ధర్మవరం టౌన్ : కర్ణాటక రాష్ట్రం దొడ్భళాపుర , యలహంక తదితర ప్రాంతాల నుంచి అక్రమంగా రవాణా చేస్తున్న పవర్‌లూమ్స్ చీరలను వాణిజ్య పన్నుల శాఖ అధికారులు గుర్తిం చారు. డీసీటీఓ రాముడు ఆధ్వర్యంలో అధికారులు ప్రత్యేక త నిఖీలు నిర్వహించి నిభందనలకు విరుద్ధంగా ఎటువంటి పన్ను లు చెల్లించకుండా విక్రయిస్తున్న 700ల పవర్‌లూమ్స్ చీరలను గుర్తించారు. సీకేపల్లి మండలం కోన క్రాస్ వద్ద తనిఖీలు నిర్వహించి పట్టుబడిన చీరలను ధర్మవరంలోని సీటీఓ కార్యాలయానికి తీసుకువచ్చారు.
ఈ క్రమంలో వాణిజ్యపన్నుల అధికారుల కు పవర్‌లూమ్స్ వ్యాపారులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుం ది. పెద్ద పెద్ద వ్యాపారులను వదిలిపెట్టి చిరు వ్యాపారులపై దా డులు నిర్వహించి వేదించడం దారుణమని వ్యాపారులు వాపోయారు. చివరకు నామమాత్రంగా జరిమాన విధించి చీరలను వ్యాపారులకు అప్పగించినట్లుగా సమాచారం. పవర్‌లూమ్స్ వ్యాపారులపై తనిఖీలు, జరిమానా వివరాలను అధికారులు వెల్లడించకుండా గోప్యంగా ఉంచడం పలు విమర్శలకు తావిస్తోంది.
పవర్‌లూమ్స్ వ్యాపారులకు జరిమానా
Published Wed, Aug 24 2016 11:48 PM | Last Updated on Tue, Oct 2 2018 4:31 PM
Advertisement