మాంత్రికుని చేతిలో మోసపోయిన ఓ పోలీస్ భార్య ఉదంతం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది.
భివండీ, న్యూస్‌లైన్ : మాంత్రికుని చేతిలో మోసపోయిన ఓ పోలీస్ భార్య ఉదంతం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఠాణే కోపిరి ట్రాఫిక్ విభాగంలో విధులు నిర్వహిస్తున్న టేంగర్ ప్రాంతానికి చెందిన ఓ పోలీసు భార్య రూపాలి (34) తన సమస్యలను విన్నవించుకొనేందుకు కల్యాణ్ నాకలోని సుందర్‌బేన్ కాంపౌండ్‌లో నివసించే మాంత్రికుడికి వద్దకు వెళ్లింది.
ఆమె సమస్యలు పరిష్కరించడానికి మాంత్రికుడు రూ. 35 వేలు ఖర్చు అవుతాయని చెప్పాడు. ఆమె తన వద్ద అంత డబ్బు లేదని చెప్పడంతో ఆభరణాలు ఉన్నా తీసుకురావాలని మాంత్రికుడు చెప్పాడు. దీంతో ఆమె మంగళవారం తన వద్ద ఉన్న రూ. 25 వేల విలువచేసే బంగారు గొలుసు, రూ.34 వేలు విలువ చేసే నెక్లస్‌తో పాటు ఐదు వేల నగదును ఇచ్చింది. మాంత్రికుడు తనను మోసం చేశాడని గుర్తించి బుధవారం స్థానిక పట్టణ పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది.