భివండీ, న్యూస్‌లైన్ : స్థానిక వరాలదేవి మందిరం వద్ద శ్రీ హనుమాన్ సేవా ట్రస్టు ఆధ్వర్యంలో చేపట్టిన ఆంజనేయస్వామి విగ్రహ తయారీ పనులు కొనసాగుతున్నాయి. ప్రతి ఏడాది హనుమాన్ జయంతిని పురస్కరించుకొని కొంతమంది భక్తులు 41 రోజుల ముందు హనుమాన్ మాలధారణ చే స్తారు. నిత్యం ఉపవాస దీక్షలు, ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు.
దీనిని దృష్టిలో ఉంచుకుని శ్రీ హనుమాన్ సేవా ట్రస్టు భారీ ఆంజనేయ స్వామి విగ్రహ తయారీకి పూనుకుంది. అంతేకాకుండా ప్రతి ఏటా హనుజ్జయంతి సందర్భంగా నిత్యాన్నదాన కార్యక్రమాలను కూడా నిర్వహిస్తోంది. 2007లో సంపూర్ణ రామకోటి రాసి భద్రాచల రామయ్యకు అంకితం కూడా చేశామని ట్రస్ట్ సభ్యుడొకరు పేర్కొన్నారు. 2009లో లక్షదీపార్చన కార్యక్రమం కూడా నిర్వహించామన్నారు. 2010 లో 1,111 మంది మహిళా భక్తులతో లలితాదేవి కుంకుమార్చన, శ్రీచక్ర పూజ తదితర కార్యక్రమాలను నిర్వహించామన్నారు.
ఇలా ప్రతి ఏడాది ప్రత్యేక పూజా కార్యక్రమాలను నిర్వహిస్తూన్న ట్రస్టు సంస్థాపకుడు గుండేటి నాగేష్, కార్యదర్శి బాలకిషన్ కోశాధికారి కోడూరి మల్లేశంలు తెలిపారు. కాగా కరీంనగర్ జిల్లా సిరిసిల్ల గ్రామానికి చెందిన వడ్డెపల్లి సత్యనారాయణ... ఆంజనేయ విగ్రహాన్ని తయారు చేస్తున్నారు. ఈ సందర్భంగా ట్రస్టు సభ్యులు మాట్లాడుతూ విగ్రహం తయారీకోసం పెద్దఎత్తున విరాళాలను సేకరించాల్సి ఉందన్నారు. పట్టణానికి చెందిన కొంతమంది దాతలు ముందుకొచ్చి విరాళాలు ఇచ్చారన్నారు. అయినప్పటికీ అవి సరిపోవన్నారు. అందువల్ల విగ్రహ తయారీకి ఆర్థిక సహాయం చేయాలని స్థానికులను వారు కోరారు. ఆర్థిక సహాయం చేయదలచిన వారు తమను 09320607696 నంబర్‌పై సంప్రదించాలని కోరారు.
కొనసాగుతున్న విగ్రహ నిర్మాణ పనులు
Published Mon, Nov 10 2014 11:21 PM | Last Updated on Sat, Jun 2 2018 8:47 PM
Advertisement
Advertisement