
ముంబై: మహారాష్ట్రలోని భివాండి ప్రాంతంలో నాలుగు అంతస్థుల భవనం కూలి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. మరో ముగ్గురు గాయపడగా.. పలువురు శిథిలాల కింద చిక్కుకుపోయినట్లు సమాచారం. ఈ దారుణం శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. భివాండి ప్రాంతంలో నిర్మించిన ఈ అక్రమ కట్టడానికి పగుళ్లు రావడం గమనించిన మున్సిపల్ అధికారులు అందులో నివసిస్తున్న ప్రజలని ఖాళీ చేయాల్సిందిగా కోరారు. దాదాపు 22 కుటుంబాలను బిల్డింగ్ నుంచి తరలించారు. అయితే కొందరు తమ వస్తువులను తీసుకెళ్లడం కోసం తిరిగి బిల్డింగ్‌లో ప్రవేశించారు. ఆ సమయంలోనే ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు మరణించగా.. ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. మరి కొద్ది మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు సమాచారం. ఘటన జరిగిన వెంటనే నేషనల్ డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ రంగంలోకి దిగి సహాయక చర్యలు ప్రారంభించింది. తీవ్రంగా గాయపడిన వ్యక్తులను కాపాడి ఆసుపత్రికి తరలించారు.
Comments
Please login to add a commentAdd a comment