదికగా ఎలాంటి కొత్త ఎత్తులకు ఆస్కారం లేకుండా అడ్డుకట్ట వేయడంతో పాటు గా పార్టీలో ఇక అసంతృప్తికి కాలం చెల్లిందని చాటే విధంగా తమ నేత వ్యవహరించారని పేర్కొన్నారు. -
తెన్నరసుకు యువజన పగ్గాలు
సాక్షి, చెన్నై:డీఎంకే యువజన విభాగం ప్రధాన కార్యదర్శి పదవి నుంచి ఎంకే స్టాలిన్ తప్పుకోనున్నారు. తన మద్దతు దారుడు తంగం తెన్నరసును ఆ పదవిలో కూర్చోబెట్టేందుకు సిద్ధమవుతున్నారు. డీఎంకేకు యువజన విభాగం వెన్నెముకలాంటిది. ఈ విభాగాన్ని డీఎంకే అధినేత ఎం కరుణానిధి తనయుడు ఎంకే స్టాలిన్ ఏర్పాటు చేశారు. ఈ విభాగం ఆవిర్భావ కాలం నాటి నుంచి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం పార్టీని యువ రక్తంతో నింపే విధంగా ప్రక్షాళన పర్వం సాగుతోంది. యువజన విభాగంలోని సీనియర్లను పార్టీ సేవలకు వినియోగించుకునేందుకు డీఎంకే అధినేత ఎం కరుణానిధి సిద్ధం అయ్యారు. అదే సమయంలో, పార్టీ కోశాధికారిగా, యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా జోడు పదవుల్లో ఉన్న స్టాలిన్ త్వరలో పార్టీ పరంగా కీలక బాధ్యతలు చేపట్టేందుకు సిద్ధమవుతున్నారు. ఈ సమయంలో ఆయన జోడు పదవులను అంటి పెట్టుకుని స్వారీ చేయడం కష్టతరం అవుతుంది. దీంతో యువజన పగ్గాలను పక్కన పెట్టి, పార్టీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టేందుకు స్టాలిన్ సిద్ధం అయ్యారు. ఈ దృష్ట్యా, పార్టీకి అనుబంధంగా వెన్నెముకగా ఉన్న యువజన విభాగాన్ని తన మద్దతుదారుడికి కట్టబెట్టేందుకు స్టాలిన్ వ్యూహ రచన చేసి ఉన్నారు. తంగం తెన్నరసు : పార్టీ ప్రక్షాళన కమిటీలో కీలక భూమిక పోషిస్తున్న తంగం తెన్నరసును ఆ పదవికి ఎంపిక చేయడానికి నిర్ణయించినట్టు డీఎంకే వర్గాలు పేర్కొంటున్నాయి. తంగం తెన్నరసు తనకు సన్నిహితుడు కావడంతో, యువజన విభాగం బలోపేతానికి శ్రమించ గలడన్న నిర్ణయానికి వచ్చి ఆయన్ను ఆ విభాగం ప్రధాన కార్యదర్శి పదవికి అర్హుడిగా స్టాలిన్ ఎంపిక చేయడం గమనార్హం. లండన్ నుంచి రాగానే, ఆ పదవి నుంచి తప్పుకునే స్టాలిన్, బాధ్యతల్ని తంగం తెన్నరసుకు అప్పగించే అవకాశాలు ఉన్నట్టు అన్నా అరివాళయం వర్గాలు పేర్కొంటున్నాయి. అధినేత ఎం కరుణానిధి ఆదేశాల మేరకు ఆ పదవి నుంచి తప్పుకునేందుకు స్టాలిన్ సిద్ధమవుతున్నట్టు అరివాళయంలో ప్రచారం సాగుతోంది. లోక్ సభ ఎన్నికల వేళ ఏ విధంగా తమ పార్టీ ప్రధాని అభ్యర్థిగా మోడీ సారథ్యాన్ని బీజేపీ ప్రకటించిందో, అదే తరహాలో తదుపరి రాష్ట్రంలో స్టాలిన్‌ను అందలం ఎక్కించేందుకు కరుణానిధి నిర్ణయం తీసుకునేసినట్టుగా ప్రచారం సాగుతోంది.