polluted
-
మహాకుంభమేళాపై ఎంపీ జయాబచ్చన్ వివాదాస్పద వ్యాఖ్యలు
న్యూఢిల్లీ: యూపీలోని ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా అత్యంత వైభవంగా కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పుడు కుంభమేళా ఒక ప్రధానాంశంగా మారింది. దీనికితోడు కుంభమేళాలో పలు ఆసక్తికర అంశాలు కూడా చోటుచేసుకుంటున్నాయి. ఇదేవిధంగా ఈ మహాపర్వంపై పలు వివాదాస్పద వ్యాఖ్యలు కూడా వినిపిస్తున్నాయి. తాజాగా సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్ మహాకుంభమేళాపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.మౌని అమావాస్యనాడు మహా కుంభమేళాలో జరిగిన తొక్కిసలాటపై సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ జయా బచ్చన్(Samajwadi Party MP Jaya Bachchan) వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. కుంభ్‌లో నీరు అత్యంత కలుషితమైపోయిందని ఆమె వ్యాఖ్యానించారు. తొక్కిసలాటలో మరణించినవారి మృతదేహాలను నదిలోకి విసిరేయడం వల్ల నీరు కలుషితమయ్యిందని, ఇదే నీరు అక్కడి ప్రజలకు చేరుతోందని, దీనిపై ఎవరూ ఎటువంటి స్పష్టత ఇవ్వడం లేదని, దేశంలోని సమస్యలపై ఎటువంటి శ్రద్ధ లేదని ఆమె ఆరోపించారు.కుంభమేళాకు వచ్చే సామాన్యులకు ఎటువంటి ప్రత్యేక సౌకర్యాలు అందడం లేదని, వారి కోసం ఎటువంటి ఏర్పాట్లు చేయలేదని ఆమె ఆరోపించారు. వీవీఐపీలు వచ్చినప్పుడు వారికి అన్ని సౌకర్యాలు కల్పిస్తారు కానీ, సామాన్యుల సౌకర్యాలను పట్టించుకోవడం లేదని అన్నారు. కోట్లాది మంది జనం కుంభమేళా(Kumbh Mela)కు వచ్చారంటూ అబద్ధాలు చెబుతున్నారని, అంత పెద్ద సంఖ్యలో జనం ఎలా చేరుకోగలరని ఆమె ప్రశ్నించారు. ఇంతకీ మహా కుంభమేళాలో ఏం జరిగింది? అనే విషయాన్ని ప్రపంచం ముందు ఉంచాలని జయాబచ్చన్ డిమాండ్ చేశారు. ప్రజలకు నిజం చెప్పాల్సి బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆమె అన్నారు.మహా కుంభమేళా తొక్కిసలాట గురించి కాంగ్రెస్ ఎంపీ గౌరవ్ గొగోయ్(Congress MP Gaurav Gogoi) మాట్లాడుతూ కుంభమేళాలో కొందరు మరణించడంపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, దీనిపై ప్రత్యేక చర్చ జరగాలని తాము డిమాండ్ చేస్తున్నామన్నారు. న్యాయం కోసం ఎవరు ప్రశ్నిస్తున్నా దానికి వ్యతిరేకంగా ప్రభుత్వం బుల్డోజర్ను నడుపుతోందన్నారు. కుంభమేళాలో మృతుల సంఖ్యను ప్రభుత్వం దాచిపెడుతోందన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తు జరగాలని, తాము సభలో నోటీసు ఇచ్చినా, దానిని తిరస్కరించారన్నారు. భవిష్యత్తులో మహా కుంభమేళా అంశాన్ని లేవనెత్తుతామని గౌరవ్ గొగోయ్ పేర్కొన్నారు.ఇది కూడా చదవండి: Delhi Election: ఆ సీట్లలో ఆప్‌కు చుక్కలే.. -
ఆయువు తీస్తున్న వాయువు
ప్రపంచవ్యాప్తంగా నిత్యం 2వేల మంది చిన్నారుల మృత్యువాత కలుషిత గాలిని పీల్చడంతోనే బలి 2021లో గాలి కాలుష్యంతో 80 లక్షల మంది మృతి పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత కాలుష్య మరణాలే ఎక్కువహెల్త్ ఎఫెక్ట్స్ ఇన్స్టిట్యూట్ నివేదికలో వెల్లడిసాక్షి, అమరావతి: ఇప్పటి దాకా ఐదేళ్ల లోపు చిన్నారుల్లో మరణానికి పోషకాహార లోపం ప్రధాన పాత్ర వహిస్తుంటే... తాజాగా ఈ జాబితాలోకి వాయు కాలుష్యం కూడా చేరింది. ప్రపంచ వ్యాప్తంగా రోజూ దాదాపు 2వేల మంది చిన్నారులు కలుషిత గాలిని పీల్చడం వల్ల మృత్యువాత పడుతుండటం ఆందోళన కలిగిస్తోంది. అపరిశుభ్రత, కలుషిత నీరు కంటే గాలి కాలుష్యంతోనే ఆరోగ్యంప్రమాదంలో పడుతోందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తున్నారు. హెల్త్ ఎఫెక్టŠస్ ఇన్స్టిట్యూట్ (హెచ్ఈఐ) విడుదల చేసిన కొత్త అధ్యయనం ప్రకారం..2021లో 80లక్షల మందికిపైగా కలుíÙత గాలి కారణంగా మృతి చెందారు. వీరిలో చిన్నారులతో పాటు వయోజనులు ఉండటం గమనార్హం. ఇదిలా ఉంటే... ఇంట్లో కూడా కాలుష్యం పెరుగుతుండటంతో గాలి నాణ్యత మరింత క్షీణించి అనారోగ్య సమస్యలు విజృంభిస్తున్నాయి. పొగాకు, రక్తపోటు తర్వాత ఇదే..ప్రపంచవ్యాప్తంగా పొగాకు వినియోగం, అధిక రక్తపోటు తర్వాత మనిషి ప్రాణాలకు వాయు కాలుష్యం అత్యంత ప్రమాదకరంగా తయారైంది. అధిక ఆదాయ దేశాల్లో కంటే ఆఫ్రికాలోని చాలా ప్రాంతాల్లో 500 రెట్లు చిన్నారుల మరణాల రేటు ఎక్కువగా ఉండటం గమనార్హం. పీఎం 2.5గా పిలిచే చిన్న కణాలు.. అంటే 2.5 మైక్రోమీటర్ల వ్యాసం కంటే చిన్నవిగా గాల్లో కలిసిపోయి ఉండే వివిధ రకాల ధూళి కణాలు ప్రపంచ వాయు కాలుష్య మరణాల్లో 90 శాతం కంటే ఎక్కువగా కారణం అవుతున్నాయని నివేదిక పేర్కొంది.వాయు కాలుష్యంతో నష్టాలు.. ⇒ శ్వాస తీసుకున్నప్పుడు గాలి ద్వారా ధూళి కణాలు రక్తంలోకి ప్రవేశించి శరీరంలోని అవయవాల పనితీరును తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. ⇒ ఊపిరితిత్తుల వ్యాధులు సంభవిస్తున్నాయి. ⇒ గుండెజబ్బులు, మధుమేహం, చిత్త వైకల్యం తలెత్తుతున్నాయి ⇒ మహిళల్లో గర్భస్రావాలువాయు కాలుష్యానికి కారణాలు.. ⇒ చెట్ల నరికివేత, అడవుల్లో కార్చిచ్చు ⇒ తీవ్రమైన కరువులు, భూములు ఎండిపోవడం ⇒తీవ్ర గాలులు, తుపానులు ⇒ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు ⇒ వాయు మార్గంలో ప్రయాణాలతో నైట్రోజన్ ఆక్సైడ్ల విడుదలవాతావరణ సంక్షోభమే కారణమా? వాతావరణ సంక్షోభం కూడా గాలి నాణ్యతను దిగజార్చుతోందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. కాలుష్య కారకాలు ఓజోన్లోకి ప్రవేశించడం ద్వారా 2021లో ఐదు లక్షల మందికిపైగా మరణాలకు కారణమైనట్టు నివేదిక తెలిపింది. ప్రధానంగా బయోమాస్, బొగ్గు, పారాఫిన్, ముడి ఇంధనాలతో వంట చేయడంతోనూ కాలుష్యం పెరిగి చిన్నారుల ప్రాణాలకు ముప్పు వాటిల్లుతోందని గుర్తించింది. సోలార్ స్టవ్‌ల వినియోగం అందుబాటులోకి వస్తే పీఎం 2.5 ఉద్గారాలు, కార్బన్ డయాక్సైడ్ ఉద్గారాలను చాలా వరకు తగ్గించవచ్చని స్పష్టం చేస్తోంది. అయితే ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 230 కోట్ల మందికి శుభ్రమైన వంట ఇంధనాలు అందుబాటులో లేకపోవడంపై ఆందోళన వ్యక్తం చేసింది. -
కాలుష్య కోరల్లోకి మరో రెండు నగరాలు.. టాప్-10లోకి చేరిన ఇండియన్ సిటీలు ఇవే..
