మెటా డైరెక్టర్ రవి గర్గ్ వెల్లడి
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: చిన్న వ్యాపారాలను కొనుగోలుదారులకు మరింత చేరువ చేసే దిశగా వాట్సాప్ బిజినెస్ యాప్‌లో కృత్రిమ మేథ (ఏఐ) ఫీచర్లను ప్రవేశపెట్టనున్నట్లు మెటా బిజినెస్ మెసేజింగ్ విభాగం డైరెక్టర్ రవి గర్గ్ తెలిపారు. ఈ ఏడాది ఆఖరులోగా ఏఐ ఏజెంట్, అసిస్టెన్స్ సేవలు అందుబాటులోకి రాగలవని ఆయన వివరించారు. వినియోగదారులకు నిరంతర సేవలు అందించేందుకు .. కంటెంట్, యాడ్స్ మొదలైనవి క్రియేట్ చేయడానికి ఇవి ఉపయోగపడగలవని పేర్కొన్నారు.
క్యాటలాగ్ రూపకల్పన నుంచి ఆర్డర్లు, చెల్లింపుల వరకు వాట్సాప్ ద్వారా లావాదేవీల నిర్వహణను సులభతరం చేసేందుకు పలు సంస్థలతో చేతులు కలుపుతున్నట్లు గర్గ్ చెప్పారు. హైదరాబాద్‌తో పాటు దేశవ్యాప్తంగా 6 మెట్రోలతో జట్టు కట్టామని, ప్రస్తుతం నెలకు సుమారు 20 లక్షల మెట్రో రైలు టికెట్ల కొనుగోలు వాట్సాప్ ద్వారా జరుగుతోందని తెలిపారు. బస్సు టికెట్లకు సంబంధించి టీఎస్‌ఆర్‌టీసీ మొదలైన వాటితో చర్చలు జరుపుతున్నామని వివరించారు. వాట్సాప్ బిజినెస్‌పై అవగాహన కలి్పంచేందుకు ప్రచారం, సీఏఐటీ వంటి పరిశ్రమ సమాఖ్యలతో శిక్షణ కార్యక్రమాలు మొదలైనవి నిర్వహిస్తున్నట్లు గర్గ్ చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment