ముంబై సెంట్రల్, న్యూస్‌లైన్: ఒకప్పుడు వరి పంట కు ప్రసిద్ధిగా ఉన్న ఆ తాలూకా ఇప్పుడు అత్యధిక గోదాములు ఉన్న ప్రాంతంగా అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందింది. ప్రస్తుతం అక్కడి రైతులు వరి పొలాలను గోదాములు నిర్మించేందు కు లీజుకు ఇస్తున్నారు. దాదాపు 30 ఏళ్ల క్రితం భివండీ తాలూకాలోని పూర్ణా గ్రామంలో గోదాముల నిర్మాణం ప్రారంభమైంది. ఇప్పుడు భివండీ తాలూకా ‘అంతర్జాతీయ గోదాముల నగరం’గా ప్రఖ్యాతి చెందింది. ఇక్కడి భూములు చాలా వరకు బిల్డర్స్ లాబీల కబ్జాలో ఉన్నాయి.
తర్వాత విడతలు గా అనేక గ్రామాల్లో గోదాములు వెలిశాయి. చిన్న వి, పెద్దవి కలుపుకొని ఇలా ఇప్పటి వరకు సుమారు 1.5 లక్షల గోదాములను ఏర్పాటు చేసినట్లు తెలి సింది. దేశ, విదేశాల్లోని వివిధ కంపెనీలకు చెందిన ఉత్పత్తులను ఇక్కడ నిల్వ చేస్తారు. వాటి సూచన మేరకు వాటిని ఇతర ప్రాంతాలకు సరఫరా చేస్తా రు. ముంబై సమీపంలో స్థలం కొరత ఉండటంతో భివండీతాలూకాలోని అనేక గ్రామాల్లో ఖాళీగా ఉన్న స్థలాలు చాలా మంది వ్యాపారులు(బిల్డర్లు) ఇంతకుముందే కొనుగోలు చేసుకున్నారు.
పెరుగుతున్న ధరలు
1982-83 సంవత్సరంలో పూర్ణా గ్రామంలో గల ఖండాగళే ఎస్టేట్‌లో తొలి గోదాం నిర్మాణం జరిగిం ది. ఆ సమయంలో రైతుల భూమికి రూ.80 నుంచి రూ.100 ఎకరం చొప్పున బిల్డర్లు కొనుగోలు చేశా రు. ఇనుప రేకులతో గోదాములను నిర్మించి, రూ.110 నుంచి రూ.120 లకు చదరపు అడుగు చొప్పున విక్రయించారు. తర్వాత పూర్ణా గ్రామం పక్కనున్న రహణాల్‌లో గోదాముల నిర్మాణం ప్రారంభమైంది. 1993-94 సంవత్సరంలో అరి హంత్ డెవలపర్స్ యజమాని వినోద్‌భాయ్ దోడి యా పూర్ణాలో 50 నుంచి 60 భవనాలను నిర్మించి అందులో గోదాములను ఏర్పాటు చేశారు.
ఎకరానికి రూ.150 నుంచి రూ.200 చొప్పున భూమి కొనుగోలు చేసి, గోదాములను ఏర్పాటు చేసి వాటి ని రూ.350 నుంచి రూ.400 లకు చదరపు అడుగు చొప్పున విక్రయించారు. అరిహంత్ డెవలపర్స్ నిర్మించిన గోదాములకు ఉత్తమ స్పందన రావడం చూసి రాజ్యలక్ష్మి డెవలపర్స్ ఈ రంగంలోకి దిగిం ది. కాల్హేర్‌లో సుమారు 400 భవనాలు నిర్మించి గోదాములు ఏర్పాటు చేసింది. 1995-96 సంవత్సరంలో సుమారు రూ.300 నుంచి రూ.400 వరకు ఎకరం చొప్పున రైతుల నుంచి భూములను కొనుగోలు చేసి, ఆ స్థలంలో నిర్మించిన గోదాముల గిడ్డం గులను ఒక చదరపు అడుగుకు రూ.400 నుంచి రూ.500 చొప్పున విక్రయించింది.
దాపోడాలో ఇండియన్ కార్పొరేషన్ పేరిట రుద్రప్రతాప్ త్రిపాఠి కూడా 2002-03 సంవత్సర కాలంలో గోదాములు నిర్మించడం ప్రారంభించారు. తర్వాత రూ.800 నుంచి రూ.900 చదరపు అడుగు చొప్పున గోదాముల గిడ్డంగులను విక్రయించారు. ప్రస్తుతం రూ.1,200 నుంచి రూ.1,500 చదరపు అడుగు చొప్పున ధర నడుస్తోంది. కాల్హేర్, కశేలి, కోపర్, పూర్ణా, రాహనాల్, వల్‌పాడా, దాపోడా, గుందవలి, మాణ్‌కోలి, అంజూర్, హైవే-దివే, ఓవళి, పిం ప్లాస్, రాంజనోలి, గోవే, పింపల్‌గర్, సోనాలే, వడ్గార్ ఇలా అనేక గ్రామాల్లో గోదాములు వెలి శాయి. అనేక గ్రామాల్లో స్థలం మిగిలి ఉండకపోవడంతో బిల్డర్లు భివండీ-పడ్గా రోడ్డుపై వడపా, వుక్సే-బోరివలి, సవాద్, ఆమణే-పిసే తదితర గ్రామాలను టార్గెట్ చేసి, గోదాములను నిర్మిస్తున్నారు. కానీ ఈ పరిసర ప్రాంతాలు దూరంగా ఉండడంతో ఎక్కువగా అమ్ముడుపోవడం లేదు.
బిల్డర్లకు స్థలాన్ని లీజుకు ఇస్తున్న రైతులు
స్థానిక రైతులు గోదాములు నిర్మించే బదులు స్థలా న్ని అభివృద్ధి చేయాలని బిల్డర్లతో ఒప్పందం కుదుర్చుకుంటున్నారు. ఆ ప్రకారంగా నిర్మించిన గోదాములను రైతులు అద్దెకు ఇచ్చేస్తున్నారు. వరి పంట నష్టమవుతున్నప్పటికీ గోదాముల అద్దె ద్వారా వచ్చే ఆదాయం వారికి ఎక్కువ గిట్టుబాటు కలిగిస్తోందని తెలుస్తోంది. ఏ రైతులైతే అధిక స్థలాన్ని అభివృద్ధి కోసం ఇచ్చారో, వారికి ప్రతి నెల చదరపు అడుగుకు రూ.8 నుంచి రూ.10 అద్దె లభిస్తోంది. అంటే లక్ష రూపాయల నుంచి రూ.5 లక్షల వరకు సమకూరుతున్నాయి. అదే దిశగా ఇతర చిన్నగ్రామాలు కూడా నడుస్తుండటం గమనార్హం.
మహా‘గోదాం’
Published Sun, Feb 9 2014 11:33 PM | Last Updated on Sat, Sep 2 2017 3:31 AM
Advertisement
Advertisement