అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి టీమిండియా ఆతిథ్యం ఇస్తుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియా గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో రోహిత్ సేనపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 2011లో వరల్డ్‌కప్ గెలిచిన ధోని సేన మ్యాజిక్‌ను రోహిత్ బృందం రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఇక వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా ఒక్క మ్యాచ్‌పై మాత్రం అందరి ఆసక్తి నెలకొంది. అదే ఇండియా, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న(ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న లీగ్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడంతో ఈసారి టీఆర్పీ రేటింగ్‌లు బద్దలవ్వడం ఖాయం.
ఈ నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ పురస్కరించుకొని అహ్మదాబాద్ ప్రాంతంలో అన్ని స్టార్ హోటల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మ్యాచ్ చూడడం కోసం వచ్చే అభిమానులతో హోటల్ గదులన్నీ నిండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం ఎన్నో నెలల ముందుగానే అహ్మదాబాద్ లో హోటల్ రూమ్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్కడి హోటల్ యజమాను ఏకంగా రోజుకు రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు.
కొన్ని స్టార్ హోటల్స్ లో ఇది ఏకంగా రూ.లక్ష వరకూ ఉంది. అయినా వాటిలోనూ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దీంతో అభిమానులు కొత్త ప్లాన్ వేశారు. నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఒక రోజు వసతి కోసం అక్కడి హాస్పిటల్స్ ను కూడా ఫ్యాన్స్ వదలడం లేదు. ఇప్పటికే అలా తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గర్లో ఉన్న హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి.
హెల్త్ చెకప్ కూడా..
ఈ హాస్పిటల్ బెడ్స్ కు కూడా ఆ ఒక్క రోజు వసతి కోసం రూ.3 వేల నుంచి రూ.25 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. అందులోనే ఆహారంతోపాటు పూర్తి మెడికల్ చెకప్ లాంటి వసతులు కూడా ఇస్తున్నారు. దీంతో హోటల్ గదుల్లో వేలకువేలు పోసి రూమ్ తీసుకోవడం కంటే ఇలా చేయడం బెటరని చాలా మంది భావిస్తున్నారు. పేషెంట్ తోపాటు మరొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది.
ఇలా చేయడం వల్ల తమ హెల్త్ చెకప్ పూర్తి కావడంతోపాటు ఒక రోజు వసతి కూడా కలుగుతుందన్నది చాలా మంది భావనగా కనిపిస్తోందని అక్కడి హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ నిఖిల్ లాలా చెప్పారు. ఆ అక్టోబర్ 15 సమయంలోనే తమకు 24 గంటల నుంచి 48 గంటల వసతి కోసం ఎన్నో వినతలు వస్తున్నట్లు పేర్కొన్నారు.
ఇంగ్లండ్, కివీస్ మ్యాచ్‌తో మహాసంగ్రామం మొదలు..
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో మొత్తంగా 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా లీగ్ మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనుండగా.. మొదటి సెమీ ఫైనల్‌కు ముంబై, రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక అక్టోబర్ 5న డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా సమరానికి తెర లేవనుంది.
చదవండి: Ind Vs WI 2nd Test: ధోనిని అధిగమించిన రోహిత్.. సిక్సర్ల విషయంలోనూ రికార్డే
Comments
Please login to add a commentAdd a comment