ప్రపంచంలో అత్యంత కాలుష్యపూరిత నగరాల జాబితాలోకి ఢిల్లీతో పాటు మరో రెండు భారతీయ నగరాలు చేరాయి. దేశమంతా ఆదివారం దీపావళి వేడుకలు ఘనంగా జరిగాయి. భారీ మొత్తంలో బాణాసంచా కాల్చడంతో ఆ విషపూరిత పొగ గాలిని కమ్మేసింది. ఫలితంగా గాలి నాణ్యత బాగా తగ్గిపోయింది. ప్రపంచంలో వాతావరణ కాలుష్యం అత్యధికంగా ఉన్న నగరాల జాబితాను స్విట్జర్లాండ్‌కు చెందిన ఎయిర్ క్వాలిటీ టెక్నాలజీ సంస్థ తాజాగా విడుదల చేసింది. ఇందులో ఎప్పటిలాగే దేశ రాజధాని ఢిల్లీ అత్యంత కాలుష్య నగరంగా అగ్ర స్థానంలో నిలించింది. ప్రస్తుతం అక్కడ గాలి నాణ్యత సూచీ 420 ఉండటంతో దీన్ని 'ప్రమాదకర' కేటగిరీలో చేర్చింది. టాప్-10 లో మరో రెండు నగరాలు అత్యంత కాలుష్యపూరిత నగరాల టాప్ 10 జాబితాలోకి భారత్ చెందిన మరో రెండు నగరాలు చేరాయి. 196 ఏక్యూఐతో కోల్‌కతా నాల్గవ స్థానంలో నిలిచింది. దేశ ఆర్థిక రాజధానిగా పిలిచే ముంబై 163 ఏక్యూఐతో ఎనిమిదో స్థానంలో ఉంది. ఏక్యూఐ స్థాయి 400-500 ఆరోగ్యవంతమైన వ్యక్తులపై ప్రభావం చూపుతుంది. ఇప్పటికే ఉన్న వ్యాధులు ఉన్నవారికి ఇది మరింత ప్రమాదకరం. ఇక 150-200 స్థాయి ఆస్తమా, ఊపిరితిత్తులు, గుండె సమస్యలతో బాధపడుతున్న వ్యక్తులకు అసౌకర్యాన్ని కలిగిస్తుంది. ఇక ఏక్యూఐ స్థాయి 0-50 ఉంటే అది మంచిదిగా పరిగణిస్తారు. -
ప్రపంచంలో అత్యంత కాలుష్య నగరంగా ఢిల్లీ..
సాక్షి, న్యూఢిల్లీ: ప్రపంచంలోనే అత్యంత కలుషిత నగరం ఢిల్లీ అని ఓ అధ్యయనం చెబుతోంది. తీవ్ర కాలుష్యం బారిన పడుతున్న ఢిల్లీ వాసులు తమ ఆయుర్దాయంలో అత్యధికంగా 11.9 ఏళ్లు కోల్పోతున్నారని పేర్కొంది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం ప్రకారం చూసినా దేశ రాజధాని వాసులు సగటు కన్నా 8.5 ఏళ్లు నష్ట పోతున్నారని తెలిపింది. భారత్‌లో ప్రజల ఆరోగ్యానికి కాలుష్యం పెనుముప్పుగా తయారైందని యూనివర్సిటీ ఆఫ్ షికాగో ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూట్ విడుదల చేసిన ది ఎయిర్ క్వాలిటీ లైఫ్ ఇండెక్స్ (ఏక్యూఎల్‌ఐ) ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) నిర్దేశించిన కాలుష్య స్థాయిల కంటే భారత్‌లో చాలా ఎక్కువ కాలుష్యం ఉందని పేర్కొంది. డబ్ల్యూహెచ్‌వో మార్గదర్శకాల ప్రకారం పర్టిక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 ఐదు మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్‌గా కాలుష్యం ఉండాల్సి ఉంది. కాలుష్య తీవ్రతలు ఇలానే కొనసాగితే భారతీయుల సగటు ఆయుర్దాయం కన్నా 5.3 ఏళ్లు తగ్గుతుందని తెలిపింది. దేశంలోని మొత్తం 130 కోట్ల మందికి పైగా ప్రజలు వార్షిక సగటు కాలుష్య స్థాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల కంటే ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోనే నివసిస్తున్నారు. చదవండి: చివరి దశకు చేరిన చంద్రయాన్–3 మిషన్.. మిగిలింది వారం రోజులే! జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్లకు మించి కాలుష్యం ఉండే ప్రాంతాల్లో 67.4 శాతం మంది నివసిస్తున్నారని నివేదిక తెలిపింది. సగటు భారతీయుడి ఆయుర్దాయం కాలుష్యం కారుణంగా 5.3 ఏళ్లు తక్కువగా ఉంటోందని వివరించింది. 2021లో భారత్‌లో రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పరి్టక్యులేట్ మాటర్ (పీఎం) 2.5 నమోదు చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రజలు సగటు కన్నా 2.6 ఏళ్లు, తెలంగాణ ప్రజలు సగటు కన్నా 3.2 ఏళ్లు కోల్పోతున్నారని తెలిపింది. జాతీయ వాయు నాణ్యత ప్రమాణం 40 మైక్రోగ్రాములు/క్యూబిక్ మీటర్ల ప్రకారం చూస్తే ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో ఆయుష్షు ముప్పు లేదని తెలిపింది. దేశంలో హృదయ సంబంధ వ్యాధులతో 4.5 ఏళ్లు, తల్లీ పిల్లల పోషకాహార లోపంతో 1.8 ఏళ్ల ఆయుర్దాయం కోల్పోతున్నట్లు నివేదిక పేర్కొంది. 2013– 2021 మధ్య ప్రపంచవ్యాప్తంగా పెరిగిన కాలుష్యంలో భారత్ వాటా 59.1 శాతమని తెలిపింది. సగటు కంటే ఎక్కువగా ఆయుర్దాయం కోల్పోతున్న అత్యధిక జనాభా కలిగిన 10 రాష్ట్రాలు వరసగా.. యూపీ, బిహార్, బెంగాల్, రాజస్తాన్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, గుజరాత్, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు ఉన్నాయని తెలిపింది. -
భారతదేశంలోని టాప్ 10 అత్యంత కాలుష్య నగరాలు
-
ప్రపంచంలోని టాప్ 10 కాలుష్య నగరాలు
-
ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరం ఏదంటే..?
న్యూఢిల్లీ: ప్రపంచ దేశ రాజధానుల్లో అత్యంత కలుషిత నగరంగా ఢిల్లీ నిలిచింది. ప్రపంచ నగరాల్లో వాయునాణ్యతను పరిశీలించి స్విస్ సంస్థ ఐక్యూ ఎయిర్ తయారు చేసే జాబితాలో అత్యంత అధమ వాయు నాణ్యత ఉన్న టాప్ 100లో 63 నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. వీటిలో సగానికి పైగా నగరాలు ఉత్తరాదిన ఢిల్లీ పరిసరాల్లోనే ఉండటం గమనార్హం. అత్యంత కలుషిత రాజధానిగా ఢిల్లీ టాప్ ప్లేస్‌లో ఉండటం వరుసగా ఇది నాలుగోసారి. భారత్‌లో ఒక్క నగరంలో కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్ధారిత వాయు నాణ్యత ప్రమాణాలు( క్యూబిక్ మీటర్‌కు 5 మైక్రోగ్రాములు) లేవని వరల్డ్ ఎయిర్ క్వాలిటీ రిపోర్ట్– 2021 తెలిపింది. జాబితా తయారీకి 117 దేశాల్లోని 6,475 నగరాల్లో వాయు నాణ్యత (పీఎం 2.5– పర్టిక్యులేట్ మాటర్ 2.5 స్థాయి)ను సంస్థ పరిశీలించింది. కలుషిత రాజధానుల్లో ఢిల్లీ తర్వాత ఢాకా (బంగ్లాదేశ్), జమేనా (చాడ్ రిపబ్లిక్), దుషంబె (తజికిస్తాన్), మస్కట్ (ఒమన్) నిలిచాయి. ఢిల్లీ పీఎం 2.5 స్థాయి క్రితంతో పోలిస్తే 14.6 శాతం పెరిగినట్లు నివేదిక తెలిపింది. ఢిల్లీ గాలిలో కాలుష్య స్థాయి క్యూబిక్ మీటర్‌కు 96.4 మైక్రోగ్రాములుగా నమోదైంది. భారత్ సరాసరి వార్షిక పీఎం 2.5 స్థాయి 2021లో క్యూబిక్ మీటర్‌కు 58.1 మైక్రో గ్రాములకు చేరిందని నివేదిక తెలిపింది. కరోనా సమయంలో లాక్‌డౌన్‌తో దేశ వాయునాణ్యత మెరుగైందని, కానీ 2021కల్లా వాయు నాణ్యత తిరిగి 2019 స్థాయికి పడిపోయిందని పేర్కొంది. దేశంలో 48 శాతం నగరాల్లో వాయు నాణ్యత క్యూబిక్ మీటర్‌కు 50 మైక్రో గ్రాములను దాటిందని తెలిపింది. చదవండి: (రసాయన దాడి ఖాయం: బైడెన్) పది మనవే.. ప్రపంచ టాప్ 15 కలుషిత నగరాల్లో పది నగరాలు భారత్‌లోనే ఉన్నాయి. ప్రపంచంలో అత్యంత కలుషిత నగరంగా రాజస్తాన్‌లోని భివాడీ నగరం నిలిచింది. ఈ నగరంలో పీఎం 2.5 స్థాయి 106.2 మైక్రోగ్రామ్/క్యూబిక్ మీటర్‌గా నమోదైంది. తర్వాత స్థానాల్లో యూపీకి చెందిన ఘజియాబాద్, చైనాకు చెందిన హోటాన్, ఢిల్లీ, జాన్పూర్, పాక్‌లోని ఫైసలాబాద్ నిలిచాయి. దేశాల వారీగా చూస్తే అత్యంత కాలుష్య దేశంగా పీఎం 2.5 స్థాయి 76.9 మైక్రోగ్రామ్/క్యూబిక్‌మీటర్‌తో బంగ్లాదేశ్ నిలిచింది. తర్వాత స్థానాల్లో చాడ్, పాక్, తజికిస్తాన్, ఇండియా ఉన్నాయి. వాయుకాలుష్యం శ్వాసకోశ ఇబ్బందులు, అలెర్జీల నుంచి క్యాన్సర్ తదితరాలకు దారితీస్తుంది. చదవండి: (మార్లిన్ మన్రో చిత్రానికి భారీ ధర.. అక్షరాలా రూ.1521కోట్లా..!) నాలుగో స్థానంలో హైదరాబాద్ ప్రపంచ వాయు నాణ్యతా నివేదిక 2021 ప్రకారం భారత్‌లో అత్యంత కలుషిత నగరాల జాబితాలో ఢిల్లీ, కోల్‌కతా, ముంబై తర్వాత హైదరాబాద్ నాలుగో స్థానంలో నిలిచింది. నగరంలో పీఎం 2.5 స్థాయిలు 2020లో క్యూబిక్ మీటర్‌కు 34.7 మైక్రోగ్రామ్ ఉండగా, 2021కి 39.4కు పెరిగినట్లు నివేదిక తెలిపింది. నగరంలో వాయు కాలుష్యం పెరుగుదలకు ప్రత్యేక కారణాలను నివేదిక పేర్కొనలేదు. కానీ పెరుగుతున్న వాహన విక్రయాలు కాలుష్య పెరుగుదలకు దోహదం చేస్తున్నాయని వ్యాఖ్యానించింది. హైదరాబాద్‌లో అధికారిక లెక్కల ప్రకారం 60 లక్షల వాహనాలున్నాయి. ఈ నివేదిక ప్రభుత్వాలకు కనువిప్పు కావాలని గ్రీన్ పీస్ ఇండియా సంస్థ మేనేజర్ అవినాశ్ వ్యాఖ్యానించారు. దేశీయ వాహన విక్రయాలు పెరుగుతూ పోతున్న తరుణంలో దేశ వాయు నాణ్యత మరింత దిగజారే ప్రమాదం ఉందని, ప్రభుత్వాలు ఇప్పటికైనా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సాంప్రదాయ ఇంధన వనరుల స్థానంలో ప్రత్యామ్నాయ ఇంధన వనరులు వాడకాన్ని ప్రోత్సహించాలన్నారు. ప్రపంచ వ్యాప్తంగా చూస్తే కేవలం 3 శాతం నగరాలు మాత్రమే డబ్లు్యహెచ్‌ఓ ప్రమాణాలకు అనుగుణంగా వాయునాణ్యతతో ఉన్నాయని నివేదిక తెలిపింది. దేశాల వారీగా చూస్తే ఏ ఒక్క దేశంలో కూడా వాయు నాణ్యత నిర్ధిష్ట ప్రమాణాలకు అనుగుణంగా లేదని పేర్కొంది. -
మానవ మనుగడకి ముప్పుగా కాలుష్యం.. ఏటా 70 లక్షల మరణాలు!
ప్రకృతి ఒడిలో ఎక్కడో కొండకోనల్లో జీవిస్తున్నవారు తప్ప ప్రపంచంలో మిగతా ప్రజలంతా కలుషిత గాలినే పీల్చుకుంటూ మనుగడ సాగిస్తున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ నిర్దేశించిన ప్రమాణాలకు మించి కలుషితమైన గాలినే పీల్చుకుంటోంది ప్రపంచంలోని 99 శాతం జనాభా. ఈ విషయాన్ని డబ్ల్యూహెచ్ఓ విడుదల చేసిన తాజా గణాంకాలే తెలియజేస్తున్నాయి. ఎక్కువమంది ప్రాణాలను హరిస్తున్న కాలుష్య మహమ్మారి ఇది. ఏటా ఈ కాలుష్యానికి ప్రపంచవ్యాప్తంగా 70 లక్షల మంది బలవుతున్నారు. ఈ కాలుష్యం ఇంటా బయటా ప్రమాద ఘంటికలను మోగిస్తోంది. ఆరుబయటను పీల్చటం వల్ల ఏటా 42 లక్షల మరణాలు సంభవిస్తున్నాయి. వంటగదుల్లో పొగ కాలుష్యం వల్ల ఏటా 38 లక్షల మంది మరణిస్తున్నారు. పొగతాగటం వల్ల వస్తున్న క్యాన్సర్, ఊపిరితిత్తుల వ్యాధులు, గుండె సంబంధ వ్యాధులు, స్ట్రోక్ సహా అనేక దీర్ఘకాలిక రోగాలతో ఏటా మన దేశంలో దాదాపు 13.5 లక్షల మంది ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయి. భారత్‌లో వాయు కాలుష్యం కారణంగా 2019లో దాదాపు 17 లక్షల మరణాలు సంభవించాయి. మనదేశంలో నమోదైన మొత్తం మరణాలలో ఇది 18 శాతం. మరణాలు, వాయు కాలుష్యం వల్ల వచ్చే వ్యాధుల వల్ల ఏకంగా రూ. 2,60,000 కోట్ల ఆర్థిక నష్టం వాటిల్లుతోంది. స్థూల జాతీయోత్పత్తి లో ఇది 1.4 శాతం మేరకు ఉంటుందని ఒక నివేదిక చెబుతోంది. కోవిడ్ –19 కారణంగా దాదాపు రెండేళ్లలో ఇప్పటి వరకు నమోదైన మొత్తం మరణాల సంఖ్య 54.4 లక్షలు. అయితే ఏటా వాయు కాలుష్యం 70 లక్షల మందిని బలిగొంటున్నా పాలకులకు అంతగా పట్టట్లేదు. ఇంతకీ వాయు కాలుష్యం అంటే ఏమిటి? భూ ఉపరితల వాతావరణంలో ప్రకృతిసిద్ధమైన గాలి సహజ గుణగణాలను ఇంటా బయటా రసాయనిక, భౌతిక, జీవ సంబంధమైన వాహకం ద్వారా కలుషితం కావటం. ఒక్కమాటలో చెప్పాలంటే అసాధారణమైన రసాయనాలు లేదా ధూళి కణాలు కలిగి ఉన్న గాలే కలుషితమైన గాలి. వాయు కాలుష్య రకాలు.. వంట కలప, మోటారు వాహనాలు, పరిశ్రమలు, నిర్మాణ రంగం, అడవులు తగులబడటం వంటివాటి ద్వారా వాయు కాలుష్యం ఏర్పడుతుంది. దేశంలోని కొన్ని ప్రాంతాల్లో శీతాకాలంలో వ్యవసాయ క్షేత్రాల్లో పెద్ద ఎత్తున పంట అవశేషాలను కాల్చడం.. పొగ, పొగమంచు, సూక్ష్మరేణువులతో కూడి వాయు కాలుష్యానికి కారణమవుతోంది. ఊపిరితిత్తుల క్యాన్సర్‌కు ధూమపానం, రాడాన్ ప్రధాన కారణాలు. ఇంట్లో వాయు కాలుష్య కారకాలైన అత్యంత ప్రమాదరకమైన మూడు కారకాల్లో రాడాన్ ఒకటి. ప్రజారోగ్యానికి సంబంధించి ప్రధాన కాలుష్య కారకాలు.. అతిచిన్న ధూళి కణాలు (పిం.ఎం. 2.5, పి.ఎం. 10), కార్బన్ మోనాక్సైడ్, ఓజోన్, నైట్రోజన్ డయాక్సైడ్తో పాటు సల్ఫర్ డయాక్సైడ్ కూడా ఉంది. ఇవేకాక గ్యాసోలిన్, బెంజీన్, స్టైరిన్, ఫార్మాల్డిహైడ్ వంటి అస్థిర సేంద్రియ సమ్మేళనాలూ వాయు కాలుష్యానికి కారణమవుతూ ప్రజారోగ్యాన్ని హరిస్తున్నాయి. సహజ వాయు కాలుష్య కారకాలు... అడవులను దహించే కార్చిచ్చు, పుప్పొడి, ధూళి తుపాను, రాడాన్ వాయువు మొదలైనవి. అసహజ కాలుష్య కారకాలు.. మనుషుల పనులు, వాహనాల్లో మండించే ఇంధనం, ఇళ్లు, ఫ్యాక్టరీలలో ఉపయోగించే బొగ్గు, కలప ఇతర ఇంధనాలు వాయుకాలుష్యానికి కారణమవుతున్నాయి. హరిత గృహ వాయువులు.. వాతావరణ మార్పు వాతావరణ మార్పులతో వాయు కాలుష్యకారకాలు సంక్లిష్ట సంబంధాన్ని కలిగి ఉంటాయి. పార్టిక్యులేట్ మ్యాటర్ (పి.ఎం.) ధూళి కణాలు వాతావరణాన్ని వేడిక్కిస్తాయి లేదా చల్లబరుస్తాయి. బ్లాక్ కార్బన్, ఓజోన్ వంటి కొన్ని కాలుష్య కారకాలు వాతావరణంలో వేడిని బంధించడం ద్వారా ఉష్ణోగ్రతను పెంచుతాయి. అయితే సల్ఫర్ డయాక్సైడ్ వంటివి కాంతిని పరావర్తనం చెందించే కణాలను ఏర్పర్చి వాతావరణాన్ని చల్లబరుస్తుంటాయి. సూర్యరశ్మిని భూవాతావరణంలో బంధిస్తూ హరిత గృహ వాయువులూ వాతావరణాన్ని వేడెక్కిస్తున్నాయి. ఈ జాబితాలో ప్రధానమైనవి కార్బన్ డయాక్సైడ్, మీథేన్, నైట్రస్ ఆక్సైడ్, నీటి ఆవిరి (ఇవన్నీ సహజంగా ఏర్పడతాయి)తో పాటు ఫ్లోరినేటెడ్ వాయువులూ (ఇవి సింథటిక్) ఉన్నాయి. వీటిని హరిత గృహ వాయువులని, వీటి ప్రభావాన్ని హరిత గృహ ప్రభావమని అంటున్నాం. మన దేశంలో హరిత గృహ వాయువుల తలసరి ఉద్గారాలు తక్కువ. అయితే మొత్తంగా చూస్తే కాలుష్యకారక దేశాల్లో మొదటి రెండు స్థానాల్లో అమెరికా, చైనా ఉంటే మూడో స్థానంలో మన దేశం ఉంది. మనుషుల అవసరాల కోసం బొగ్గు, పెట్రోలియం ఉత్పత్తులు వంటి శిలాజ ఇంధనాలను కాల్చడం వల్ల వాతావరణం వేడెక్కుతోంది. దీన్నే భూతాపోన్నతి.. గ్లోబల్ వార్మింగ్ అంటున్నాం. దీన్ని పారిశ్రామిక పూర్వకాలం (క్రీ.శ. 1850– 1900 మధ్య) నుంచే గమనిస్తున్నాం. ఇప్పుడు వాతావరణం వేగంగా మారుతోంది. 2100 నాటికి ప్రపంచ సగటు ఉష్ణోగ్రతలు 5.4 డిగ్రీల సెల్సియస్ దాకా పెరగవచ్చు. ఈ మార్పు వల్ల పర్యావరణానికి తీవ్రమైన ముప్పు వాటిల్లుతోంది. ప్రజారోగ్యానికీ హాని కలుగుతోంది. జాతుల మనుగడకూ ముప్పే. దీన్ని తట్టుకొని నిలబడడం ప్రపంచానికే సవాలుగా మారింది. విధాన నిర్ణేతలు తప్పనిసరిగా మెరుగైన వ్యూహాలను అమలు చేయాల్సిన అవసరం ఉంది. మన దేశంలో వాయు కాలుష్య నివారణ,నియంత్రణ చట్టం – 1981 వచ్చిన తర్వాత పరిస్థితి కాస్త మెరుగుపడిందని చెప్పొచ్చు. పిల్లలను బడులకు పంపొద్దు పిల్లల ఊపిరితిత్తులు నాజూగ్గా ఉంటాయి. కాబట్టి వాయు కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లోని బడులకు పిల్లలను పంపవద్దు. ఎర్త్ లీడర్స్ ఫర్ ఎన్విరాన్మెంటల్ మానిటరింగ్ కార్యక్రమం కింద వ్యాస రచయిత సారథ్యంలో అహ్మదాబాద్, సూరత్‌లోని కొన్ని పాఠశాలల్లో వాయు కాలుష్యం ఎంత ఉందో చెప్పే కిట్లను పిల్లలతోనే తయారుచేయించి, ఆయా పాఠశాలల్లో అమర్చారు. వాయు కాలుష్యం ఎప్పుడు, ఎంత ఉంటున్నదని తల్లిదండ్రులతో పాటు ఇంకా ఎవరైనా తెలుసుకోవడానికి వీలుగా డేటాను క్లౌడ్‌తో అనుసంధానించారు. వాయు కాలుష్య సమస్యను అర్థం చేసుకోవడానికి, పరిష్కార మార్గాలను అన్వేషించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో తోడ్పడుతోంది. గాలిలో కాలుష్య కణాలు.. సల్ఫేట్, నైట్రేట్లు, అమ్మోనియా, సోడియం క్లోరైడ్, బ్లాక్ కార్బన్ (డీజిల్ వాహనాల నుంచి విడుదలయ్యే కణాలు బ్లాక్ కార్బన్‌ను కలిగి ఉంటాయి), ఖనిజాల «ధూళి వంటివన్నీ కాలుష్య కణాలే. గాలిలో తేలియాడే ఈ అతిచిన్న కణాలన్నిటినీ మనం పీల్చుకుంటున్నాం. పది మైక్రో మీటర్లు (మీటరులో 10లక్షల వంతు) లేదా అంతకంటే చిన్న కణాలు మన ఊపిరితిత్తుల్లోకి వెళ్లగలవు. అయితే వీటికన్నా ఇంకా చిన్న కాలుష్య కాణాలు ఆరోగ్యానికి హాని కలిగిస్తాయి. 