
తండ్రి స్టాలిన్‌ను అభినందిస్తున్న ఉదయనిధి
సాక్షి, చెన్నై: కరుణానిధి వారసుడు స్టాలిన్ సీఎం పగ్గాలు చేపట్టేందుకు రెడీ అయ్యారు. అదే సమయంలో తన వారసుడిని స్టాలిన్ ముందే రంగంలోకి దించారు. స్టాలిన్‌కు భార్య దుర్గా స్టాలిన్, కుమారుడు ఉదయనిధి స్టాలిన్, కుమార్తె సెంతామరై ఉన్నారు.
సినీ నిర్మాతగా, నటుడిగా తన కంటూ ప్రత్కేక గుర్తింపు కలిగిన ఉదయనిధిని తాను స్థాపించిన డీఎంకే యువజన విభాగానికి ప్రధాన కార్యదర్శిగా స్టాలిన్ గతంలోనే నియమించారు. అలాగే, చేపాక్కం –ట్రిప్లికేన్ నుంచి విజయకేతనంతో తొలిసారి అసెంబ్లీలో అడుగుపెట్టేందుకు ఉదయనిధి రెడీ అయ్యారు. ఈ నెల 6న సీఎంగా స్టాలిన్ ప్రమాణస్వీకారం చేసే చాన్స్ ఉన్నట్లు భావిస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment