పెళ్లికూతురి ప్రతీకారం | Revenge of tradition | Sakshi
Sakshi News home page

పెళ్లికూతురి ప్రతీకారం

Published Wed, Feb 3 2016 10:43 PM | Last Updated on Fri, Aug 24 2018 7:24 PM

పెళ్లికూతురి ప్రతీకారం - Sakshi

పెళ్లికూతురి ప్రతీకారం

హాలీవుడ్ / కిల్‌బిల్
 
అది యూఎస్‌లోని టెక్సాస్...   హైవే పక్కనే ఓ  చర్చి.  ఫాదర్‌తో కలిపి అందులో ఉన్నది ఆరుగురే. ఇంతలో  తెల్లటి గౌన్‌లో సిగ్గులొలికిస్తూ పెళ్లి కూతురు..   సూట్‌లో ముసిముసి నవ్వులు చిందిస్తూ పెళ్లి కొడుకు ఎంటరయ్యాడు. పెళ్లికొడుకు తరపున కొంత మంది వస్తే, పెళ్లికూతురు తరపున మాత్రం ఎవరూ లేరు. ఆమె ఓ అనాథ. తన గురించి పెళ్లి కొడుకు తల్లిదండ్రులు అడుగుతున్న ప్రశ్నలకు ఉక్కిరిబిక్కిరై బయటకు వెళ్లి చల్లగాలిని ఆస్వాదిస్తానని చెప్పింది. భారంగా అడుగులు వేస్తోంది.  ఎందుకంటే ఆమె ప్రెగ్నెంట్. ఇంకొన్ని రోజుల్లో ఓ బిడ్డకు జన్మనివ్వబోతోంది ఆ పెళ్లి కూతురు. ఇంత  హడావుడిలో ఉన్న ఆ పెళ్లికూతురి చెవులు వేణుగానాన్ని ఆస్వాదిస్తున్నాయి. అలాంటి వాతావరణంలో  ఎవరినైతే తాను చూడకూడదు అనుకుందో అతను రానే వచ్చాడు. పేరు బిల్. 

బిల్ ఆమెను ‘‘కిడో’’ అంటూ పలకరించాడు. ఆ పేరు పిలిచేది తనకు తెలిసిన అతి కొద్ది మందే. వారిలో ఒకడే బిల్.  ఉలిక్కిపడింది.  ‘‘నేను ఇక్కడ ఉన్నట్లు ఎలా తెలిసింది?’’ అని అడిగింది.

‘‘నువ్వెక్కడున్నావో అక్కడికి కచ్చితంగా వస్తా’’అని  బదులిచ్చాడు అతను. ‘‘ఇక్కడ ఎవరికీ అనుమానం రాకూడదు సరిగ్గా  ఉండు’’ అని అతడిని  బతిమాలింది. సరేనన్నాడతను. తన కాబోయే భర్తకు బిల్‌ను తండ్రిగా పరిచయం చేసింది. పెళ్లి ఇంకొంచెంసేపటిలో జరుగుతుందనగా ఓ నలుగురు కత్తులతో, గన్స్‌తో విరుచుకుపడి అందర్నీ హతమార్చారు. ముఖ్యంగా పెళ్లి కూతురిని అతిక్రూరంగా హింసించారు. చావుబతుకుల మధ్య కూడా ఆమె ‘‘బిల్ నా కోసం కాకపోయినా నా కడుపులో పెరుగుతున్న బిడ్డ కోసమైనా నన్నువదిలేయ్’’ అని ప్రాధేయపడింది. కనికరించలేదు. వెంటనే ఆమె తల్లోకి బుల్లెట్  దించాడు.  కట్ చేస్తే...హాస్పిటల్ బెడ్ పై కిడో. కోమాలో! ఆ పరిస్థితిలో ఉన్న ఆమెను వదల్లేదు బిల్. తనను మోసం చేసిందన్న కసితో ఉన్నాడతను.  విషం ఎక్కించి చంపించాలని ప్లాన్ చేశాడు. కానీ ఆమెను అలా చంపడం కన్నా,  స్పృహలో ఉన్నప్పుడు చిత్రవధ చేసి చంపాలని చివరి నిమిషంలో ప్లాన్ మారుస్తాడు. ఇంతలోనే నాలుగేళ్లు గడిచిపోతాయి. ఓ రోజు కోమాలోంచి ఉలిక్కిపడి లేస్తుంది కిడో. బిడ్డకు దూరమై, జీవచ్ఛవంలా మిగుల్తుంది. తన పరిస్థితికి కసితీరా ఏడ్చి, తన పై అత్యాచారం చేయబోయిన  హాస్పిటల్ సిబ్బందిలో ఇద్దరిని చంపి ఆక్కడి నుంచి బయటపడ్తుంది.

ప్రపంచంలో అత్యంత కిరాతకమైన ‘ డెడ్లీ వైపర్ అసాసినేషన్ స్క్వాడ్’లో గతంలో కిడో కూడా సభ్యురాలే. అయితే ప్రశాంతమైన జీవితం గడపాలన్న ఉద్దేశంతో మొత్తం అందర్నీ విడిచిపెట్టి పెళ్లి చేసుకొని స్థిరపడాలనుకున్న  ఆమెను ఆ స్క్వాడ్ సభ్యులు వదలరు. అందర్నీ హతమారుస్తారు.  తన భర్తను, కడుపులో పెరుగుతున్న బిడ్డనూ లేకుండా చేసిన వాళ్లను హతమార్చాలని ఆమె ప్లాన్. . ఆ స్క్వాడ్‌లో ఉన్న వెర్నిటా గ్రీన్‌ను హతమారుస్తుంది. జపాన్‌లో మాఫియా డాన్‌లా పాతుకుపోయిన మరో స్క్వాడ్ మెంబర్ ఒ-రెన్‌తో పోరాడి, ఆమె  సామ్రాజ్యాన్నీ  కుప్పకూలుస్తుంది. ఒ-రెన్ చనిపోయిందన్న విషయం తెలుసుకున్న బిల్ అతని సోదరుడు బడ్ కంగారుపడతారు. ఇక కిడో తమనే టార్గెట్ చేస్తుందన్న విషయం తెలుసుకుని ఆమె కోసం రెడీగా ఉంటాడు బడ్.  అనుకున్నట్టుగానే తమ పై ఎటాక్ చేసిన కిడోను సజీవ సమాధి చేస్తాడు. చావుకు దగ్గరగా రావడం తనకిది మొదటిసారి కాదు. చావంటే భయం లేదు. కానీ వాళ్లను చంపకుండా చనిపోకూడదనే పట్టుదల. ఎలా  బయటపడాలి? అని ఆలోచిస్తే మార్షల్ ఆర్ట్స్ సాయంతో  ఆ సమాధిని బద్దలు కొట్టుకుని  బయటపడుతుంది కిడో.  బిల్ నుంచి డబ్బులు తీసుకుని సెటిల్ అయిపోదామనుకుంటా బడ్.  అతనికి డబ్బులు ఇచ్చిన ట్టే  ఇచ్చి చంపేసి, దాన్ని కూడా కిడో మీదకు నెట్టేస్తుంది ఎలీ.  కూడా చంపేసి బిల్‌ను చంపాలన్న కసితో వెళుతుంది.  అతన్ని చంపుదామని తుపాకీ ఎక్కుపెట్టేలోగా కిడోకు షాక్. ఏ బిడ్డయితే తనకు దూరమైంది అనుకుందో ఆమె బతికే ఉంటుంది. తన కూతురు బతికే ఉన్నా తన జీవితాన్ని ఛిన్నాభిన్నం చేసిన బిల్‌ను మాత్రం వదలాలనుకోలేదు. చంపేసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement