భివండీ న్యూస్‌లైన్ : రహనాల్ గ్రామంలోని సద్గురు కాంపౌండ్ సిరాజ్ కెమికల్ కంపెనీ గోదాములో గురువారం ఉదయం 11 గంటలకు అగ్ని ప్రమాదం జరిగింది. అయితే ఈ ప్రమాదంలో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. భారీగా మంటలు చెలరేగడంతో గోదాము ఎదురుగా నిలిపి ఉంచిన టెంపో దగ్ధమైంది. అగ్మి మాపక సిబ్బంది వెంటనే మంటలను అదుపులోకి తెచ్చారు. ప్రమాదం జరిగిన గోదాముకు ఎలాంటి అనుమతులు లేవని గ్రామ పంచాయితి వికాస్ అధికారి నరేష్ పాటిల్ మీడియాకు తెల్పారు. దీనిపై సంబంధిత అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.