భివండీ, న్యూస్‌లైన్: భివండి పవార్‌లూమ్ పరిశ్రమల యజమానులు చేపట్టిన ఆందోళన ఆరో రోజుకు చేరింది. వీరి డిమాండ్ల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో సోమవారం ఆందోళనను మరింత తీవ్రం చేశారు. భీవండీ పవర్‌లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అశోక్‌నగర్ నుంచి టోరంటో నోడల్ కంపెనీ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పవార్‌లూమ్స్ యజమానులు పాల్గొన్నారు. విద్యుత్ వితరణ కంపెనీకి చెందిన నోడల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, విద్యుత్ రేట్లు తగ్గించాలని, టోరంట్ కంపెనీని భివండీ నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో కూడిన ఓ విన్నతిపత్రాన్ని నోడల్ అధికారి పరస్‌బి జాడ్కర్‌కు అందించారు. ఈ ర్యాలీలో భీవండీ పవర్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు, ఎంపీ సురేష్ టావ్రే, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రశీద్ తాహిర్, శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రేతోపాటు పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు.
న్యాయం చేసేందుకు కృషి చేస్తా: సీఎం
భివండీ పవార్‌లూమ్స్ యజమానుల సమస్యలపై సంఘర్ష్ సమితి అధ్యక్షులైన ఎంపీ సురేష్ టావ్రే సోమవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవార్‌లూమ్స్ యజమానులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు టావ్రే తెలిపారు. పవార్‌లూమ్స్ యజమానులు, సంఘర్ష్ సమితి పదాధికారులతోపాటు టొరంటో కంపెనీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టావ్రే ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.
భివండీ ఆందోళన మరింత తీవ్రం
Published Tue, Nov 12 2013 12:50 AM | Last Updated on Sat, Sep 2 2017 12:31 AM
Advertisement