
సాక్షి, హైదరాబాద్: హెరిటేజ్ సంస్థకు నాంపల్లి కోర్టు మంగళవారం గట్టిషాక్ ఇచ్చింది. గతంలో కన్నబాబు,అంబటి రాంబాబులపై హెరిటేజ్ సంస్థ పరువునష్టం కింద నాంపల్లి కోర్టులో పిటిషన్‌ను దాఖలు చేసింది. తాజాగా ఈ కేసు మంగళవారం విచారణకు వచ్చింది. సరైన ఆధారాలు లేవన్న కారణంతో నాంపల్లి కోర్టు కేసును కొట్టివేసింది.హెరిటేజ్ కేసులో సంస్థ అధికారులు సరైన ఆధారాలు చూపలేకపోయారని కోర్టు తెలిపింది. ఈ మేరకు కన్నబాబు, అంబటి రాంబాబులపై నమోదైన కేసును కొట్టివేస్తున్నట్లు నాంపల్లి కోర్టు పేర్కొంది.
Comments
Please login to add a commentAdd a comment