ధరాఘాతంపై వైఎస్సార్సీపీ ఆందోళనలు | YSRCP Protests on high rates pulls in AP | Sakshi
Sakshi News home page

ధరాఘాతంపై వైఎస్సార్సీపీ ఆందోళనలు

Published Mon, Nov 2 2015 5:09 PM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM

YSRCP Protests on high rates pulls in AP

విజయవాడ: పెరిగిన నిత్యావసర ధరలను వెంటనే అదుపులోకి తీసుకురావడానికి ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని అందుకు నిరసనగా ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ  ఆందోళనలు నిర్వహించింది. జిల్లాల్లోని అన్ని మండల కేంద్రాల ఎదుట ఆందోళనలు చేపట్టిన పార్టీ నాయకులు, కార్యకర్తలు అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

విజయనగరం:
విజయనగరం జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. కురుపాం ఎమ్మెల్యే పుష్పశ్రీ వాణి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ, ధర్నా చేశారు. విజయనగరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వీరభద్రస్వామి, బొబ్బిలిలో వైఎస్సార్సీపీ నేత బేబి నాయన ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.

శ్రీకాకుళం:
శ్రీకాకుళం తహశీల్దార్ కార్యాలయం ఎదుట మాజీ మంత్రి ధర్మాన ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. పాతపట్నం ఎమ్మెల్యే కలమట వెంకట రమణ ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా చేశారు.

విశాఖపట్టణం:
విశాఖ జిల్లా వ్యాప్తంగా పెరిగిన ధరలకు నిత్యావసర ధరలకు వ్యతిరేకంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. సీతమ్మధార ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఉత్తర నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ తైనాల విజయ్కుమార్ ధర్నా నిర్వహించారు. ఈ నిరసన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ పాల్గొన్నారు. టర్నర్ చౌల్ట్రీలో వైఎస్సార్సీపీ నేతలు కోలా గురువులు, జాన్ వెస్లీ, చిన్న గదిలి రూరల్ ఎమ్మార్వో కార్యాలయం వద్ద వైఎస్సార్సీపీ నేత వంశీ కృష్ణా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ర్యాలీలు నిర్వహించి, అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు.శ్రీహరిపురంలో పశ్చిమ నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్ఛార్జ్ మళ్లా విజయ్కుమార్ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ చేశారు.

తూర్పుగోదావరి:
రాజమండ్రి సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ఎమ్మెల్సీ ఆదిరెడ్డి అప్పారావు, తుని ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే దాడిశెట్టి రాజా ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ప్రత్తిపాడు ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే వరుపుల సుబ్బారావు ఆధ్వర్యంలో ధర్నాచేశారు. ఈ నిరసన కార్యక్రమంలో గుడివాడ అమర్నాథ్, మహిళా అధ్యక్షురాలు ఉషాకిరణ్ పాల్గొన్నారు. కోరుకొండలో జక్కంపూడి విజయలక్ష్మీ, అనపర్తిలో డా.సూర్యనారాయణరెడ్డి, అమలాపురంలో విశ్వరూప్, చిట్టబ్బాయి ఆధ్వర్యంలో స్ధానిక ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ఆందోళన నిర్వహించారు. పిఠాపురం తహశీల్దార్ కార్యాలయం వద్ద  వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ పెండెం దొరబాబు ఆందోళన చేశారు. మండపేట, కడియం ఎమ్మార్వో కార్యాలయాల వద్ద వైఎస్సార్సీపీ నేత పట్టాభి రామయ్య, వెంకటస్వామి నాయుడు ధర్నాలు చేశారు. రాజమండ్రి రూరల్లో ఆకుల వీర్రాజు, పి.గన్నవరంలో కొండేటి చిట్టిబాబు ఆధ్వర్యంలో ఆందోళన చేశారు. కాకినాడ అర్బన్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో మాజీ ఎమ్మెల్యే ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి పాల్గొన్నారు.

పశ్చిమ గోదావరి:
భీమవరంలో గ్రంధి శ్రీనివాస్, ఆచంటలో ముదునూరి ప్రసాదరాజు ఆధ్వర్యంలో తహశీల్దార్ కార్యాలయాల ఎదుట ఆందోళన చేశారు.నరసాపురంలో కొత్తపల్లి సుబ్బారాయుడు, పోలవరం ఎమ్మార్వో కార్యాలయం ఎదుట ధర్నా, సీఎం చంద్రబాబు దిష్టిబొమ్మ దగ్థం చేసిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పాల్గొన్నారు. పాలకొల్లులో మేకాశేషుబాబు, కొవ్వూరులో మాజీ ఎమ్మెల్యే తానేటి వనిత, వందనపు సాయిబాల పద్మ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించి అధికారులకు వినతి పత్రాలు సమర్పించారు. ఏలూరులో నిర్వహించిన కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నేత శ్రీనివాస్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

కృష్ణా:
కృష్ణా జిల్లా వ్యాప్తంగా అన్ని మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. నూజివీడు ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎమ్మెల్యే మేకా ప్రతాప్అప్పారావు ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ, ధర్నా చేశారు. విజయవాడ గాంధీనగర్లో ట్రేడ్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారుఅవనిగడ్డలో రమేశ్, గన్నవరంలో దుత్తా రామచంద్రారావు ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. పామర్రు తహశీల్దార్  కార్యాలయం ఎదుట జరిగిన ఎమ్మెల్యే ఉప్పులేటి కల్పన ఆధ్వర్యంలో ధర్నా చేశారు. నందిగామలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి అరుణ్కుమార్, మైలవరంలో మాజీ ఎమ్మెల్యే జోగి రమేష్ ఆధ్వర్యంలో ఆందోళనలు  నిర్వహించారు. జగ్గయ్యపేటలో నిర్వహించిన కార్యక్రమంలో సామినేని ఉదయభాను ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున నేతలు, కార్యకర్తలు పాల్గొన్నారు.

గుంటూరు:
గుంటూరు తహశీల్దార్ ఎమ్మార్వో కార్యాలయం ఎదుట రాష్ట్ర కార్యదర్మి లేళ్ల అప్పారెడ్డి, ఎమ్మెల్యే ముస్తఫా ఆధ్వర్యంలో భారీ ఎత్తున ధర్నా నిర్వహించారు. నర్సరావుపేటలో ఎమ్మెల్యే డా.గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. మాచర్లలో ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, మంగళగిరిలో ఎమ్మెల్యే ఆర్కే ఆధ్వర్యంలో భారీ ఎత్తున ఆందోళనలు నిర్వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు మర్రి రాజశేఖర్ ఆధ్వర్యంలో చిలకలూరుపేట తహశీల్దార్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. తెనాలిలో అన్నాబత్తుని శివకుమార్, పొన్నూరులో మాజీ ఎమ్మెల్యే రావి వెంకటరమణ, గురజాలలో జంగా కృష్ణమూర్తి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు.

ప్రకాశం:
ఎర్రగొండపాలెం తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే పాలకొండ డేవిడ్ రాజు ధర్నా నిర్వహించారు. దర్శిలో మాజీ ఎమ్మెల్యే బూచేపల్లి సుబ్బారెడ్డి, చీరాలలో, కనిగిరిలో కార్యకర్తలు పెద్ద ఎత్తున ఆందోళనలు, ధర్నాలు చేశారు. చిన్నగంజాంలో గొట్టిపాటి భరత్ కుమార్, కొండేటిలో అశోక్ బాబు ఆందోళనలో పాల్గొన్నారు. ఒంగోలులో  వైఎస్సార్‌సీపీ నేతలు కుప్పం ప్రసాద్, చిన్న
రాజు వెంకట్రావు, కటారి శంకర్, గంగాడ సుజాత ధర్నాలో పాల్గొన్నారు

శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు:
ఉదయగిరిలో మాజీ ఎమ్మెల్యే మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి ధర్నా చేశారు. కడవలూరు తహశీల్దార్ కార్యాలయం వద్ద మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. ఈ  కార్యక్రమంలో ఎంపీ మేకపాటి, జిల్లా అధ్యక్షుడు కాకాని గోవర్థన్ రెడ్డి పాల్గొన్నారు. పప్పు దినుసుల ధరను నియంత్రించడంలో సర్కార్ విఫలమైందని ఎంపీ మేకపాటి అన్నారు. వెంటనే విదేశాల నుంచి దిగుమతి చేసుకోవాలని మేకపాటి తెలపారు.

చిత్తూరు:
చిత్తూరు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు ఆందోళనలు నిర్వహించారు. తిరుపతి ఆర్డీవో కార్యాలయం ఎదుట  వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మమత ధర్నా నిర్వహించారు. సత్యవేడు, చంద్రగిరి, జంగాలపల్లి, బైరెడ్డిపల్లి, గంగాధర నెల్లూరు, తంబళ్లపల్లి, బి.కొత్తకోట,పలమనేరులలో  ధర్నా కార్యక్రమాల్లో కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. వడమాలపేటలో ఎమ్మెల్యే
రోజా, మదనపల్లిలో ఎమ్మెల్యే తిప్పారెడ్డి నేతృత్వంలో ధర్నాలు నిర్వహించారు.

వైఎస్సార్ జిల్లా:
పులివెందుల తహశీల్దార్ కార్యాలయం ఎదుట వైఎస్ఆర్ సీపీ నేత వైఎస్ వివేకానందరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కమలాపురంలో పార్టీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్ రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. నిత్యావసర సరుకుల ధరలు తగ్గేలా ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్థానిక ఎమ్మార్వో రామ్మోహన్‌కు వినతిపత్రం సమర్పించారు.
రైల్వే కోడూరులో ఎమ్మెల్యే కొరుముట్ల శ్రీనివాస్, బద్వేల్లో ఎమ్మెల్యే జయరాములు ధర్నాలో పాల్గొన్నారు. జమ్ములమడుగులో  వైఎస్ఆర్ సీపీ  యువజన కార్యదర్శి హనుమంతరెడ్డి ధర్నా చేశారు.

అనంతపురం: 
ఉరవకొండ తహశీల్దార్ కార్యాలయం వద్ద ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి ధర్నా నిర్వహించారు. వినూత్నంగా తోపుడు బండిపై నిత్యావసర సరుకులు అమ్మి నిరసన తెలిపారు.ధర్మారంలో మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి, తాడిపత్రిలో రమేశ్రెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.జిల్లాలోని రాయదుర్గంలో మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఈ నిరసన కార్యక్రమంలో మాజీ ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి పాల్గొన్నారు. అదేవిధంగా అనంతపురం ఎమ్మార్వో కార్యాలయం వద్ద ఎర్రిస్వామిరెడ్డి ఆధ్వర్యంలో ధర్నా చేశారు.  

కర్నూలు:
బనగానపల్లిలో వైఎస్సార్సీపీ నేత కాటసాని రాంరెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. తహశీల్దార్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగారు. ఎమ్మిగనూరు, ఆలూరులో ధర్నాలు నిర్వహించారు. కోరుమూడులో ఎమ్మెల్యే మణిగాంధీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున కార్యకర్తలు పాల్గొన్నారు.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement