Jeedimetla Crime News: Mystery Death Of Missing Teen Girl | బాలిక అనుమానాస్పద మృతి. - Sakshi
Sakshi News home page

బాలిక అనుమానాస్పద మృతి.. రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది?

Published Wed, Feb 16 2022 9:27 AM | Last Updated on Wed, Feb 16 2022 11:16 AM

Jeedimetla: Mystery Death Of Missing Teen Girl Update - Sakshi

సాక్షి, జీడిమెట్ల: జీడిమెట్ల పోలీస్‌ స్టేషన్‌ పరిధిలో అను మానాస్పదంగా ఓ బాలిక మృతిచెందిన ఘటన కలకలం సృష్టించింది సీఐ కె.బాలరాజు, బాలిక బంధువుల వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్‌కు చెందిన బచ్చన్‌సింగ్, పూర్ణంకౌర్‌ దంపతులకు ఐదుగురు పిల్లలు వీరిలో నలుగురు కుమార్తెలు కాగా ఒక్క కుమారుడు. వీరి పెద్దకుమార్తె(17) ఆరో తరగతి వరకు చదువుకుంది. అనంతరం చదువు మానేసి ఇంటి వద్దనే ఉంటుంది. బచ్చన్‌సింగ్‌ కుటుంబం నాలుగు నెలల క్రితం గాజులరామారంలో ఉండేవారు. ఇటీవలే సుభాష్‌నగర్‌కు వచ్చా రు. సోమవారం రాత్రి 10 గంటల వరకు ఇంట్లోనే ఉన్న బాలిక ఒక్కతే ఇంటి నుంచి బయటకు వెళ్లింది.

బయటకు వెళ్లిన అరగంట అయినా ఇంటికి రాకపోవడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యు లు ఆమె ఆచూకీ కోసం చుట్టు పక్కల వెతికారు. అయినప్పటికీ ఆమె జాడ తెలియకపోవడంతో రా త్రి ఒంటి గంటకు జీడిమెట్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కిడ్నాప్‌ అయినట్లుగా కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో రాత్రి 2:30 గంటలకు జీడిమెట్ల పోలీసులకు పైప్‌లైన్‌ రోడ్డులోని ఓ అపార్ట్‌మెంట్‌ వద్ద బాలిక మృతదేహం పడి ఉందని అపార్ట్‌మెంట్‌ వాచ్‌మెన్‌ అమ్రిత్‌ పోలీసులకు సమాచారమిచ్చాడు. వెంటనే అక్కడకు చేరుకున్న పోలీ సులు బాలిక తల్లిదండ్రులను ఘటనా స్థలికి పిలిపించి వాకబు చేయగా వారి కూతురేనని తెలిపారు. బాలిక చున్నీ అపార్ట్‌మెంట్‌ 5వ ఫ్లోర్‌లో లభించగా ఆమె 5వ అంతస్తు నుంచి కిందకు దూకిందెమో.. అన్నట్లుగా పోలీసులు పోలీసులు వ్య క్తం చేశారు. బాలిక తలపై లోతు గాయం అవ్వడంతో పాటు నోట్లో నుంచి రక్తం వచ్చిన ఆనవాళ్లు ఉన్నాయి.  
చదవండి: నిజామాబాద్‌లో రెచ్చిపోయిన రౌడీమూకలు

పోస్టుమార్డమ్‌ రిపోర్టులో ఆత్మహత్యే.. 
బాలిక పోస్టుమార్డమ్‌ నివేదికలో మాత్రం హత్య చే యబడ్డ ఆనవాళ్లు లేనట్లుగా పోలీసులు తెలిపారు. బాలిక తానంతట తానే అపార్ట్‌మెంట్‌పై నుంచి దూ కిందా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నా రు. కుంటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. 

రాత్రి సమయంలో ఎందుకు వెళ్లింది? 
సోమవారం రాత్రి బాలికను కుటుంబ సభ్యులెవ రూ బయటకు పంపకపోవడంతో బాలిక ఒక్కతే ఇంట్లో చెప్పకుండా బయటకు వెళ్లిన నాలుగు గంటలకే  శవ మై కనిపించింది. అంతే కాకుండా తన ఇంటికి దూరంగా ఉన్న అపార్ట్‌మెంట్‌ వద్దకు వచ్చినా.. చీకటిగా ఉండే 5వ అంతస్థుకు ఒక్కతే ఎలా వెళ్లగలిగింది? ఒకవేళ వెళ్లినా అపార్ట్‌మెంట్‌పైన రేలింగ్‌ చాలా ఎత్తులో ఉన్న ందున బాలిక అంత సులభంగా ఎలా ఎక్కగలదు? అనే సందేహాన్ని బాలిక బంధువులు వ్యక్తం చేస్తున్నారు. కాగా ప్రేమికుల దినోత్సవం రోజే ఆత్మహత్య చేసుకోవడంతో పలు అనుమానాలకు తావిస్తోంది. 
మరో ఆరు నెలల్లో పెళ్లి చేయాలనుకున్నాం.. 
బాలికకు 18 సంవత్సరాలు నిండకపోవడంతో పెళ్లి చేయలేదు. మరో ఆరు నెలల్లో 18 ఏళ్లు రాగానే పెళ్లి చేయాలని అనుకున్నామని బాలిక తల్లిదండ్రులు, బంధువులు బోరున విలపించారు. ఇంతలోనే బాలిక మృతి చెందడాన్ని బంధువులు జీర్ణించుకోలేకపోతున్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement