hotel rooms
-
దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు!
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి టీమిండియా ఆతిథ్యం ఇస్తుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియా గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో రోహిత్ సేనపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 2011లో వరల్డ్‌కప్ గెలిచిన ధోని సేన మ్యాజిక్‌ను రోహిత్ బృందం రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఇక వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా ఒక్క మ్యాచ్‌పై మాత్రం అందరి ఆసక్తి నెలకొంది. అదే ఇండియా, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న(ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న లీగ్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడంతో ఈసారి టీఆర్పీ రేటింగ్‌లు బద్దలవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ పురస్కరించుకొని అహ్మదాబాద్ ప్రాంతంలో అన్ని స్టార్ హోటల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మ్యాచ్ చూడడం కోసం వచ్చే అభిమానులతో హోటల్ గదులన్నీ నిండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం ఎన్నో నెలల ముందుగానే అహ్మదాబాద్ లో హోటల్ రూమ్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్కడి హోటల్ యజమాను ఏకంగా రోజుకు రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కొన్ని స్టార్ హోటల్స్ లో ఇది ఏకంగా రూ.లక్ష వరకూ ఉంది. అయినా వాటిలోనూ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దీంతో అభిమానులు కొత్త ప్లాన్ వేశారు. నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఒక రోజు వసతి కోసం అక్కడి హాస్పిటల్స్ ను కూడా ఫ్యాన్స్ వదలడం లేదు. ఇప్పటికే అలా తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గర్లో ఉన్న హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. హెల్త్ చెకప్ కూడా.. ఈ హాస్పిటల్ బెడ్స్ కు కూడా ఆ ఒక్క రోజు వసతి కోసం రూ.3 వేల నుంచి రూ.25 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. అందులోనే ఆహారంతోపాటు పూర్తి మెడికల్ చెకప్ లాంటి వసతులు కూడా ఇస్తున్నారు. దీంతో హోటల్ గదుల్లో వేలకువేలు పోసి రూమ్ తీసుకోవడం కంటే ఇలా చేయడం బెటరని చాలా మంది భావిస్తున్నారు. పేషెంట్ తోపాటు మరొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తమ హెల్త్ చెకప్ పూర్తి కావడంతోపాటు ఒక రోజు వసతి కూడా కలుగుతుందన్నది చాలా మంది భావనగా కనిపిస్తోందని అక్కడి హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ నిఖిల్ లాలా చెప్పారు. ఆ అక్టోబర్ 15 సమయంలోనే తమకు 24 గంటల నుంచి 48 గంటల వసతి కోసం ఎన్నో వినతలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్, కివీస్ మ్యాచ్‌తో మహాసంగ్రామం మొదలు.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో మొత్తంగా 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా లీగ్ మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనుండగా.. మొదటి సెమీ ఫైనల్‌కు ముంబై, రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక అక్టోబర్ 5న డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా సమరానికి తెర లేవనుంది. చదవండి: Ind Vs WI 2nd Test: ధోనిని అధిగమించిన రోహిత్.. సిక్సర్ల విషయంలోనూ రికార్డే -
గోడలకు కళ్లుంటాయి.. గోప్యంగా చూస్తుంటాయి! జర జాగ్రత్త
సాక్షి, హైదరాబాద్: గోడలకు చెవులుంటాయ న్నది పాత సామెత. కానీ గోడ లకు కళ్లు కూడా ఉంటాయన్న చందంగా నేటి పరిస్థితులు మారుతున్నా యి. తమిళనాడు తిరు కొవి లూర్ లోని ఓ టెక్స్ టైల్ దుకాణంలో ఇటీ వల ట్రయల్ రూంలో దాచిన సెల్‌ఫోన్ ద్వారా యువతులు దుస్తులు మార్చు కొనే వీడి యోలను కొందరు గలీజుగాళ్లు రికార్డు చేయడం తెలిసిందే. ఇలా ఎక్కడో ఒక చోట ఈ తరహా ఘటనలు బయట పడుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో ట్రయల్ రూంలకు వెళ్లిన ప్పుడు లేదా హోటళ్లలో బస చేసిన ప్పుడు మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని పోలీ సులు సూచిస్తున్నారు. ►నచ్చిన దుస్తులు సరిపోయాయో లేదో తెలుసుకోవాలంటే వినియోగదారులు ట్రయల్ రూంలకు వెళ్లక తప్పదు. అదేవిధంగా విహారయాత్రలు, ఆఫీస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయడమూ అనివార్యమే. అక్కడ వాష్‌రూంలను వాడకుండా ఉండలేం. ఇదే అవకాశంగా చేసుకొని కొందరు సిబ్బంది రహస్య కెమెరాలు పెట్టి మహిళల వీడియోలను తీసే దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. హోటళ్లు, దుకాణ యజమానులకు తెలియకుండానే కొందరు సిబ్బంది ఇలాంటి అనైతిక పనులకు పాల్పడుతుండటం యాజమాన్యాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది. ఇలా చేస్తే ముప్పు తప్పుతుంది.. ► వస్త్రాల కొనుగోలు కోసం మాల్స్‌కు వెళ్లిన ప్పుడు ట్రయల్ రూంకు వెళ్లాల్సి వచ్చినా లేదా హోటళ్లలో వాష్‌రూంలు వాడాల్సి వచ్చినా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి. ఏమాత్రం అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే బయటకు వచ్చేయాలి. ► సెల్‌ఫోన్ టార్చ్ వేస్తూ చూస్తే రహస్య కెమెరాలు ఉండి ఉంటే వాటి లెన్స్‌పై టార్చ్పడి రిప్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కూడా రహస్య కెమెరాల ప్రమాదం నుంచి బయటపడొచ్చు. ► హోటల్ గదుల్లో బస చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా రాత్రివేళ్లలో నిద్రించాలంటే ముందుగా సీలింగ్ ఫ్యాన్ ఉన్న గదుల్లో లైట్లు ఆర్పి సెల్‌ఫోన్ టార్చ్ వేసి చూడాలి. రెడ్‌లైట్ బ్లింక్ అవుతున్నట్లు గమనిస్తే దాన్ని హిడెన్ కెమెరాగా అనుమానించాలి. ► ట్రయల్ రూంలు, హోటల్ రూంలకు ఉన్న తలుపులకు ఏవైనా అనుమానాస్పద రంద్రాలు ఉన్నట్లు గుర్తించినా.. అందులో ఏవైనా వస్తువులు ఉన్నట్లు గమనించినా వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి. ► ట్రయల్ రూంలు, వాష్ రూంలలో దుస్తులు తగిలించేందుకు ఉండే కర్టెన్ రాడ్స్ లేదా కొక్కాలకు కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నాయో లేదో చూడాలి. ► ట్రయల్ రూంలలో, వాష్‌రూంలలో ఉండే అద్దాల వెనుక సైతం మనకు తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మిర్రర్ ట్రిక్ వాడాలి. మీ వేలిని అద్దానికి తాకేలా పెడితే దాని ప్రతిబింబానికి మీ వేలికి దూరం ఉంటే అది నిజమైనది. ఆ వేలు ప్రతిబింబానికి ఆనితే అది రెండోవైపు నుంచి మనం కనిపించే అవకాశం ఉన్నట్లు అనుమానించాలి. -
చిన్న పట్టణాల్లో ఎక్కువ బుకింగ్‌లు
న్యూఢిల్లీ: ఈ ఏడాది చిన్న పట్టణాల్లో హోటల్ గదుల బుకింగ్‌లు ఎక్కువగా ఉన్నట్టు ఓయో తెలిపింది. హోటల్ బుకింగ్ సేవలను అందించే ఈ సంస్థ ఈ ఏడాదికి సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. తెనాలి, హాత్రాస్, ససారామ్, కరైకుడి తదితర పట్టణాల్లో క్రితం ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది ఎక్కువ బుకింగ్‌లు చూసినట్టు తెలిపింది. వ్యాపార పర్యటనలకు సంబంధించి బుకింగ్ల్లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయి. జూన్ 4న అత్యధిక బుకింగ్‌లు ఓయో ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదయ్యాయి. భక్తులు ఎక్కువగా బుకింగ్ చేసుకున్న కేంద్రంగా వారణాసి నిలిచింది. తిరుపతి, పూరి, అమృత్సర్, హరిద్వార్ బుకింగ్‌ల పరంగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే యూరప్‌లో లగ్జెంబర్గ్ ప్రావిన్స్ ఎక్కువ మంది పర్యాటకులకు ఇష్టమైన కేంద్రంగా నిలిచింది. ఓయో ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది ఇక్కడకు బుక్ చేసుకున్నారు. అమెరికాలో టెక్సాస్‌ను ఎక్కువ మంది సందర్శించారు. బ్రిటన్‌కు సంబంధించి లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌బ్రో, లీచెస్టర్, బ్రైటాన్ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నాయి. చదవండి: జియో..షావోమీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త! -
వరద బీభత్సం.. ఒక రాత్రికి రూ.40వేలు పలుకుతున్న హోటల్స్!
వరదల కారణంగా ఐటీ నగరం బెంగళూరు అస్తవ్యస్తంగా మారింది. పలు చోట్ల ఇళ్లలోకి వరదనీరు రావడంతో అక్కడి ప్రజల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కొందరు తాత్కాలికంగా వారి ఇళ్లను విడిచిపెట్టి హోటల్లో బస చేస్తున్నారు. దీంతో నగరంలో హోటళ్లకు అనూహ్యంగా డిమాండ్ పెరిగింది. ఇదే అవకాశం అన్నట్లు హోటల్ యాజమాన్యాలు ఒక్క రాత్రి ఏకంగా రూ.20 వేల నుంచి రూ.40వేలు వసూలు చేస్తున్నారట. ఒక్క రాత్రికి రూ. 30వేలు అయినా దొరకట్లే.. పర్పుల్ఫ్రంట్ టెక్నాలజీస్ సీఈఓ, వ్యవస్థాపకురాలు మీనా గిరీసబల్ల చెప్పినట్లు ఓ వార్త పత్రికకు తెలిపిన సమాచారం ప్రకారం.. ‘యెమలూరులోని మా విలాసవంతమైన గేటెడ్ కమ్యూనిటీ వరదల్లో చిక్కుకుంది. ఆ తర్వాత మేము ఓల్డ్ ఎయిర్పోర్ట్ రోడ్‌లోని హోటల్లో మా కుటుంబసభ్యులతో ఒక రోజు బస చేసేందుకు రూ. 42,000 ఖర్చు పెట్టాల్సి వచ్చిందన్నారు. ఓ పక్క హోటల్ రూమ్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నప్పటికీ కొందరికీ ఆ గదులు కూడా దొరకట్లేదట. ఎందుకంటే చాలా నగరంలోని హోటళ్లు రాబోయే వారం రోజులకు పూర్తిగా బుక్ చేసుకున్నట్లు సమాచారం. హోటల్ యజమానుల ప్రకారం.. వరద ప్రభావం అధికంగా ఉండడంతో చాలా మంది ముందుగానే గదులను బుక్ చేసుకున్నారు. వరద నీరు తగ్గినప్పటికీ కూడా వారి ఇళ్లను శుభ్రం చేసుకోవడంతో పరిసరాల్లోని వ్యర్థాలను తొలగించేందుకు చాలా సమయం పడుతుందని.. దీంతో హోటల్లో రమ్‌లు దొరకట్లేదని అంటున్నారు. ఇంకా ఐదు రోజులు ఇంతే.. మరో వైపు నగరవాసులకు మరింత ఆందోళన కలిగిస్తూ వాతావరణ శాఖ (IMD) బెంగళూరులో రాబోయే ఐదు రోజుల పాటు నిరంతర వర్షాలు కురుస్తాయని అంచనా వేసింది. ఏజెన్సీ బుధవారం ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. వర్షాభావ ప్రాంతాల్లో గ్రౌండ్ ఫ్లోర్లో నివసించే వారు ఇతర ప్రాంతాలకు మారాల్సి వస్తోంది. మొదటి అంతస్తు, పై అంతస్తులో నివసించే ప్రజలు అత్యవసర పరిస్థితుల్లో ట్రాక్టర్లు, పడవలపై రాకపోకలు సాగించాల్సి వస్తోంది. రానున్న రోజుల్లో మరిన్ని వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పరిస్థితి తీవ్రంగా మారే అవకాశం ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం, భారీ వర్షం కారణంగా బెంగళూరులోని 85 ప్రాంతాలు 2,000 ఇళ్లు జలమయమయ్యాయి. చదవండి: ఉద్యోగులకు అలర్ట్.. టాక్స్ బెనిఫిట్స్ పొందాలంటే ఈ బిల్లులు ఉండాల్సిందే! -
భారత్-ఇంగ్లండ్ జట్లకు రూమ్ తిప్పలు!
ముంబై:గత రెండు రోజుల క్రితం తొలి వన్డే మ్యాచ్‌ను పూర్తి చేసుకుని రెండో మ్యాచ్‌కు సిద్ధమవుతున్న భారత్-ఇంగ్లండ్ జట్లు ఇప్పుడు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒక మ్యాచ్ ముగిసిన తరువాత తదుపరి మ్యాచ్‌లు వెళ్లడానికి జాతీయ జట్లుకు సాధారణంగా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. అయితే గురువారం కటక్‌లో జరిగే రెండో వన్డేకు ముందు ఇరు జట్లకు రూమ్ తిప్పులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కటక్‌లో హోటల్ రూమ్స్ లేకపోవడంతో భారత్-ఇంగ్లండ్ జట్లు అక్కడకు ఇంకా చేరలేదు. వివాహ కార్యక్రమాల్లో భాగంగా మొత్తం హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయిన నేపథ్యంలో ఇరు క్రికెట్ జట్లు ఇంకా పుణెలోనే బస చేస్తున్నాయి. హోటల్ రూమ్స్ బుధవారం నాటికి మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇరు జట్లు మంగళవారం సాయంత్రం వరకూ పుణెలో ఉండనున్నట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అషిర్బాద్ బెహెరా తెలిపారు. 'తొలి వన్డే తరువాత కటక్‌లో జరిగే రెండో వన్డే విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఎటువంటి సాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇప్పుడు జరిగింది. హోటల్ రూమ్స్ అందుబాటులో లేవు. హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటేనే మేము వాటిని బుక్ చేసే అవకాశం ఉంది. మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు వరకూ హోటల్ రూమ్స్ లేవు.అందుచేత భారత్-ఇంగ్లండ్ జట్లు ఆలస్యంగా కటక్ చేరుకోనున్నాయి'అని బెహెరా పేర్కొన్నారు. -
గంట గంటకు అద్దె
సాక్షి, అమరావతి : పుష్కరాలకు వచ్చే భక్తులకు సాధ్యమైనంత వరకూ వసతి సౌకర్యాలు కల్పించడానికి హోటళ్లు సిద్ధమయ్యాయి. ప్రస్తుతం అమల్లో ఉన్న 24 గంటల చెక్ అవుట్ స్థానంలో గంటల రూపంలో అద్దె వసూలు చేయడానికి హోటల్స్ రంగం సిద్ధం చేసుకుంటున్నాయి. గోదావరి పుష్కరాల సమయంలో 12 గంటల చెక్ అవుట్‌కు జీవో ఇచ్చినట్టుగానే కృష్ణా పుష్కరాలకు కూడా కల్పించాలని హోటల్స్ అసోసియేషన్స్ ప్రభుత్వాన్ని కోరాయి. దీనిపై ఎటువంటి జీవో జారీ చేయకుండానే అమలు చేయడానికి ప్రభుత్వం మౌఖిక ఆదేశాలు జారీ చేసినట్లు అసోసియేషన్ ప్రతినిధులు చెబుతున్నారు. ప్రభుత్వం కూడా 20 శాతం మించి గదులు తీసుకోమని చెప్పడంతో సామాన్యులకు సాధ్యమైనన్ని గదులు అందుబాటులో ఉంటాయంటున్నారు. కేవలం 12 గంటల చెక్ అవుటే కాకుండా అవసరమైతే గంటల ప్రకారం అద్దె వసూలుచేసే ఆలోచన చేస్తున్నట్లు ప్రముఖ స్టార్ హోటల్ అధినేత చెప్పడం విశేషం. ఉన్న సమయాన్ని బట్టీ రోజువారీ టారీఫ్‌లో 20 నుంచి 40 శాతం డిస్కౌంట్ ఇవ్వనున్నట్లు తెలిపారు. తక్కువ సమయం ఉన్న వారికి గరిష్టంగా డిస్కౌంట్ అందిస్తామని, దీనివల్ల గదులు తొందరగా ఖాళీ అయ్యి మరొకరికి అవకాశం ఉంటుందని తెలిపారు. వచ్చే భక్తుల్లో చాలామంది పవిత్ర స్నానంచేసి వెళ్లిపోవడానికే చూస్తారని, అందుకే గంటల ప్రకారం అద్దె వసూలు చేయడం ద్వారా ఇద్దరికీ ప్రయోజనం చేకూరుతుందని చెప్పారు. విజయవాడలో సుమారు 1,700 గదులు ఉండగా, ఇందులో 20 శాతం ప్రభుత్వానికి కేటాయిస్తున్నారు. ఈ గదులకు అద్దెలను వెంటనే చెల్లిస్తామని ప్రభుత్వం హామీ ఇవ్వడం విశేషం. -
గది..గగనమే !
సాక్షి, అమరావతి : కృష్ణా పుష్కరాలకు వచ్చే భక్తులు విడిది చేయడానికి హోటల్ గదులు దొరికే అవకాశాలు కనిపించడం లేదు. విజయవాడలో ఉన్న హోటల్ గదుల్లో అధిక శాతం ప్రభుత్వమే బుక్ చేసుకోనుండడంతో సామాన్యులకు గదులు దొరకని పరిస్థితి కనపడుతోంది. ప్రభుత్వ కార్యాలయాలు ఇక్కడికి తరలి రావడంతో చాలా గదులలో ఇప్పటికే అధికారులు, మంత్రులు ఉంటున్నారు. పుష్కరాల నిర్వహణకు ప్రభుత్వం 60 వేల మంది ఉద్యోగులకు బాధ్యతలను అప్పచెప్పింది. ఇవి కాకుండా ప్రొటోకాల్ అధికారులు, జాతీయ అంతర్జాతీయ మీడియా ప్రతినిధులకు అదనపు గదులను కేటాయించాల్సి వస్తోంది. నగరంలో ఉన్న ఫోర్ స్టార్ హోటళ్లలో అత్యధిక శాతం ప్రభుత్వమే తీసుకోనున్నట్లు తెలుస్తోంది. త్రీస్టార్తో పాటు మిగిలిన లాడ్జీల్లో 30 నుంచి 40 శాతం గదులను ప్రభుత్వం తీసుకునే అవకాశం ఉందని హోటల్ ఓనర్స్ అంచనా వేస్తున్నారు. గోదావరి పుష్కరాల్లో 30 శాతం గదులు... గోదావరి పుష్కరాల సమయంలో రాజమండ్రిలోని హోటళ్లలో 30 శాతం గదులను ప్రభుత్వం తీసుకుందని, ఇప్పుడు కూడా అదే స్థాయిలో తీసుకునే అవకాశాలున్నాయని విజయవాడ హోటల్ ఓనర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు ఐలాపురం రాజా అన్నారు. నగరంలో మొత్తం 200 హోటళ్లు ఉండగా అందులో మూడు ఫోర్ స్టార్, 8 త్రీస్టార్ హోటళ్లు ఉన్నాయి. అన్ని హోటళ్లలో కలిపి సుమారు 1,700 గదులు అందుబాటులో ఉన్నాయి. వీటిలో ప్రభుత్వం తీసుకోగా కనీసం వెయ్యి గదులు కూడా మిగలని పరిస్థితి కనిపిస్తోంది. పుష్కర విధుల్లో ఉన్న ఉద్యోగస్తుల్లో చాలామందికి కళాశాలలు, కళ్యాణ మండపాల్లో వసతి ఏర్పాట్లు చేస్తున్నా, ఉన్నతాధికారులు, వచ్చే ముఖ్య అతిథుల కోసం ప్రభుత్వం పెద్ద ఎత్తున గదులను కావాలని కోరుతోంది. గదుల కొరతను తీర్చడానికి 12 గంటల చెక్ ఔట్ సదుపాయం కల్పించాలని హోటల్ ఓనర్స్ అసోసియేషన్ ప్రభుత్వాన్ని కోరుతోంది. గోదావరి పుష్కరాలకు ఇదే విధంగా 12 గంటల చెక్ ఔట్ సౌకర్యాన్ని కల్పిస్తూ జీవో జారీ చేశారని, అదే విధానాన్ని ఇక్కడా అమలు చేయాలని కోరుతున్నట్లు రాజా తెలిపారు. ఈ సూచనపై ప్రభుత్వం సాను కూలంగా స్పందించి రెండు రోజుల్లో నిర్ణయం తీసుకుంటామని హామీ ఇచ్చిందన్నారు. దీని వల్ల తక్కువగా ఉన్న గదులను గరిష్ట స్థాయిలో వినియోగించుకునే వెసులుబాటుతో పాటు భక్తులకు ఆర్థికంగా కలిసొస్తుందన్నారు. ధరలు పెంచం.. డిమాండ్ ఉందని గదుల అద్దెలు పెంచే ఆలోచన లేదని ఓనర్స్ అసోసియేషన్ స్పష్టం చేసింది. ప్రభుత్వానికి ఇవ్వగా మిగిలిన వాటిని సాధారణ రేట్లకే ఇస్తామని ఫార్చున్ మురళీ హోటల్ అధినేత ఎం.మురళీ కృష్ణ తెలిపారు. ఎవరూ అద్దెలు పెంచే ఆలోచనలో లేరని స్పష్టం చేశారు. అయితే వాస్తవ పరిస్థితులు దీనికి భిన్నంగా కనిపిస్తున్నాయి. తాము తీసుకునే గదులపై సాధ్యమైనంత డిస్కౌంట్ ఇవ్వాల్సిందిగా ప్రభుత్వం కోరుతోంది. ఇలా ప్రభుత్వానికి ఇచ్చిన డిస్కౌంట్‌ను అద్దెలు పెంచడం ద్వారా సాధారణ భక్తులను నుంచి వసూలు చేయడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇంకా ప్రభుత్వ విధానం స్పష్టం కాకపోవడంతో అడ్వాన్స్ బుకింగ్స్ మొదలు పెట్టలేదని హోటల్ ప్రతినిధులు పేర్కొన్నారు. విజయవాడలో మొత్తం హోటళ్లు, లాడ్జీల సంఖ్య – 200 ఫోర్స్టార్ హోటళ్లు–3 (తాజ్ గేట్‌వే, డీవీ మానర్, ఫార్చూన్ మురళీ) త్రీస్టార్ హోటళ్ల సంఖ్య 8 అందుబాటులో ఉన్న మొత్తం గదులు 1,700 ఫోర్ స్టార్ హోటల్లో అద్దె రూ. 4,000 – 6,000 (24 గంటలు) త్రీ స్టార్ హోటల్లోæ అద్దె రూ. 2,000 3,000 లాడ్జీలు రూ. 500 1,500 -
పెళ్లి కాని జంటల కోసం..
పెళ్లయిపోయిన వాళ్ల మాట ఏమోగానీ.. పెళ్లికాని ప్రేమికులు ఎక్కడికైనా వెళ్లి సరదాగా గడపాలంటే చాలా కష్టం. వాళ్లకు గదులు దొరకవు. ఒకవేళ ఏదైనా హోటల్లో గది తీసుకుందామన్నా పోలీసులతో ఇబ్బందే. ఈ సమస్యను గుర్తించిన బిట్స్ పిలానీ మాజీ విద్యార్థి సంచిత్ సేథి ఓ పరిష్కారం కనుగొన్నాడు. దేశవ్యాప్తంగా ఉన్న హోటళ్లతో అనుసంధానం అయ్యేలా 'స్టే అంకుల్' అనే కొత్త స్టార్టప్ కంపెనీ ప్రారంభించాడు. ఈ హోటళ్లలో పెళ్లికాని జంటలు కూడా ఎంచక్కా గడపొచ్చు. వెబ్సైట్లో ఉన్న జాబితాలో ఉండే హోటళ్లలో 10-12 గంటల పాటు గడపొచ్చు. కావాలనుకుంటే ఉదయం 10 నుంచి సాయంత్రం 7 వరకు లేదా, రాత్రి 9 నుంచి ఉదయం 8 వరకు ఉండొచ్చు. ఇందుకు అద్దె రూ. 2వేల నుంచి రూ. 6వేల వరకు ఉంటుంది. ఈ వెబ్సైట్ ప్రారంభించిన కొత్తలో పర్యాటకులు ఎక్కువగా వస్తారని అనుకున్నారు. కానీ పెళ్లికాని జంటల నుంచి పదేపదే తమకు హోటల్ గదులు కావాలని రిక్వెస్టులు రావడంతో అటుదిశగా చర్యలు ప్రారంభించారు. నిజానికి భారతదేశంలో చట్టాల ప్రకారం పెళ్లికాని జంటలు గది అద్దెకు తీసుకోకూడదని ఎక్కడా లేదని, ప్రభుత్వ గుర్తింపు కార్డు ఉంటే ఎలాంటి ఇబ్బంది లేకుండా గది అద్దెకు తీసుకోవచ్చని సంచిత్ సేథి చెప్పారు. కొన్ని హోటళ్ల వారు ఇందుకోసం ముందుకొచ్చినా, బహిరంగంగా చెప్పలేకపోతున్నారని, ఈ ఆలోచనా ధోరణిని మార్చాలన్నదే తన ప్రయత్నమని అన్నారు. తమ జాబితాలో ఉన్నవాటిలో చాలావరకు ప్రముఖ ప్రైవేటు హోటళ్లేనని చెప్పారు. -
సార్లొస్తున్నారు..రూములు బుక్ చేయండి
నగరపాలక సంస్థ అధికారులకు ఇన్చార్జి సబ్ కలెక్టర్ సూచన ఒక్కో హోటల్లో 15 గదుల కేటాయింపు నగరంలో చెత్త సమస్య తలెత్తకుండా చర్యలు కార్పొరేషన్, న్యూస్‌లైన్ : వీఐపీలొస్తున్నారు... నగరాన్ని శుభ్రంగా ఉంచండి... హోటల్ రూమ్స్ బుక్ చేయండి అంటూ ఇన్చార్జి సబ్ కలెక్టర్ రమేష్ కుమార్ నుంచి నగరపాలక సంస్థ అధికారులకు ఆదేశాలు అందాయి. చీఫ్ మెడికల్ ఆఫీసర్ పి.రత్నావళి శుక్రవారం నుంచి ఆదిశగా ఏర్పాట్లు చేస్తున్నారు. నగరం సుమా రు 20 వరకు ప్రముఖ హోటళ్ళు ఉన్నాయి. ఒక్కో హోటల్లో 15 రూంలు వీఐపీలకు జూన్ 6 నుంచి 8 వరకు కేటాయించాల్సిందిగా సీఎంహెచ్ఓ హోటల్ యజమానులకు ఆదేశాలు జారీ చేశారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీ క్యాంపస్ సమీపంలోని స్థలంలో జూన్ 8న రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు ప్రమాణ స్వీకారోత్సవం చేయనున్న విషయం విదితమే. ఈక్రమంలో రెండు రోజుల ముందుగానే వీఐపీలు నగరానికి చేరుకొనే అవకాశం ఉంది. రెవెన్యూ, నగరపాలక సంస్థ అధికారులు ఆదిశగా ఏర్పాట్లను ముమ్మరం చేశారు. పారిశుద్ధ్యంపై ప్రత్యేక దృష్టి ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారోత్సవాన్ని పురస్కరించుకొని ఉన్నతాధికారులు రెండు రోజుల పాటు నగరంలో ఉండే అవకాశం ఉన్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ రెండు రోజులు నగరంలో చెత్త సమస్య ఉత్పన్నం కాకుండా జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కమిషనర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ రత్నావళిని ఆదేశించారు. ప్రణాళికను రూపొందించుకోవాలని, లోటుపాట్లకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సీఎంహెచ్ఓకు సూచించారు. ఈమేరకు ఆమె యాక్షన్ ప్లాన్ రూపొందిస్తున్నారు.