కొత్త పన్ను విధానం మరింత ఆకర్షణీయంగా తీసుకొస్తున్న.. తరుణంలో పాత పన్ను విధానం రద్దు చేసే అవకాశం ఉందని పుకార్లు పుడుతున్నాయి. దీనిపై కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ స్పందిస్తూ.. పాత పన్ను విధానం రద్దు చేస్తారనే వార్తల్లో ఎటువంటి నిజం లేదని అన్నారు. ఈ విషయాన్ని ఓ సమావేశంలో వెల్లడించారు.
పాత పన్ను విధానం ఔచిత్యం, ప్రణాళికల గురించి కేంద్ర మంత్రి మాట్లాడుతూ.. భారతదేశ పన్ను వ్యవస్థ మొత్తం సరళంగా ఉండాలని తాను కోరుకుంటున్నట్లు వెల్లడించారు. పన్ను విధానం నిబంధనలకు అనుగుణంగా ఉండాలని, దీనికోసం పాత పన్ను విధానాన్ని తొలగించాలనే ఉద్దేశ్యం తనకు లేదని అన్నారు.
మొత్తం పన్ను చెల్లింపుదారులందరూ.. కొత్త పన్ను విధానానికి మారాలని కోరుకుంటున్నారా? అని ఆర్థిక మంత్రిని అడిగినప్పుడు. పాత పన్ను విధానం రద్దు చేసే ఆలోచన లేదని స్పష్టం చేశారు. అంతే కాకుండా కొత్త ఆదాయ పన్ను చట్టం గురించి ప్రస్తావిస్తూ.. 1931లో తీసుకొచ్చిన పాత పన్ను చట్టం స్థానంలో అనేక మార్పులు చేపట్టినట్లు వెల్లడించారు. కాబట్టి త్వరలోనే దీనికి సంబంధించిన బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టనున్నట్లు పేర్కొన్నారు.
ఇదీ చదవండి: ఫిబ్రవరి 7న ఏం జరగనుంది?.. అందరూ వెయిటింగ్
దేశ నిర్మాణం కోసం పన్ను చెల్లింపుదారులు చేస్తున్న సేవలను గౌరవించడానికి ప్రధానమంత్రి 'నరేంద్ర మోదీ' చేసిన ప్రయత్నమే 2025 బడ్జెట్‌లో ఇచ్చిన పన్ను ఉపశమనం అని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. గత మూడు.. నాలుగు సంవత్సరాలుగా, మేము నిరంతరం పన్ను చెల్లింపుదారులతో నిమగ్నమై ఉన్నాము. ప్రభుత్వంపై వారి నమ్మకం చెక్కుచెదరకుండా ఉండటానికి, మేము అనేక చర్యలు తీసుకున్నామని అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment