సాక్షి, హైదరాబాద్: గోడలకు చెవులుంటాయ న్నది పాత సామెత. కానీ గోడ లకు కళ్లు కూడా ఉంటాయన్న చందంగా నేటి పరిస్థితులు మారుతున్నా యి. తమిళనాడు తిరు కొవి లూర్ లోని ఓ టెక్స్ టైల్ దుకాణంలో ఇటీ వల ట్రయల్ రూంలో దాచిన సెల్‌ఫోన్ ద్వారా యువతులు దుస్తులు మార్చు కొనే వీడి యోలను కొందరు గలీజుగాళ్లు రికార్డు చేయడం తెలిసిందే. ఇలా ఎక్కడో ఒక చోట ఈ తరహా ఘటనలు బయట పడుతూనే ఉన్నా యి. ఈ నేపథ్యంలో ట్రయల్ రూంలకు వెళ్లిన ప్పుడు లేదా హోటళ్లలో బస చేసిన ప్పుడు మహిళలు కొన్ని జాగ్రత్తలు తప్పని సరిగా తీసుకోవాలని పోలీ సులు సూచిస్తున్నారు.
►నచ్చిన దుస్తులు సరిపోయాయో లేదో తెలుసుకోవాలంటే వినియోగదారులు ట్రయల్ రూంలకు వెళ్లక తప్పదు. అదేవిధంగా విహారయాత్రలు, ఆఫీస్ పనులపై ఇతర ప్రాంతాలకు వెళ్లినప్పుడు హోటళ్లలో బస చేయడమూ అనివార్యమే. అక్కడ వాష్‌రూంలను వాడకుండా ఉండలేం. ఇదే అవకాశంగా చేసుకొని కొందరు సిబ్బంది రహస్య కెమెరాలు పెట్టి మహిళల వీడియోలను తీసే దుర్మార్గాలకు ఒడిగడుతున్నారు. హోటళ్లు, దుకాణ యజమానులకు తెలియకుండానే కొందరు సిబ్బంది ఇలాంటి అనైతిక పనులకు పాల్పడుతుండటం యాజమాన్యాలకు తలనొప్పులు తెచ్చిపెడుతోంది.
ఇలా చేస్తే ముప్పు తప్పుతుంది..
► వస్త్రాల కొనుగోలు కోసం మాల్స్‌కు వెళ్లిన ప్పుడు ట్రయల్ రూంకు వెళ్లాల్సి వచ్చినా లేదా హోటళ్లలో వాష్‌రూంలు వాడాల్సి వచ్చినా అక్కడి పరిస్థితులను నిశితంగా పరిశీలించాలి. ఏమాత్రం అనుమానాస్పద వస్తువులు కనిపించినా వెంటనే బయటకు వచ్చేయాలి.
► సెల్‌ఫోన్ టార్చ్ వేస్తూ చూస్తే రహస్య కెమెరాలు ఉండి ఉంటే వాటి లెన్స్‌పై టార్చ్‌పడి రిప్లెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. ఇలా కూడా రహస్య కెమెరాల ప్రమాదం నుంచి బయటపడొచ్చు.
► హోటల్ గదుల్లో బస చేయాల్సి వచ్చినప్పుడు ముఖ్యంగా రాత్రివేళ్లలో నిద్రించాలంటే ముందుగా సీలింగ్ ఫ్యాన్ ఉన్న గదుల్లో లైట్లు ఆర్పి సెల్‌ఫోన్ టార్చ్ వేసి చూడాలి. రెడ్‌లైట్ బ్లింక్ అవుతున్నట్లు గమనిస్తే దాన్ని హిడెన్ కెమెరాగా అనుమానించాలి.
► ట్రయల్ రూంలు, హోటల్ రూంలకు ఉన్న తలుపులకు ఏవైనా అనుమానాస్పద రంద్రాలు ఉన్నట్లు గుర్తించినా.. అందులో ఏవైనా వస్తువులు ఉన్నట్లు గమనించినా వెంటనే యాజమాన్యానికి ఫిర్యాదు చేయాలి.
► ట్రయల్ రూంలు, వాష్ రూంలలో దుస్తులు తగిలించేందుకు ఉండే కర్టెన్ రాడ్స్ లేదా కొక్కాలకు కెమెరాలు పెట్టే అవకాశం ఉంటుంది. అలాంటివి ఉన్నాయో లేదో చూడాలి.
► ట్రయల్ రూంలలో, వాష్‌రూంలలో ఉండే అద్దాల వెనుక సైతం మనకు తెలియకుండా కెమెరా పెట్టి రికార్డ్ చేసే ప్రమాదం పొంచి ఉంటుంది. అందుకే మిర్రర్ ట్రిక్ వాడాలి. మీ వేలిని అద్దానికి తాకేలా పెడితే దాని ప్రతిబింబానికి మీ వేలికి దూరం ఉంటే అది నిజమైనది. ఆ వేలు ప్రతిబింబానికి ఆనితే అది రెండోవైపు నుంచి మనం కనిపించే అవకాశం ఉన్నట్లు అనుమానించాలి.
Comments
Please login to add a commentAdd a comment