న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కుంభమేళా ఒక ప్రధానాంశంగా మారింది. దీనికితోడు కుంభమేళాలో పలు ఆసక్తికర అంశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇదేవిధంగా ఈ మహాపర్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహాకుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.
మౌని అమావాస్యనాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్(Samajwadi Party MP Jaya Bachchan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభ్‌లో నీరు అత్యంత కలుషితమైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమయ్యిందని, ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని, దేశంలోని సమస్యలపై ఎటువంటి శ్రద్ధ లేదని ఆమె ఆరోపించారు.
కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ, సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కోట్లాది మంది జనం కుంభమేళా(Kumbh Mela)కు వచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని, అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకోగలరని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ మహా కుంభమేళాలో ఏం జరిగింది? అనే విషయాన్ని ప్రపంచం ముందు ఉంచాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.
మహా కుంభమేళా తొక్కిసలాట గురించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) మాట్లాడుతూ కుంభమేళాలో కొందరు మరణించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయం కోసం ఎవరు ప్రశ్నిస్తున్నా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బుల్డోజర్‌ను నడుపుతోందన్నారు. కుంభమేళాలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తాము సభలో నోటీసు ఇచ్చినా, దానిని తిరస్కరించారన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా అంశాన్ని లేవనెత్తుతామని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.
ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే..
Comments
Please login to add a commentAdd a comment