2.5 మైక్రో మీటర్లు లేదా అంతకంటే తక్కువ వ్యాసం ఉన్న (పి.ఎం. 2.5) కాలుష్య కణాలు ఊపిరితిత్తులను దాటుకొని మనిషి రక్తంలోకి ప్రవేశిస్తాయి. పి.ఎం. 2.5 కణాలు మన వెంట్రుక వ్యాసంలో ముప్పయ్యవ వంతు సూక్ష్మంగా ఉంటాయి. మనుషులను మరణానికి చేరువ చేస్తున్న అయిదవ అతి ప్రమాద కారకాలివి. 80 శాతం వాయు కాలుష్య మరణాలకు పి.ఎం. 2.5 కాలుష్య కణాలే కారణం. వీటి మూలంగా 2010లో 6, 27,000 మంది మృత్యువాత పడ్డారని, ఆ ఏటి మరణాల్లో ఇవి 6 శాతమని 2012లో జీబీడీ – లాన్సెట్ పేర్కొంది. గాలి నాణ్యతపై నిఘా గాలి నాణ్యత విషయంలో ప్రతి దేశానికి వేరువేరు ప్రమాణాలున్నాయి. మన దేశంలో కూడా కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రమాణాలను నిర్దేశించింది. గాలి నాణ్యత సూచి (ఏక్యూఐ) గురించి ప్రజలకు అవగాహన కల్పించాలి. ఈ సూచీలో కాలుష్య తీవ్రతను తెలియజెప్పే ఆరు విభాగాలున్నాయి. ఎనిమిది కాలుష్య కారకాలను పరిగణనలోకి తీసుకొని నాణ్యత ఏ మేరకు ఉందో నిర్ధారిస్తారు. రెండేళ్లుగా బిఎస్6 ప్రమాణాలు శిలాజ ఇంధనాలు వినియోగించే మోటారు వాహనాలు తదితర యంత్రాల నుంచి వెలువడే ఉద్గారాలను నియంత్రించేందుకు భారత ప్రభుత్వం భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ (బీఎస్ఈఎస్)ను ఏర్పాటు చేసింది. కేంద్ర పర్యావరణ, అటవీ, భూతాపోన్నతి శాఖ పరిధిలోని కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ఆధ్వర్యంలో నిర్ణీత కాలవ్యవధిలో ఈ గాలి కాలుష్య ప్రమాణాలు అమలవుతున్నాయి. భారత్స్టేజ్ 6 ప్రమాణాలకు అనుగుణంగా తయారైన వాహనాలకు మాత్రమే దేశవ్యాప్తంగా 2020 నుంచి రిజిస్ట్రేషన్ సాధ్యపడుతోంది. చమురు కంపెనీలు కూడా బిఎస్6 ప్రమాణాలకు అనుగుణంగా 100 పీపీఎం మేరకు గంధకం కలిగిన పెట్రోలు డీజిల్‌ను సరఫరా చేస్తున్నాయి. తక్కువ కాలుష్య కారకమైన ఇంధనంగా పేరుగాంచిన సిఎన్జీతో సమానమైన సామర్థ్యం బిఎస్6 ప్రమాణాలతో కూడిన డీజిల్, పెట్రోల్‌కు ఉండడం విశేషం. కాటేస్తున్న వాయు కాలుష్యం ప్రపంచవ్యాప్తంగా 2019లో వాయు కాలుష్యం వల్ల 67 లక్షల మంది చనిపోయారు. చైనాలో అత్యధికంగా 18.5 లక్షల మంది, భారత్‌లో 16.7 లక్షల మంది వాయుకాలుష్యానికి బలయ్యారు. మన దేశంలో ప్రతి నలుగురు మృతుల్లో ఒకరు వాయు కాలుష్యం వల్ల చనిపోయారు. 2019లో ప్రపంచవ్యాప్తంగా మరణాలకు దారితీస్తున్న కారణాల్లో రక్తపోటు, పొగాకు, నాసిరకం ఆహారం తర్వాత నాలుగో స్థానం వాయు కాలుష్యానిదే. దీర్ఘకాలం పాటు వాయుకాలుష్యానికి గురైతే అనేక రకాల జబ్బుల పాలు కావడమే కాకుండా మరణాలూ సంభవిస్తున్నాయి. వాయు కాలుష్య మరణాలు ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది తెలంగాణలో35,364 మంది ∙ 2019లో దేశంలో వాయుకాలుష్యంతో చనిపోయిన వారిలో సగం మంది ఉత్తర ప్రదేశ్, బిహార్, పశ్చిమబెంగాల్, రాజస్థాన్‌కు చెందిన వారే. తద్వారా జరిగిన ఆర్థిక నష్టం 3,680 కోట్ల డాలర్లు. ఇంకా చెప్పాలంటే మన దేశ స్థూల ఉత్పత్తిలో 1.36 శాతం. ∙2019లో ఆంధ్రప్రదేశ్‌లో 62,808 మంది వాయు కాలుష్యం బారిన పడి మృత్యువాత పడ్డారు. ఏపీలో 15.6 శాతం మరణాలకు కారణం వాయుకాలుష్యమే. ఆర్థిక నష్టం 134.95 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 1.09 శాతం. ∙తెలంగాణలో 2019లో వాయు కాలుష్యం కారణంగా 35,364 మంది ప్రాణాలొదిలారు. రాష్ట్రంలో చనిపోతున్న వంద మందిలో 15.5 శాతం మంది వాయు కాలుష్యం వల్లనే చనిపోతున్నారు. ఆర్థిక నష్టం 111.59 కోట్ల డాలర్లు. రాష్ట్ర స్థూల ఉత్పత్తిలో ఇది 0.91 శాతం. (సౌజన్యం: స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్ 2020) మానవ ఆరోగ్యంపై కాలుష్య ప్రభావాలు ∙వాయు కాలుష్యం ఊపిరితిత్తులు, గుండె, నాడీ వ్యవస్థ, మెదడు పనితీరుపై ప్రభావం చూపుతుంది. ∙వాయు కాలుష్యం ప్రభావం అందరిపైనా ఒకేలా ఉండదు. వృద్ధులు, శిశువులు, గర్భిణీలు, గుండె, శ్వాసకోశానికి సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వంటి హై రిస్క్ గ్రూపులోని వారి మీద ఎక్కువ ప్రభావం చూపుతుంది. ∙పిల్లల్లో ఊపిరితిత్తులు ఇంకా ఎదిగే దశలో ఉంటాయి కాబట్టి వాళ్లు వాయు కాలుష్యానికి బహిర్గతమైనప్పుడు అది వాళ్ల ఆరోగ్యాన్ని దెబ్బ తీస్తుంది. ∙వాయు కాలుష్యం వల్ల కంటి దురదలు, తలనొప్పి, వికారం వంటి చిన్న చిన్న అనారోగ్యాలతోపాటు ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం వంటి పెద్ద పెద్ద ఆరోగ్య సమస్యలూ తలెత్తుతాయి. అంతేకాదు దీర్ఘకాలం పాటు విషపూరిత వాయువులను పీల్చడం వల్ల ఊపిరితిత్తుల క్యాన్సర్ వంటి జబ్బులూ వచ్చే ప్రమాదం ఉంది. అంతేకాదు ఈ వాయు కాలుష్యకారకాలు ఊపిరితిత్తుల దిగువ భాగాలకు చేరి శ్వాసనాళాల వాపు, సంధి వాపు వంటి వ్యాధులకూ కారణమవుతున్నాయి. డాక్టర్ ఎన్. సాయి భాస్కర్ రెడ్డి, జియో సైంటిస్ట్ 92463 52018 -
తాగునీరు కలుషితం
సాక్షి, రాజేంద్రనగర్: తాగునీటి పైపులైన్లోకి మురుగు నీరు ప్రవేశించి నీరు కలుషితమవుతుంది. అభివృద్ధి కార్యక్రమాల నేపథ్యంలో మంచినీటి పైపులైన్ పగలడంతో ఈ సమస్య ఏర్పడింది. అత్యవసరంగా ఈ పైపులైన్‌కు మరమ్మతులు నిర్వహించాల్సి ఉన్నప్పటికీ జలమండలి అధికారులు పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. వివరాల ప్రకారం బండ్లగూడ గ్రామం నుంచి కిస్మత్‌పూర్‌కు వెళ్లే ప్రధాన రహదారి ఎస్ఎంఆర్ ప్రాంతంలో కల్వర్టు ఉంది. ఈ కల్వర్టు మూసుకుపోవడంతో మురుగు నీరు పొంగి పొర్లుతుంది. దీంతో ఆర్డబ్ల్యూఎస్ శాఖ పైపులైన్‌ను వేసి కల్వర్టు వెడల్పు చేశారు. ఈ సమయంలో బండ్లగూడ నుంచి కిస్మత్‌పూర్‌కు వెళ్లే తాగునీటి ప్రధాన పైపులైన్‌కు చిల్లు ఏర్పడింది. దీని మీదుగా తాగునీరు ఎగజిమ్ముతుంది. నీరు సరఫరా అయిన సమయంలో తాగునీరు బయటకు వస్తుంది. నీటి సరఫరా లేని సమయంలో మురుగు నీరు ఉదయం వేలల్లో పైపులైన్‌ను ముంచి ప్రవహిస్తుంది. ఈ సమయంలో ఈ మురుగు నీరంతా పైపులైన్లోకి కలుస్తుంది. దీంతో తాగునీరు కలుషితమై ఇళ్లల్లోకి చేరుతుంది. స్థానికులు ఈ విషయమై గత 4–5రోజులుగా ఫిర్యాదులు చేస్తున్నారు. దాదాపు 50కాలనీలకు ఈ పైపులైన్ నీరే సరఫరా అవుతుంది. అత్యవసరంగా ఈ పైపులైన్‌కు జలమండలి అధికారులు మరమ్మతులు నిర్వహించాలి. కానీ అధికారులు ఏ ఒక్కరూ పట్టించుకోవడం లేదు. డీజీఎం మణికొండలో ఉండడం, ఏఈ పీరంచెరువులో ఉండడంతో ఈ ప్రాంతంపై ఏ ఒక్కరి అజమాయిషి లేదు. అలాగే ఫిర్యాదులు చేసేందుకు సైతం ఈ అధికారులు ఎవరూ అందుబాటులోకి రావడం లేదు. దీంతో స్థానికులు లబోదిబోమంటున్నారు. మురుగు నీరు తాగడంవల్ల అనారోగ్యాలకు గురవుతున్నామని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు. ప్రధాన పైపులైన్ ప్రాంతంలో పనులు జరుగుతున్నా అధికారులు పట్టించుకోరా అని ప్రశ్నిస్తున్నారు. -
ఇంట్లో ఉన్నా వదిలి పెట్టదు...!
ప్రపంచంలోని 95 శాతానికి పైగా జనాభా కాలుష్యంతో కూడిన ప్రమాదకరమైన గాలిని పీల్చాల్సిన దుస్థితి ఏర్పడింది. ప్రధానంగా పట్టణప్రాంత ప్రజలు ముఖ్యంగా అభివృద్ధి చెందుతున్న దేశాల్లోని కోట్లాదిమందిని అసురక్షిత వాయువు బలిగొంటోంది. ప్రపంచవ్యాప్తంగా ప్రతీ ముగ్గురిలో ఒకరు ఇంటా,బయట రెండు రెట్లు ఈ సమస్యను ఎదుర్కుంటున్నారు. అత్యధికంగా, అత్యల్పంగా కాలుష్యం బారిన దేశాల మధ్య అంతరం అతివేగంగా తగ్గిపోతున్నట్టు ఓ సమగ్ర అధ్యయనంలో వెల్లడైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) నిర్థారిత సురక్షిత ప్రమాణాలస్థాయి కంటే వాయుకాలుష్యం బారిన పడుతున్న ప్రజల సంఖ్యను అంచనా వేసేందుకు ఉపగ్రహ డేటా ద్వారా పర్యవేక్షించారు. ఈ డేటా ఆధారంగా కొత్తగా కనుక్కున్న వివరాలతో అమెరికాకు చెందిన హెల్త్ ఎఫెక్ట్ ఇనిస్టిట్యూట్ తాజా నివేదిక రూపొందించింది. ప్రపంచస్థాయిలో అధిక రక్తపోటు, ఆహారపు అలవాట్లు, పోగత్రాగడం తర్వాత వాయుకాలుష్యం వల్ల ఎక్కువ మంది మరణిస్తున్నట్టు తేలింది. గుండె జబ్బులు, గుండెపోటు, ఊపిరితిత్తుల క్యాన్సర్, శ్యాసకోశాల ఇన్ఫెక్షన్లతో దాదాపు 41 లక్షల మంది ముందుగానే చనిపోతున్నట్టు, ఇదొక అతి పెద్ద పర్యావరణ ఆరోగ్య ముప్పుగా పరిణమించినట్టు హెచ్చరించింది. బ్రిటన్‌తో సహా పలు దేశాల్లో డీజిల్ ఇంథనం వల్ల వాయుకాలుష్యం పెరుగుతోందని, రవాణా వాహనాలతో పాటు రోడ్లపై ఇతర వాహనాల రద్దీ బాగా పెరిగిపోవడం వల్ల ఈ కాలుష్యం విస్తరిస్తోందని పేర్కొంది. మరణాల్లో సింహభాగం భారత్, చైనాలదే ... ప్రపంచవ్యాప్తంగా 2016లో 60 లక్షలకు పైగా మరణాలు సంభవించాయి. అందులో 50 శాతానికి పైగా భారత్, చైనాల్లోనే అదీకూడా ఎక్కువగా ఈ దేశాల రాజధానులు న్యూఢిల్లీ, బీజింగ్లలోనే జరిగినట్టు స్టేట్ ఆఫ్ గ్లోబల్ ఎయిర్–2018 నివేదిక పేర్కొంది. 2016లో భారత్‌లో 56 కోట్ల మంది,చైనాలో 41 కోట్ల మంది ఇళ్లలోపలే అంతర్గతంగా వ్యాపిస్తున్న కాలుష్యం బారిన పడినట్టు తెలిపింది. అతి సూక్ష్మస్థాయిలో ఘన, ద్రవ రూపాల్లోని కాలుష్యం మోతాదుకు మించి ఊపిరితిత్తుల్లోకి ప్రవేశించి, క్రమక్రమంగా మర ణానికి కారణమవుతున్నట్టు వెల్లడించింది. భారత్‌లో ఇళ్ల లోపలి కాలుష్యం (ఇండోర్ పొల్యుషన్) కారణంగా ప్రతీ నలుగురిలో ఒకరు, అదే చైనాలో ప్రతీ ఐదుగురిలో ఒకరు చనిపోతున్నారు. బొగ్గువాడకం తగ్గించడంతో, వాయుకాలుష్య నియంత్రణకు చైనా గట్టి చర్యలు తీసుకుంటోందని, ఈ విషయంలో భారత్ కూడా ఇళ్లలోపలి కాలుష్యాన్ని తగ్గించేందుకు ఎల్పీజీ వాడకం పెంచే చర్యలు మొదలుపెట్టిందని ఈ ఇనిస్టిట్యూట్ ఉపాధ్యక్షుడు బాబ్ ఓ కీఫె పేర్కొన్నారు. –సాక్షి నాలెడ్జ్ సెంటర్ -
కాలుష్య జాబితాలో ఆ నగరం టాప్..
