బ్యూటీ పార్లర్‌లో వేశ్యవాటిక డబ్బులు ఇవ్వలేదనే.. | woman complaint beauty parlour owner | Sakshi
Sakshi News home page

డబ్బులు ఇవ్వలేదనే.. యువతి కుట్ర

Published Sun, Dec 24 2017 8:53 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM

woman complaint beauty parlour owner - Sakshi

మైసూరు: నగరంలో ఓ బ్యూటీ పార్లర్‌లో వేశ్యవాటిక నడుపుతూ పట్టుబడ్డ కేసులో ప్రతిరోజూ కొత్త విషయాలు వెలుగుచూస్తూనే ఉన్నాయి. బ్యూటీపార్లర్‌లో పని చేస్తున్న యువతి డబ్బులు డిమాండ్‌ చేసిందని అందుకు అంగీకరించకపోవడంతో తన భర్త రాజేశ్‌పై కమిషనర్‌కు ఫిర్యాదు చేసిందంటూ బ్యూటీ పార్లర్‌ యజమాని రాజేశ్‌ భార్య సవిత ఆరోపించారు. శనివారం ఆమె మీడియాతో మాట్లాడారు. తన భర్త రాజేశ్‌ ఎన్నో వ్యయప్రయాసలకోర్చి పార్లర్‌ను ప్రారంభించారని, అయితే పార్లర్‌లో నష్టాలు రావడంతో రెండు నెలలుగా పార్లర్‌ అద్దె కూడా చెల్లించలేని స్థితిలో ఉన్నామన్నారు. ఇంటి అద్దె కూడా చెల్లించే స్థోమత లేకపోవడంతో తన కుమార్తెతో పాటు పార్లర్‌లోనే ఉంటున్నామన్నారు.

ఆరోపణలు చేసిన యువతి తమ పార్లర్‌లో పది రోజులు కూడా పని చేయలేదని 20 రోజుల క్రితం శెలవుపై వెళ్లిన యువతి మంగళవారమే తిరిగి వచ్చిందన్నారు. మరుసటి రోజే పార్లర్‌పై పోలీసులు దాడి చేసారన్నారు. వ్యక్తిగత కక్షతోనే ఒడనాడి సంస్థ సదరు యువతితో కలసి కుట్ర పన్నారని, అందులో భాగంగానే పార్లర్‌లో తనను లైంగికంగా వేధిస్తున్నారంటూ నాటకమాడారని ఆరోపించారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement