high rates
-
చింత చిగురు.. నోరూరు
కైకలూరు: పచ్చబంగారంలా చిటారు కొమ్మన మిలమిల మెరిసే చింత చిగురును తింటే ఆరోగ్యంపై చింత అవసరం లేదంటారు పెద్దలు. నోటికి పుల్లడి రు చి ఇస్తూనే.. తినేకొ ద్దీ తినాలపిస్తుంది. చింత చిగురుకు కొ ల్లేరు రొయ్యలు, చేపలకు దట్టిస్తే.. ఇక భోజన ప్రియులకు పండగే. పులుపులో చింత చిగురుకు మరీ డిమాండ్. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాల్లో చిగురుతో వండిన చేప, రొయ్య, కోడి, వేట వంటి మాంసాహార కూరలను అందరూ లొట్టలేసుకోవాల్సిందే. ఈ సీజన్లో లేలేత చింత చిగురు అందుబాటులోకి వచ్చింది. పల్లెటూర్ల నుంచి మహిళలు చింత చిగురును తీసుకువచ్చి పట్టణాల్లో విక్రయిస్తున్నారు. చింత చిగురులో పలు పోషకాహారాలు మెండుగా ఉండటంతో అధిక ధర పలుకుతున్నా దీనికి డిమాండ్ బాగుంది. ఇదే సీజన్లో.. చైత్రమాసం దాటిన వెంటనే చింత చెట్లకు చిగురు అందుబాటులోకి వస్తోంది. ఉమ్మడి పశి్చమగోదావరి జిల్లాలో బుట్టయగూడెం, నూజివీడు, పాలకొల్లు, నరసాపురం, కైకలూరు, నూజివీడు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, దెందులూరు, చింతలపూడి నియోజకవర్గాల్లో చింత చిగురు అందుబాటులో ఉంది. కైకలూరు నియోజకవర్గంలో గోపాలపురం, వెంకటాపురం, పరసావానిపాలెం, చిగురుకోట, వడాలి గ్రామాల నుంచి చింత చిగురును తీసుకొచ్చి కైకలూరు పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నారు. ధర విషయానికి వస్తే 100 గ్రాములు రూ.100కి విక్రయిస్తున్నారు. ఇతర ప్రాంతాలకు ఆర్డర్లను బట్టి సరఫరా చేస్తున్నారు. చెట్లు తగ్గిపోవడంతో గతంలో కంటే చిగురు ఎక్కువగా లభించడం లేదని గోపాలపురం గ్రామానికి చెందిన విక్రయ మహిళ వాకాని శకుంతల ‘సాక్షి’కి తెలిపారు. ఆహా ఏమి రుచి.. శాకాహార, మాంసాహార కూరలకు చింత చిగురును దట్టిస్తే ఆ రుచే వేరుగా ఉంటుంది. కొల్లేరు పరిసర ప్రాంతాల్లో చింత చిగురుతో చేసిన వంటకాలు ప్రత్యేక డిష్‌గా గుర్తింపు పొందుతున్నాయి. శాకాహార, మాంసాహారాల్లో పలురకాలుగా చింత చిగురుతో వంటకాలు చేస్తారు. పోషకాల గని చింత చిగురులో ఆరోగ్యానికి అవసరమైన పోషకాలు ఉన్నాయి. 100 గ్రాముల చిగురులో 5.8 గ్రాముల ప్రొటీన్లు, 10.06 గ్రాముల పీచు పదార్థం, 100 మిల్లీగ్రాముల కాల్షియం, 140 మిల్లీగ్రాముల పాస్ఫరస్, 26 మిల్లీగ్రాముల మెగ్నీíÙయం, విటమిన్ ‘సి’ 3 మిల్లీ గ్రాములు ఉంటాయి. ఇండియన్ జర్నల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా చింత చిగురుతో అనేక ప్రయోజనాలు ఉన్నా యని ప్రకటించింది. ఉపయోగాలివీ.. 👉 చింత చిగురులో ఉన్న ఫినాల్స్, యాంటీ ఆక్సిడెంట్లు చెడు కొలెస్టరాల్‌ను తగ్గించి, మంచి కొలెస్టరాల్‌ను పెంచుతాయి. 👉 శరీరంలో ఎర్రరక్త కణాల ఉత్పత్తికి అవసరమైన పోషకాలను అందించి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది. 👉యాంటీ ఇన్ఫల్మేటరీ గుణాలు ఉన్నాయి. చిగురును ఉడికించి నీటిని పుక్కిలిస్తే గొంతు నొప్పి, మంట, వాపు, నోటి పూత తగ్గుతాయి. 👉 చింత చిగురులో డైటరీ ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. 👉మలబద్ధకం సమస్య తొలగిపోతుంది. 👉పైల్స్ నివారణకు ఉపయోగపడుతుంది. 👉 వైరల్ ఇన్ఫెక్షన్లతో వచ్చే జ్వరాన్ని తగ్గిస్తుంది. 👉గుండె జబ్బులు రాకుండా చూస్తుంది. 👉నులి పురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింత చిగురు ఔషధంగా పనిచేస్తుంది. 👉జీర్ణాశయ సంబంధ సమస్యలను తగ్గిస్తుంది. 👉విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్లు సమృద్ధిగా ఉండటంతో రోగ నిరోధక శక్తిగా పనిచేస్తుంది. 👉ఎముకుల దృఢత్వం, థైరాయిడ్ నివారణకు దోహదపడుతుంది. 👉షుగర్ వ్యాధిగ్రస్తుల్లో చక్కెర స్థాయిలను తగ్గిస్తుంది. 👉కీళ్ల వాపుల నివారణ, మలేరియా నుంచి ఉపశమనాన్ని కలిగిస్తుంది. 👉 తల్లిపాలను మెరుగుపరుస్తుంది.100 గ్రాములు రూ.100 చింత చెట్లు పూర్వం రహదారుల వెంబడి కనిపించేవి. ఏటా జూన్, జూలై నెలల్లో ఎక్కువగా చింత చిగురును విక్రయించేవాళ్లం. ఇప్పుడు రోడ్లు వెడల్పు చేయడంతో చాలా చెట్లను తొలగించారు. కొన్నిచోట్ల మాత్రమే చింత చెట్లు కనిపిస్తున్నాయి. పలువురు వైద్యం కోసం అని చెప్పి మా వద్ద చింత చిగురు కొంటున్నారు. ప్రస్తుతం 100 గ్రాముల చిగురును రూ.100 ధరకు విక్రయిస్తున్నాం. –వి.మంగమ్మ, ఆకుకూరల విక్రయదారు, గోపాలపురంచింత చెట్లను పెంచాలి చింత చెట్లను తొలగించిన ప్రాంతాల్లో మరో చెట్టును నాటాలి. పట్టణీకరణతో చాలా చెట్లు తొలగిస్తున్నారు. ఆకుకూరలకు కలిదిండి మండలం గోపాలపురం గ్రామం పేరు. మా కుటుంబం చింత చిగురును విక్రయిస్తోంది. చిగురును సేకరించడం అంతు సులువైన పనికాదు. చింత చెట్లను పెంచే విధంగా అందరికి అవగాహన కలిగించాలి. చింత చిగురుతో లాభాలెన్నో ఉన్నాయి. – వాకాని నాగ సుబ్రహ్మణ్యం, ఉప సర్పంచ్, గోపాలపురం -
దాయాదుల సమరం.. ఆసుపత్రి బెడ్లను కూడా వదలడం లేదు!
అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు ఐసీసీ వన్డే వరల్డ్‌కప్ జరగనున్న సంగతి తెలిసిందే. ఈ మెగాటోర్నీకి టీమిండియా ఆతిథ్యం ఇస్తుంది. పుష్కర కాలం తర్వాత టీమిండియా గడ్డపై జరుగుతున్న టోర్నీ కావడంతో రోహిత్ సేనపై మంచి అంచనాలు నెలకొన్నాయి. 2011లో వరల్డ్‌కప్ గెలిచిన ధోని సేన మ్యాజిక్‌ను రోహిత్ బృందం రిపీట్ చేస్తుందేమో చూడాలి. ఇక వరల్డ్‌కప్‌లో జరిగే మ్యాచ్‌ల సంగతి ఎలా ఉన్నా ఒక్క మ్యాచ్‌పై మాత్రం అందరి ఆసక్తి నెలకొంది. అదే ఇండియా, పాకిస్తాన్ మధ్య అక్టోబర్ 15న(ఆదివారం) అహ్మదాబాద్‌లోని నరేంద్రమోదీ స్టేడియంలో జరగనున్న లీగ్ మ్యాచ్. చిరకాల ప్రత్యర్థుల మధ్య మ్యాచ్ కావడంతో ఈసారి టీఆర్పీ రేటింగ్‌లు బద్దలవ్వడం ఖాయం. ఈ నేపథ్యంలో టీమిండియా, పాకిస్తాన్ మ్యాచ్ పురస్కరించుకొని అహ్మదాబాద్ ప్రాంతంలో అన్ని స్టార్ హోటల్స్‌కు ఫుల్ డిమాండ్ ఏర్పడింది. మ్యాచ్ చూడడం కోసం వచ్చే అభిమానులతో హోటల్ గదులన్నీ నిండిపోనున్నాయి. ఈ నేపథ్యంలో మ్యాచ్ కోసం ఎన్నో నెలల ముందుగానే అహ్మదాబాద్ లో హోటల్ రూమ్స్ బుకింగ్స్ చేసుకుంటున్నారు. ఇదే అదునుగా అక్కడి హోటల్ యజమాను ఏకంగా రోజుకు రూ.50 వేల వరకూ వసూలు చేస్తున్నారు. కొన్ని స్టార్ హోటల్స్ లో ఇది ఏకంగా రూ.లక్ష వరకూ ఉంది. అయినా వాటిలోనూ బుకింగ్స్ అన్నీ అయిపోయాయి. దీంతో అభిమానులు కొత్త ప్లాన్ వేశారు. నరేంద్ర మోదీ స్టేడియం దగ్గరలో ఉన్న హాస్పిటల్ బెడ్స్ కోసం కూడా ప్రయత్నిస్తున్నారు. ఒక రోజు వసతి కోసం అక్కడి హాస్పిటల్స్ ను కూడా ఫ్యాన్స్ వదలడం లేదు. ఇప్పటికే అలా తమకు ఎన్నో వినతులు వచ్చినట్లు స్టేడియం దగ్గర్లో ఉన్న హాస్పిటల్ యాజమాన్యాలు చెబుతున్నాయి. హెల్త్ చెకప్ కూడా.. ఈ హాస్పిటల్ బెడ్స్ కు కూడా ఆ ఒక్క రోజు వసతి కోసం రూ.3 వేల నుంచి రూ.25 వేల వరకూ డిమాండ్ చేస్తున్నారు. అందులోనే ఆహారంతోపాటు పూర్తి మెడికల్ చెకప్ లాంటి వసతులు కూడా ఇస్తున్నారు. దీంతో హోటల్ గదుల్లో వేలకువేలు పోసి రూమ్ తీసుకోవడం కంటే ఇలా చేయడం బెటరని చాలా మంది భావిస్తున్నారు. పేషెంట్ తోపాటు మరొకరు కూడా ఉండే అవకాశం ఉంటుంది. ఇలా చేయడం వల్ల తమ హెల్త్ చెకప్ పూర్తి కావడంతోపాటు ఒక రోజు వసతి కూడా కలుగుతుందన్నది చాలా మంది భావనగా కనిపిస్తోందని అక్కడి హాస్పిటల్స్ మెడికల్ డైరెక్టర్ నిఖిల్ లాలా చెప్పారు. ఆ అక్టోబర్ 15 సమయంలోనే తమకు 24 గంటల నుంచి 48 గంటల వసతి కోసం ఎన్నో వినతలు వస్తున్నట్లు పేర్కొన్నారు. ఇంగ్లండ్, కివీస్ మ్యాచ్‌తో మహాసంగ్రామం మొదలు.. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19 వరకు జరగనున్న మెగా సమరంలో మొత్తంగా 48 మ్యాచ్‌లు జరగనున్నాయి. కాగా లీగ్ మ్యాచ్‌లు పది వేదికల్లో జరగనుండగా.. మొదటి సెమీ ఫైనల్‌కు ముంబై, రెండో సెమీఫైనల్‌కు కోల్‌కతా.. ప్రతిష్టాత్మక ఫైనల్ మ్యాచ్‌కు అహ్మదాబాద్ వేదిక కానుంది. ఇక అక్టోబర్ 5న డిపెండింగ్ చాంపియన్ ఇంగ్లండ్, రన్నరప్ న్యూజిలాండ్ మధ్య మ్యాచ్‌తో మెగా సమరానికి తెర లేవనుంది. చదవండి: Ind Vs WI 2nd Test: ధోనిని అధిగమించిన రోహిత్.. సిక్సర్ల విషయంలోనూ రికార్డే -
కొండెక్కిన టమాట
-
జనగామ టు విజయవాడ
తెలంగాణ ఆపిల్‌గా పేరొందిన సీతాఫలం వ్యాపారం జిల్లాలో జోరుగా సాగుతోంది. రోజుకు రూ. రెండు లక్షలకు పైగానే అమ్మకాలు అవుతున్నాయి. ప్రస్తుతం ఉపాధి పనులు నిలిచిపోవడంతో కూలీలు, రైతుల కుటుంబ సభ్యులు అడవిబాట పడుతూ సీతాఫలాలనే నమ్ముకుంటున్నారు. ఒకప్పుడు గ్రామీణులకు అందుబాటులో ఉన్న పండు నేడు పక్క రాష్ట్రాలతో పాటు మహానగరాలకు తరలిపోతోంది. దీంతో సీతాఫలం తినాలనే కోరిక ఉన్నా ధరలను చూసిన సామాన్యులు బెంబేలెత్తిపోతున్నారు. సాక్షి, జనగామ: జనగామ, చేర్యాల, బచ్చన్నపేట, నర్మెట, తరిగొప్పుల, మద్దూరు, లింగాలఘనపురం, రఘునాథపల్లి, స్టేషన్‌ఘన్‌పూర్, దేవరుప్పుల తదితర మండలాల నుంచి పట్టణంలోని ఏరియా ఆస్పత్రి వద్ద ఉన్న మార్కెట్‌కు సీతాఫలాలను కూలీలు తీసుకొస్తున్నారు. నిత్యం జనగామ మార్కెట్లో రూ. రెండు లక్షలకు పైగా వ్యాపారం సాగుతుంది. జనగామ నుంచి హైదరాబాద్, మిర్యాలగూడ, కోదాడ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయవాడ, రాజ మండ్రి, విజయనగరం, ఒంగోలు, గుంటూరుతో పాటు ఢిల్లీ, ముంబయి రాష్ట్రాలకు సీతాఫల్ పండ్లను ఎగుమతి చేస్తున్నారు. విజయవాడకు భారీగా ఎగుమతి చేస్తున్నారు. మార్కెట్లో ఒక్కో గంపను రూ.150 నుంచి రూ.300 వరకు కొనుగోలు చేస్తున్న ఆంధ్రప్రాంతానికి చెందిన వ్యాపారులు చిన్న, పెద్ద సైజు పండ్లను వేరుచేసి ఎగుమతి చేస్తున్నారు. విజయవాడలో పెద్ద సైజులలో ఉన్న డజను పండ్లకు రూ.150 నుంచి రూ.200 వరకు విక్రయిస్తుంటే హైదరాబాద్‌లో రూ.150కి పైగా డిమాండ్ ఉంది. రోజుకు పది వాహనాలు.. జనగామ నుంచి ప్రతీ రోజు పది వాహనాలకుపైగా సీతాఫల్ పండ్లను విజయవాడ కేంద్రంగా తరలిస్తున్నారు. ఆంధ్రప్రాంతానికి చెందిన ఏజెంట్లు జనగామలోనే మకాం వేసి రోజువారీగా కొనుగోలు చేస్తున్నారు. ఉదయం ఎనిమిది గంటల నుంచి ప్రారంభమయ్యే సీతాఫల్ మార్కెట్లో రాత్రి వరకు క్రయ, విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలోనే అనేక గ్రామాల్లో రోజువారి కూలీలతో పాటు రైతులు, యువకులు, అన్ని వర్గాల వారు కుటుంబ సమేతంగా తెల్లవారు జాము నాలుగు గంటలకే అడవికి వెళ్లి సీతాఫల్ పండ్లను సేకరిస్తున్నారు. నెలరోజులుగా జోరుగా సాగుతున్న ఈ సీజన్ మరో 20 రోజులకు పైగానే ఉంటుం ది. తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా దిగుబడినిచ్చే ప్రాంతం జనగామ అని చెప్పుకోవచ్చు. ఈ ప్రాంతానికి చెందిన రైతులు మామిడితోటలకు బదులుగా సీలాఫల్ తోటలను సాగు చేసుకునేందుకు ముందుకొస్తున్నారు. ఔషధ గుణాలు సీతాఫల్ ఆకులు, బెరడు, వేరు ఇలా అన్ని భాగాలను అనేకరకాల వ్యాధుల నివారణలో వినియోగిస్తారని నమ్మకం. వీటి ఆకులకు మధుమేహాన్ని అదుపులో ఉంచడంతో పాటు అధికబరువు తగ్గించే గుణం ఉందని నమ్మకం. ఆకుల కషాయం జలుబును నివారిస్తుందని పెద్దలు అంటుంటారు. పండ్ల నుంచి నుంచి కెరోటిన్, థయామిన్, రిబోప్లేవిన్, నియాసిన్, విటమిన్–సి వంటి గుణాలు కలిగిన విటమిన్లు సమృద్ధిగా వస్తాయి. పండును రసం రూపంగా కాకుండా నేరుగా తింటే గుజ్జు నోటిలోని జీర్ణరసాలను పెంచుతూ జీర్ణప్రక్రియను వేగవంతం చేస్తుంది. పండు గుజ్జును తీసి రసంలా తయారు చేసి పాలల్లో కలిపి పిల్లలకు తాగిస్తే సత్వర శక్తి లభిస్తుందని పెద్దలు చెబుతుం టారు. ఇందులో ఫాస్పరస్, క్యాల్షియం, ఇనుము లాంటి పోషకాలు, ఎముకల పరిపుష్టికి దోహదం చేస్తాయి. మలబద్ధకంతో బాధపడే వారికి ఈ పండు దివ్యౌషధంగా పనిచేస్తుంది. ముఖ్యంగా ఆకుల్లోని హైడ్రోసైనిక్ ఆమ్లం చర్మసంబంధిత సమస్యల్ని తగ్గిస్తుంది. ఆకులను మెత్తగా నూరి కొంచెం పసుపు కలిపి మానని గాయాలపై రాస్తే తగ్గుముఖం పడుతుంది. ఆకులను మెత్తగా నూరి బోరిక్‌పౌడర్ (క్యారం బోర్డు పౌడర్)ను కలిపి మంచం, కుర్చీల మూలాల్లో ఉంచితే నల్లుల బెడద తప్పుతుంది. -
నాటుకోడి ధర అదరహో
మాంసం ప్రియుల ట్రెండ్ మారింది. ఇంటి పెరట్లో సహజ సిద్ధంగా పెంచుకునే నాటు కోళ్ల మాంసం రుచే వేరు. వీటి మాంసం గట్టిగా ఉండడంతో వండడానికి, తినడానికి ఇబ్బంది పడేవారు. రుచి లేకపోయినా మృదువుగా ఉండే బాయిలర్ కోడి మాంసానికి అలవాటు పడిన జనం ప్రస్తుతం నాటు కోడి మాంసం వైపు చూస్తున్నారు. వీటి ధరలు మటన్ రేట్లను మరిపిస్తున్నా.. కేజీ బాయిలర్ కోడి మాంసం కంటే.. అరకేజీ నాటుకోడి మాంసంతో సరిపెట్టుకుంటున్నారు. ఆదివారం అయితే నాటు కోళ్ల కోసం జనం బారులు తీరుతున్నారు. దీంతో పల్లెల నుంచి నాటు కోళ్లు తీసుకొచ్చి విక్రయించేవారు ఎక్కువయ్యారు. పాత బస్టాండ్ ప్రాంతం ఆదివారం నాటు కోళ్ల సంతను తలపిస్తోంది. సాక్షి, గూడూరు(నెల్లూరు) : ఒకప్పుడు పల్లెల్లో నాటు కోళ్లను పెంచుకుని, వాటి మాంసాన్ని ఆహారంగా తినేవారు. కాలక్రమంలో వాటిని పెంచడంలో ఇబ్బందులతో పెంచేవారే తగ్గిపోయారు. దీంతో పల్లెల్లో సైతం పుట్టగొడుగుల్లా చికెన్ సెంటర్లు వెలిశాయి. ఇలా కొన్నాళ్లకు ఆ రుచి వెగటేసింది. మళ్లీ నాటు కోడి మాంసం అంటూ అటూ పల్లెలతో పాటు ఇటు పట్టణ ప్రజలు ఉత్సాహం చూపుతున్నారు. పెద్ద పెద్ద హోటళ్లలోనూ, ఫంక్షన్ల్లో ‘నాటు కోడి మాంసం, రాగి సంగటి’ అనే కొత్త సంప్రదాయం వచ్చింది. నాటు కోళ్లకు గిరాకీ పెరగడంతో కొందరు పల్లెల్లో నాటు కోళ్ల పెంపకాలు చేపట్టారు. వ్యాపారులు అక్కడ నాటు కోళ్లను కొనుగోలు చేసి, పట్టణానికి తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. మాంసం ప్రియులు నాటు కోళ్లను కొనుగోలు చేయడం వైపు మొగ్గు చూపుతున్నారు. నాటు కోడి మాంసం దాదాపుగా మటన్ ధరకు సరితూగుతోంది. మటన్ ధర కిలో రూ.500 నుంచి రూ.600 వరకు ఉంది. ఈ క్రమంలో నాటు కోడి ఒకటన్నర కిలో ధర రూ.600 ఉంది. వ్యర్థాలు పోను అది సుమారు కిలో మంసం మాత్రమే వస్తుంది. దీంతో నాటు కోడి మాంసం మటన్ ధరకు సరితూగేలా పలుకుతోంది. -
సినిమా థియేటర్ల యాజమాన్యాలకు నోటీసులు
జనగామ అర్బన్ : సినిమా..చూసొద్దామా మామ.. సినిమా చూసొద్దామా.. మామ అనే పాటను మధ్య తరగతి ప్రజలు ఇక ఎంచాక్కా పాడుకోవచ్చు. పండుగపూటో, సెలవుదినాల్లో కుటుంబంతో సరాదగా సినిమాకెళ్తే టికెట్ల ధరల కన్నా తినుబండారాల బిల్లు తడిసిమోపెడవుతోంది. దీంతో కుటుంబ సభ్యులతో సహా సినిమాకు వెళ్లాలంటేను జంకుతున్నారు. అయితే రాష్ట్ర ప్రభుత్వం సగటు ప్రేక్షకుడు హాయిగా సినిమా చూడటంతో పాటు జేబుకు చిల్లుపడే కార్యక్రమానికి స్వస్తి పలికే దిశగా అడుగులు వేస్తోంది. థియేటర్లలో విక్రయించే తినుబండారాలు, శీతల పానీయాలను ఎమ్మార్పీ ధరలకే విక్రయించాలని, నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఆదేశాలను జారీ చేసింది. ఇందుకు గాను ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాలోని 20, మహబూబాబాద్ జిల్లాలోని 08, జనగామ 03, భూపాలపల్లి జిల్లాలో 04 సినిమా థియేటర్ల యాజమాన్యాలకు తూనికలు, కొలతల అధికారులు ఇప్పటికే నోటీసులు జారీ చేయడంతో పాటు ఇటీవల వరంగల్ జిల్లా కేంద్రంలో సమావేశాన్ని నిర్వహించి తగు సూచనలు చేశారు. కొత్త నిబంధనలు ఆగస్టు 1 నుంచి అమల్లోకి వచ్చాయి.అంతేకాకుండా మొదటి వారంలో తనిఖీలు నిర్వహించడానికి అవసరమైన చర్యలను కూడా చేపట్టనున్నారు. కాగా సినిమా థియేటర్లలో ప్రేక్షకులు, వినియోగదారుల ఫిర్యాదుల కోసం టోల్‌ఫ్రీ నంబర్ 18004250033, వాటప్స్ నబంర్ 7330774444 కనిపించే విధంగా ఏర్పాటు చేయాలని అధికారులు సూచించారు. సినిమా హాళ్లలో ఉత్పత్తులను అధిక ధరలకు విక్రయిస్తున్నారని ప్రేక్షకుల నుంచి వచ్చిన ఫిర్యాదుల మేరకు చట్టబద్ధంగా నిర్వహించడానికి ప్రభుత్వం ప్రత్యేక చర్యలను చేపట్టనుంది. వీటిపై ఫిర్యాదు చేయవచ్చు..విడిగా విక్రయించే తినుబండారాల్లో నాణ్యత లోపించినా.. ఉత్పత్తుల బరువు, పరిమాణం, గడువు దాటినా, ఎమ్మార్పీ లేకపోయినా, ప్యాకేజీ రూపంలో ఉన్న వస్తువులపై పేరు, కస్టమర్ కేర్ వివరాలు లేకపోయినా ప్రేక్షకులు టోల్‌ఫ్రీ లేదా వాటప్స్ నంబర్‌కు వెంటనే సమాచారం ఇవ్వడంతో పాటు ఫిర్యాదు చేయవచ్చు. ప్రేక్షకుల ఫిర్యాదును బట్టి జరిమానాతో పాటు జైలు శిక్షలు విధించే విధంగా అధికారులు విధి విధానాలను రూపొందించడం గమనార్హం. ఇక నుంచి సినిమా థియేటర్లలో ప్రేక్షకులకు కష్టాలు తప్పనున్నాయి. అధికారులు తీసుకుంటున్న చర్యలపై సినీ ప్రేమికులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం.. సినిమా థియేటర్లలో విక్రయించే తినుబండారాలపై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం. దీంతో నాణ్యమైన ఉత్పత్తులు సరైన ధరలకు లభించడంతో పాటు ఆరోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి. మధ్య తరగతి ప్రేక్షకులు కూడా ఎంజాయ్ చేస్తారు. – పాము శ్రీనివాస్, జనగామ నిబంధనలను పాటించాల్సిందే.. ప్రభుత్వం తూనికలు, కొలతల శాఖ ద్వారా తీసుకుంటున్న చర్యలు, రూపొందించిన విధివిధానాలను అన్ని సినిమా థియేటర్ల యాజమాన్యాలు పాటించాల్సిందే. ఇప్పటికే ఈ విషయంలో నోటీసులు, సమావేశాలు నిర్వహించి అవగాహన కల్పించాం. – ఎస్. విజయ్‌కుమార్, జిల్లా తూనికలు, కొలతల శాఖ అధికారి, జనగామ -
థియేటర్లలో అధికధరలపై చర్యలు తీసుకుంటాం
వికారాబాద్ అర్బన్ : సినిమా థియేటర్లలో తిను బండాల విషయంలో ప్రమాణాలు పాటించాల్సిందేనని తూనికలు, కొతల శాఖ జిల్లా అధికారి కిష న్ తెలిపారు. మంగళవారం స్థానిక కార్యాలయం లో జిల్లాలోని సినిమా థియేటర్ల యాజమాన్యం ప్రతినిధులు, మేనేజర్లతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. తూనికలు కొలతల శాఖ రాష్ట్ర కమిషనర్ ఆదేశం మేరకు ఆగస్టు 1నుంచి థియేటర్లలో కొనసాగుతున్న క్యాంటిన్లపై తనిఖీలు నిర్వహిస్తామని చెప్పారు. క్యాంటిన్లలో ఏ వస్తువు కూడా ఎంఆర్పీ కంటే ఎక్కువ ధరకు అమ్మరాదని తెలిపారు. ప్రధానంగా పాప్‌కారŠన్స్ తదితరాల విక్రయాల్లో వినియోగదారులను తీవ్రంగా మోసం చేస్తున్నారనే ఫిర్యాదులు అందుతున్నాయని చెప్పారు. పాప్‌కారŠన్స్ పరిమాణం, వాటికి తీసుకునే ధర విషయాన్ని స్పష్టంగా వినియోగదారుడికి తెలిసే లా ఒక స్టిక్కర్ అతికించాలని సూచించారు. అవే వివరాలను బోర్డుపై పేర్కొనాలని తెలిపారు. ఈ విషయంలో ఏమాత్రం నిర్లక్ష్యం వహించినా జరిమానాలతో పాటు, కేసులు నమోదు చేస్తామ ని హెచ్చరించారు. వాటర్ బాటిల్స్, కూల్‌డ్రింగ్స్ తదితరాలను అధిక ధరలు విక్రయిస్తే చర్యలుత ప్పవని స్పష్టం చేశారు. ఏ వస్తువు ఎంత ధరకు అమ్ముతున్నారనే విషయాన్ని తప్పకుండా అన్ని థియో టర్లలో బోర్డులపై రాసి ఉంచాలని తెలి పారు. వినియోగదారుడి సౌకర్యార్థం అదే బోర్డుపై టోల్‌ఫ్రీ నెంబర్ 180042500333, వాట్సప్ నం బర్ 7330774444ను తప్పకుండా పొందుపర్చాలని చెప్పారు. ఈ సందర్భంగా కొందరు థియేటర్ల యజమానులు మాట్లాడు తూ.. క్యాంటిన్లో చోటుచేసుకునే విషయాలకు థియేటర్ మేనేజర్లను బాధ్యులను చేయొద్దని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. థియేటర్ యాజమాన్యం, క్యాంటిన్ నిర్వాహకులను బాధ్యులను చేయాలని కోరారు. ఈ విషయంపై స్పందించిన అధికారులు మేనేజర్లపై ఎలాంటి కేసులు నమోదు చేయబోమని హామీ ఇచ్చారు. అయితే, థియేటర్లోని క్యాంటిన్లో అధిక ధరలకు తినుబండారాలు తదితరాలు అమ్మకుండా, వినియోగదారులు నష్టపోకుండా చూసుకోవాల్సిన బాధ్యత మాత్రం మేనేజర్లపైనే ఉంటుందని స్పష్టం చేశారు. కార్యక్రమంలో తూనికల కొలతల అధికారి అశోక్‌రావు అదితరులు పాల్గొన్నారు. -
దర్జాగా దోపిడీ
వికారాబాద్ అర్బన్: వికారాబాద్‌లోని రైతు బజారులో వ్యాపారులు వినియోగదారులను దర్జాగా మోసం చేస్తున్నారు. అక్కడి బోర్డుపై ఒక ధర రాసి, అమ్మే వద్ద మరో ధరతో విక్రయిస్తున్నారు. ఇదేమని అడిగితే అదంతే.. ఇష్టమైతే కొను లేకపోతే లేదు అని దబాయిస్తున్నారు అక్కడి వ్యాపారులు. ప్రతి రోజు ఇదే తరహాలో దందా కొనసాగుతోంది. ఇంత జరుగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. రైతుల స్థానంలో వ్యాపారులు చొరబడడంతోనే ఇలాంటి మోసాలు జరుగుతున్నాయని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. వికారాబాద్ వ్యవసాయ మార్కెట్ శాఖ అధికారులు ప్రతి రోజు అన్ని రకాల కూరగాయల ధరలను సూచిక బోర్డుపై రాస్తున్నట్లు చెబుతున్నారు. కానీ అక్కడికి అమ్మడానికి వచ్చిన రైతులు, వ్యాపారులు బోర్డుపై ఉన ధరలకే కూరగాయలు విక్రయించాలి. కాని అధికారులు చెబుతున్న ధరలను ఏ ఒక్క వ్యాపారి పాటించడం లేదు. ఎందుకంటే రైతు బజారులో రైతులు ఎవరూ లేరనే ధీమాతో ఇది యథేచ్ఛగా జరుగుతోంది. కొంతమంది ఇతరుల పేరుమీద ఉన్న లైసెన్స్‌ను తీసుకుని వ్యాపారం చేస్తున్నారు. పైగా ఒకరి పేరుమీద కూరగాయలు అమ్ముకునే లైసెన్స్ ఉంటే ఇంట్లోని నలుగురు వ్యాపారం చేస్తున్నారు. దీంతో చుట్టుపక్కల గ్రామాలకు చెందిన నిజమైన రైతులు రోజు సాయంత్రం పొలం నుంచి కూరగాయలు రైతు బజారుకు తీసుకొస్తే కనీసం వారు కూర్చొని అమ్మడానికి అవకాశం ఇవ్వడం లేదు. దీంతో రైతు బజారులో కూరగాయలు అమ్ముకోవాల్సిన రైతులు రోడ్డు పక్కన, వ్యాపారులు దర్జాగా రైతు బజారులో వ్యాపారం చేసుకుంటున్నారు. రైతు బజారులో ఇంత జరుగుతున్న పర్యవేక్షణ ఏమాత్రం లేదు. సూచిక బోర్డు మీద రాసిన ధరలకే రైతులు, వ్యాపారులు కూరగాయలు అమ్ముతున్నారా అని చూసే దిక్కులేకుండా పోయిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. గతంలో రైతు బజారును రెండుగా చేశారు. ఓ వైపు వ్యాపారులని, మరో వైపు రైతులు మాత్రమే ఉండాలని మార్కెట్ అధికారులు నిర్ణయించారు.కాని రెండు వైపులు వ్యాపారులే మాకాం వేశారు. ఇలా ఎక్కువ ధరకు అమ్ముతున్నారు.. పట్టణంలోని రైతు బజారులో మార్కెట్ అధికారులు కిలో టమాటా రూ.20గా రాశారు. కాని వ్యాపారులు రూ.30 కిలో అమ్ముతున్నారు. పచ్చిమిర్చి బోర్డుపై కిలో రూ.30 అని రాశారు. కాని రూ.40కి అమ్ముతున్నారు. ఇలా ప్రతీ కూరగాయాలను కిలోకు రూ.10 పెంచి అమ్ముతున్నారు. అధికారులు మాత్రం బోర్డుమీద ధరలు రాసి తమపని అయిపోయిందన్నట్లుగా అక్కడి నుంచి వెళ్లిపోతున్నారు. -
లంచాల రేట్లు పెరిగాయ్!
ఎద్దువెనక నక్కలాగా మోదీ వెనుక బాబు ఏదో ఆశించి తిరిగారు. ముప్ఫై ఢిల్లీ విజిట్లవల్ల విమానం ఖర్చులు తప్ప ఒక్క హామీ కూడా సాధించలేక పోయారు. ‘‘గత కాలము మేలు...’’ అని జనం అనుకుంటు న్నారు. మోదీ పాలనపై నాలుగేళ్ల తర్వాత సమీక్షించు కుంటే వెలితిగా అనిపిస్తోంది. ఆనాడు వాజ్‌పేయి పాలిం చింది నికరంగా నాలుగేళ్లే అయినా జనహితానికి ఎన్నో కొండ గుర్తులు సృష్టించారు. కేవలం ఈ నెలల వ్యవధిలో మోదీ ప్రభుత్వం అద్భుతాలు సృష్టిస్తుందనే ఆశ లేదు. వచ్చీ రాకుండానే నల్ల ధనవంతుల మీద, అవినీతి మీద రంకెలు వేశారు. ఒక్క రూపాయి నల్లధనం దొరకలేదు. చెలామణిలో ఉన్న కరెన్సీని బూడిద చేసి కొత్త రంగుల్లో కొత్తనోట్లు వదిలారు. పెద్ద నోట్ల రద్దుతో ఖజానాకి వరదొస్తుందని చెప్పారు. ఏమీ రాలేదు. పాపం, గ్రామా లలో వయోవృద్ధులు, అమాయకులు వారు ప్రాణపదంగా దాచుకున్న పెద్ద నోట్లు పనికిరాకుండా పోయాయి. ఆనాటి ప్రభుత్వం మూడు సింహాల ముద్రతో, రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ గారి చేవ్రాలుతో ఇచ్చిన ప్రామిసరీ నోటుకి మర్యాద, విలువ లేకుండా పోయింది. ఆనాటి రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ వద్దన్నా వినకుండా ఏక పక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారని మోదీ మీద అభియోగం. అవినీతి ఆగలేదు. ఎమర్జెన్సీ రోజుల్లో లాగే, రిస్క్ పెరిగిందని అవినీతికి రేట్లు పెంచారు. ఉన్నత స్థాయిలో కుంభకోణాలు లేవని గుండీలమీద చేతులేసుకుని చెబుతున్నారు. మహా స్కాముల్ని రాజకీయ లబ్ధి కోసం నిర్వీర్యం చేయడం స్కాం కాదా అంటున్నారు. గెలుపు కోసం ఈశాన్య రాష్ట్రాలలో కరెన్సీని కురి పించలేదా అని ప్రత్యక్ష సాక్షులు నిగ్గతీస్తున్నారు. వెంకయ్యనాయుడిని జన జీవన స్రవంతి నుంచి వేరు చేసి, ఏనుగు అంబారీ ఎక్కించడం మాత్రం మోదీ గొప్ప ఎత్తుగడగా బీజేపీ శ్రేణులు భావిస్తున్నాయి.ఆనాడు మోదీని ఎంత గ్లామరస్‌గా ప్రదర్శించినా, దక్షిణాది రాష్ట్రాలలో ఆ పప్పులు ఉడకలేదు. ఉత్తరాదిలో అప్పటికే కాంగ్రెస్ కొడి గట్టడం, గుజరాత్ ముఖ్యమంత్రిగా మహాద్భుతాలు చేశారన్న ప్రచారం అటు బాగా పనిచేసింది. మోదీని నిలబెట్టింది. వస్తు, సేవల పన్ను విధానానికి కావల్సిన మెజార్టీ సాధించి నెగ్గించగలిగారు. అర్ధరాత్రి జీరో అవర్‌లో జీఎస్టీ పండుగని పార్లమెంట్ భవనంలో జరిపి, నాటి స్వాతంత్య్రోత్సవాన్ని తలపించారు. సంతోషం. పన్నులకు తగిన సేవలు లేవని జనం గగ్గోలు పెడుతున్నారు. ఎక్కడా టౌన్లకి సరైన రోడ్లు లేవు. వీధి దీపాలు లేవు. డ్రైనేజీ లేదు. రక్షిత మంచినీరు లేదు. ఇప్పుడే గ్రామాలమీద దృష్టి పడింది. గ్రామాలంటే రైతులు. వాళ్ల ఓట్ల కోసం ఒక్కసారిగా ఇవ్వాళ గ్రామాలు గుర్తొచ్చాయి. స్వచ్ఛ భారత్ జరిగిన దానికంటే ప్రచారం అధికంగా జరుగుతోంది. పెద్ద నగరాలలో, అనేకానేక కాలనీలలో చెత్త పేరుకు పోతోంది. బ్యాంకింగ్ రంగం అనేక కారణాలవల్ల ఎన్.పీ.ఏ.గా తయారైంది. బడా బాబులకి వేలాది కోట్లు ధార పోసింది. మోదీ జన్‌ధన్ పథకం సామాన్యులకి ఏమి ఒరగబెట్టిందో తెలియదు. ‘మనసులో మాట’ వినడానికి బావుంది. తాజాగా చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ ఓటర్లని మోదీ పైకి ఉసికొల్పుతున్నారు. మోదీ, వైఎస్సార్సీపీ కలిసిపోయి కుమ్మక్కు రాజకీయాలు నడుపుతున్నారని చంద్రబాబు అభియోగం. ఎద్దువెనక నక్కలాగా మోదీ వెనుక చంద్రబాబు ఏదో ఆశించి తిరిగారు. కానీ ఏమీ రాలేదు. ముప్ఫై ఢిల్లీ విజిట్లవల్ల విమానం ఖర్చులు తప్ప ఒక్క హామీ కూడా సాధించలేక పోయారు. అందుకని ఆదికవి నన్నయ అన్నట్టు గత కాలము మేలు వచ్చు కాలము కంటెన్. (వ్యాసకర్త ప్రముఖ కథకుడు) శ్రీరమణ -
భగ్గుమంటున్న ‘బంగినపల్లి’
కాశిబుగ్గ వరంగల్ సిటీ : మధుర ఫలాలుగా పేరొందిన మామిడి పండ్లు మామూలుగా ఏప్రిల్ మొదటి వారం నుంచి విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సారి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పూత, కాత నెల రోజులు ఆలస్యంగా రావడంతో ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు. మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి. కాగా హైదరాబాద్, విజయవాడల నుంచి కొందరు చిరు వ్యాపారులు దొరికిన కొద్దిపాటి బంగినపల్లి మామిడి పండ్లను తీసుకొచ్చి కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్ముతున్నారు. ఈ మామిడి పండ్లు ప్రస్తుతం కాశిబుగ్గ చౌరస్తాతో పాటు అండర్‌బ్రిడ్జి, ములుగురోడ్డు సెంటర్లో లభ్యమవుతున్నాయి. సీజన్ ఆరంభంలో వచ్చిన మామిడి పళ్లను చూసి వినియోగదారులు కొనడానికి ఎగబడుతున్నారు. మందుగా అమ్మకానికి వచ్చే కోబ్రా, నీలంబరి, జలాలు, నీలాలు కూడా ఇప్పటి వరకు అమ్మకానికి రాలేదు. ఒక బంగినపల్లి మాత్రం అక్కడక్కడ అమ్మకానికి ఉండడం విశేషం.కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్మకాలు -
రాయల్ స్టాగ్ రూ.1,050 !
వరంగల్: మేడారం జాతరలో మద్యం ధరలకు రెక్కలు వచ్చాయి. జాతరలో అధికారికంగా 22 మద్యం షాపులు ఏర్పాటుచేయగా.. యజమానులు సిండికేట్ అయి అధిక ధరలకు విక్రయిస్తున్నారు. సిండికేట్ వద్ద భారీ మొత్తంలో అధికారులు మాముళ్లు మాట్లాడుకున్నందునే పట్టించుకోవడం లేదని భక్తులు ఆరోపణలు చేస్తున్నారు. జాతరలోని హోల్‌సేల్ షాపుల నిర్వహకులు ఎంఆర్పీ రూ. 560 ఉన్న రాయల్‌స్టాగ్ బాటిల్‌ను చిరు వ్యాపారులకు రూ. 900 – 950కు ఇవ్వగా వారు రూ.100 కలిపి విక్రయిస్తున్నారు. ఇక ఆఫీసర్స్ ఛాయిస్ ఎమ్ఆర్పీ 110 అయితే.. ఇద్దరు చేతులు మారాక రూ.150, బీరు ధర రూ.150 చేరినా అధికారులు పట్టించుకోకుండా నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం విశేషం. కొబ్బరికాయ రూ. 40 .. కొత్తిమీర రూ.50 ములుగు రూరల్/వెంకటాపురం(కె): మండలంలోని గట్టమ్మ వద్ద టెండరు దక్కించుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకున్న వ్యాపారులు నిబంధనలకు విరుద్ధంగా అధిక ధరలకు విక్రయాలు నిర్వహిస్తున్నారు. సంబంధిత అధికారులు ఇదంతా చూస్తూ తమకేమీ పట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. మేడారం జాతరకు వెళ్తున్న భక్తులు గట్టమ్మకు మొక్కులు చెల్లించడం ఆనవాయితీ. ఈ క్రమంలో నెల రోజులుగా భక్తుల సంఖ్యలో పెరిగింది. ఇదే అదనుగా కొబ్బరికాయల దుకాణదారుడు ఉదయం రూ. 40 చొప్పున, సాయంత్రం వరకు రూ.35 చొప్పున విక్రయిస్తున్నాడు. కాగా మేడారం మహాజాతరలో కొత్తిమీర కట్ట రూ.50కు విక్రయిస్తున్నారు. జాతరకు లక్షలాది మంది భక్తులు అమ్మవార్లను దర్శించుకొని మేకలు, కోళ్లతో మొక్కులు చెల్లిస్తున్నారు. అనంతరం మాంసం కూర వండుకుంటున్నారు. వాటిలో వేసుకునే కొత్తమీర కొనాలం టే ధర భారీగా ఉండటంతో ఆశ్చర్యపోతున్నారు. అయినా తప్పడం లేదని భక్తులు వాపోతున్నారు. (కొత్తిమీర విక్రయిస్తున్న వ్యాపారులు ) ఏస్కో కల్లు సారా.. మేడారం జాతర అంటేనే కోళ్లు, యాటలు, కల్లు, మందుతో మజా చేసే ఉత్సవం. నాలుగు రోజులపాటు జరిగే జాతరలో చిన్నా, పెద్ద, ఆడ, మగ తేడా లేకుండా అందరూ ఎంజాయ్ చేస్తూంటారు. తొలుత వనదేవతలు శ్రీసమ్మక్క, సారలమ్మను దర్శించుకుంటారు. అనంతరం విడిది చేసే ప్రాంతంలో కోళ్లు, యాటలు కోసుకుని సరదాగా గడుపుతుంటారు. అయితే భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని మేడారం సమీపంలోని కొంతమంది ప్రజలు చీప్‌లిక్కర్ మందు, తాటికల్లు, గుడాలను తీసుకొచ్చి విక్రయిస్తున్నారు. -
డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదం
సాక్షి, హైదరాబాద్: పాఠశాలల్లో విద్యార్థులకు అవసరమైన డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు వివాదాస్పదమవుతోంది. చర్లపల్లి సెంట్రల్ జైలు నుంచి డ్యుయల్ డెస్క్‌ల సరఫరా పేరిట ఓ మధ్య వ్యాపారి అధిక ధరలతో వంద.. వెయ్యి కాదు.. ఏకంగా లక్ష బల్లలను సరఫరా చేసేలా ఆర్డర్ సొంతం చేసుకున్నారు. విద్యాశాఖ టెండర్లు పిలిచి ఈ పనులు అప్పగించిందా? అంటే అదీ లేదు. జైళ్ల శాఖ పేరుతో నామినేషన్‌పై వీటి కొనుగోలుకు విద్యా శాఖ ఓకే చెప్పింది. సాధారణంగా రూ.10 లక్షల విలువైన పనులకూ ప్రభుత్వానికి ఫైలు పంపించే విద్యా శాఖ రూ.50 కోట్ల విలువైన ఈ పనులకు సొంతంగా ఆర్డర్ ఇవ్వడం అనుమానాలకు తావిస్తోంది. పైగా చర్లపల్లి సెంట్రల్ జైలులో ఏడాది పొడవునా పని చేసినా లక్ష బల్లల తయారీ సామర్థ్యం లేదని విద్యాశాఖ అధికారులే చెబుతున్నారు. అయినా జైలు పేరుతో బయటి వ్యక్తికి లక్ష బల్లల సరఫరా ఆర్డర్ అప్పగించారని, ఈ వ్యవహారంలో భారీ ఎత్తున కమీషన్ల దందా కొనసాగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓపెన్ మార్కెట్లో చూస్తే.. విద్యాశాఖ ఆర్డర్ ఇచ్చిన డ్యుయల్ డెస్క్‌లను పరిశీలిస్తే అంత ధర లేదని చిన్నతరహా పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. ముగ్గురు విద్యార్థులు కూర్చునేందుకు వీలున్న ఈ బల్లల తయారీకి రూ.2,800 వరకు ఖర్చవుతుందని, సరఫరా, లాభాల కింద రూ.1,200 కలిపినా రూ.4 వేలకు మించదని పేర్కొంటున్నాయి. కానీ ముగ్గురు విద్యార్థులు కూర్చునే బల్లలకు రూ.5,050 రేటుతో రూ.50 కోట్లకుపైగా విలువైన ఆర్డర్‌ను ఎలాంటి టెండర్లు లేకుండా ఇవ్వడంపై ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇవేకాదు పదో తరగతి పరీక్షల కోసం మరో 11 వేల వరకు డ్యుయల్ డెస్క్‌ల సరఫరాకూ ఆర్డర్ ఇచ్చింది. ఈ వ్యవహారంలో రూ.15 కోట్ల వరకు నిధుల దుర్వినియోగం జరిగినట్లు విమర్శలు వస్తున్నాయి. విద్యాశాఖ మాత్రమే కాదు.. సోషల్ వెల్ఫేర్, ట్రైబల్ వెల్ఫేర్ శాఖలు కూడా గురుకులాల కోసం ఆర్డర్లు ఇచ్చాయి. ప్రభుత్వం గతంలో జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం జైల్లో ఖైదీలు తయారు చేసే ఉత్పత్తులను ప్రభుత్వ సంస్థలు కొనుగోలు చేయాలి. సాధారణంగా జైలులో తయారు చేసే బల్లలపై పన్నులు ఉండవు. అలాంటప్పుడు మరింత రేటు తగ్గాల్సి ఉన్నా.. అధిక ధరలకు ఆర్డర్ ఇవ్వడం గమనార్హం. జెమ్ ఏం చెబుతోందంటే.. గవర్నమెంట్ ఈ–మార్కెట్‌ప్లేస్(జెమ్).. ప్రధానమంత్రి నేతృత్వంలోని కార్యదర్శుల కమిటీ సూచనల మేరకు ఏర్పాటైన ఆన్లైన్ మార్కెట్ ఇదీ. ఇందులో వ్యాపార సంస్థలు, ప్రభుత్వాలు రిజిస్టర్ చేసుకోవాలి. ప్రభుత్వాలకు అవసరమైన పరికరాలను స్పెసిఫికేషన్స్ ప్రకారం ఆయా వ్యాపార సంస్థల నుంచి కొనుగోలు చేసుకోవచ్చు. ఇందులో డెస్క్‌లు సరఫరా చేసే వ్యాపార సంస్థలు వెయ్యికిపైగా ఉన్నాయి. విద్యాశాఖ నిర్దేశిత ప్రమాణాలతో కూడిన డ్యుయల్ డెస్క్‌లు రూ.1,600 నుంచి రూ.3,500 వరకు ధర ఉన్నాయి. కానీ దాని నుంచి కొనుగోలు చేసేందుకు విద్యా శాఖ ఎలాంటి చర్యలు చేపట్టలేదు. కాగా, ఈ వ్యవహారంలో ప్రభుత్వానికి ఫిర్యాదులు అందడంతో విచారణకు ఆదేశించింది. పాఠశాల విద్యాశాఖ కమిషనర్ కిషన్ ఈ విషయాన్ని తేల్చాలని జైలు అధికారులకు లేఖ రాసినట్లు తెలిసింది. ధరలు మేం నిర్ణయించం.. లక్ష డ్యుయల్ డెస్క్‌ల కొనుగోలు కోసం చర్లపల్లి జైలుకు ఆర్డర్ ఇచ్చింది వాస్తవమే. జైళ్లలో తయారయ్యే వస్తువులను ప్రభుత్వ విభాగాలు కొనుగోలు చేయాలన్న నిబంధన ఉంది. ఆ మేరకే మేం ఆర్డర్ ఇచ్చాం. అయితే ధరలను మేం నిర్ణయించం. మేం ఇచ్చిన స్పెసిఫికేషన్స్ ప్రకారం జైలు అధికారులే ధర నిర్ణయించారు. ఆ ప్రకారమే కొనుగోలుకు ఆర్డర్ ఇచ్చాం. – కిషన్, పాఠశాల విద్యా కమిషనర్ -
చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ధరల షాక్!
-
చంద్రన్న విలేజ్ మాల్స్‌లో ధరల షాక్!
సాక్షి, అమరావతి : చౌకధరల దుకాణాల స్థానంలో నారా చంద్రబాబునాయుడు ప్రభుత్వం ప్రారంభించిన ‘చంద్రన్న విలేజ్ మాల్స్’లో ధరలు షాక్ కొడుతుండడంతో ప్రజలు నిరసనాగ్రహాలు వ్యక్తం చేస్తున్నారు. బహిరంగ మార్కెట్లో లభిస్తున్న ధరలకన్నా ఈ మాల్స్‌లో ధరలు ఎక్కువ ఉండడం చూసి జనం అవాక్కవుతున్నారు. ధరల తీరుపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమౌతుండడంతో చంద్రన్న మాల్స్‌లో అమ్మకాలను తాత్కాలికంగా నిలిపివేశారు. ప్రస్తుతం సబ్బులు, ఇతర సౌందర్యసాధనాలు మాత్రమే విక్రయిస్తున్నారు. అవి కూడా మార్కెట్ రేట్లకే కావడం విశేషం. ఒకటి రెండు రోజుల్లో సరుకులన్నీ వస్తాయని డీలర్లు చెబుతున్నారు. ప్రజాపంపిణీ వ్యవస్థను నిర్వీర్యం చేస్తూ రేషన్ షాపులను.. రిలయన్స్‌తో పాటు చంద్రబాబుకు వాటాలున్న ఫ్యూచర్ గ్రూప్‌లకు అప్పగించేస్తుండడంపై ఇప్పటికే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఒకవైపు గిట్టుబాటు ధర లభించక రైతులు అల్లాడుతుండగా అవే ఉత్పత్తుల ధరలు వినియోగదారుల వద్దకు వచ్చేసరికి దిమ్మతిరిగేలా షాక్ కొడుతున్నాయి. అందులోనూ చౌకధరల దుకాణాలకు ప్రత్యామ్నాయంగా రాష్ట్రప్రభుత్వం ముందుకు తెచ్చిన చంద్రన్న మాల్స్‌లో ధరలు భారీగా ఉండడంపై వినియోగదారుల్లో వ్యతిరేకత వ్యక్తమౌతోంది. 40శాతం చౌక ధరలంటూ ప్రచారం.. రాష్ట్రంలో 29 వేల రేషన్‌షాపులు ఉన్నాయి. వీటిల్లో ఎంపిక చేసిన 6,500 దుకాణాల్లో చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రారంభించేందుకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకుంది. పైలెట్ ప్రాజెక్టుగా విజయవాడ, గుంటూరులోని రెండు దుకాణాలను ఎంపిక చేసింది. మిగిలిన దుకాణాలను వెంటనే ప్రారంభించనున్నామని, వీటిల్లో ప్రజలకు అవసరమైన నిత్యావసర వస్తువులను మార్కెట్ ధర కంటే 40 శాతం తక్కువకు అందుబాటులోకి తీసుకు వస్తామని పెద్ద ఎత్తున ప్రచారం చేసింది. ఎంపిక చేసిన విలేజ్ మాల్స్ ఆకర్షణీయంగా ఉండే ఏర్పాట్లు కూడా చేసింది. దీంతో ఈ మాల్స్‌లోని నిత్యావసర వస్తువులను కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూశారు. ఈ నెల 12 వ తేదీన ముఖ్యమంత్రి చంద్రబాబు వెలగపూడిలోని తాత్కాలిక సచివాలయం నుంచి రిమోట్ కంట్రోల్ ద్వారా చంద్రన్న విలేజ్ మాల్స్‌ను ప్రారంభించారు. మొదటి రోజు ప్రారంభోత్సవ హడావుడి ఉండటంతో ఆ రోజు అమ్మకాలు పెద్దగా జరగలేదు. 13 వ తేదీన విజయవాడ భవానీపురంలోని విలేజ్‌మాల్‌కు ప్రజలు పెద్ద సంఖ్యలో వచ్చి నిత్యావసర వస్తువులను కొనుగోలు చేశారు. అయితే బయట మార్కెట్ కంటే అక్కడి నిత్యావసర వస్తువుల ధరలు ఎక్కువగా ఉండటంతో కొనుగోలుదారుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అయింది. కొందరు కొనుగోలుదారులు ఇంటికి తీసుకువెళ్లిన వస్తువులను తిరిగి ఇచ్చేయడానికి ప్రయత్నించారు. అయితే దుకాణదారుడు వాటిని తిరిగి తీసుకునేందుకు అంగీకరించలేదు. ఆ రోజున దాదాపు రూ.6 వేల విలువైన నిత్యావసర వస్తువుల అమ్మకాలు జరిగాయి. ప్రజల నుంచి వచ్చిన వ్యతిరేకతను పరిగణనలోకి తీసుకుని కొందరు అధికారులు కొనుగోలుదారుల అభిప్రాయాలను తెలుసుకుని అదే రోజు సాయంత్రం నుంచి అమ్మకాలను నిలిపివేయాలని, అక్కడి నుంచి నిత్యావసర వస్తువులను తీసేయాలని ఆదేశించారు. 14వ తేదీ నుంచి ఆ దుకాణంలో నిత్యావసర వస్తువులు లేకపోవడంతో వచ్చిన కొనుగోలుదారులు తిరిగివెళ్లిపోయారు. వచ్చిన వారికి రెండు మూడు రోజుల్లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు ప్రారంభం అవుతాయని చెబుతూ, దుకాణంలోని మిగిలిన సబ్బులు, పేస్టుల ధరలు మార్కెట్ కంటే తక్కువగా ఇస్తున్నామని చెబుతున్నారు. రైతు నుంచి వినియోగదారుడి వరకూ... ఏ పరిశ్రమలోనైనా ఒక ఉత్పత్తి బైటకొస్తే యజమాని దాని ధర నిర్ణయించి అమ్ముకుంటాడు. కానీ అలాంటి అవకాశం లేని ఉత్పత్తిదారుడు బహుశా రైతు ఒక్కడేనేమో. పండించిన పంటకు ధరలు నిర్ణయించేది ప్రభుత్వమో.. దళారీలో.. వారు చెప్పిన ధర గిట్టుబాటు కాకపోయినా పంటను తెగనమ్ముకోవలసిందే. వేరుశనగ, మినుము, కందులు, పసుపు సహా ఏ పంటకూ ధర లేదు. రైతులు పంటలు బాగా పండించినపుడు పూర్తిగా రేటు లేకుండా పోతోంది. అయితే వినియోగదారుడి దగ్గరకు వచ్చే సరికి రేట్లు షాక్ కొడుతుంటాయి. ఇదెలా జరుగుతోందంటే దళారులు వచ్చి రైతుల దగ్గర నుంచి పంటను తక్కువ రేటుకు కొనుగోలు చేస్తున్నారు. ఆ తరువాత రేట్లు ఆకాశానికి ఎత్తేస్తున్నారు. అడ్డగోలుగా మోసం చేస్తున్నారు. వేరు శనగ పరిస్థితి అంతే.. రైతుల వద్ద క్వింటా రూ.3 వేలకు కొనుగోలు చేస్తున్నారు. ఇదే వేరు శనగ హెరిటేజ్ షాపుల్లో కేజీ రూ.150 పలుకుతోంది. రైతుల వద్ద శనగలు క్వింటా సగటున రూ. 3,500లకే కొంటున్నారు. అంటే కిలో రూ. 35 అన్నమాట. హెరిటేజ్ షాపులో మాత్రం కేజీ రూ.180లకు అమ్ముకుంటున్నారు. కందులను రైతుల దగ్గర క్వింటా రూ. 2,500లకు కొని, తన హెరిటేజ్‌లో మాత్రం కేజీ కందిపప్పును రూ. 80లకు అమ్ముకుంటున్నారు. రూ.25కు కొని రూ.80కి అమ్ముతారా? ఇంత అన్యాయమైతే రైతెలా బతుకుతాడు? మిర్చికి కూడా గిట్టుబాటు ధరలేక రైతు మండిపోతున్నాడు. క్వింటాలు రూ. 2,500 నుంచి రూ. 3 వేలు మాత్రమే ధర ఉంది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ హయాంలో అయితే... క్వింటా రూ. 8 వేలపైనే ఉంది. ఇపుడు కంది, మినుము, పెసర ధరలు క్వింటా సగటున రూ. 3 నుంచి 4 వేల మధ్యే ధర పలుకుతున్నాయి. వైఎస్సార్ హయాంలో రూ. 8 వేలకు తగ్గలేదు. ఇవాళ పసుపు ధర రూ. 4వేలు, రూ. 5 వేల మధ్య ఉంది. వైఎస్ పాలనలో రూ. 13 నుంచి రూ. 14 వేలుంది. అవికూడా మార్కెట్ ధరకే.. సబ్బులు, పేస్టులు వంటి వస్తువుల ఎంఆర్పీపై 8 నుంచి 12 శాతం వరకు రేటు తగ్గించి అమ్ముతున్నామని దుకాణదారులు చెబుతున్నారు. అయితే ఎంఆర్పీపై ఆ శాతం తగ్గించి వాటిని అమ్ముతున్నప్పటికీ మార్కెట్లోని మిగిలిన దుకాణాదారులు అదే ధరకు ఆ వస్తువులను విక్రయిస్తున్నారు. దీంతో సబ్బులు, పేస్టుల వంటి వస్తువుల ధరలు కూడా తక్కువగా ఏమీ లేవని కొనుగోలుదారులు చెబుతున్నారు. ప్రభుత్వ ప్రచారానికి భిన్నంగా చంద్రన్న విలేజ్మాల్లోని ధరలు ఉండటంతో శని, ఆదివారాలు కూడా కొనుగోలుదారులు రాలేదు. దాంతో ఆ మాల్ వెలవెలబోయింది. ఆందోళనలో చౌకడిపోల డీలర్లు.. రాష్ట్రంలోని 6,500 చౌకధరల దుకాణాలను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మార్చేందుకు జరుగుతున్న ప్రయత్నాల పట్ల డీలర్లు ఆందోళన చెందుతున్నారు. పైలట్ ప్రాజెక్టుగా ఎంపికైన విజయవాడ, గుంటూరులోని మాల్స్‌లో నిత్యావసర వస్తువుల అమ్మకాలు లేకపోవడంతో ప్రభుత్వం పంపిణీ చేసే బియ్యం మినహా ఇతర వస్తువులు విక్రయించే అవకాశం ఉండదనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్రన్నమాల్స్గా చౌకధరల దుకాణాలను ఆధునీకరించేందుకు పెద్ద ఎత్తున ఖర్చు చేయాల్సి ఉంటుందని, ఆ మొత్తాలకు నామమాత్రపు వడ్డీ కూడా వచ్చే అవకాశం లేదనే అభిప్రాయంలో ఉన్నారు. కొందరు చౌకధరల దుకాణదారులు తమ దుకాణాల్లో ప్రభుత్వం పంపిణీ చేస్తున్న బియ్యంతో పాటు ఇతర సరుకులను కూడా అమ్ముకుంటూ నెలకు రూ.5 నుంచి రూ.10 వేల వరకు సంపాదించుకుంటున్నారు. చంద్రన్న విలేజ్‌మాల్‌గా ఆ దుకాణం మారితే మిగిలిన వస్తువులు అమ్ముకునే అవకాశం లేక నష్టపోతామనే భయాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఏం కొంటాం..ఏం తింటాం రేషన్ షాపులను చంద్రన్న విలేజ్‌మాల్స్‌గా మారుస్తున్నారంటే దానిలోని అన్ని రకాలు సరుకులు తక్కువ ధరలకు దొరుకుతాయనుకున్నాం. ప్రారంభోత్సవం రోజున వెళ్లి చూస్తే పప్పు దినుసులన్నీ బయట మార్కెట్‌కంటే ఎక్కువగా ఉన్నాయి. ఇంత రేట్లు ఉంటే ఇక్కడి వరకూ రావడం దేనికి. ఇంటికి దగ్గరలో ఉన్న పచారి షాపులోనే కొనుక్కుంటాం కదా. – షేక్ ఆషాబీ, కబేళా రోడ్, విజయవాడ పప్పులు లేకుండా విలేజ్ మాల్స్ ఏమిటి? కందిపప్పు, మినపపప్పు, శనగపప్పు వంటి నిత్యావసర సరుకులు లేకుండా విలేజ్ మాల్స్ ఏమిటో అర్ధం కావడం లేదు. షాపునకు వెళ్లి చూస్తే నిత్యావసరాలు కనబడ లేదు. నిర్వాహకులను అడిగితే త్వరలో వస్తాయని సమాధానం చెబుతున్నారు. ఈ రేషన్ షాపును పైలెట్ ప్రాజెక్ట్‌గా రెండు నెలల క్రితమే నిర్ణయించినప్పుడు ముందుగా అన్ని సరుకులు సిద్ధం చేయకపోవడం ఏమిటో? – చిమటా గోపి, విద్యాధరపురం, విజయవాడ -
జోరుగా పొగాకు మార్కెట్
► రోజురోజుకీ పెరుగుతున్న గరిష్ట ధరలు ► ఈ సీజన్లో రూ.168 అత్యధిక ధర ► ఊరట చెందుతున్న పొగాకు రైతులు ► ప్రధాన కంపెనీలు ధరలు ► పెంచకపోవడంపై చర్చ ఒంగోలు టూటౌన్ : జిల్లాలో పొగాకు మార్కెట్ జోరుగా కొనసాగుతోంది. ధరలు ఆశాజనకంగా ఉండటంతో రైతులు ఊరట చెందుతున్నారు. ఇప్పటి వరకు అత్యధిక ధర రూ.168 వచ్చింది. గత శనివారం టంగుటూరు–1లో ఈ ధర రావడం పొగాకు రైతుల్లో చర్చనీయాంశమైంది. ఈ సీజన్లో రాష్ట్రంలో ఇదే అత్యధిక ధర కావడం గమనార్హం. ఇదే విధంగా శుక్రవారం ఒంగోలు–2 వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.168 రాగా, అత్యల్ప ధర కొండపి వేలం కేంద్రంలో పలికింది. శనివారం టంగుటూరు వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.167 పలకగా, అత్యల్ప ధర రూ.135 రావడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇలా పలు వేలం కేంద్రాలలో రూ.161 నుంచి రూ.166 వరకు ధర లభిస్తోంది. ఈ సీజన్లో పొగాకు కొనుగోళ్లు మార్చి 15న ప్రారంభమయ్యాయి. తొలిరోజు గరిష్ట ధర కిలో రూ.160 పలికి రైతుల్లో ఆనందం నింపింది. గత ఏడాది కిలో రూ.140తో ప్రారంభించిన వ్యాపారులు.. ఈసారి కిలో రూ.160తో ప్రారంభించడం విశేషంగా చెప్పుకోవచ్చు. దీంతో తొలి రోజే ధరలపై రైతుల్లో కొంత మేర సంతృప్తి కనిపించింది. కొనుగోళ్లు ప్రారంభించిన నాటి నుంచి నేటి వరకు రోజురోజుకీ ధరలు పెరుగుతూనే ఉన్నాయి. కిలోకి రూ.163పైనే గరిష్ట ధర...: శనివారం దక్షిణాది తేలిక నేలలు, నల్లరేగడి నేలల కొన్ని వేలం కేంద్రాలలో ధరలు పరిశీలిస్తే.. కిలోకి గరిష్ట ధర రూ.163 పైనే ఉంది. అత్యధికంగా టంగుటూరు–1లో మళ్లీ కిలోకి రూ.167 పలికింది. అదే విధంగా వెల్లంపల్లి వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.163 రాగా, కనిష్ట ధర రూ.116 లభించింది. ఒంగోలు–1 వేలం కేంద్రంలో కిలోకి అత్యధికంగా రూ.162 రాగా, ఒంగోలు–2 వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.164 వచ్చింది. టంగుటూరు–2 వేలం కేంద్రంలో అత్యధిక రూ.162 లభించగా, అత్యల్ప ధర రూ.104 లభించింది. కొండపి వేలం కేంద్రంలో అత్యధిక ధర రూ.163 లభించడంతో రైతులు కొంత ఊరట చెందారు. 15 తరువాత విదేశీ కంపెనీ ప్రతినిధులు రాక...: పలు విదేశీ కంపెనీల ప్రతినిధులు ఈ నెల 15 తరువాత వచ్చే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. కంపెనీ ప్రతినిధులు వస్తే.. పంట నాణ్యతను పరిశీలించి ఆర్డర్లు ఖరారు చేసుకునే అవకాశం ఉంది. ఈ పరిస్థితులలో విదేశీ ఆర్డర్లకు చూపించేందుకు శాంపిల్స్ కోసం కొంత మంది వ్యాపారులు పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. అందులో భాగంగానే పొగాకు కొనడం వలనే ధరలు పెరిగినట్లు తెలుస్తోంది. మేలు రకం పొగాకు వారికి చూపించేందుకే స్థానిక వ్యాపారులు వేలం కేంద్రాలలో పోటీపడుతున్నట్లు తెలుస్తోంది. కీలక కంపెనీల కన్నా.. డీలర్లుగా ఉండే మధ్య స్థాయి కంపెనీల వారే ప్రస్తుతం కాస్తంత ఎక్కువ ధరలు ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. మార్కెట్లో ప్రధాన కంపెనీలుగా పేరున్న కంపెనీలు తొలిరోజు ఇచ్చిన గరిష్ట ధర కిలో రూ.160లోపేనని రైతు సంఘ నాయకులు చెబుతున్నారు. ప్రధాన ఎగుమతిదారులుగా పేరున్న కంపెనీలు ఇంకా పూర్తిస్థాయిలో కొనుగోళ్లకు రాలేదని పొగాకు రైతులు చర్చించుకుంటున్నారు. దీనిపై పొగాకు రైతుల్లో ఒకింత ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రధాన కంపెనీలు ధరలు పెంచకుండా సాధారణ వ్యాపారులు మాత్రమే అధిక ధరలు ఇవ్వడం ఎంతకాలం సాధ్యమన్న అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనా ఊహించిన దానికన్నా ఆరంభంలోనే మార్కెట్ మెరుగ్గా ఉండటంపై రైతులు సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు 1.2 మిలియన్ కిలోలు కొనుగోలు: జిల్లాలో మొత్తం 82 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతిచ్చింది. దీనిలో ఎస్బీఎస్ పరిధిలో 42 మిలియన్ కిలోల ఉత్పత్తికి ఆథరైజ్డ్ ఇవ్వగా, సుమారు 32 మిలియన్ కిలోలు మాత్రమే పంట ఉత్పత్తి వచ్చే అవకాశం ఉందని అంచనా. దీనిలో ఇప్పటి వరకు 1.2 మిలియన్ కిలోలు కొన్నట్లు ఎస్బీఎస్ ఆర్ఎం జి.ఉమామహేశ్వరరావు తెలిపారు. సరాసరి ధర రూ.156.29 వచ్చినట్లు చెప్పారు. అదే విధంగా ఎస్ఎల్ఎస్ పరిధిలో 40.5 మిలియన్ కిలోల పంట ఉత్పత్తికి అనుమతివ్వగా, కేవలం 23 మిలియన్ కిలోల పంట ఉత్పత్తి వస్తుందని అంచనా. ఇప్పటి వరకు వేలం కేంద్రాలలో 1.1 మిలియన్ కిలోల పొగాకు మాత్రమే కొనుగోలు చేసినట్లు ఎస్ఎల్ఎస్ ఆర్ఎం రత్నసాగర్ తెలిపారు. సరాసరి ధర రూ.156 వచ్చినట్లు తెలిపారు. -
కొండెక్కిన ధరలు !
ధరల కలవరం – కొనలేని.. తినలేని దుస్థితిలో సామాన్యులు – ధరల అదుపునకు ప్రభుత్వ చర్యలు శూన్యం సరుకులు కిలో రూ.ల్లో కందిపప్పు 150 శనగపప్పు 120 వేరుశనగ నూనె 120 సన్‌ఫ్లవర్ నూనె 100 పామోలిన్ 60 చింతపండు 140 ఎండుమిర్చి 160 బెల్లం 60 అనంతపురం అర్బన్ : సామాన్యులపై ధరలు దాడి చే స్తూ కలవరపెడుతున్నాయి. నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకీ పైపైకి ఎగబాకుతుండడంతో తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. నిత్యావసర సరుకుల ధరలు ఏకంగా సామాన్యులు కొనలేని.. తినలేని స్థాయికి చేరుకున్నాయి. వాటి అదుపు చేయడంలో ప్రభుత్వం విఫలమవుతోంది. భగ్గుమంటున్న ధరలు.. కందిపప్పు, చింతపండు, ఎండు మిర్చి, వంట నూనె, బెల్లం, తదితర నిత్యావసర సరుకులు లేకుంటే కుటుంబం గడవదు. వీటి ధరల పేద వర్గాలకు అందనంతగా పైపైకి పోతున్నాయి. వీటి సెగకు సామాన్య ప్రజలు అల్లాడిపోతున్నారు. పేద, మధ్యతరగతి వర్గాలు తమ నెలసరి సంపాదనలో అత్యధిక మొత్తం నిత్యావసర సురుకులకే వెచ్చించాల్సి వస్తోంది. ఇక రోజువారీ కూలీ చేసుకుని కుటుంబాలను పోషించుకునే వారి పరిస్థితి మరింత దుర్భరంగా మారింది. కందిపప్పు మొదటి రకం రూ.150 ఉండగా రెండవ రకం రూ.130 ఉంది. శనగపప్పు రెండు నెలల క్రితం వరకు రూ.84 ఉండగా ఇప్పుడు ఏకంగా రూ.120కి ఎగబాకింది. చింతపండు రూ.140 ఉంది. వేరుశనగ నూనె రూ.120, సన్‌ఫ్లవర్ నూనె రూ.100, పామోలిన్ రూ.60 వరకు ఉంది. ప్రభుత్వ చర్యలు శూన్యం.. ఒకవైపు నిత్యావసర సరుకుల ధరల అదుపు తప్పుతున్నా ప్రభుత్వం నుంచి చర్యలు శూన్యమే అయ్యాయి. ధరలను నియంత్రించేందుకు కనీస చర్యలు కూడా చేపడుతున్న దాఖలాలు లేపు. ఇది ఒక రకంగా బడా వ్యాపారులకు అనుకూలంగా మారింది. ట్రెడింగ్ బిజినెస్ ద్వారా ఇష్టారాజ్యంగా ధరలను పెంచేస్తున్నారు. అక్రమ నిల్వలపై మొక్కుబడి నిత్యావసర సరుకుల ధరలు పెరుగుతున్న క్రమంలో ఒక స్థాయి వ్యాపారులు అక్రమ నిల్వలు పాల్పడుతున్నారు. నిల్వలపై అధికార యంత్రాగం మొక్కబడి దాడులతో సరిబెడుతున్నట్లు విమర్శలు వస్తున్నాయి. దీంతో కొందరు వ్యాపారులు పెద్ద ఎత్తున్న కందిపప్పు, శనగ పప్పు, చింతపండు వంటి నిత్యాసర సరుకులు అక్రమంగా నిల్వ చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. పేదల పరిస్థితి దుర్భరం రోజు రోజుకు పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరల కారణంగా పేద కుటుంబాల పరిస్థితి దుర్భరంగా మారింది. రోజువారీ సంపాదన సరుకులకే వెచ్చించాల్సిన దుస్థితి నెలకొంది. ధరలను అదుపు చేయడంలో ప్రభుత్వం పూర్తిగా వైఫల్యం చెందింది. – చంద్రిక, ఐద్వా నాయకురాలు కడుపు నిండా తినలేని దుస్థితి పేద, మధ్యతరగతి వర్గాల వారు కడుపు నిండా తినలేని దుస్థితి నెలకొంది. నిత్యావసర వస్తువుల్లో ప్రధానమైన కందిపప్పు, చింతపండు, వంట నూనె ఇలా ప్రతి వాటి ధరల రోజు రోజుకి పెరుగుతున్నాయి. ధరలను నియంత్రించడంలో ప్రభుత్వం కనీస చర్యలు చేపట్టకపోవడం ప్రజల పాలిటి శాపంగా మారింది. – ఈడిగ జయలక్ష్మి, మహిళ సమాఖ్య నాయకురాలు చాలా కష్టంగా ఉంది చిన్నపాటి కాంట్రాక్టు పనులు చేసుకుని మాలాంటి మధ్యతరగతి వర్గాల బతుకులు చాలా కష్టంగా ఉన్నాయి. కుటంబపోషణ భారంగా ఉంది. కొద్ది పాటి సంపాదనలో అధిక మొత్తం నిత్యావసర సరుకులకే వెచ్చించాల్సి వస్తోంది. ధరలను అదుపు చేసి పేద, మధ్యతరగతి వర్గాలకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – సూరి, శారదానగర్ -
జనరిక్.. మాయాజాలం
అధిక ధరలకు విక్రయం గుడ్‌విల్ మత్తులో వైద్యులు ధనార్జనే ధ్యేయంగా వ్యాపారులు ఏజెన్సీలకు కాసుల పంట బెల్లంపల్లి రూరల్ : ఆదిలాబాద్ జిల్లాలోని మందుల దుకాణదారులు లాభార్జనే ధ్యేయంగా వ్యవహరిస్తుండడంతో సామాన్య ప్రజల ఆరోగ్యం అగమ్యగోచరంగా మారుతోంది. మెరుగైన వైద్యం కోసం పట్టణ ప్రాంతాలకు తరలివస్తే కొత్త సీసాలో పాత మందు అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. పట్టణ ప్రాంతాలకు చెందిన వైద్యులు వేలాది రూపాయలు పరీక్షల పేరిట తీసుకోవడమే కాకుండా రోగానికి పనికొచ్చే మందులు ఇవ్వడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూర్పు ప్రాంతంలోని మంచిర్యాల, బెల్లంపల్లి, మందమర్రి, చెన్నూర్, కాగజ్‌నగర్, శ్రీరాంపూర్‌తోపాటు పలు మండలాల్లో మందుల షాపుల యజమానులు జనరిక్ మందులను పేరు పొందిన కంపెనీల మందుల ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జనరిక్ మందులు రోగులకు అంటగడితే 100 శాతం లాభాలను గడించవచ్చని తెలివిగా వ్యవహరిస్తున్నారు. వైద్యులు ఏ మందులు రాసినా దుకాణాల యజమానులు రోగులకు ఎక్కువ మొత్తంలో సంబంధిత జనరిక్ మందులే ఇస్తున్నారు. పట్టణ ప్రాంతాల్లో పని చేసే వైద్యులు మెడికల్ ఏజెన్సీలతో కుమ్మక్కై బ్రాండెడ్ మందులకు బదులుగా జనరిక్ మందులను రోగులకు అంటగడుతూ లక్షలాది రూపాయలు సొమ్ము చేసుకుంటున్నారు. జనరిక్ మందులను రాస్తే వైద్యులకు ఏజెన్సీ వారు పెద్ద మొత్తంలో గుడ్‌విల్‌ను అందించడమే కాకుండా మందుల దుకాణాల యజమానులకు ఆఫర్లు ప్రకటిస్తున్నారు. అర్హత లేకున్నా దుకాణాల నిర్వహణ పట్టణాల్లో పుట్ట గొడుగుల్లా పుట్టుకొస్తున్న మెడికల్ షాపుల నిర్వహణ మరీ అధ్వానంగా మారింది. కనీస అర్హత లేని వ్యక్తులు కూడా మందుల దుకాణాలు నిర్వహిస్తున్నారు. ప్రభుత్వ గుర్తింపు కలిగిన ఫార్మసి లైసెన్స్ కలిగి ఉండి నిబంధనలకు అనుగుణంగా దుకాణాలు ఏర్పాటు చేయాల్సి ఉండగా.. కొంత కాలం దుకాణాల్లో పని చేసిన వారూ.. అవగాహన లేని వారూ దుకాణాలు నిర్వహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. మందుల దుకాణాల నిర్వహణ, ఆస్పత్రుల పని తీరుపై సంబంధిత అధికారులు ఎప్పటికప్పుడు తనిఖీలు చేయాల్సి ఉండగా.. ఏమాత్రం పట్టించుకోవడం లేదనే ఆరోపణలు వినవస్తున్నాయి. రోగం వచ్చినా.. నొప్పి వచ్చినా పట్టణాలకే ప్రజలు అనారోగ్యానికి గురైనప్పుడు పట్టణాలకే వైద్యం నిమిత్తం వస్తుంటారు. రోగుల అత్యవసర పరిస్థితిని సొమ్ము చేసుకునేందుకు ఇక్కడి వైద్యులతో పాటు మందుల దుకాణాల యజమానులు వ్యవహరిస్తున్నారు. రోగానికి తగ్గట్లు మందులు ఇవ్వాల్సి ఉండగా జనరిక్ మందులను రాస్తున్నారనే ఆరోపణలున్నాయి. అక్షర జ్ఞానం లేని పల్లెవాసులు వారిని నమ్మి అధిక ధరలకు మందులు కొనుగోలు చేస్తున్నారు. పల్లెల్లోని ఆర్ఎంపీలు సైతం జనరిక్ మందులను రోగులకు ఇస్తున్నారు. ఎలాంటి పరిజ్ఞానం లేకుండా మందుల షాపులను నిర్వహిస్తున్న యజమానులపై సంబంధిత అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నిబంధనలు ఏమి లేవు జనరిక్ మందులు అమ్మకూడదని ఎలాంటి నిబంధనలు లేవు. లెసైన్స్ లేకుండా ఎవరైనా మందుల షాపులను నిర్వహిస్తే చర్యలు తీసుకుంటాం. నిబంధనలకు విరుద్ధంగా వ్యాపారం చేస్తే శాఖపరమైన చర్యలు తీసుకోవడానికి వెనుకాడబోం. - రాజమొగిళి, మంచిర్యాల డ్రగ్ ఇన్స్పెక్టర్ -
ఏ ముక్క ముట్టలేం
► భారీగా పెరిగిన మటన్, చికెన్ ధరలు ► కూరగాయల ధరలతో పోటీ ► నిలకడగా చేపల ధరలు ► సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాంసాహారానికి దూరం శ్రీకాకుళం: మటన్, చికెన్ ధరలు ఒక్కసారిగా పెరిగాయి. నిత్యావసర సరుకులు, కూరగాయల ధరలతో పోటీ పడుతున్నాయి. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడంతో, ఈ ప్రభావం వీటిపై పడింది. సామాన్య, మధ్య తరగతి ప్రజలు మాంసాహారానికి దూరమయ్యే పరిస్థితి నెలకొంది. వారాంతరాల్లో కూడా మాంసాహారం తినే పరిస్థితి కనిపించడం లేదు. కూరగాయల ధరలు పెరగడంతో ఇదే అదునుగా వ్యాపారులు చికెన్, మటన్ ధరలును మరింత పెంచేశారు. చేపల ధరలే కాస్త అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు అందరి చూపు చేపలవైపే ఉంది. చికెన్ స్కిన్లెస్ కిలో రూ.200 ఉంది. మటన్ ధర మరింత పైపైకి పోతోంది. ప్రస్తుతం కిలో రూ.500పైగా పలుకుతోంది. ఈ ధరలు ఎందుకు పెరుగుతాయి, ఎవరు పెంచుతారు, ఎప్పుడు పెంచుతారో తెలియని పరిస్థితి నెలకొంది. ధరలపై అధికారుల నియంత్రణ ఉందా? లేక వ్యాపారులే నచ్చినపుడు పెంచుకోవచ్చునా తెలియక ప్రజలు గందరగోళానికి గురవుతున్నారు. ధరల నియంత్రణలో ప్రభుత్వం విఫలం కూరగాయలు తిందామంటే ధరలు మండుతున్నాయి. చికెన్, మటన్ ముట్టకోలేం. ఎలా బతకాలని సామాన్య, మధ్య తరగతి ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. టీడీపీ, బీజేపీ ప్రభుత్వాలు ధరల నియంత్రణలో విఫలమయ్యాయని మండిపడుతున్నారు. ఎన్నడూ లేని విధంగా నిత్యవసర సరుకుల ధరలు, కూరగాయలు, చికెన్, మటన్ ధరలు అకాశానంటాయి. ఇదే పరిస్థితి కొనసాగితే పేదలు బతకడం కష్టమని వాపోతున్నారు. వ్యాపారాలు అంతంత మాత్రమే ప్రస్తుతం ఎండలు కారణంగా కోళ్లు అంతగా సరఫరా కావడం లేదు. ఇదే చికెన్ ధర పెరగడానికి కారణం. ఫౌల్ట్రీ నుంచి తెచ్చేటప్పుడు కొన్ని కోళ్లు చచ్చిపోతున్నాయి. ఈ నష్టాన్ని భర్తీ చేయాలంటే ధర పెంచక తప్పదు. ప్రస్తుతం వ్యాపారాలు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయి. - వై.రాజు, చికెన్ సెంటర్ యజమాని, శ్రీకాకుళం కాళీ సంచితో తిరిగి వస్తున్నాం ప్రస్తుతం అరకొర జీతంతో బతకాలంటేనే చాలా కష్టంగా ఉంది. మార్కెట్లో ఏ కూరగాయలు కొనాలన్నా కిలో రూ.40పై మాటే. ధరలకు భయపడి ఏమి కొనకుండా ఖాళీ సంచితో తిరిగి వస్తున్నాం. చికెన్, మటన్ ధరలంటే మరి చెప్పనక్కర్లేదు. -ఎం.త్రినాథరావు, ప్రైవేటు ఉద్యోగి, శ్రీకాకుళం -
దోసెకు పేదలిక దూరమేనా?
► కుతకుతలాడుతున్న కందిపప్పు ► చుక్కలు తాకుతున్న మినపపప్పు ► ఘాటెక్కిన మిర్చి, కొండెక్కిన చింతపండు ► దోసె, ఇడ్లీ మర్చిపోవాల్సిందేనంటున్న మధ్యతరగతి ► పచ్చడన్నం కూడా భారమవుతుందన్న పేదలు ► పచ్చళ్లు పెట్టుకోవడం కూడా కష్టమే హైదరాబాద్: దోసె, ఇడ్లీలకు పేదలు, సామాన్య ప్రజలు దూరం కావాల్సిందేనా? నాలుకను కట్టేసుకోవాల్సిందేనా? మండుతున్న ఎండలను మించిపోయేలా పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలను చూస్తే తప్పదనిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో కందిపప్పు కుతకుతలాడుతోంది. మినపపప్పు ధర చుక్కలంటుతోంది. పల్లీల రేట్లూ పెరిగిపోయాయి. పంట చేతికొస్తున్న దశలోనే చింతపండు ధర కొండెక్కి కూర్చొంది. కిలో పచ్చి మిర్చి ఏకంగా రూ.వంద పలుకుతోంది. ఎండుమిర్చి మరింత ఘాటెక్కింది. విపరీతంగా పెరిగిన నిత్యావసరాల ధరలు వింటేనే సామాన్యుల గుండె దడదడలాడుతోంది. గత నెల రోజుల్లోనే పప్పుల ధరలు భారీగా పెరిగాయి. 2014 ఏప్రిల్‌తో పోల్చితే ప్రస్తుతం చాలా నిత్యావసర సరుకుల ధరలు రెండు రెట్లు అధికమయ్యాయి. ఈ రేట్లతో సరుకులు కొనేందుకు మార్కెట్‌కు వెళ్లాలంటే జేబులు తడుముకొని వాయిదా వేసుకోవాల్సి వస్తోందని సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నెల రోజుల కిందట రూ.125 ఉన్న కిలో కందిపప్పు ఇప్పుడు ఏకంగా రూ. 180కి చేరింది. మినప పప్పు ధర రూ.130 నుంచి రూ.190 - 200కు ఎగబాకింది. కిలో పల్లీల రేటు రూ. 90 నుంచి రూ. 140కి చేరింది. ఇలా ఏ నిత్యావసర సరుకు తీసుకున్నా విపరీతంగా ధర పెరిగిపోవడం సామాన్య, దిగువ మధ్యతరగతి, చిరు వేతన జీవులను ఆర్థికంగా కుంగదీస్తోంది. పచ్చడన్నం తినాలన్నా భారమే.. కందిపప్పు ధర భారీగా పెరిగిన నేపథ్యంలో చిన్న చిన్న హోటళ్లలో సాంబారు, పప్పుకు కందిపప్పు బదులు పెసర పప్పు వాడుతున్నారు. మినపపప్పు రేటు విపరీతంగా పెరిగినందున ఇడ్లీ, దోసెలకు స్వస్తి చెప్పాల్సి వస్తోందని పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాలు అంటున్నాయి. ఇడ్లీలు, దోసెలు చేసుకోవడం దాదాపు మర్చిపోయామని కడపకు చెందిన ప్రేమలత అనే ప్రైవేటు ఉపాధ్యాయురాలు తెలిపారు. పప్పుల ధరలు భారీగా పెరిగిన నేపథ్యంలో వాటిని కొనలేక పచ్చడన్నంతో సరిపెట్టుకుందామన్నా అదీ భారంగా ఉందని పేదలు కంట తడిపెట్టుకుంటున్నారు. పచ్చడికి అవసరమైన చింతపండు, ఎండుమిర్చి, పచ్చిమిర్చి, నువ్వులు, పల్లీల ధరలు నింగినంటుతుండటమే ఇందుకు కారణం. చింతపండు కిలో ధర రూ. 70 నుంచి రూ.120కి పెరిగింది. ఎండు మిర్చి రూ. వంద నుంచి 170కి ఎగబాకింది. పచ్చిమిర్చి కిలో రూ. 90 నుంచి రూ. 100 వరకూ పలుకుతోంది. నువ్వుల మాట ఇక చెప్పనక్కరలేదు. ప్రత్యామ్నాయంగా పల్లీలు తీసుకోవాలన్నా కిలో రూ. 140 పైనే ఉండటం సామాన్యులకు భారంగా మారింది. పెరిగిన ధరలతో పచ్చడి మెతుకులు సమకూర్చుకోవడం కూడా భారంగా ఉందని పేదలు వాపోతున్నారు. ఈ ఏడాది పచ్చళ్లూ కష్టమే... మామిడి కాయలు మార్కెట్లోకి వచ్చిన నేపథ్యంలో ఏడాది పొడవున అత్యవసరాలకు వాడుకునేందుకు పచ్చళ్లు పెట్టాలనుకునేవారు సైతం పెరిగిన ధరలతో ఆందోళన చెందుతున్నారు. ఎండు మిర్చి కిలో రూ. 170 నుంచి 190 పలుకుతుండటం ఇందుకు ఒక కారణం. పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండటానికి నువ్వుల నూనె మంచిది. నాణ్యమైన నువ్వుల నూనె లీటరు రూ.160పైనే పలుకుతోంది. నాణ్యమైన మిర్చిపొడి కిలో రూ.250 పైనే ఉంది. పచ్చళ్లలో తప్పకుండా వాడాల్సిన ఆవాలు ధర కూడా చాలా పెరిగిపోయింది. మామిడి కాయ ఒక్కోటి సైజును బట్టి రూ.15 నుంచి రూ. 22 వరకూ ధర ఉంది. ముక్కలు కోసినందుకు ఒక్కో కాయకు ఏకంగా రూ. 4 వసూలు చేస్తున్నారు. దీంతో పచ్చళ్లు కూడా చాలా తక్కువ మోతాదులో పెట్టుకుంటున్నామని మహిళలు వాపోతున్నారు. ధరల పెరుగుదల తీరు ఇదీ.... సరుకు 2014 2015 2016 కందిపప్పు 70 115 180 మినపపప్పు 75 130 200 ఎండుమిర్చి 82 110 170 చింతపండు 70 105 120 పచ్చిమిర్చి 50 70 100 -
ఆకాశాన్నంటిన ధరలతో జనం అవస్థలు
-
ధరాఘాతంపై వైఎస్సార్సీపీ ఆందోళనలు
విజయవాడ: పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకు నిరసనగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆందోళనలు నిర్వహించింది. జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల ఎదుట ఆందోళనలు చేపట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. విజయనగరం: విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా చేశారు. విజయనగరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి, బొబ్బిలిలో వైఎస్సార్సీపీ నేత బేబి నాయన ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. శ్రీకాకుళం: శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి ధర్మాన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా చేశారు. విశాఖపట్టణం: విశాఖ జిల్లా వ్యాప్తంగా పెరిగిన ధరలకు నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తైనాల విజయ్‌కుమార్ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ పాల్గొన్నారు. టర్నర్ చౌల్ట్రీలో వైఎస్సార్సీపీ నేతలు కోలా గురువులు, జాన్ వెస్లీ, చిన్న గదిలి రూరల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేత వంశీ కృష్ణా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.శ్రీహరిపురంలో పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మళ్లా విజయ్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు. తూర్పుగోదావరి: రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తుని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రత్తిపాడు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ధర్నాచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ పాల్గొన్నారు. కోరుకొండలో జక్కంపూడి విజయలక్ష్మీ, అనపర్తిలో డా.సూర్యనారాయణరెడ్డి, అమలాపురంలో విశ్వరూప్, చిట్టబ్బాయి ఆధ్వర్యంలో స్ధానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆందోళన చేశారు. మండపేట, కడియం ఎమ్మార్వో కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ నేత పట్టాభి రామయ్య, వెంకటస్వామి నాయుడు ధర్నాలు చేశారు. రాజమండ్రి రూరల్‌లో ఆకుల వీర్రాజు, పి.గన్నవరంలో కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాకినాడ అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు. పశ్చిమ గోదావరి: భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, ఆచంటలో ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు.నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, పోలవరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా, సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్థం చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. పాలకొల్లులో మేకాశేషుబాబు, కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, వందనపు సాయిబాల పద్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. కృష్ణా: కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. నూజివీడు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే మేకా ప్రతాప్‌అప్పారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా చేశారు. విజయవాడ గాంధీనగర్‌లో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారుఅవనిగడ్డలో రమేశ్, గన్నవరంలో దుత్తా రామచంద్రారావు ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. పామర్రు తహశీల్దార్ కార్యాలయం ఎదుట జరిగిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నందిగామలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్‌కుమార్, మైలవరంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. జగ్గయ్యపేటలో నిర్వహించిన కార్యక్రమంలో సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు. గుంటూరు: గుంటూరు తహశీల్దార్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రాష్ట్ర కార్యదర్మి లేళ్ల అప్పారెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, గురజాలలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రకాశం: ఎర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాలకొండ డేవిడ్ రాజు ధర్నా నిర్వహించారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, చీరాలలో, కనిగిరిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేశారు. చిన్నగంజాంలో గొట్టిపాటి భరత్ కుమార్, కొండేటిలో అశోక్ బాబు ఆందోళనలో పాల్గొన్నారు. ఒంగోలులో వైఎస్సార్సీపీ నేతలు కుప్పం ప్రసాద్, చిన్న రాజు వెంకట్రావు, కటారి శంకర్, గంగాడ సుజాత ధర్నాలో పాల్గొన్నారు శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు: ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధర్నా చేశారు. కడవలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీ మేకపాటి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. పప్పు దినుసుల ధరను నియంత్రించడంలో సర్కార్ విఫలమైందని ఎంపీ మేకపాటి అన్నారు. వెంటనే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మేకపాటి తెలపారు. చిత్తూరు: చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత ధర్నా నిర్వహించారు. సత్యవేడు, చంద్రగిరి, జంగాలపల్లి, బైరెడ్డిపల్లి, గంగాధర నెల్లూరు, తంబళ్లపల్లి, బి.కొత్తకోట,పలమనేరులలో ధర్నా కార్యక్రమాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వడమాలపేటలో ఎమ్మెల్యే రోజా, మదనపల్లిలో ఎమ్మెల్యే తిప్పారెడ్డి నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా: పులివెందుల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కమలాపురంలో పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో రామ్మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు. రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్, బద్వేల్లో ఎమ్మెల్యే జయరాములు ధర్నాలో పాల్గొన్నారు. జమ్ములమడుగులో వైఎస్ఆర్ సీపీ యువజన కార్యదర్శి హనుమంతరెడ్డి ధర్నా చేశారు. అనంతపురం: ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నా నిర్వహించారు. వినూత్నంగా తోపుడు బండిపై నిత్యావసర సరుకులు అమ్మి నిరసన తెలిపారు.ధర్మారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రిలో రమేశ్‌రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.జిల్లాలోని రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కర్నూలు: బనగానపల్లిలో వైఎస్సార్సీపీ నేత కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మిగనూరు, ఆలూరులో ధర్నాలు నిర్వహించారు. కోరుమూడులో ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు. -
కోయకుండానే కన్నీళ్లు తెప్పిస్తున్న ఉల్లి
-
పండుగ పూటా పస్తులే..!
* ఇంతవరకూ అందని చక్కెర * బియ్యం.. పప్పు.. ఉప్పూ కరువే * ఐదు నెలలుగా పామాయిల్ సరఫరా బంద్ * సర్కార్ తీరుపై పేదల ఆక్రోశం సంగారెడ్డి: తెలంగాణలో పండుగరోజు పప్పన్నం తినటం కాదు, పాయసం తాగుదాం...పండుగకు వారం రోజుల ముందే పేదలకు అవసరమైన పండుగ సామాను అందజేస్తాం. - సీఎం కేసీఆర్ చెప్పిన మాటలివి. కానీ సీఎం మాటలకు చేతలకు ఏ మాత్రం పొంతన కుదరడం లేదు. తెలుగువారు చేసుకునే పండుగల్లో సంక్రాంతి పెద్ద పండుగ. పల్లెల్లోనే కాదు పట్టణాల్లోని ప్రజలు సంక్రాంతి పండుగను ఘనంగా జరుపుకుంటారు. పెద్దోళ్లు..పేదోళ్లు అన్న తేడా లేకుండా పండుగపూట పిండి వంటలు చేసుకుని కుటుంబసభ్యులంతా సంతోషంగా తింటారు. అయితే ఈ సంక్రాంతికి పేదలు పిండివంటలు కాదుకదా, కనీసం పప్పు బువ్వ కూడా తినలేని పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు పంపిణీ చేసి బియ్యం, పప్పు, ఉప్పు, చక్కెర, పామాయిల్ ఇలా వంట సరుకులేవీ ఈ నెల అందలేదు. దీంతో సకినాలు సుట్టుకుందామంటే బియ్యం లేవు..తీపి గారెలు చేద్దామంటే చక్కెర ఇవ్వలేదు...పిండివంటలు చేద్దామంటే పామాయిల్ లేదు.. ఇంగ పండుగ ఏం జేస్తం అంటూ తెల్లరేషన్ కార్డులున్న పేదలు ఆవేదన చెందుతున్నారు. కోటా పెరగక పోగా..అసలుకే ఎసరు సర్కార్ పౌరసరఫరాల శాఖ ద్వారా పేదలకు బియ్యం, పప్పు, నూనె, చెక్కెరతో పాటు ఇతర నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. అయితే ప్రతి పండుగకూ ముందుగానే కోటా పెంచి మరీ నిత్యావసరాలు పంపిణీ చేస్తుంది. అయితే ఈ సంక్రాంతికి మాత్రం పేదలకు చౌకధరల దుకాణాల ద్వారా ఎలాంటి సరుకులు అందలేదు. ఇదేమిటని అడిగితే ఆహారభద్రతా కార్డులు తయారు కాలేదనీ, దీంతో సరుకుల పంపిణీ కాలేదని అధికారులు చెబుతున్నారు. జిల్లాలో ఆరు లక్షలపైచిలుకు రేషన్‌కార్డులుండగా, జిల్లా వ్యాప్తంగా ఉన్న 1,843 చౌకధరల దుకాణాల ద్వారా రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం, పప్పు, ఉప్పు లాంటి సరుకులు సరఫరా చేస్తున్నారు. అయితే ఈనెల రేషన్‌కార్డు లబ్ధిదారులకు ఎక్కడా సరుకుల పంపిణీ జరగలేదు. ఆరు లక్షల పైచిలుకు రేషన్‌కార్డు లబ్ధిదారులకు బియ్యం పంపిణీ చేయాలంటే 20.647 మెట్రిక్ టన్నుల బియ్యం అవసరం అవుతాయి. అయితే ఈనెల కేవలం ఆహారభద్రతాకార్డుల పూర్తయిన చోట్ల కేవలం 5 వేల క్వింటాళ్ల బియ్యం మాత్రమే సరఫరా చేశారు. ప్రతి కుటుంబానికి కనీసం కిలో చక్కెర పంపిణీ చేయాలి. అయితే ఇప్పటి వరకు కేవలం అర కేజీ చొప్పున 550 క్వింటాళ్ల చక్కెర మాత్రమే సరఫరా చేశారు. సంక్రాంతి పండుగ పూట అరిశెలు, ఇతర పిండివంటలు చేసుకోవాలనుకునే కుటుంబాలకు అరకిలో చక్కెర ఏమాత్రం సరిపోదు. దీంతో ఎక్కువ రేటు పెట్టి మార్కెట్లో చక్కెర కొనాల్సిన పరిస్థితి నెలకొంది. ఇక సంక్రాంతి అంటేనే సకినాలు గుర్తుకు వస్తాయి. సకినాలు కాల్చుకోవాలంటే నూనె తప్పనిసరిగా ఉండాలి. అయితే చౌకధరల ద్వారా ఐదు మాసాలుగా పామాయిల్ సరఫరా నిలిచిపోయింది. దీంతో రేషన్‌కార్డు లబ్ధిదారులు కిలో పామాయిల్‌కు రూ.80 పెట్టి మార్కెట్లో కొనుక్కోవాల్సిన పరిస్థితి నెలకొంది. అలాగే చౌకధరల దుకాణం ద్వారా సరఫరా అవుతూ వచ్చిన పప్పు, గోధుమలు, ఉప్పు, చింతపండు లాంటి సరుకులు కూడా ఈ నెల సరఫరా కాలేదు. పండుగ పూట కూడా ప్రభుత్వం సరుకులు సరఫరా చేయకపోవటంపై పేదలు ఉడికిపోతున్నారు. సొంత రాష్ట్రంలో పేదలను అక్కున్న చేర్చుకుంటామని చెబుతున్న ప్రభుత్వం పండుగల రోజులు సైతం సరుకులు సరఫరా చేయకపోవటమేమిటని ఆక్రోశంగా ప్రశ్నిస్తున్నారు. అధికారులు మాత్రం ఆహార భద్రతాకార్డుల తయారీలో సమస్యలు, సరుకుల సరఫరాపై స్పష్టత కొరవడటం కారణంగానే సమస్య తలెత్తినట్లు చెబుతున్నారు.