Asia Cup 2024: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌ | Womens Asia Cup 2024: India Beat Pakistan By 7 Wickets | Sakshi
Sakshi News home page

Asia Cup 2024: పాక్‌ను చిత్తుగా ఓడించిన భారత్‌

Published Fri, Jul 19 2024 9:39 PM | Last Updated on Sat, Jul 20 2024 3:21 PM

Womens Asia Cup 2024: India Beat Pakistan By 7 Wickets

మహిళల ఆసియా కప్‌ టోర్నీలో టీమిండియా ఘనంగా బోణీ కొట్టింది. డంబుల్లా వేదికగా పాకిస్తాన్‌తో ఇవాళ (జులై 19) జరిగిన మ్యాచ్‌లో భారత్‌ 7 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన పాకిస్తాన్‌.. రేణుకా శర్మ (4-0-14-2), దీప్తి శర్మ (4-0-20-3), పూజా వస్త్రాకర్‌ (4-0-31-2), శ్రేయాంక పాటిల్‌ (3.2-0-14-2) ధాటికి 19.2 ఓవర్లలో 108 పరుగులకే ఆలౌటైంది. 

పాక్‌ ఇన్నింగ్స్‌లో అమీన్‌ (25), తుబా హసన్‌ (22), ఫాతిమా సనా (22), మునీబా అలీ (11) మాత్రమే రెండంకెల స్కోర్లు చేయగా.. గుల్‌ ఫేరోజా (5), అలియా రియాజ్‌ (6), నిదా దార్‌ (8), జావిద్‌ (0), అరూబ్‌ షా (2), నశ్రా సంధు (0), సదియా ఇక్బాల్‌ (0) నిరాశపరిచారు.  

అనంతరం ఛేదనకు దిగిన భారత్‌.. 14.1 ఓవర్లలో మూడు వికెట్లు నష్టపోయి లక్ష్యాన్ని చేరుకుంది. భారత ఓపెనర్లు షఫాలీ వర్మ 40, స్మృతి మంధన 45, దయాలన్‌ హేమలత 14 పరుగులు చేసి ఔట్‌ కాగా.. హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ (5), జెమీమా రోడ్రిగెజ్‌ (3) భారత్‌ను విజయతీరాలకు చేర్చారు. భారత్‌ తమ తదుపరి మ్యాచ్‌లో యూఏఈతో తలపడనుంది. ఈ మ్యాచ్‌ జులై 21న జరుగనుంది. కాగా, ఇవాళే జరిగిన మరో మ్యాచ్‌లో యూఏఈపై నేపాల్‌ 6 వికెట్ల తేడాతో సంచలన విజయం సాధించింది. ఈ విజయం నేపాల్‌ను ఆసియా కప్‌లో మొదటిది.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement