హైదరాబాద్‌ పబ్‌ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి.. | Pub Owners New Scam On Dating App With Girls In Hyderabad | Sakshi
Sakshi News home page

హైదరాబాద్‌ పబ్‌ల్లో కొత్త రకం మోసం.. వ్యాపారవేత్తను బుట్టలోకి దింపి..

Published Fri, Jun 7 2024 9:51 AM | Last Updated on Fri, Jun 7 2024 10:05 AM

Pub Owners New Scam On Dating App With Girls In Hyderabad

సాక్షి, హైదరాబాద్‌: నగరంలో కొత్త రకం మోసం వెలుగు చూసింది. కొంతమంది పబ్‌ యజమానులు.. అమ్మాయిలతో కలిసి డేటింగ్‌ యాప్‌లో కొత్త మోసానికి తెరతీశారు. పబ్ యజమానులు, అమ్మాయిలు.. వ్యాపారవేత్తలను బుట్టలో వేసుకొని డబ్బులు కొట్టేస్తున్నారు.

ఒక వ్యాపారవేత్తకు రితికా అనే యువతి పరిచయం కాగా, పరిచయం అయిన మరుసటి రోజే కలుద్దామని చెప్పి హై టెక్ సిటీ మెట్రో స్టేషన్ వద్దకి రమ్మంది. మరుసటి రోజు ఇద్దరు మెట్రో స్టేషన్ వద్ద చేరుకున్నారు. వ్యాపారవేత్తను పబ్‌లోకి తీసుకెళ్లి తియ్యని మాటలు చెప్పి గంట లోపల ఖరీదైన  మద్యం ఆర్డర్ చేసి తాగింది. రూ. 40,505 రూపాయిలు బిల్‌ను చేతిలో పెట్టి రితిక జారుకుంది. బిల్లును చూసి ఆ వ్యాపారవేత్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. 45 వేల రూపాయల మద్యం తాగిన రితిక తూలకుండా బయటికి వెళ్లిపోవడంతో విస్మయం చెందిన వ్యాపార వేత్త.. పబ్బు యజమానులు మద్యం పేరుతో కోక్ ని అమ్మాయికి ఇచ్చి ఉంటారని అనుమానిస్తున్నాడు.

పబ్‌ వాళ్లే అమ్మాయిలతో కలిసి ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారని గుర్తించారు. ఇలాగే ఆ యువతి, పబ్ యాజమానుల చేతిలో చాలా మంది మోసపోయి పోయినట్లు తేలింది. రెండు రోజుల పరిధిలోని ఈ పబ్బులో ఇలాంటి మోసాలు జరిగినట్లు గుర్తించారు. తనకు జరిగిన మోసంపైన సోషల్ మీడియాలో ఆధారాలతో సహా వ్యాపారవేత్త బయటపెట్టాడు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement