కాశిబుగ్గ వరంగల్ సిటీ : మధుర ఫలాలుగా పేరొందిన మామిడి పండ్లు మామూలుగా ఏప్రిల్ మొదటి వారం నుంచి విరివిగా మార్కెట్లో అందుబాటులో ఉంటాయి. ఈ సారి వాతావరణం అనుకూలంగా లేకపోవడంతో పూత, కాత నెల రోజులు ఆలస్యంగా రావడంతో ఇప్పటి వరకు మార్కెట్లోకి రాలేదు. మరో రెండు వారాల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు మార్కెట్ వర్గాలు తెలుపుతున్నాయి.
కాగా హైదరాబాద్, విజయవాడల నుంచి కొందరు చిరు వ్యాపారులు దొరికిన కొద్దిపాటి బంగినపల్లి మామిడి పండ్లను తీసుకొచ్చి కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్ముతున్నారు. ఈ మామిడి పండ్లు ప్రస్తుతం కాశిబుగ్గ చౌరస్తాతో పాటు అండర్‌బ్రిడ్జి, ములుగురోడ్డు సెంటర్‌లో లభ్యమవుతున్నాయి. సీజన్ ఆరంభంలో వచ్చిన మామిడి పళ్లను చూసి వినియోగదారులు కొనడానికి ఎగబడుతున్నారు.
మందుగా అమ్మకానికి వచ్చే కోబ్రా, నీలంబరి, జలాలు, నీలాలు కూడా ఇప్పటి వరకు అమ్మకానికి రాలేదు. ఒక బంగినపల్లి మాత్రం అక్కడక్కడ అమ్మకానికి ఉండడం విశేషం.కిలో రూ.100 నుంచి 120 వరకు అమ్మకాలు