ఏటూరునాగారం/తాడ్వాయి : ఓ యువకుడు నమ్మించి మోసం చేశాడనే మనోవేదనతో యువతి ఆత్మహత్య చేసుకున్న ఘటన తాడ్వాయి మండలం బీరెల్లిలో శుక్రవారం చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నారుు.. ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన వల్స లక్ష్మినారాయణ , వెంకటరమణ దంపతుల కుమార్తె వల్స శ్రీదేవి(20)ని ఏటూరునాగారం గ్రామానికి చెందిన ఓ పత్రిక రిపోర్టర్ కుదురుపాక రాజేష్ కొంత కాలంగా ప్రేమిస్తున్నాడు. అరుుతే ప్రేమ పేరుతో వేధిస్తున్నాడని, అందుకే తమ కుమార్తె పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిందని తల్లి వెంకటరమణ ఆరోపించింది.
తన భర్త లక్ష్మినారాయణ పదేళ్ల క్రితమే మృతిచెందగా, అన్నీ తానే అరుు కుమార్తెను పోషిస్తున్నానని, బీరెల్లిలోని అమ్మమ్మ ఇంటికి వెళ్తున్నానని చెప్పి తిరిగిరానిలోకాలకు పోయిందని కన్నీరుమున్నీరుగా విలపించింది. తన కూతురు మృతికి కారుకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలని పోలీసులను కోరింది. వెంకటరమణ ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్‌కానిస్టేబుల్ చిట్టిబాబు తెలిపారు.
నమ్మించి మోసగించాడని యువతి ఆత్మహత్య
Published Sat, Mar 5 2016 1:13 AM | Last Updated on Wed, Aug 1 2018 2:15 PM
Advertisement
Advertisement