![Tamil Nadu: Mk Stalin To Take Oath On May 7th - Sakshi](/styles/webp/s3/article_images/2021/05/3/59.jpg.webp?itok=Ax5GBHVx)
సాక్షి, చెన్నై: మే2న విడుదలైన తమిళనాడు అసెంబ్లీ ఫలితాల్లో తిరుగులేని విజయాన్ని సొంతం చేసుకున్న ద్రవిడ మున్నేట్ర కళగం (డీఎంకే) పార్టీ ఆ రాష్ట్ర ప్రభుత్వ పగ్గాలను చేపట్టబోతుంది. జయలలిత మరణించిన తర్వాత తొలిసారి జరిగిన తమిళనాడు ఎన్నికల్లో డీఎంకే పార్టీ సత్తా చాటింది. మొత్తం 234 నియోజకవర్గాలున్న అసెంబ్లీలో 156 స్థానాలను డీఎంకే కూటమి కైవసం చేసుకుంది. పదేళ్ల నిరీక్షణ అనంతరం మళ్లీ డీఎంకేకు అధికారం వరించింది. దీంతో ఆ పార్టీ అధ్యక్షుడు ఎంకే స్టాలిన్ ముఖ్యమంత్రి పీఠాన్ని అధిరోహించనున్నారు.
తమిళనాడు ముఖ్యమంత్రిగా డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ ఈ నెల 7న ప్రమాణం చేయనున్నారు. ప్రస్తుతం నెలకొన్న కొవిడ్ సెకండ్ వేవ్ సంక్షోభం కారణంగా నిరాడంబరంగా ప్రమాణ స్వీకార కార్యక్రమం చేపట్టబోనున్నట్లు ఇప్పటికే స్టాలిన్ స్పష్టం చేశారు. ఆదివారం విజయం తర్వాత తన తండ్రి కరుణానిధి సమాధి దగ్గర నివాళులర్పించిన స్టాలిన్ మీడియాతో మాట్లాడారు. అధికారంలోకి రాగానే తాము ఇచ్చిన హామీలను నెరవేరుస్తామని చెప్పారు. ఇక తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో స్టాలిన్ కొలత్తూరు నుంచి ఆయన తనయుడు ఉధయనిధి స్టాలిన్ చెపాక్ నుంచి విజయం సాధించిన విషయం తెలిసిందే.
చదవండి:
156 స్థానాల్లో డీఎంకే కూటమి ఘనవిజయం
తమిళనాడు: ఇరవై ఏళ్లకు.. వికసించిన కమలం
Comments
Please login to add a commentAdd a comment