వాషింగ్టన్: అత్యంత ఓజోన్ కాలుష్యం గల పది అమెరికా నగరాల్లో కాలిఫోర్నియా ఎనిమిదో స్థానంలో ఉందని అమెరికన్ లంగ్ అసోసియేషన్ వార్షిక నివేదిక ‘ స్టేట్ ఆఫ్ ది ఎయిర్’ వెల్లడించింది. ఈ అసోసియేషన్ బుధవారం అత్యంత కాలుష్య నగరాల వివరాలను ప్రకటించింది. ఈ నివేదికలో లాస్ ఏంజలెస్-లాంగ్ బీచ్ ప్రాంతం అగ్రస్థానంలో ఉంది. 19 ఏళ్లుగా అమెరికన్ లంగ్ అసోసియేషన్ ప్రతి ఏటా ‘స్టేట్ ఆఫ్ ది’ పేరుతో కాలుష్య నగరాల నివేదికను వెల్లడిస్తోంది. గత నివేదికతో పోలీస్తే ఈసారి అన్ని రాష్ట్రాల్లో ఓజోన్ కాలుష్యం పెరిగింది. ఈ నివేదికలో దిగ్భ్రాంతికరమైన వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి. 133 మిలియన్ల అమెరికన్లలో ప్రతి 10 మందిలో నలుగురు కలుషిత వాయువును పీల్చుకుంటున్నారు. దీంతో తీవ్ర అనారోగ్యం, అకాల మరణాలు సంభవిస్తున్నాయి. ఊపిరితిత్తుల క్యాన్సర్, ఆస్తమా , గుండె జబ్బులు వంటి రోగాలకు గురవుతున్నారని నివేదిక తెలిపింది. ‘మారుతున్న వాతావరణ పరిస్థితులు చూస్తే ఓజోన్ పొర మరింత ప్రమాదంలో ఉంది. ఇప్పటికే అన్ని నగరాల్లో కాలుష్యం పెరిగిపోతుంది. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే రానున్న రోజుల్లో అమెరికన్లు ఆరోగ్య సమస్యలకు గురవుతార’ని అసోసియేషన్ అధ్యక్షుడు హెరోల్డ్ పి. విమ్మెర్ తెలిపారు. కాగా వాయుకాలుష్య నివారణకు ఇప్పటికే చర్యలు చేపట్టామని, అన్ని రాష్ట్రాల్లో కాలుష్యాన్ని తగ్గించేలా కార్యక్రమాలు నిర్వహిస్తామని హెల్తీ ఎయిర్ క్యాంపెయింగ్ డైరెక్టర్ లిండ్సే మోస్లే అలెగ్జాండర్ పేర్కొన్నారు. -
భూగర్భజలాలు కలుషితం
క్రషర్ బ్లాస్టింగ్‌కు వాడే రసాయనాల ఎఫెక్ట్.. పెట్రోలు, డీజిలు వాసన వస్తున్న బోరుబావుల నీరు ఎండిపోతున్న పంటలు..రైతులకు కోలుకోలేని దెబ్బ యాటకల్లుకు చెందిన ఈ రైతు పేరు ఈరన్న. ఈయనకు క్రషర్ సమీపంలో పొలం ఉంది. రెండు నెలల కిందట బోరు కింద ఐదు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాడు. క్రషర్లో పేలుళ్ల ధాటికి వెలువడే తెల్లని పొగకు, భూగర్భజలం కలుషితమై బోరు నుంచి వస్తున్న నీటికి పంటలో ఎదుగుదల లోపించింది. పైగా బోరు నుంచి వచ్చే నీరు పెట్రోల్, డీజిల్ లాంటి వాసన వస్తోంది. ఇలా ఒక్క ఈరన్నదే కాదు...గ్రామంలో పదుల సంఖ్యలో రైతులకు చెందిన బోరు బావుల్లో నీరు కలుషితం అయ్యింది. శెట్టూరు: యాటకల్లు గ్రామం వద్ద గల క్రషర్ కారణంగా సమీపంలోని పొలాలు బీడుగా మారుతున్నాయి. అసలే వర్షాభావ పరిస్థితులతో కొట్టుమిట్టాడుతున్న రైతులు అరకొరగా వచ్చే బోర్ల నీటితోనైనా పంటలు సాగుచేసుకుందామనుకుంటే క్రషర్ రూపంలో అడియాస అవుతోంది. క్రషర్ నుంచి తయారయ్యే కంకరకు భారీ డిమాండ్ పెరగడంతో కొద్ది రోజుల నుంచి క్రషర్లో అధిక సామర్థ్యంతో పేలుళ్లు (బ్లాస్టింగ్) జరుపుతున్నారు. బ్లాస్టింగ్‌కు వాడే రసాయనాలు, ఇంధనం, దాని సామర్థ్యాలు అధిక మోతాదులో ఉండటంతో గ్రామంలో ఇళ్లు బీటలు వారాయి. క్రషర్ నుంచి వెలువడే తెల్లని పొడి పంట పొలాలను కప్పేసి భూమి సారవంతాన్ని పీల్చి పిప్పి చేస్తోందని రైతులు మండిపడుతున్నారు. కలుషితమవుతున్న భూగర్భజలాలు క్రషర్కు ఆనుకుని 15 నుంచి 20 దాకా వ్యవసాయ బోర్లు ఉన్నాయి. వీటి ద్వారా వచ్చే నీటితో సమీపంలోని 15 మంది రైతులు వేరుశనగ సాగు చేసుకున్నారు. బ్లాస్టింగ్ సమయంలో వాడే ఇంధనం వల్ల భూగర్భజలాలు కలుషితం అయ్యాయని రైతులు వాపోతున్నారు. బోరు నుంచి నీరు బయటికి వస్తున్న సమయంలో పెట్రోల్, డీజిల్ వాసన వస్తోందని చెబుతున్నారు. వ్యవసాయ పనులకు వచ్చే కూలీలు ఈ నీటిని తాగితే ప్రాణాలు ఇక అంతేననే ఆందోళన చెందుతున్నారు. క్రషర్ ప్రభావంతో వట్టిపోయిన బోర్లు క్రషర్ చుట్టూ ఉన్న వ్యవసాయ బోర్లన్నీ పూర్తిగా వట్టిపోయాయి. గ్రామానికి చెందిన పెద్దన్న, వెంకటేశులు, రామచంద్ర, బోయ తిప్పేస్వామి, తిమ్మన్న, ప్రసాద్, రామాంజనేయులు, తిమ్మప్పతో పాటు మరికొంతమందికి చెందిన బోర్లు ఎండిపోయాయి. దీని కారణంగా 100 ఎకరాలు బీడు భూములుగా మారాయి. ఇటీవల వేసిన కొత్త బోర్లలో సైతం నీరు ఒకటి, రెండు నెలల పాటు వచ్చి వట్టిపోయినట్లు రైతులు చెబుతున్నారు. క్రషర్ బ్లాస్టింగ్ ప్రభావంతో జరుగుతున్న నష్టం గురించి ఫిర్యాదు చేస్తే రెవెన్యూ, పోలీసు ఇతర అధికారులు పరిశీలనకు వచ్చి, మైనింగ్‌శాఖకు నివేదికలు పంపుతామని చెప్పి చేతులు దులుపుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
కలుషిత నీటితో 20 మందికి అస్వస్థత
ఆందోళనలో పండూరు ప్రజలు జన్మభూమిలో వైద్య సిబ్బంది సరిపడిన మంచాలు లేక రోగుల అవస్థలు కాకినాడ రూరల్ : మండలం పండూరులో తాగునీరు కలుషితమై 20 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం అర్థరాత్రి నుంచి గ్రామస్తులు ఒక్కొక్కరుగా విరేచనాలు, వాంతులతో ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లగా అది తెరవకపోవడంతో ప్రైవేటు ఆస్పత్రులను ఆశ్రయించారు. ప్రైవేటు ఆస్పత్రులకు, దూరప్రాంతాలకు వెళ్లలేనివారు స్థానిక మందుల దుకాణంలోని టాబ్లెట్లు వేసుకుని ఉదయమే ఆస్పత్రి బాట పట్టారు. కొందరు ఏఎన్ఎంలు వైద్యం చేసే ప్రయత్నం చేసినప్పటికీ 12 మంది ఒకేసారి ఆస్పత్రికి రావడంతో సిబ్బంది కంగారుపడ్డారు. మండల వైద్యాధికారి ఐ ప్రభాకర్, హెల్త్సూపర్వైజర్లు, సిబ్బంది వాకలపూడిలోని జన్మభూమి– మాఊరు కార్యక్రమంలో ఉన్నారు. ఆస్పత్రిలో ఇద్దరు ఏఎన్ఎంలు ఒక మహిళా వైద్యాధికారి మాత్రమే అస్వస్థులకు వైద్యం చేశారు. బాధితులతో పాటు కుటుంబ సభ్యులు కూడా తరలిరావడంతో గందరగోళ పరిస్థితి నెలకొంది. రోగులకు ఫ్లూయిడ్స్ ఎక్కించేందుకు సరిపడినన్ని మంచాలు లేక ఒకొక్క మంచంపైనా ఇద్దర్ని చొప్పున పడుకోబెట్టి వైద్యం చేశారు. మరికొందర్ని ఆస్పత్రి వరండాలోనే చెక్క బెంచీలపై ఉంచి ఫ్లూయిడ్స్ పెట్టారు. తాగునీరు కలుషితం కావడం వల్లే ఈ సమస్య ఎదురైందని డాక్టర్ కన్యాకుమారి చెబుతున్నారు. వెంటనే పంచాయతీ కార్యదర్శికి, సర్పంచ్‌కు సమాచారం అందజేసినట్లు ఆమె వివరించారు. పంచాయతీ కార్యదర్శి మహ్మద్ ఉన్నీసా బీబీని వివరణ కోరగా పంచాయతీకి రెండు ఓవర్‌హెడ్ ట్యాంకులు ఉన్నాయని, వాటికి సంబంధించిన మోటార్ పాడవడంతో పి.వెంకటాపురం చెరువుగట్టుపై ఉన్న సూర్యారావుపేట పంపింగ్ స్కీమ్ నుంచి నాలుగు రోజులుగా పండూరు ప్రజలకు తాగునీరు అందజేస్తున్నామన్నారు. గ్రామం అంతా ఇదే నీరు తాగుతున్నారని, ప్రత్యేకంగా ఒకే ప్రాంతానికి చెందిన ప్రజలకు మాత్రమే విరేచనాలు, వాంతులు అయ్యాయంటే తాగునీరు వెళ్లే పైపులైనులో ఎక్కడో పైపు బద్దలై వేరే నీరు కలసి ఉండవచ్చన్నారు. విషయం తెలిసినప్పటి నుంచి పైపులైను తనిఖీ చేయిస్తున్నామన్నారు. విషయం తెలుసుకున్న ఆర్డబ్ల్యూఎస్ మండల ఏఈ ఎ.శివాజీ, ఉపసర్పంచ్ భావిశెట్టి వెంకటరమణ తదితరులు పీహెచ్‌సీకి వెళ్లి బాధితులను పరామర్శించి డాక్టర్ కన్యాకుమారితో మాట్లాడారు. ప్రమాదం ఏమీ లేదని ఫ్లూయిడ్స్ పెట్టి ఇంటికి పంపినట్టు వివరించారు. అస్వస్థతకు గురైన వారిలో.. అబ్బన త్రిమూర్తులు, వలవల వెంకటలక్ష్మి, జువ్వల వరాలమ్మ, బర్రే దుర్గాప్రసాద్, బర్రే దేవి, శీలి నూకరాజు, గరగ సుబ్బాలమ్మ, వలవల రఘు, శీలి బుల్లెమ్మ, అల్లవరపు నారాయణరావు, భావిశెట్టి వీరలక్ష్మి, కోనా గంగాభవాని ఉన్నారు. ఏఈపై అట్రాసిటీ కేసు పెట్టాలి పండూరులో తాగునీరు కలుషితమైన విషయంలో ఆర్డబ్ల్యూఎస్ ఏఈ ఎ.శివాజీ ఎస్సీలను చులకన చేసి మాట్లాడారంటూ ఆ గ్రామ ఎస్సీ నాయకులు శీలి లక్ష్మణరావు, తాతపూడి దివాకర్ తిమ్మాపురం పోలీస్‌స్టేషన్‌లో గురువారం ఫిర్యాదు చేశారు. బాధితులను పరామర్శించడానికి వచ్చిన సందర్భంగా తాగునీరు కలుషితమైందో లేక ఎస్సీ పేటలో ఏదైనా ఫంక్షన్లో ఫుడ్ పాయిజెన్ అయ్యిందో తెలియాల్సి ఉందన్నారని, ఆ శాఖ తప్పును కప్పిపుచ్చుకునేందుకు తమపై ఆరోపణలు చేయడం దారుణమన్నారు. గత నెల రోజులుగా ఇక్కడ ఎటువంటి ఫంక్షన్లు జరగలేదని, అస్వస్థతకు గురైన వారిలో 12 మంది కాపులని, నలుగురు ఎస్సీలు ఉన్నారని, కాపులంతా ఎస్సీలు చేసుకొనే ఫంక్షన్‌కు వచ్చి భోజనం చేయడం వల్లే అస్వస్థతకు గురైనట్లు ఏఈ శివాజీ పేర్కొన్నట్లు ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆయనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు. దీనిపై పోలీసులు చర్యలు తీసుకోకపోతే ఆందోళన చేస్తామని లక్ష్మణరావు తెలిపారు. రక్షిత తాగునీరు అందించండి : కన్నబాబు పండూరులో తాగునీరు కలుషితమై ప్రజలు అస్వస్థతకు గురి కావడం విచారించదగ్గ విషయం. తక్షణం గ్రామంలో పంపిణీ చేస్తున్న తాగునీటిని నిలిపివేసి రక్షిత నీటిని ట్యాంకర్ల ద్వారా అందించాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు కురసాల కన్నబాబు డిమాండ్ చేశారు. మోటార్లు పాడైపోతే వాటిని మరమ్మతులు చేయించాలని, అలా కాకుండా వాటిని అలాగే వదిలేసి కలుషిత చెరువునీటిని అందించడం దారుణమన్నారు. ప్రజలంతా కోలుకునేవరకూ కాకినాడ నుంచి ట్యాంకర్ల ద్వారా తాగునీటిని అందజేయాలని కన్నబాబు అధికారులకు సూచించారు. -
గ్రామాల్లో తాగునీరు కలుషితం
పారిశుద్ధ్య లోపం.. ప్రబలుతున్న వ్యాధులు పరిశుభ్రత, అవగాహనతో ఆరోగ్య పరిరక్షణ కంగ్టి: గ్రామాల్లో వ్యాధులు ప్రబలుతున్నాయి. ప్రస్తుతం వర్షాలు పడుతుండడంతో తాగునీరు కలుషితమవుతోంది. పైప్‌లైన్ లీకేజీల వల్ల ఈ పరిస్థితి నెలకొంది. మరి కొన్ని గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించింది. జ్వరం, జలులు, దగ్గు వంటి వ్యాధుల బారిన పడిన ప్రజలు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారు. మండలంలోని జమ్గి (బి) సాధు తండాలో మూడు నెలల క్రితం డెంగీతో జనాలు బెంబేలెత్తగా వైద్య శిబిరం ఏర్పాటు చేసి అదుపులోకి తెచ్చారు. గత ఆగస్టు దామర్గిద్దాలో అతిసార వ్యాధితో ఒకరు మరణించారు. వారం రోజుల నుంచి సిద్దంగిర్గా గ్రామంలో చికన్ గున్య వ్యాధితో ప్రజలు బాధపడుతున్నారు. ప్రస్తుతం వైద్య శిబిరం కొనసాగుతోంది. ముందస్తు జాగ్రత్తలు అవసరం వర్షాకాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది. దీంతో దోములు, ఈగలు వృద్ధి చెందుతాయి. తద్వారా వ్యాధులు సోకే అవకాశం ఎక్కువ. గ్రామాల్లో పారిశుద్ధ్యం లోపించడం, మురుగు కాలువలను శుభ్రం చేయకపోవడం వల్ల కూడా దోమలు వృద్ధి చెందుతున్నాయి. నీటి ట్యాంకులు శుభ్రం చేయకపోవడంతో పాచి పోరుకుపోతోంది. పైప్లైన్ల లీకేజీల వల్ల తాగునీరు కలుషితం అవుతోంది. కనీస జాగ్రత్తలు పాటిస్తే రోగాలను దూరం చేయవచ్చని వైద్యులు సూచిస్తున్నారు. వర్షాకాలంలో కాచి చల్లార్చిన నీటిని తీసుకోవడం మంచిదన్నారు. ఎక్కవ రోజులు నీటిని నిల్వ ఉంచడం మంచిదికాదని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, వేడివేడి భోజనం తినడం ద్వారా రోగాలను దూరం చేయవచ్చని పేర్కొన్నారు. -
కలుషితమవుతున్న పెదజాలరి పేట బీచ్