
15 ఏళ్ల బాలికపై గ్యాంగ్‌రేప్
పదిహేనేళ్ల బాలికపై పాల్ఘర్ జిల్లా వాసాయిలో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.
భివండీ న్యూస్‌లైన్ : పదిహేనేళ్ల బాలికపై పాల్ఘర్ జిల్లా వాసాయిలో ముగ్గురు యువకులు సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఈ ఘటనలో పోలీసులు ఒకరిని అరెస్టు చేయగా, మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. భివండీకి సమీపంలోని ఓ గ్రామానికి చెందిన ఈ బాలికను పోగావ్ ప్రాంతానికి చెందిన రామ్‌పర్వేశ్ చౌవ్హాన్ (26) కొద్ది రోజుల క్రితం వివాహాం చేసుకుంటానని చెప్పాడు.
అందుకు ఆమె నిరాకరించడంతో తన మిత్రులు ధామన్‌కర్ నాక ప్రాంతానికి చెందిన ఇజాజ్ అహ్మద్ (26) గజని చౌదరి (30)తో కలిసి బాధితులారాలిని ఈ నెల 5నఅపహరించారు. వడూన్‌గర్ గ్రామంలోని ఓ చిన్న గదిలో ఆమెను బంధించి ముగ్గురూ సామూహిక అత్యాచారం చేశారు. వారి చెర నుంచి తప్పించుకున్న బాలిక జరిగిన విషయాన్ని ఎవరికీ చెప్పలేదు. అయితే ఆమె అనారోగ్యం పాలవడంతో తల్లి దగ్గరిలో ఉన్న వైద్యుని వద్దకు తీసుకెళ్లగా అసలు విషయం బయట పడింది.
బాధితురాలి తల్లి స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్‌లో సోమవారం ఫిర్యాదు చేయగా పోలీసులు కేస్ నమోదు చేశారు. ప్రధాన నిందుతుడు రామ్‌పర్వేశ్ చౌహాన్‌ను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న వారి కోసం గాలిస్తున్నామని పోలీసు చెప్పారు.