భారత్-ఇంగ్లండ్ జట్లకు రూమ్ తిప్పలు!
ముంబై:గత రెండు రోజుల క్రితం తొలి వన్డే మ్యాచ్ను పూర్తి చేసుకుని రెండో మ్యాచ్కు సిద్ధమవుతున్న భారత్-ఇంగ్లండ్ జట్లు ఇప్పుడు వింత పరిస్థితిని ఎదుర్కొంటున్నాయి. ఒక మ్యాచ్ ముగిసిన తరువాత తదుపరి మ్యాచ్లు వెళ్లడానికి జాతీయ జట్లుకు సాధారణంగా ఎటువంటి ఇబ్బందులు ఏర్పడవు. అయితే గురువారం కటక్లో జరిగే రెండో వన్డేకు ముందు ఇరు జట్లకు రూమ్ తిప్పులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం కటక్లో హోటల్ రూమ్స్ లేకపోవడంతో భారత్-ఇంగ్లండ్ జట్లు అక్కడకు ఇంకా చేరలేదు. వివాహ కార్యక్రమాల్లో భాగంగా మొత్తం హోటల్ రూమ్స్ అన్ని బుక్ అయిన నేపథ్యంలో ఇరు క్రికెట్ జట్లు ఇంకా పుణెలోనే బస చేస్తున్నాయి. హోటల్ రూమ్స్ బుధవారం నాటికి మాత్రమే అందుబాటులో ఉండటంతో ఇరు జట్లు మంగళవారం సాయంత్రం వరకూ పుణెలో ఉండనున్నట్లు ఒడిశా క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ అషిర్బాద్ బెహెరా తెలిపారు.
'తొలి వన్డే తరువాత కటక్లో జరిగే రెండో వన్డే విజయవంతమవుతుందని ఆశిస్తున్నాం. కొన్ని సందర్భాల్లో ఎటువంటి సాయం చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. అది ఇప్పుడు జరిగింది. హోటల్ రూమ్స్ అందుబాటులో లేవు. హోటల్ రూమ్స్ అందుబాటులో ఉంటేనే మేము వాటిని బుక్ చేసే అవకాశం ఉంది. మ్యాచ్ మొదలయ్యే ముందు రోజు వరకూ హోటల్ రూమ్స్ లేవు.అందుచేత భారత్-ఇంగ్లండ్ జట్లు ఆలస్యంగా కటక్ చేరుకోనున్నాయి'అని బెహెరా పేర్కొన్నారు.