మిన్నంటిన ప్రత్యేక పోరు
మిన్నంటిన ప్రత్యేక పోరు
Published Wed, Aug 3 2016 1:46 AM | Last Updated on Sat, Aug 18 2018 5:57 PM
ప్రభుత్వాల మెడలు వంచి హోదా సాధిద్దాం: దుద్దుకుంట
వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో బంద్ విజయవంతం
పుట్టపర్తి అర్బన్: అడ్డగోలు విభజన కారణంగా కష్టాలతో కొట్టుమిట్టాడతున్న ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించే విషయంలో ఐదు కోట్ల ప్రజలను కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు మోసం చేస్తున్నాయని, ఉద్యమాలతో వారి మెడలు వంచి ప్రత్యేక హోదా సాధించుకునేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని వైఎస్సార్‌సీపీ సమన్వయకర్త దుద్దుకంట శ్రీధర్‌రెడ్డి పిలుపునిచ్చారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి పిలుపు మేరకు మంగళవారం దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి ఆధ్వర్యంలో పుట్టపర్తిలో ప్రత్యేక హోదా బంద్ నిర్వహించారు. బంద్‌కు కాంగ్రెస్, కమ్యూనిస్ట్ పార్టీలు, లంబాడ హక్కుల పోరాట సమితి మద్దతు పలికాయి.ఈ సందర్భంగా ప్రభుత్వ కార్యాలయాలు, ప్రైవేట్ కార్యాలయాలు మూతపడ్డాయి. పట్టణంలో ప్రజలు బంద్‌కు మద్దతు తెలుపుతూ స్వచ్ఛందంగా దుకాణాలను ఉదయం నుంచే మూసివేశారు. బంద్ కారణంగా ఉదయం నుంచి ఆర్టీసీ బస్సులు డిపోకే పరిమితమయ్యాయి. తొలుత పట్టణంలోని హనుమాన్ సర్కిల్ నుంచి మండల పరిషత్ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో డీసీసీ అధ్యక్షుడు కోటా సత్యనారాయణ, ఆ పార్టీ నాయకులు, ఎల్‌హెచ్‌పీఎస్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు రవినాయక్, సీపీఎం, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శులు లక్ష్మినారాయణ, దండగల అంజినేయులు నాయకులు పాల్గొని మద్దతు తెలిపారు. ర్యాలీ ఆర్టీసీ డిపో వద్దకు చేరుకోగానే కార్మికులు మద్దతు పలుకుతూ డిపో ఎదుట గేట్‌మీట్ నిర్వహించారు. ఈ సందర్భం గా దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి మాట్లాడుతూ 2014 ఎన్నికల సమయంలో ప్రధాని మోదీతోపాటు,ముఖ్యమంత్రి చంద్రబాబు,కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు రాష్ట్రానికి ప్రత్యేక హోదా కల్పిస్తామని చెప్పారన్నారు. రెండేళ్లు పాలన పూర్తయి నా హోదా గురించి పట్టించుకోవడం లేదన్నారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మొదటి నుంచి∙హోదా కోసం అలుపెరగని పోరాటం చేస్తున్నారని, ఆయనకు అన్ని వర్గాల ప్రజలు మద్దతు తెలపాల్సిన అవసరం ఉందన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ మండల, పట్టణ కన్వీనర్లు గంగాద్రి, మా ధవరెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి డీఎస్ కేశవరెడ్డి, కౌన్సిలర్లు నారాయణరెడ్డి, రాంజీనాయక్, ఈశ్వరయ్య, నాయకులు చెన్నక్రిష్ణారెడ్డి, హనుమంతరెడ్డి, భాస్కర్‌రెడ్డి, సూర్యాగౌడ్, శివ, చెన్నక్రిష్ణ, శివప్ప, భాస్కర్, రవీంద్ర, సాయిరాంరెడ్డి, లింగాల భాస్కర్‌రెడ్డి, సుధాకర్‌రెడ్డి, మురళీకృష్ణ, శ్రీధర్‌రెడ్డి, కాంగ్రెస్ కౌన్సిలర్ ఓబిలేషు, జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్‌గుప్తా, సుబ్బయ్య చౌదరి, సీపీఎం నాయకులు రాము, ఓబిలేషు, సీపీఐ నాయకులు బ్రహ్మా, షెక్షావలి, వినోద్ పాల్గొన్నారు.
Advertisement
Advertisement