రామ్ గోపాల్ వర్మ..సంచలనాలకు, వివాదాలకు కేరాఫ్ ఈ పేరు. ఒకప్పుడు ఆయన సినిమాలు టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్‌ను కూడా షేక్ చేశాయి. అయితే ఇటీవల ఆయన తీస్తున్న సినిమాలు ఆశించిన స్థాయిలో విజయం సాధించడం లేదు కానీ..సోషల్ మీడియాలో మాత్రం ఆయన పెట్టే పోస్టులు వైరల్‌గా మారుతుంటాయి.
ఏ అంశంపైనైనా కాస్త వ్యంగ్యంగా స్పందించడం ఆయనకున్న అలవాటు. ఏ విషయం అయినా కుండ బద్దలు కొట్టినట్లు చెప్పేస్తాడు. సినిమా విషయాల్లోనే కాదు పర్సనల్ విషయాల్లోనూ అలానే వ్యవహరిస్తాడు. తాజాగా జాన్వీ కపూర్(Janhvi Kapoor) గురించి ఆర్జీవీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తనకు జాన్వీతో సినిమా తీసే ఉద్దేశమే లేదన్నాడు. దానికి గల కారణం ఏంటో కూడా వివరించాడు.
శ్రీదేవి అంటేనే ఎక్కువ ఇష్టం
రామ్ గోపాల్ వర్మ(Ram Gopal Varma )కి దివంగత నటి శ్రీదేవి అంటే ఎంత ఇష్టమో అందరికి తెలిసిందే. ఆమె మరణించినా.. తనపై ఆర్జీవీకి ఉన్న ప్రేమ మాత్రం తగ్గలేదు. చిన్న సందర్భం దొరికినా.. ఆమె గురించి గొప్పగా మాట్లాడతాడు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో శ్రీదేవి గురించి మాట్లాడుతూ.. శ్రీదేవిని ఎవరితోనూ పోల్చలేం. ఆమె అందం, అభినయం ఎవరికి రాలేదన్నారు. ‘పదహారేళ్ళ వయసు’ లేదా ‘వసంత కోకిల’.. సినిమా ఏదైనా సరే శ్రీదేవి ప్రదర్శన మాత్రం అద్భుతంగా ఉంటుంది. నిజం చెప్పాలంటే ఆమె యాక్టింగ్ చూసిన తర్వాత నేనొక ఫిల్మ్ మేకర్‌ననే విషయం మర్చిపోయా. ఆమెని ఒక ప్రేక్షకుడిగా చూస్తూ ఉండిపోయా. అది ఆమె స్థాయి’ అని ఆర్జీవీ అన్నారు.
జాన్వీతో సినిమా చేయను
శ్రీదేవి(sridevi) కూతురు జాన్వీ కపూర్‌తో సినిమా చేస్తారా? అనే ప్రశ్నకుల ఆర్జీవీ సమాధానం ఇస్తూ ఇప్పట్లో ఆ ఉద్దేశమే లేదన్నారు. శ్రీదేవిని జాన్వీతో పోల్చడం సరికాదన్నారు. శ్రీదేవి అందం జాన్వీకి రాలేదని, ఏ విషయంలోనైనా ఆమెతో పోల్చలేమని అన్నారు. ‘నాకు శ్రీదేవి అంటే ఇష్టం. ఆమెను ఎంతో అభిమానిస్తుంటా. ఇన్నేళ్ల కెరీర్‌లో చాలా మంది పెద్ద స్టార్స్, నటీనటులతో నేను కనెక్ట్ అవ్వలేకపోయా. అలాగే జాన్వీతో కూడా కనెక్ట్ కాలేదు. ఈ జనరేషన్ వాళ్లకి జాన్వీనే గొప్పగా కనిపిస్తుందేమో. నాకు మాత్రం శ్రీదేవినే గొప్ప. జాన్వీలో శ్రీదేవి అందం లేదు. ఇప్పుడైతే జాన్వీతో సినిమా చేసే ఉద్దేశం లేదు’ అని ఆర్జీవీ అన్నారు.
వరుస సినిమాలతో దూసుకెళ్తున్న జాన్వీ
శ్రీదేవి కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన జాన్వీ.. ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకెళ్తోంది. ధడక్ మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి.. తొలి సినిమాతోనే మంచి మార్కులు కొట్టేసింది. ఆ తర్వాత బాలీవుడ్‌లో వరుస సినిమాలు చేసింది. ఇక ఇప్పుడు టాలీవుడ్‌లోనూ రాణిస్తోంది. గతేడాది విడుదలైన ‘దేవర’లో జాన్వీ టాలీవుడ్‌లోకి అడుగుపెట్టారు. రామ్ చరణ్, బుచ్చిబాబు కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలో జాన్వీ హీరోయిన్‌గా నటించబోతుంది.
Comments
Please login to add a commentAdd a comment