Power Looms
-
రాజన్న సిరిసిల్లలో పవర్ లూమ్స్ పరిశ్రమ బంద్
-
మగ్గాలపై మలిసంధ్య బతుకులు
చేనేతను నమ్ముకుని పనిచేస్తున్న ఆఖరితరం - సిరిసిల్లలో మొత్తం 175 చేనేత మగ్గాలు - కార్మికులు 225 మంది మాత్రమే - ఇప్పటికే జియో ట్యాగింగ్ పూర్తి - చేనేతను మింగిన మర నేత ఈ చిత్రంలో కనిపిస్తున్న చేనేత కార్మికుడి పేరు మామిడాల చంద్రయ్య (92). భార్య పేరు కమలమ్మ. ముగ్గురు కుమారులు, ఒక కూతురు. సిరిసిల్ల విద్యానగర్వాసి. ఒకప్పుడు బాగానే బతికాడు. ఇల్లు కట్టుకోవడంతోపాటు కుమారులు, కూతురుకు పెళ్లిళ్లు చేశాడు. వీరు ఎవరికి వారే బతుకుతున్నారు. ఈ వృద్ధుడిది ఇప్పుడు సాతగాని పానం.. బొక్కలు తేలిన ఒళ్లు.. మగ్గంపై జోటను ఆడించాలంటే రెక్కల్లో సత్తువ లేదు. తన ఒంట్లో సత్తువ లేకున్నా.. చేనేత మగ్గంపై బట్ట నేస్తున్నాడు. రోజూ పొద్దుగాల 10 గంటలకు వచ్చి చేనేతమగ్గంపై 4 మీటర్ల బట్టను సాయంత్రం 5 గంటల వరకు ఉత్పత్తిచేసి వెళ్తాడు. ఒక్కో మీటరుకు రూ.17 చొప్పున రోజూ రూ.68 కూలి వస్తుంది. నెలకు రూ.1,500 – రూ.1,800 మాత్రమే అందుతుంది. ప్రభుత్వం ఆసరా పింఛన్ రూ.1,000 ఇస్తుంది. ఈ సొమ్ముతోనే బియ్యం, ఉప్పు, పప్పు, కూరగాయలతో పూటగడవాలి. ఆరోగ్యం సహకరించకున్నా చేనేతమగ్గంపై బట్ట నేసి అంతో ఇంతో సంపాదించడం తప్ప మరోమార్గంలేదు. ఇది ఒక్క చంద్రయ్య– కమలమ్మ దంపతుల పరిస్థితే కాదు.. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని దాదాపు 225 మంది చేనేత కార్మికుల దుస్థితి. సిరిసిల్ల: ‘చిన్న చేపను పెద్ద చేప మింగినట్లు’.. చేనేత మగ్గాలను మరమగ్గాలు (పవర్‌లూమ్స్) మింగేశాయి. కాలంతో పోటీ పడలేక.. జిగిసచ్చిన వృద్ధ కార్మికులు మరోపని చేతకాక.. వయసు పైబడినా.. కళ్లు కనిపించ కపోయినా.. ఒళ్లు సహకరించకున్నా.. జానెడు పొట్ట కోసం.. కాళ్లు, చేతులు ఆడిస్తూ బట్ట నేస్తున్నారు. 58 ఏళ్లవయసు నిండితే ప్రభుత్వం రిటైర్మెంట్ను ప్రకటి స్తోంది. కానీ చేనేత కార్మికులంతా 60 దాటి 95 ఏళ్ల వయసున్న వారు ఇంకా మగ్గంపై శ్రమిస్తూ.. పొట్టపో సుకుంటున్నారు. తక్కువ కూలి ఉన్నా.. కుటుంబ అవసరాల కోసం మగ్గాన్నే నమ్ముకుని మలి సంధ్య లోనూ పనిచేస్తున్నారు. సిరిసిల్లలో మూడు చేనేత సహకార సంఘాలు ఉండగా.. 114 మంది కార్మికులు చేనేత మగ్గాలపై ఆధారపడ్డవారే.. మరమగ్గాలపై వేగం గా బట్ట ఉత్పత్తి అవుతుండగా.. చేనేతమగ్గంపై కాళ్లు, చేతులు ఆడిస్తూ.. ఎంతశ్రమించినా మరమగ్గాలతో పోటీపడలేక పోతున్నారు. అత్యంత కష్టమైన ఈ పనిలో వయోవృద్ధులు శ్రమించడం బాధాకరం. ఈ పనిని కొత్తగా ఎవ్వరూ నేర్చుకోకపోవడంతో ఈ తరం తనువు చాలిస్తే.. చేనేత మగ్గాలు మూలన పడాల్సిందే. ఇప్పుడు మరణశయ్యపై చేనేత మగ్గాలు ఆఖరితరం చేతిలో బట్టనేస్తున్నాయి. మిగిలినవి కొన్నే.. రాజన్న సిరిసిల్ల జిల్లాలో 175 చేనేత మగ్గా లు ఉన్నాయి. వీటికి చేనేత, జౌళిశాఖ అధి కారులు జియో ట్యాగింగ్ చేశారు. ఈ రంగంపై 175 మంది కార్మికులు, మరో 50 మంది అను బంధ రంగాల కార్మికులు ఆధారపడ్డారు. సిరిసి ల్లలో అత్యధికంగా 135 మంది ఉండగా.. వేము లవాడ, మామిడిపల్లి, బోయినపల్లి, తంగళ్లపల్లి గ్రామాల్లో మిగతావారు పని చేస్తున్నారు. వీరికి టెస్కో ద్వారా నూలు సరఫరా అవుతోంది. దీని ఆధారంగా బట్టనేసి ఇస్తున్నారు. ‘ఆసరా’ అంతంతే.. ప్రభుత్వం అందించే రాయితీలు, సంక్షేమ పథకాలు మర మగ్గాల కార్మికులకు కొంతైనా దరి చేరుతున్నాయి. కానీ, నిజమైన చేనేత కార్మికులకు చేయూత లభించడంలేదు. 35 కిలోల బియ్యం వచ్చే అంత్యోదయ కార్డులు మంజూరు చేయడంలేదు. ఇంట్లో ఒక్కరికే పింఛన్ ఇవ్వాలనే నిబంధన.. వృద్ధాప్యంలో ఉన్న దంప తుల్లో ఒక్కరికే వర్తిస్తోంది. మగ్గం నేసే కార్మికుడు, ఇంట్లో ఉండే వృద్ధురాలు ఇద్దరూ పింఛన్‌కు అర్హులే. బీడీ కార్మికులకు, ఒంటరి మహిళలకు ఈ నిబంధనను సడలించింది. చేనేత కార్మికులకు ఆం క్షలు ఉండడంతో సామాజిక భద్రత కరువైంది. ఆసరా పిం ఛన్లు, అంత్యోదయ కార్డులివ్వాలని వేడుకుంటున్నారు. -
పవర్‌లూమ్స్ వ్యాపారులకు జరిమానా
ధర్మవరం టౌన్ : కర్ణాటక రాష్ట్రం దొడ్భళాపుర , యలహంక తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న పవర్‌లూమ్స్ చీరలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తిం చారు. డీసీటీఓ రాముడు ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక త నిఖీలు నిర్వహించి నిభందనలకు విరుద్ధంగా ఎటువంటి పన్ను లు చెల్లించకుండా విక్రయిస్తున్న 700ల పవర్‌లూమ్స్ చీరలను గుర్తించారు. సీకేపల్లి మండలం కోన క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుబడిన చీరలను ధర్మవరంలోని సీటీఓ కార్యాలయానికి తీసుకువచ్చారు. ఈ క్రమంలో వాణిజ్యపన్నుల అధికారుల కు పవర్‌లూమ్స్ వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుం ది. పెద్ద పెద్ద వ్యాపారులను వదిలిపెట్టి చిరు వ్యాపారులపై దా డులు నిర్వహించి వేదించడం దారుణమని వ్యాపారులు వాపోయారు. చివరకు నామమాత్రంగా జరిమాన విధించి చీరలను వ్యాపారులకు అప్పగించినట్లుగా సమాచారం. పవర్‌లూమ్స్ వ్యాపారులపై తనిఖీలు, జరిమానా వివరాలను అధికారులు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం పలు విమర్శలకు తావిస్తోంది. -
చేనేతలరాత ఇంతేనా..
♦ చేనేత రుణాలన్నీ మాఫీ చేశామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ♦ 159 గ్రూపులకుగాను కేవలం 42 గ్రూపులకే మాఫీ ♦ వ్యక్తిగత రుణాల విషయంలో 757కుగాను 512 మందికే వర్తింపు ♦ పవర్‌లూమ్స్ విషయంలోనూ అదే దారి ♦ ఆధార్ అనుసంధానం పేరుతో చాలామందికి మాఫీ కాని వైనం ♦ మార్చి చివరికి బ్యాంకు ఖాతాల్లో పడుతుందంటున్న అధికారులు ♦ రెండేళ్లుగా మొదటి విడతకే దిక్కులేదు...రెండో విడత ఎప్పుడో? అధికారంలోకి రాక మునుపు ఒకమాట... వచ్చిన తర్వాత మరొక మాట చెప్పడం ‘దేశం’ అధినేత చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. మహిళలు.. రైతులు.. చేనేతలు.. ఎవ్వరూ కూడా ఒక్కపైసా బ్యాంకులకు కట్టొద్దు...అధికారంలోకి రాగానే మాఫీ చేసి రుణ విముక్తులను చేస్తామంటూ ఎన్నికల సమయంలో ప్రగల్బాలు పలికారు. ‘ఏరు దాటేంతవరకు ఓడ మల్లన్న......ఏరు దాటాక బోడి మల్లన్న’ అన్న చందంగా ఎన్నికలు ముగిసి అధికారంలోకి వచ్చాక రుణమాఫీ విషయంలో బాబు యూ టర్న్ తీసుకున్నారు. ఏదో ఒక రూపంలో వీలైనంత మేర రుణమాఫీని తగ్గించడమే లక్ష్యంగా ఆంక్షలు పెడుతున్నారు. రెండేళ్లు పూర్తవుతున్నా నేటికీ ఒక్క చేనేత కార్మికుడికి కూడా రుణమాఫీ చేతికి అందకపోవడం గమనార్హం. సాక్షి, కడప: జిల్లాలో చేనేతలకు సంబంధించి వేలాది మగ్గాలు ఉన్నాయి. ప్రధానంగా మాధవరం, ప్రొద్దుటూరు, పుల్లంపేట, పులివెందుల, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం తదితర ప్రాంతాలలో చేనేత వృత్తిని నమ్ముకుని అనేక కుటుంబాలు జీవిస్తున్నాయి. అయితే ఆర్థిక పరిస్థితులు అనుకూలించక, చేనేత వృత్తిలో నష్టాలు రావడంతో చాలామంది రుణాలు తీసుకున్నారు. ప్రధానంగా జిల్లాలో 757 మంది చేనేత కార్మికులు వ్యక్తిగత రుణాలు తీసుకోగా, అందులో 512 మందికి రూ.1.37 కోట్లు ప్రభుత్వం రుణమాఫీ వర్తింపజేస్తున్నట్లు పేర్కొంది. మిగిలిన 245 మందికి సంబంధించిన ఆధార్ ఠ మొదటిపేజీ తరువాయి నెంబర్లు అనుసంధానం కాలేదు. దీంతో వీరికి రెండవ విడతలో ఇస్తామని అధికారులు పేర్కొంటున్నారు. అలాగే 216 పవర్‌లూమ్స్ ఉండగా, అందులో 126 పవర్‌లూమ్స్‌కు మాత్రమే రూ.41,87,382 లక్షలు కేటాయించారు. మిగిలిన 90 పవర్‌లూమ్స్‌కు ఎప్పుడు కేటాయింపులు జరుగుతాయో అర్థం కావడం లేదు. సగానికి సగం గ్రూపులకు కూడా అందని మాఫీ ఇక చేనేతల్లో మహిళా గ్రూపులకు సంబంధించి రూ. లక్ష నుంచి రూ. 5 లక్షలు తీసుకున్న రుణాలను మాఫీ చేస్తున్నట్లు బాబు సర్కార్ ఆర్భాటంగా ప్రకటించింది. ఇందులో ఒక్కో గ్రూపులో ఒకరు మొదలుకుని ఎంతమంది ఉన్నా రూ.5 లక్షల వరకు రుణాలు అందించారు. అయితే జిల్లా వ్యాప్తంగా 159 మహిళా చేనేత గ్రూపులు ఉండగా, కేవలం 42 గ్రూపులకు మాత్రమే రుణమాఫీని వర్తింపజేశారు. 42 గ్రూపులకుగాను కోటి 2 లక్షల రూపాయలను కేటాయించారు. అయితే మరో 117 గ్రూపులకు సంబంధించిన రుణమాఫీ గురించి పట్టించుకునే నాథుడే లేడు. అంటే సగం గ్రూపులకు కూడా మాఫీ సొమ్ము అందని పరిస్థితి కళ్ల ముందు కనిపిస్తోంది. రెండవ విడత ఎప్పుడో? మొదటి విడత చేనేత రుణమాఫీకి సంబంధించి చేనేత జౌళి శాఖ అధికారులు జిల్లాలోని వ్యక్తిగత, గ్రూపు, పవర్లూమ్స్ల ప్రతిపాదనలు తయారు చేసి ప్రభుత్వానికి పంపుతున్నారు. అయితే ఇప్పటికే ప్రభుత్వం రూ. 2.80 కోట్లు కేటాయించిన నేపథ్యంలో ప్రతిపాదనలు వెళ్లిన అనంతరం సంబంధిత కార్మికుల అకౌంట్లలో రుణమాఫీ సొమ్ము జమ కానుంది. మొదటి విడత రుణమాఫీ మొత్తం ఈనెలాఖరులోపు జమ అయ్యే అవకాశం కనిపిస్తుండగా, రెండవ విడత ఎప్పుడు మంజూరవుతుందో, ఎప్పుడు విడుదలవుతుందో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. మొత్తానికి జిల్లాలో చేనేత కార్మికులకు రుణాలు అందడంతో పాటు రుణమాఫీ కూడా పెద్ద సమస్యగా మారింది. మార్చి చివరి నాటికి ఖాతాలకు రుణమాఫీ - ఏడీ జయరామయ్య జిల్లాలో చేనేత రుణమాఫీకి సంబంధించి 512 మందికి వ్యక్తిగత రుణాలు మాఫీ అయ్యాయని.. 42 గ్రూపులకు, మరో 126 పవర్‌లూమ్స్‌కు రుణమాఫీ మంజూరైనట్లు చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డెరైక్టర్ జయరామయ్య తెలిపారు. ఆయన ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడుతూ రూ. 2.80 కోట్లు రుణమాఫీ కింద ప్రభుత్వం కేటాయించిందని...మార్చి నెలాఖరు నాటికి లబ్ధిదారుల ఖాతాల్లో జమ అవుతుందన్నారు. అంతేకాకుండా మరికొన్ని గ్రూపులకు, వ్యక్తిగత రుణాలకు సంబంధించి కూడా రెండవ విడతలో మాఫీ సొమ్ము జమచేస్తామని చెప్పారు. ప్రస్తుతం ఆధార్ అనుసంధానం కాకపోవడంతోపాటు కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయని ఆయన తెలిపారు. -
మగ్గం బ్రాండ్ బీడీ
మగ్గంపై నేసిన చీరతోనే ఉరి వేసుకున్న చేనేత కార్మికుల దీనగాథలు ఎన్నో విన్నాం. మగ్గం నడపలేక పురుగులమందు తాగి బలవన్మరణం పొందిన వారి కథలు చదివాం.మగ్గం నీడలో విరాజిల్లిన ఊళ్లకు ఊళ్లే శ్మశానాలుగా మారడం చూశాం.ఇప్పుడు మగ్గానికి క్యాన్సర్ వచ్చింది! చేనేత... కళాకారులకు బీడీ పని ఇచ్చి వెళ్లింది. ఒకప్పుడు చేనేత కళకు జీవం పోసి ఇప్పుడు చావలేక బతుకుతున్న... మనసు చంపుకుని చావుకట్టలు చుడుతున్న...చేనేత చేతుల బీడు జీవితమే ఈ మగ్గం బ్రాండ్ బీడీ కథనం. 50 ఏళ్ల క్రితం.. హైదరాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరంలో... రంగారెడ్డి జిల్లాలోని యాలాల మండలంలో గోవిందరావు పేట, ముద్దాయిపేట గ్రామాలు. ఒక్కో గ్రామంలో 500 కు పైగా కుటుంబాలు ఉండేవి. ఒక్కో ఇంటికి పదేసి చొప్పున మరమగ్గాలు, గుట్టల కొద్దీ వడకాల్సిన నూలు ఉండేది. తీసిన దారాలు తీసినట్టే అయిపోయేవి. వేసిన రంగులు వేసినట్టే అయిపోయేవి. రేయింబవళ్లు చేసినా తరగనంత పని చేతుల నిండుగా ఉండేది. వేకువజామునుంచి, అర్ధరాత్రి వరకు వస్త్రాలు నేస్తూనే ఉండటంతో మగ్గాల చప్పుళ్లు గ్రామ పొలిమేరల దాకా వినిపించేవి. చుట్టూ ఉన్న 8 తండాలు, 30 గ్రామాల వాళ్లే కాదు, దూరప్రాంతాల వారూ వస్త్రాల కొనుగోళ్లకు గోవిందరావు పేట, ముద్దాయిపేటకే వచ్చేవారు. ఇక్కడి చేనేత యాలాల పేరుమీదగానే ప్రసిద్ధమైంది. రంగురంగుల యాలాల చేనేతలు, కొనుగోలుదారులతో ఈ ప్రాంతంలో కోటికాంతులు విరబూసేవి. సిరిసంపదలు తులతూగేవి. నేడు మణెమ్మకు 90 ఏళ్లు. నలభై ఏళ్ల క్రితం వరకు... భర్త, కొడుకు, మనవలు, మనవరాళ్లతో ఇల్లు సందడిగా ఉండేది. భర్త అనారోగ్యంతో చనిపోగా, కొడుకు నేతన్నగానే కన్ను మూశాడు. మనవడు దామోదరూ కులవృత్తినే నమ్ముకున్నాడు. కానీ, మగ్గం మూలన పడటంతో పొట్టకూటికోసం కరీంనగర్‌లోని సిరిసిల్లకు వెళ్లాడు. అక్కడా చుక్కెదురవడంతో ఏడేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. చేతిలో చిల్లిగవ్వలేక పుట్టినగడ్డకు మనవడి శవాన్ని తీసుకురాలేక ఊరికాని ఊళ్లోనే నలుగురి సాయం అడిగి మట్టిచేసొచ్చింది మణెమ్మ. కూలిన ఇంట్లోనే ఓ పూట తిని, ఓ పూట తినక బిక్కుబిక్కుమంటూ రోజులు లెక్కపెట్టుకుటోంది. పగిడాల నర్సవ్వకు 80 ఏళ్లు. ఉన్న ఊళ్లో పని లేకపోవడంతో పదేళ్ల క్రితం కొడుకుతో కలిసి మహారాష్ట్రకు బతుకుతెరువు కోసం వెళ్లింది. అక్కడా పని లేదని అర్ధమై, కొడుకుకు భారంగా ఉండలేక ఉన్న ఊరు చేరుకుంది. ఇల్లు కూలి, కుప్పగా దర్శనమిచ్చింది. దాన్ని బాగు చేసుకునే స్తోమత లేదు. ఊళ్లోనే అయినవాళ్లను బతిమాలుకొని, వారిళ్లలో తలదాచుకుంటోంది. అంజిలమ్మకు 60 ఏళ్లు. పిల్లాపాపలతో కళకళలాడిన ఇంట్లో ఇప్పుడు ఒక్కతే ఉంటోంది. పొట్టకూటి కోసం పిల్లలు పట్నమెళ్లిపోయారు. భర్త పోయాడు. బీడీలు చుట్టుకుంటూ... గతాన్ని తలచుకుంటూ బతుకు భారంగా నెట్టుకొస్తోంది. వైభవోపేతంగా ఒక వెలుగు వెలిగిన ఈ రెండు గ్రామాలలో ఇప్పుడు ఎటుచూసినా శిథిలావస్థకు చేరిన గృహాలు, ఆకలి కేకలకు తాళలేక పొట్ట చేత పట్టుకుని సూరత్, షోలాపూర్, భీమండి, నవసాగర్, ముంబయ్.. వంటి ప్రాంతాలకు వలసపోయిన చేనేతకారులు. కూలిపోయిన ఇళ్లు, మొండిగోడలు.. వాటి మధ్యే జీవచ్ఛవాలుగా మారిన నేతన్నల కుటుంబాల అవశేషాలు. జనసంచారం లేక వెక్కిరిస్తున్న వీధులు. ఎటు చూసినా దయనీయ దృశ్యాలే. ఎక్కడికీ వెళ్లలేక, మరో పని తెలియక ముసలీ ముతక, ఉన్న కొద్దిపాటి మహిళలు బీడీలు చుడుతూ కాలం వెళ్లదీస్తున్నారు. వీరితో పాటు ఇంకా అవశేషంగా మిగిలిపోయిన నాటి చీరలు కట్టుకున్న వృద్ధులు అక్కడక్కడా కనిపిస్తారు. 1200 బీడీలకు 100 రూపాయలు! ఏ చేతులతోనైతే మగ్గం పనులు చేశారో.. ఆ చేతులతోనే ఇప్పుడు బీడీలు చుడుతున్నారు గోవిందరావు పేట, ముద్దాయిపేట గ్రామస్థులు. నాడు పెళ్లి చీర అమ్మితే నెలకు సరిపడా గ్రాసం వెళ్లిపోయేది. నేడు ఎన్ని వందల బీడీలు చుట్టినా పూట గడవడమే కష్టంగా మారింది వారికి. చేనేత చివరాఖరి రోజుల్లో నాటి ప్రభుత్వం భాగ్యనగర్ఖాదీని ఏర్పాటు చేసింది. వేతనాలు ఇచ్చింది. ఆడపిల్లలు చెరకలకు దారాలు అల్లేవారు. వాటినే తీసుకెళ్లి మగ్గాల మీద చీరలు నేసేవారు. ఆ సంస్థ 20 ఏళ్లు నడిచి, ఆ తర్వాత మూత పడింది. ‘‘ఇప్పుడు ఆ సంస్థ ఎక్కడపోయిందో... ఎవరూ అడిగింది లేదు. తెలంగాణ ఉద్యమంలో మా చేనేత కార్మికులే ముందున్నారు. కానీ, ఇప్పుడు మమ్మల్ని పట్టించుకునేవారు లేరు’‘ అని ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు. ముడిసరుకు ఉంటే ఇప్పటికీ చురుగ్గా పనులు అవుతాయి. ఎంతో మంది కళాకారులు ఉన్నారు. పొరుగూళ్లకు వెళ్లిన కళాకారులూ తిరిగి సొంత ఊళ్లకు చేరుకుంటారు. కానీ, ముడిసరుకు ఇచ్చేవారెవరు... ఆప్కో నుంచి నూలు ఇప్పించి, ఆదుకోవాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తున్నారు. ఈ పని కూడా గుర్తింపు కార్డు ఉంటేనే! ప్రస్తుతం ప్రతి చేనేత కుటుంబంలో బీడీల పనే జీవనాధారంగా మారింది. అయితే, బీడీల తయారీకి చేనేతకారుల గుర్తింపు కార్డులు ఉంటేనే ఆర్డర్లు వస్తున్నాయి. ఈ కార్డులు ఉంటేనే పింఛను మంజూరు, రేషన్ బియ్యం.. వంటి లింకులు ఉన్నాయి. గుర్తింపు కార్డులు లేని, బీడీలు చుట్టే ఓపికా లేని వృద్ధులు ఈ విధానం వల్ల మరింత ఇబ్బందులు పడుతున్నారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు! ఇక్కడి చేనేత కార్మికుల బంగళాలు శిథిలావస్థకు చేరుకున్నాయి. ఒకనాడు సిరిసంపదలు తులతూగిన ఈ ప్రాంతాల్లో గుప్తనిధులు ఉంటాయని ఈ గ్రామాలలో తవ్వకాలు జరిపిన సంఘటనలు కోకొల్లలు. ప్రస్తుతం గోవిందరావు పేటలో జనసంచారం ఎక్కువగా లేకపోవడంతో రాత్రివేళల్లో పాడుబడిన బంగళాలు, శిథిలావస్థలోకి చేరిన ఇళ్లలో గుప్తనిధుల తవ్వకాలు నేటికీ కొనసాగుతూనే ఉన్నాయి. యాలాల చేనేతకార్మికుల ప్రస్తుత దుస్థితితో పాటు, ఈ తవ్వకాలను ఆపడం ఎలా అన్నదానిపైనా ప్రభుత్వం దృష్టి సారించవలసి ఉంది. - జావెద్, సాక్షి, యాలాల; ఫొటోలు: నాగరాజు పరిస్థితిలో మార్పు ఏమీ రాలేదు..! నాడు ఎంతో ఉన్నతంగా బతికాం. నే డు మా పిల్లలు కూడా బీడీల తయారీలో ఉండకపోతే పూట గడవని పరిస్థితి. ప్రస్తుతం యాలాల, గోవిందరావుపేటలలోని చేనేత కుటుంబాల్లో నా దగ్గర మాత్రమే మరమగ్గం ఉంది. అది కూడ వృత్తి మీద మమకారంతో జాగ్రత్తగా చూసుకుంటున్నాను. మొన్నామధ్య ఒక్క పంచె అయినా నేయాలనే పట్టుదలతో బీడీల ఆదాయంతో ముడిసరుకు కొనుక్కొచ్చాను. ఆ పూటకు తిండిలేకపోతే నేసిన అరమీటర్ గుడ్డను తీసుకెళ్లి అమ్మి, గింజలు తెచ్చుకున్నాను. తెలంగాణ రాష్ట్రం వస్తే మా కష్టాలు తీరుతాయని భావించాం. కానీ పరిస్థితి ఎప్పటిలాగానే ఉంది. - రాంచందర్, చేనేత కార్మికుడు, గోవిందరావుపేట పీఎఫ్ డబ్బుల జాడే లేదు! చేనేత కార్మికుల కోసం ఏర్పాటు చేసిన భాగ్యనగర్ ఖాదీ సమితిలో ప్రతినెలా మేమంతా డబ్బులు కట్టేవాళ్లం. వీటితో పాటు చేనేత కార్మికులకు అండగా ఉంటుందనే ధీమాతో గతంలో ఖాదీ సమితిలో డబ్బులు చెల్లించాం. కానీ మా డబ్బులతో పాటు పీఎఫ్ డబ్బుల వివరాలు నేటికీ అంతుచిక్కడం లేదు. ఇందుకు సంబంధించిన పూర్తి పత్రాలు, ఇతరత్రా డాక్యుమెంట్లు ఇప్పటికీ భద్రంగా ఉన్నాయి. ఈ విషయంలో సర్కారు దృష్టి సారించి మాకు న్యాయం చేయాలి. - నల్ల మల్లయ్య, చేనేత కార్మికుడు కార్డు లేదని పింఛను ఇస్తలేరు! నాకు 60 ఏళ్లు పైబడ్డాయి. చేనేత కార్మికురాలిగా నాకు గుర్తింపు కార్డు లేదనే కారణంతో పింఛను మంజూరు కాలేదు. చేనేత కార్మికులుగా బతికిన మాకు న్యాయం జరగాలి. - మెర్గు అంజిలమ్మ, చేనేత కార్మికురాలు, యాలాల -
చేయూత ఏదీ?
ధర్మవరం : చేనేత కార్మికునికి చచే ్చదాకా సగం గుంత.. సచ్చినాక నిండు గుంత అన్న నానుడి అక్షర సత్యం అవుతోంది. మగ్గం గుంతల్లోనే ఏళ్ల తరబడి పనిచేస్తున్నా.. ఎదుగూ బొదుగూ లేని జీవితాలతో కార్మికులు అవస్థ పడుతున్నారు. పవర్‌లూమ్స్‌పై విరివిగా తయారవుతున్న వస్త్రాలు చేనేత రంగం ఉనికిని ప్రశ్నార్థకం చేస్తున్నాయి. జిల్లాలోని ధర్మవరం, సోమందేపల్లి, ముదిరెడ్డిపల్లి, ఉరవకొండ, సిండికేట్‌నగర్, యాడికి, తాడిపత్రి తదితర ప్రాంతాల్లో 80 వేల కుటుంబాలకు పైగా చేనేతపై ఆధారపడి జీవిస్తున్నాయి. ప్రత్యక్షంగా, పరోక్షంగా జిల్లాలో 5లక్షల మందికి పైగా చేనేత రంగంలో ఉపాధి పొందుతున్నారు. పవర్‌లూమ్స్‌పై పలు డిజైన్లలో చీరలు తయారవుతుండడం, వాటినే చేనేత చీరలుగా తక్కువ ధరకు వ్యాపారులు విక్రయిస్తుండడంతో చేనేత చీరలకు గిట్టుబాటు ధర లభించడం లేదు. ఏడాదికి రూ. కోటి విలువైన చేనేత వస్త్రాలను కొనుగోలు చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం ఇప్పటి దాకా ఆ దిశగా చర్యలు చేపట్టిన పాపానపోలేదు. చేనేత కార్మికులకు రుణమాఫీ చేస్తామని ప్రకటించడమే తప్ప ఆ దిశగా ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదని చేనేత కార్మిక సంఘాల నాయకులు చెబుతున్నారు. ఉన్నత చదువులకు దూరం చేనేతల పిల్లలు ఉన్నత చదువులకు నోచుకోవడం లేదు. కుటుంబం గడవటమే కష్టంగాఉన్న నేపథ్యంలో పిల్లలను ప్రభుత్వ పాఠశాలలకు పంపి 10వ తరగతితో సరిపెడుతున్నామని చేనేత కార్మికులు చెబుతున్నారు. చేనేత సహకార సంఘాలున్నా అధిక శాతం మంది కార్మికులు మాస్టర్ వీవర్స్ వద్దనే పనిచేయాల్సి వస్తోంది. వారు నిర్ణయించిందే ధర. ఇచ్చేదే కూలి. పాలకులకు పట్టనిహెల్త్ కార్డులు నిత్యం మగ్గం గుంతలో గడిపే చేనేత కార్మికులకు అనారోగ్యం చేస్తే ఆసుపత్రికి వెళ్లేందుకు చేతిలో పైసా ఉండని పరిస్థితి. 2012 ఆగస్టు15న అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ రాష్ట్రీయ స్వచ్చత బీమా యోజన పేరిట ఆరోగ్య పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా ఒక చేనేత కుటుంబంలో ఐదుగురు సభ్యులకు రూ. 37,500 కేటాయించాలని నిర్ణయించారు. ఏడాదిలో ఈ మొత్తాన్ని దేశంలోని ఏ ఆసుపత్రిలో అయినా వాడుకోవచ్చునని సూచించారు. అయితే.. ఆ హెల్త్ కార్డుల కాలపరిమితి ముగుస్తోందని కార్మికులు చెప్పడంతో కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు ఆరునెలల గడువును పెంచారు. ఆ గడువు గత ఏడాది సెప్టెంబర్‌తో ముగిసిపోయింది. కార్మికులు కొత్త కార్డుల కోసం ఎదురుచూస్తున్నారు. రుణాల్లోనూ మొండిచేయే.. ఎలాంటి హామీ లేకుండా ఒక్కొక్క చేనేత కుటుంబానికి రూ.25వేల నుంచి రూ.1.50 లక్షలవరకు రుణాలను మంజూరు చేసేవారు. వీటిపై ప్రభుత్వమే 84 శాతం గ్యారంటీ ఇచ్చేది. అయితే.. ఈ నిధులను రూ.25 వేలకు మించి ఇవ్వడం లేదని చేనేత నాయకులు చెబుతున్నారు. జిల్లాలో ఈ రుణాలను పొందినవారు వందల్లో ఉంటారంటే పరిస్థితి ఎంత అధ్వానంగా ఉందో అర్థమవుతోంది. చంద్రబాబు ఎన్నికల సమయంలో చేనేత కార్మికుల కోసం బడ్జెట్లో ఏటా రూ.వెయ్యి కోట్లు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. అయితే.. ఈ ఏడాది ప్రవేశపెట్టిన బడ్జెట్లో రూ.46 కోట్లతోనే సరిపెట్టారు. ఇందులో ఖర్చులు, చేనేతశాఖ సిబ్బంది వేతనాలు పోను ఎంత మేర కార్మికుల సంక్షేమానికి ఖర్చు చేస్తారన్నది ప్రశ్నార్థకంగా మారింది. చేనేత ఆత్మహత్యలు పెరుగుతాయి ఇప్పటికే చేనేత రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ఇటువంటి తరుణంలో ఊతమివ్వాల్సిన ప్రభుత్వాలు మొండిచెయ్యి చూపడం ఎంతవరకు సమంజసం? ప్రభుత్వం పట్టించుకోకపోతే చేనేత రంగం కనుమరుగయ్యే పరిస్థితి ఉంది. ఇప్పటికే చీరలకు గిట్టుబాటు ధరలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఆకలి చావులు, ఆత్మహత్యలకు పాల్పడే ప్రమాదం లేకపోలేదు. ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిందే. లేకపోతే చేనేతల సత్తా ఏమిటో ప్రభుత్వానికి తెలియజేస్తాం. -పోలా రామాంజినేయులు, ఆంధ్రప్రదేశ్ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు చేనేత రంగాన్ని విస్మరించారు బడ్జెట్లో చేనేత రంగానికి కేటాయించిన నిధులను చూస్తే ప్రభుత్వం కార్మికులను పూర్తిగా విస్మరించిందని చెప్పొచ్చు. ఇప్పటికే చేనేత రంగం పూర్తిగా దెబ్బతినింది. ప్రభుత్వం ఆదుకోకపోతే ఈ రంగమే మనుగడ కష్టం. అదీకాక చేనేత రంగానికి చేయూతగా ఉన్న పథకాలన్నింటినీ ఒకేగాటన కట్టారు. దీని వల్ల కార్మికులకు తీవ్ర నష్టం వాటిల్లే ప్రమాదముంది. -జింకా చలపతి, ఏపీ చేనేత కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గతంతో పోల్చితే చాలా తక్కువ ప్రభుత్వం చేనేత రంగ అభివృద్ధికి కేటాయించిన రూ.48 కోట్లు కేవలం అధికారులకు సంబంధించిన వేతనాలు, ఇతరత్రా వాటికే సరిపోతాయి. ఇక కార్మికులకు ఏమి ప్రయోజనం? అసలే గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్న చేనేత రంగానికి ఇది అశనిపాతమే. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా విఫలమైంది. చేనేతలను మోసం చేసిన ఏ ప్రభుత్వానికీ మనుగడ ఉండదు. -రంగన అశ్వర్థనారాయణ, కాంగ్రెస్‌నాయకుడు -
సిరిసిల్ల వస్త్రానికి ఎన్ని‘కళ’
సంక్షోభంలో ఉన్న సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఎన్నికల గాలితాకింది. వరుసగా ఎన్నికలు రావడంతో సిరిసిల్ల వస్త్రోత్పత్తి రంగానికి కళ వచ్చింది. ఇక్కడి వస్త్రోత్పత్తిదారులకు చేతినిండా పని లభిస్తోంది. రాజకీయపార్టీలు వినియోగించే బ్యానర్లు, జెండాలు, కండువాలు తయారీకి అవసరమైన గుడ్డ సిరిసిల్లలోనే ఉత్పత్తికావడంతో మంచి డిమాండ్ ఏర్పడింది. ఇక్కడ ఉత్పత్తి అవుతున్న గుడ్డ మన రాష్ట్రంతో పాటు జార్ఖండ్, ఉత్తరాంచల్, ఛత్తీస్‌గఢ్, తమిళనాడు, మధ్యప్రదేశ్, కర్ణాటక, కేరళ, మహారాష్ట్రలకు ఎగుమతి అవుతోంది. న్యూస్‌లైన్, సిరిసిల్ల,రాష్ట్రంలోనే అత్యధికంగా సిరిసిల్లలో 34 వేల మరమగ్గాలు ఉన్నాయి. ఇందులో 27వేల మరమగ్గాలపై పాలిస్టర్, 7వేల మగ్గాలపై కాటన్ గుడ్డ ఉత్పత్తి అవుతోంది. పాతికవేల కుటుంబాలు వస్త్రోత్పత్తి పరిశ్రమపై ఆధారపడి ఉన్నాయి. నూలు ధరలు పెరగడం, ఉత్పత్తి చేసిన గుడ్డకు గిరాకీ లేక వస్త్ర వ్యాపారులు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నారు. కరెంటు బిల్లులు పెరిగి విడిభాగాల రేట్లు ఎక్కువై వస్త్రోత్పత్తి గిట్టుబాటు లేని పరిస్థితి గతంలో ఎదురైంది. ఇప్పుడు గుడ్డకు కాస్త ధర పెరగడంతో వ్యాపారులు ఊపిరి పీల్చుకున్నారు. ఒకేసారి స్థానిక, మున్సిపల్, సార్వత్రిక న్నికలు రావడంతో వస్త్రవ్యాపారులకు కలిసొచ్చింది. సిరిసిల్లలో నిత్యం 27లక్షల మీటర్ల గుడ్డ ఉత్పత్తవుతుండగా, గతంలో వస్త్ర నిల్వలు అమ్మకాల్లేక పేరుకుపోయాయి. ఎన్నికల పుణ్యమా.. అని ఇప్పుడు వస్త్ర నిల్వలన్నీ హైదరాబాద్‌లోని మార్వాడి సేట్లు కొనుగోలు చేయడంతో గుడ్డనిల్వలు లేకుండా పోయాయి. ఎన్నికల పుణ్యమా అని.. ఎన్నికలకు అవసరమైన జెండాలు, బ్యానర్లు, కండువాలు, క్యాప్‌లకు చౌకగా లభించే గుడ్డ అవసరమవుతోంది. సిరిసిల్లలో నాసిరకం గుడ్డ ఉత్పత్తవుతుండగా, జాతీయ మార్కెట్లో సిరిసిల్ల గుడ్డను ఎన్నడూలేని విధంగా ఎన్నికల సమయంలో ఎక్కువగా కొనుగోలు చేయడం పరిపాటి. దీంతో సిరిసిల్ల వస్త్రానికి గిరాకీ పెరిగింది. ఈ నేపథ్యంలో మరమగ్గాల కార్మికులకు చేతినిండా పని లభిస్తోంది. పాలిస్టర్ వస్త్రానికి డిమాండ్ ఉండడంతో కార్మికులతో యజమానులు, ఆసాములు పని చేయిస్తున్నారు. సిరిసిల్లలో 8గంటల పని విధానాన్ని అమలుచేయాలని ప్రభుత్వం నిర్దేశించగా, గుడ్డకు డిమాండ్ ఉండడంతో 12 గంటలు పని చేయిస్తున్నారు. మరో మూడు నెలల వరకు కార్మికులకు పని ఉంటుందని భావిస్తున్నారు. సిరిసిల్లలో తక్కువ ధరకు గుడ్డ దొరుకుతుండగా, ఆ గుడ్డను రంగుల్లో ప్రింట్ చేసేందుకు ప్రాసెసింగ్ చేయడానికి మీటర్ రూ.10 వరకు ఖర్చవుతోంది. హైదరాబాద్ వంటి ప్రాంతాల్లో మిల్లుల్లో ప్రాసెసింగ్ చేయడానికి ఎక్కువ ఖర్చవుతోంది. మొత్తంగా సిరిసిల్ల వస్త్ర పరిశ్రమకు ఊరట లభించింది. -
భివండీ ఆందోళన మరింత తీవ్రం
భివండీ, న్యూస్‌లైన్: భివండి పవార్‌లూమ్ పరిశ్రమల యజమానులు చేపట్టిన ఆందోళన ఆరో రోజుకు చేరింది. వీరి డిమాండ్ల పరిష్కారంపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించకపోవడంతో సోమవారం ఆందోళనను మరింత తీవ్రం చేశారు. భీవండీ పవర్లూమ్ సంఘర్ష్ సమితి నేతృత్వంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అశోక్‌నగర్ నుంచి టోరంటో నోడల్ కంపెనీ వరకు కొనసాగిన ఈ ర్యాలీలో భారీ సంఖ్యలో పవార్‌లూమ్స్ యజమానులు పాల్గొన్నారు. విద్యుత్ వితరణ కంపెనీకి చెందిన నోడల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించి, విద్యుత్ రేట్లు తగ్గించాలని, టోరంట్ కంపెనీని భివండీ నుంచి తీసివేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లతో కూడిన ఓ విన్నతిపత్రాన్ని నోడల్ అధికారి పరస్బి జాడ్కర్కు అందించారు. ఈ ర్యాలీలో భీవండీ పవర్ సంఘర్ష్ సమితి అధ్యక్షుడు, ఎంపీ సురేష్ టావ్రే, సమాజ్‌వాదీ పార్టీ ఎమ్మెల్యే రశీద్ తాహిర్, శివసేన ఎమ్మెల్యే రూపేష్ మాత్రేతోపాటు పెద్ద సంఖ్యలో తెలుగువారు పాల్గొన్నారు. న్యాయం చేసేందుకు కృషి చేస్తా: సీఎం భివండీ పవార్‌లూమ్స్ యజమానుల సమస్యలపై సంఘర్ష్ సమితి అధ్యక్షులైన ఎంపీ సురేష్ టావ్రే సోమవారం ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా పవార్‌లూమ్స్ యజమానులకు న్యాయం చేసేందుకు కృషి చేస్తానని ఆయన హామీ ఇచ్చినట్టు టావ్రే తెలిపారు. పవార్‌లూమ్స్ యజమానులు, సంఘర్ష్ సమితి పదాధికారులతోపాటు టొరంటో కంపెనీ అధికారులతో సమావేశాన్ని ఏర్పాటు చేసి, సమస్యను పరిష్కరించేందుకు కృషి చేస్తానని టావ్రే ‘న్యూస్‌లైన్’కు తెలిపారు.