
స్వాతి వేముల (ఫైల్ ఫొటో)
సాక్షి, భివండీ: ప్రేమించిన వ్యక్తి పెళ్లికి నిరాకరించడంతో తీవ్ర మనస్థాపానికి గురైన తెలుగు యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన మహారాష్ట్రలోని భివండీలో జరిగింది. వివరాలు.. కామత్‌ఘర్‌కు చెందిన స్వాతి వేముల (21), బాలాజి నగర్‌కు చెందిన సాయిచంద్ర మాచెర్ల (25) గత నాలుగేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. పెళ్లి చేసుకుందామని స్వాతి చెప్పడంతో సాయిచంద్ర నిరాకరించాడు. దీంతో మంగళవారం ఇంట్లో ఎవరులేని సమయంలో స్వాతి ఉరేసుకుని తనువు చాలించింది. పోలీసులు కేసు నమోదుచేసి సాయిచంద్రని అదుపులోకి తీసుకున్నారు.
Comments
Please login to add a commentAdd a comment