న్యూఢిల్లీ: డీప్ ఫేక్స్ వంటి కృత్రిమ మేధ ఆధారిత తప్పుడు సమాచార వ్యాప్తిని కట్టడి చేసేందుకు టెక్ దిగ్గజం మెటా, మిస్‌ఇన్ఫర్మేషన్ కంబాట్ అలయన్స్ (ఎంసీఏ) జట్టు కట్టాయి. వాస్తవాలను చెక్ చేసేందుకు ఉపయోగపడేలా వాట్సాప్‌లో ప్రత్యేక హెల్ప్‌లైన్‌ను ప్రవేశపెడుతున్నాయి.
ఇది 2024 మార్చి నుంచి అందరికీ అందుబాటులోకి రానుంది. దీనికి సంబంధించిన చాట్‌బాట్‌కు ప్రజలు డీప్‌ఫేక్‌ల గురించిన సమాచారాన్ని పంపవచ్చు. ఆ మెసేజీలను విశ్లేíÙంచేందుకు ఎంసీఏ ప్రత్యేక యూనిట్‌ను (డీఏయూ) ఏర్పాటు చేస్తుంది. ఈ వాట్సాప్ చాట్‌బాట్ ఇంగ్లీష్‌తో పాటు తెలుగు, హిందీ, తమిళ భాషల్లో అందుబాటులో ఉంటుంది. పరిశ్రమ కూటమి అయిన ఎంసీఏలో 16 సంస్థలకు సభ్యత్వం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment