Hyderabad: 2 Members Arrested For Organising Prostitution In Kesara - Sakshi
Sakshi News home page

కీసర: వ్యభిచార గృహంపై దాడి.. గతంలోనూ అదే పని

Published Tue, Nov 9 2021 9:06 AM | Last Updated on Tue, Nov 9 2021 9:18 PM

Kesara Police Raid Prostitute Houe And Arrest 2 Members - Sakshi

కీసర: గోధుమకుంట పంచాయతీ పరిధిలోని టీపీఎస్‌కాలనీలో వ్యభిచారం నిర్వహిస్తున్న ఓ గృహంపై కీసర పోలీసులు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులను సోమవారం అరెస్టు చేశారు. కీసర ఇన్‌స్పెక్టర్‌ నరేందర్‌గౌడ్‌ తెలిపిన వివరాల ప్రకారం... గోదావరిఖని సప్తగిరి కాలనీకి చెందిన కె.కుమారస్వామి(49) ఈసీఐఎల్‌ ఎంజేకాలనీలో నివసిస్తున్నాడు. 

ఇతనికి కీసర మండలం టీపీఎస్‌కాలనీలో హోటల్‌ నిర్వహించే ఓ మహిళ (అరుణకుమారి)తో పరిచయం ఏర్పడింది. వీరిద్దరిపై గతంలో మేడిపల్లి పీఎస్‌ పరిధిలో వ్యభిచార గృహం నడుపుతున్నట్లు కేసు నమోదయ్యింది. తర్వాత తమ మకాంను గోధుమకుంట టీపీఎస్‌కాలనీకి మార్చారు. ఆన్‌లైన్‌లో డబ్బులు వసూలు చేసి కస్టమర్లు అడిగిన చోటకి మహిళలను పంపేవాడు కుమారస్వామి.  

గత నెల అనారోగ్యంతో బాధపడుతున్న బంగ్లాదేశ్‌ ఢాకాకు చెందిన మహిళ కలకత్తా నుంచి వచ్చి వీరిని ఆశ్రయించింది. ఆ మహిళను బొడుప్పల్‌కు చెందిన కస్టమర్‌ వద్దకు పంపేందుకు సిద్దమవుతుండగా సమాచారం అందుకున్న కీసర పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. వీరు వాడిన కారు, రెండు సెల్‌ఫోన్లు, రూ.4వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. 
(చదవండి: దారుణం: మంచినీళ్ల నెపంతో ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై..)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement