
ఫ్యాన్ల పరిశ్రమలో అగ్నిప్రమాదం
హైదరాబాద్: నగరంలోని జీడిమెట్ల పారిశ్రామికవాడలోని శ్రీవేంకటేశ్వర సహకార సొసైటీ పరిధిలో ఉన్న ఒక ఫ్యాన్ల తయారీ పరిశ్రమలో ఆదివారం ఉదయం అగ్నిప్రమాదం సంభవించింది. ఉదయం 9 గంటల సమయంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల పరిశ్రమలో మంటలు చెలరేగాయి.
గమనించిన స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. భారీ ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. ఫైర్ సిబ్బంది మంటలు ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు.