న్యూఢిల్లీ: ఈ ఏడాది చిన్న పట్టణాల్లో హోటల్ గదుల బుకింగ్‌లు ఎక్కువగా ఉన్నట్టు ఓయో తెలిపింది. హోటల్ బుకింగ్ సేవలను అందించే ఈ సంస్థ ఈ ఏడాదికి సంబంధించి గణాంకాలు విడుదల చేసింది. తెనాలి, హాత్రాస్, ససారామ్, కరైకుడి తదితర పట్టణాల్లో క్రితం ఏడాదితో పోల్చినప్పుడు ఈ ఏడాది ఎక్కువ బుకింగ్‌లు చూసినట్టు తెలిపింది.
వ్యాపార పర్యటనలకు సంబంధించి బుకింగ్‌ల్లో హైదరాబాద్, ఢిల్లీ, బెంగళూరు, కోల్‌కతా, చెన్నై అగ్రస్థానాల్లో ఉన్నాయి. జూన్ 4న అత్యధిక బుకింగ్‌లు ఓయో ప్లాట్‌ఫామ్ ద్వారా నమోదయ్యాయి. భక్తులు ఎక్కువగా బుకింగ్ చేసుకున్న కేంద్రంగా వారణాసి నిలిచింది. తిరుపతి, పూరి, అమృత్‌సర్, హరిద్వార్ బుకింగ్‌ల పరంగా తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. అంతర్జాతీయంగా చూస్తే యూరప్‌లో లగ్జెంబర్గ్ ప్రావిన్స్ ఎక్కువ మంది పర్యాటకులకు ఇష్టమైన కేంద్రంగా నిలిచింది. ఓయో ప్లాట్‌ఫామ్‌పై ఎక్కువ మంది ఇక్కడకు బుక్ చేసుకున్నారు. అమెరికాలో టెక్సాస్‌ను ఎక్కువ మంది సందర్శించారు. బ్రిటన్‌కు సంబంధించి లండన్, ప్లైమౌత్, మిడిల్స్‌బ్రో, లీచెస్టర్, బ్రైటాన్ పర్యాటకులకు ఇష్టమైన ప్రదేశాలుగా ఉన్నాయి.
చదవండి: జియో..షావోమీ స్మార్ట్ ఫోన్ వినియోగదారులకు అదిరిపోయే శుభవార్త!
Comments
Please login to add a commentAdd a comment