కళాశాలకు వెళ్తున్నానని చెప్పి..
హైదరాబాద్: కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన యువతి తిరిగి ఇంటికి చేరుకోకపోవడంతో.. కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలోని సాయి బాబ నగర్‌కు చెందిన ప్రీతి(17) చింతల్‌లోని ఎన్‌ఆర్‌ఐ కళాశాలలో ఇంటర్ ద్వితియ సంవత్సరం చదువుతోంది.
ఈ క్రమంలో ఈ నెల 20న కళాశాలకు వెళ్తున్నానని చెప్పి వెళ్లిన ప్రీతి తిరిగి ఇంటికి రాలేదు. దీంతో బంధువులు, స్నేహితుల ఇళ్లలో ఆరా తీసిన కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిస్సింగ్ కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.